న్యూఢిల్లీ: గురువారం దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ, ఫార్మా షేర్లు మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఈ రోజు సెన్సెక్స్ 53,044.01 పాయింట్ల వద్ద పైకి ఎగిసింది. బుధవారం మార‍్కెట్ ముగిసే సమయానికి కంటే ఈ రోజు మార్కెట్ ప్రారంభ సమయానికి 33 పాయింట్లు పెరిగి నిఫ్టీ 15,886.75 పాయింట్లను నమోదు చేసింది.
మార్కెట్లు ప్రారంభం కాగానే ఐటీ షేర్లు జోరందుకున్నాయి. 1.90పాయిట్లతో ఎల్ అండ్ టీ, 1.59శాతంతో హెచ్‌సీఎల్,1.67శాతంతో టెక్ మహీంద్రా,1.12శాతంతో విప్రో,రిలయన్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఫార్మాలో డాక్టర్ రెడ్డీస్ లాభాలతో కొనసాగుతుండగా బ్లూచిప్ స్టాక్స్ సైతం వాటితో పోటీ పడుతున్నాయి. టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా,బజాజ్ ఫైనాన్షియల్, ఓఎన్జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలతో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment