దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. ఆయా కార్పొరేట్ కంపెనీల వార్షిక ఫలితాలు , చమురు ధరలు దిగిరావడంతో పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు సిద్ధమయ్యారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సెన్సెక్స్ అత్యంత స్వల్పంగా 10 పాయింట్లు నష్టపోయి 60287 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుండగా.. నిఫ్టీ కేవలం 3పాయింట్ల నష్టపోయి 39527పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది.
ఇక అదానీ పోర్ట్,టెక్ మహీంద్రా,లార్సెన్, కొటక్ మహీంద్రా,ఇన్ఫోసిస్,హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఎథేర్ మోటార్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్, శ్రీరామ్ సిమెంట్,టీసీఎస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇండస్‌ఇండ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్,హెడ్‌ఎఫ్‌సీ లైఫ్,అపోలో హాస్పటల్,కోల్ ఇండియా, సన్ ఫార్మా,బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment