ముంబై: ఇంటర్నెట్ ఆధారిత ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించే ఎయిమర్స్ ట్రేడర్‌లో ఎలాంటి పెట్టుబడులు పెట్టొద్దని నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) ఇన్వెస్టర్లను హెచ్చరించింది.
‘‘సురజ్ మౌర్య అనే వ్యక్తి ఎయిమర్స్ ట్రేడర్ పేరుతో టెలిగ్రామ్, వాట్సప్, ట్విట్టర్ సామాజిక మాధ్యమాల ద్వారా కచ్చితమైన రాబడులను అందిస్తామంటూ మోసపూరిత ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నారు. ఈ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టి మోసవద్దు. దీనికి ఎక్ఛేంజీ నుంచి ఎలాంటి గుర్తింపు లేదు’’ అని ఎన్‌ఎస్‌ఈ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదే తరహా తప్పుడు ఆఫర్లను ప్రకటించడంతో ఈ ఆగస్టులో రియల్ ట్రేడర్, గ్రో స్టాక్, షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్‌లను సైతం స్టాక్ ఎక్ఛేంజీ నిషేధించింది.
Comments
Please login to add a commentAdd a comment