Mobile Manufacturing
-
వేగంగా వృద్ధి చెందుతున్న రంగం
ఉత్పత్తి ఆధారిత ప్రోత్రాహకాల(పీఎల్ఐ) వల్ల మొబైల్ తయారీ రంగం వేగంగా వృద్ధి చెందుతున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ తెలిపారు. పీఎల్ఐ పథకం కింద ఈ రంగం ఇప్పటికే లక్ష్యాలను అధిగమించిందని చెప్పారు. 2014-15లో రూ.1.9 లక్షల కోట్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగం వాటా 17.4 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2024లో రూ.9.52 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఇందుకు ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవ చూపినట్లు తెలిపారు.ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలు‘పీఎల్ఐ పథకం వల్ల దేశీయంగా మొబైల్ ఉత్పత్తి రంగంలో ప్రాథమికంగా రూ.9,100 కోట్ల పెట్టుబడులు సమకూరాయి. వీటివల్ల రూ.6.61 లక్షల కోట్ల విలువైన మొబైళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 2014-15లో వీటి ఎగుమతులు కేవలం రూ.1,566 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం దాదాపు రూ.1.2 లక్షల కోట్లు విలువైన ఫోన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ రంగం దాదాపు రూ.8.12 లక్షల కోట్లు ఉత్పత్తిని సాధిస్తుందని అంచనా. పీఎల్ఐ పథకం వల్ల మొబైల్ తయారీ రంగంలో దాదాపు లక్షకు పైగా యువతకు ఉపాధి లభించింది. ఈ వృద్ధికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఎంతో తోడ్పడింది’ అని కృష్ణన్ తెలిపారు. -
యాపిల్ ఐఫోన్ 14.. ఇక కష్టమే..
-
టెలికం కంపెనీలకు ‘సిమ్’ పోటు.. ఈ– సిమ్ పంచాయితీ!
న్యూఢిల్లీ: టెలికం సేవల కంపెనీలు (ఆపరేటర్లు), మొబైల్ ఫోన్ల తయారీదారుల మధ్య పేచీ వచ్చింది. ఇదంతా సిమ్ కార్డులకు కొరత ఏర్పడడం వల్లే. కరోనా కారణంగా లాక్డౌన్లతో సెమీకండక్టర్ పరిశ్రమలో సంక్షోభం నెలకొనడం తెలిసిందే. రెండేళ్లయినా కానీ సెమీకండక్టర్ల కొరత ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలను వేధిస్తోంది. ఇది టెలికం కంపెనీలనూ తాకింది. సిమ్‌కార్డుల సరఫరాలో కొరత నెలకొంది. అంతేకాదు, 2024కు ముందు సిమ్ల సరఫరా పరిస్థితి మెరుగుపడేలా లేదు. దీంతో రూ.10,000 అంతకుమించి విలువ చేసే అన్ని మొబైల్ ఫోన్లలో, ఫిజికల్ సిమ్ స్లాట్‌తోపాటు.. ఎలక్ట్రానిక్ సిమ్ (ఈ–సిమ్) ఉండేలా మొబైల్ ఫోన్ తయారీదారులను ఆదేశించాలని టెలికం ఆపరేటర్లు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు లేఖ రాసింది. కానీ, సీవోఏఐ డిమాండ్‌ను ఇండియన్ సెల్యులర్ ఎలక్ట్రానిక్స్ అసిసోయేషన్ (ఐసీఈఏ)ను నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ నెల 10న కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖకు లేఖ రాసింది. సెల్యులర్ ఆపరేటర్లు కోరుతున్నట్టు మొబైల్ ఫోన్లలో ఈ–సిమ్ కార్డులను ప్రవేశపెట్టడం వాటి తయారీ వ్యయాలు పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొంది. అదనపు హార్డ్‌వేర్ అవసరంతోపాటు, డిజైన్లోనూ మార్పులు అవసరమవుతాయని వివరించింది. ధరలు పెరిగే ప్రమాదం.. ప్రస్తుతం ఈ–సిమ్ ఆప్షన్ ఖరీదైన ఫోన్లలోనే ఉంది. కేవలం 1–2 శాతం మంది చందాదారులే ఈ ఫోన్లను వినియోగిస్తున్నారు. రూ.10,000పైన ధర ఉండే ఫోన్లు మొత్తం ఫోన్ల విక్రయాల్లో 80 శాతంగా ఉన్నాయని ఐసీఈఏ అంటోంది. ఈ–సిమ్‌ను తప్పనిసరి చేస్తే భారత మార్కెట్లో అమ్ముడుపోయే ఫోన్ల కోసం ప్రత్యేక డిజైన్లు అవసరమవుతాయని పేర్కొంది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఈ–సిమ్ తప్పనిసరి అనే ఆదేశాలేవీ లేవు. దీంతో భారత మార్కెట్లో విక్రయించే ఫోన్లను ఈ–సిమ్‌కు సపోర్ట్ చేసే విధంగా తయారు చేయాల్సి వస్తుంది. ఫలితంగా మధ్య స్థాయి ఫోన్ల ధరలు పెరిగిపోతాయి. మొబైల్ ఫోన్ల మార్కెట్లో సగం రూ.10,000–20,000 బడ్జెట్‌లోనివే కావడం గమనార్హం. సిమ్‌కార్డులకు కొరత ఏర్పడడంతో వాటి ధరలు పెరిగాయన్నది సెల్యులర్ ఆపరేటర్ల మరో అభ్యంతరంగా ఉంది. దీన్ని కూడా ఐసీఈఏ వ్యతిరేకిస్తోంది. ‘‘సిమ్ కార్డుల ధర ఐదు రెట్లు పెరిగినా ఫర్వాలేదు. కానీ, ఈ–సిమ్ కోసం ఫోన్లో చేయాల్సిన హార్డ్‌వేర్ మార్పుల కోసం అయ్యే వ్యయంతో పోలిస్తే తక్కువే’’అన్నది ఐసీఈఏ వాదనగా ఉంది. అన్ని మొబైల్ ఫోన్లకు ఈ–సిమ్‌లను తప్పనిసరి చేసినట్టయితే అది మొబైల్ ఫోన్ల పరిశ్రమ వృద్ధిని దెబ్బతీస్తుందని, ఎగుమతుల పట్ల నెలకొన్న ఆశావాదాన్ని సైతం నీరుగారుస్తుందని అంటోంది. త్వరలో కుదురుకుంటుంది.. సిమ్‌కార్డుల కొరత సమస్య త్వరలోనే సమసిపోతుందని ఐసీఈఏ అంటోంది. వచ్చే 6–9 నెలల్లో సాధారణ పరిస్థితి ఏర్పడొచ్చని చెబుతోంది. కానీ, సిమ్ సరఫరాదారులతో సీవోఏఐ ఇదే విషయమై చేసిన సంప్రదింపుల ఆధారంగా చూస్తే.. సిమ్ కార్డుల సరఫరా 2024కు ముందు మెరుగయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది. హైలైట్స్ ► సరఫరా సమస్యల కారణంగా సిమ్ కార్డుల ధర పెరిగిపోయింది: సీవోఏఐ ► సిమ్ కార్డుల ధర ఐదు రెట్లు పెరిగినా, హార్డ్‌వేర్‌లో ఈ–సిమ్ల కోసం చేయాల్సిన మార్పుల వల్ల అయ్యే వ్యయాలతో పోలిస్తే తక్కువే: ఐసీఈఏ ► ఈ–సిమ్ కార్డులతో సిమ్‌కార్డుల వ్యర్థాలను (నంబర్ పోర్టబులిటీ రూపంలో) నివారించొచ్చు: సీవోఏఐ ► 1–2 శాతం చందాదారులే ఈ సిమ్‌లను వాడుతున్నారు. అన్ని ఫోన్లకు తప్పనిసరి చేయొద్దు: ఐసీఈఏ ► సిమ్ కార్డుల సరఫరా 2024లోపు మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు: సీవోఏఐ ► 6–9 నెలల్లో సరఫరా సాధారణ స్థితికి వచ్చేస్తుంది: ఐసీఈఏ -
‘ధరల’ వ్యూహం పరిమిత కాలమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘మొబైల్ ఫోన్స్ మార్కెట్లో చవక ధరల వ్యూహం ఎంతో కాలం పనిచేయదు. నిలదొక్కుకోవాలంటే అందుబాటు ధర ఒక్కటే సరిపోదు. నాణ్యమైన ఫీచర్లు, విక్రయానంతర సేవలు ఉండాల్సిందే’ అని ఐటెల్ మొబైల్‌ను ప్రమోట్ చేస్తున్న ట్రాన్సియన్ ఇండియా సీఈవో అరిజీత్ తలపత్ర తెలిపారు. మార్కెట్‌ను అర్థం చేసుకోకపోతే మొబైల్ ఫోన్స్ రంగంలో బ్రాండ్లకు మనుగడ లేదన్నారు. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాదిలోనే ఫీచర్ ఫోన్ల విభాగంలో రెండవ స్థానాన్ని చేజిక్కించుకుని ఇతర బ్రాండ్లకు సవాల్ విసిరామన్నారు. సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్కెట్ తీరుతెన్నులు, కంపెనీ గురించి ఆయన మాటల్లో.. ఆ సెగ్మెంట్లో తొలి స్థానం.. చైనా కేంద్రంగా 2007లో ట్రాన్సియన్ ప్రారంభమైంది. ఆఫ్రికా తొలి మార్కెట్. సబ్ సహారన్ ఆఫ్రికాలో 70 శాతం వాటా ట్రాన్సియన్‌దే. ఇక 2016లో భారత్‌లో అడుగు పెట్టే ముందే జనాల్లోకి వెళ్లి సర్వే నిర్వహించాం. వారికి ఏం కావాలో అర్థం చేసుకుని మొబైల్స్‌ను రూపొందించాం. విక్రయాల ప్రారంభానికి ముందే సర్వీస్ సెంటర్లను తెరిచాం. భారత్‌లో ఏడాదిలోనే ఫీచర్ ఫోన్ల రంగంలో రెండవ స్థానానికి చేరుకున్నాం. రూ.7 వేల లోపు ధరల విభాగంలో ఫీచర్, స్మార్ట్ఫోన్లలో అగ్రస్థానంలో నిలిచాం. 8 కోట్ల పైచిలుకు వినియోగదార్లు సొంతమయ్యారు. సీఎంఆర్ గణాంకాల ప్రకారం ఐటెల్‌కు రూ.7 వేలలోపు ధరల విభాగంలో 27 శాతం, మొత్తం మార్కెట్లో 9.2 శాతం వాటా ఉంది. కంపెనీకి 85 శాతం మంది ఆఫ్‌లైన్ కస్టమర్లు ఉన్నారు. 1,100 పైగా సర్వీస్ కేంద్రాలు ఉన్నాయి. కస్టమర్లు 2జీ నుంచి 4జీకి.. దేశంలో ప్రస్తుతం 35 కోట్ల మంది 2జీ సేవలను వినియోగిస్తున్నారు. మాకు ఇదే పెద్ద మార్కెట్. వినియోగదార్లు 4జీ వైపు మళ్లేందుకు కృషి చేస్తాం. భవిష్యత్‌లో సాంకేతిక పరిజ్ఞానం ఖరీదు తగ్గితే రూ.10 వేల లోపు ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్స్ లభించే అవకాశం ఉంది. కంపెనీకి నోయిడాలో మూడు ప్లాంట్లు ఉన్నాయి. అమ్మకాలనుబట్టి చూస్తుంటే జూన్–జూలై నాటికి పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. నాలుగో ప్లాంటు దక్షిణాదిన ఏర్పాటు చేస్తాం. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని (పీఎల్ఐ) వినియోగించుకుని ఎగుమతులపై దృష్టిసారిస్తాం. మొబైల్స్‌తోపాటు టీవీలు, సౌండ్‌బార్స్, స్మార్ట్‌గ్యాడ్జెట్స్ అందుబాటులోకి తెచ్చాం. ఆఫ్రికాలో గృహోపకరణాలను ట్రాన్సియన్ విక్రయిస్తోంది. క్రమంగా భారత్‌లోనూ వీటిని పరిచయం చేస్తాం. -
ఇక కొత్త ఫోన్‌తో చార్జర్ రాదు
న్యూఢిల్లీ: గతంలో మొబైల్ కొంటే దాంతో పాటు చార్జర్, ఇయర్ ఫోన్స్ వచ్చేవి. కాలక్రమేణా ఇయర్ ఫోన్స్ ఫోన్ తో పాటు రావడం ఆగిపోయింది. రానున్న రోజుల్లో చార్జర్ ను తొలగించి ఖర్చులను తగ్గించుకోవాలని ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, శాంసంగ్ ఫోన్ తయారీ దారులు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల తయారీదారులకు చార్జర్ తయరీ ఖర్చులతో పాటు ఫోన్ ప్యాకేజింగ్ లో అయ్యే అదనపు ఖర్చు కూడా మిగులుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిపై శాంసంగ్, యాపిల్ తయారీదారుల నుంచి అధికారిక సమాచారం ఏదీ రాలేదు. త్వరలో రానున్న ఐఫోన్ 12లో ఇయర్ ఫోన్స్ తో పాటు, చార్జర్ కూడా రాదని యాపిల్ ఎనలిస్ట్ మింగ్ చుకో అంటున్నారు. ప్రస్తుతం వస్తున్న ఫోన్లన్నీ దాదాపు టైప్ సీ పోర్టుతో వస్తున్నాయి. దీనివల్ల మార్కెట్లో ఒకే తరహా చార్జర్ అందుబాటులోకి వస్తుందని తయారీ సంస్థలు భావిస్తున్నాయి. అంతేగాక వైర్ లెస్ చార్జింగ్ సదుపాయంతో వస్తున్న ఫోన్లకు అసలు చార్జర్ అవసరమే ఉండదు. -
అతిపెద్ద మొబైల్ మేకర్‌గా భారత్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా నిలిచిందని కేంద్ర న్యాయ, టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 200కి పైగా మొబైల్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు సోమవారం ప్రకటించారు. భారతదేశంలో ఇప్పటివరకు 330 మిలియన్ మొబైల్ హ్యాండ్సెట్లు తయారైనట్టు చెబుతూ దీనికి సంబంధించిన డేటాను కేంద్ర మంత్రి షేర్ చేశారు. 2014లో కేవలం 2 ప్లాంట్లలో 60 మిలియన్ల మొబైల్ ఫోన్లు మాత్రమే తయారు అయ్యాయి. వీటి విలువ కూడా 2014లో 3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2019లో 30 బిలియన్ డాలర్లకు పెరిగింది. అలాగే రేపు (జూన్ 2న) మధ్యాహ్నం 12:00 గంటలకు విలేకరుల సమావేశంలో భారతీయ ఎలక్ట్రానిక్ రంగం కోసం కొత్త పథకాలను ప్రకటించనున్నారు. భారీ దిగుమతిదారుగా ఉన్న భారత్ గత ఐదేళ్లలో బలమైన ఎగుమతిదారుగా అవతరించిందని ఎలక్ట్రానిక్స్ ఇండియా ట్వీట్ చేసింది. Under the leadership of PM @narendramodi, India has emerged as the 2nd largest mobile phone manufacturer in the world. In the last 5 years, more than 200 Mobile Phone Manufacturing units have been set up. #ThinkElectronicsThinkIndia pic.twitter.com/fGGeCRpj87 — Ravi Shankar Prasad (@rsprasad) June 1, 2020 చదవండి : సీనియర్లకు షాకివ్వనున్న ఇన్ఫోసిస్ షావోమి ల్యాప్‌టాప్ లాంచ్ : ఈ నెలలోనే -
నోయిడాలో భారీ మొబైల్ ఫ్యాక్టరీ
నోయిడా: దక్షిణ కొరియాకి చెందిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ తయారీ ప్లాంటును ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–ఇన్ దీన్ని సోమవారం ప్రారంభించారు. ప్రస్తుతం ఏటా 6.8 కోట్లుగా ఉన్న శాంసంగ్ హ్యాండ్సెట్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దశలవారీగా 2020 నాటికి 12 కోట్లకు పెంచుకునేందుకు ఈ కొత్త ప్లాంటు తోడ్పడనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం ఊతంతో .. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరిందని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నాలుగేళ్ల క్రితం భారత్‌లో మొబైల్ ఫోన్స్ తయారీ ఫ్యాక్టరీలు రెండే ఉండగా..ఇప్పుడు 120కి చేరాయని పేర్కొన్నారు. హ్యాండ్సెట్స్ ఫ్యాక్టరీలు పెరిగే కొద్దీ ఉపాధికి కూడా తోడ్పాటు లభించిందని, నాలుగు లక్షల పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన జరిగిందని ప్రధాని చెప్పారు. ‘భారత్‌ను ప్రపంచ తయారీ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఇది చాలా ముఖ్యమైన రోజు. మేకిన్ ఇండియా నినాదం కేవలం ఆర్థిక విధానంలో భాగం మాత్రమే కాదు.. దక్షిణ కొరియా వంటి దేశాలతో ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు కూడా ఇది తోడ్పడనుంది’ అని ఆయన తెలిపారు. నయా మధ్యతరగతి ప్రజల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయన్నా రు. భారత్‌లో 40 కోట్ల పైగా స్మార్ట్‌ఫోన్స్ వినియోగంలో ఉన్నాయని, 32 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని ప్రధాని చెప్పారు. ప్లాంటులో 2 వేల కొలువులు.. వేగంగా ఎదుగుతున్న భారత్ వృద్ధి సాధనలో పలు కొరియన్ కంపెనీలు పాలుపంచుకుంటున్నాయని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–ఇన్ తెలిపారు. శాంసంగ్ వంటి కంపెనీలు ఏర్పాటు చేసే ఫ్యాక్టరీలతో ఉపాధికి తోడ్పాటు లభించగలదన్నారు. శాంసంగ్ కొత్త ప్లాంటుతో కొత్తగా 2,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని పేర్కొన్నారు. ఇక్కడ తయారయ్యే స్మార్ట్‌ఫోన్స్.. ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతవుతాయని తెలిపారు. మొబైల్ ఫోన్స్ ఎగుమతుల హబ్‌గా ఎదగాలన్న భారత్ లక్ష్య సాధనకు పూర్తి తోడ్పాటు అందిస్తామని శాంసంగ్ ఇండియా సీఈవో హెచ్‌సీ హాంగ్ తెలిపారు. రూ. 5వేల కోట్ల పెట్టుబడులు.. శాంసంగ్ కంపెనీ నోయిడాలో 1996లో తమ ఫ్యాక్టరీని ప్రారంభించింది. కీలకమైన గెలాక్సీ ఎస్9, ఎస్9+, గెలాక్సీ నోట్8 వంటి ఫోన్స్ ఇందులోనే తయారవుతున్నాయి. సుమారు రూ. 4,915 కోట్లతో ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు శాంసంగ్ గతేడాది జూన్‌లో ప్రకటించింది. శాంసంగ్‌కి చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబుదూర్‌లో మరో ప్లాంటు కూడా ఉంది. భారత్‌లో అయిదు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు.. ఒక డిజైన్ సెంటర్ కూడా ఉంది. -
అతిపెద్ద శాంసంగ్ ప్లాంట్‌ను ఆవిష్కరించిన మోదీ
నోయిడా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేతో కలిసి శాంసంగ్ నూతన మొబైల్ తయారీ యూనిట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం ఇరు దేశాల అధ్యక్షులు మెట్రో రైలులో ఢిల్లీ నుంచి నోయిడా చేరుకున్నారు. దీని కంటే ముందు మహాత్మాగాంధీ స్మృతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ జరిగిన కచేరిలో మహాత్మనికి ఇష్టమైన భజనలను విన్నారు. ప్లాంట్ ప్రారంభోత్సవ సందర్భంగా మోదీ ‘ఒక్క కొరియన్ ఉత్పత్తి అయినా లేని మధ్యతరగతి కుటుంబాలు మన దేశంలో చాలా అరుదు. అంతగా ఈ ఉత్పత్తులు ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాయి. ప్రస్తుతం మన ప్రభుత్వం గవర్నమెంట్ ఈ-మార్కెట్(జీఈఎమ్) విధానాన్ని అవలంభిస్తుంది. దీని ద్వారా ప్రభుత్వమే నేరుగా ఉత్పత్తిదారుల దగ్గర నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. అందువల్ల వల్ల చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు లాభం కలగడమే కాక పారదర్శకత కూడా పెరుగుతుందని’ అన్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కూడా హాజరయ్యారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య కీలక అంశాలను చర్చించనున్నట్లు సమాచారం. ఈ పర్యటన గురించి మూన్ జే.. ‘భారత ప్రభుత్వం 100 స్మార్ట్ సిటీలను నిర్మించాలని భావిస్తుంది. ఆ ప్రాజెక్టుల్లో పనిచేసేందుకు మేము ఉత్సాహాంగా ఉన్నాం’ అని తెలిపారు. భారత్‌ను ఓ స్నేహదేశంగా గుర్తిస్తామని, తమకు అవసరమైనప్పుడల్లా భారత్ సాయం చేసిందన్నారు. తమ దేశం సదరన్ పాలసీని చేపట్టిందని, దానిలో భాగంగా భారత్‌తో మరింత బలమైన బంధాన్ని ఏర్పర్చుకోవాలని భావిస్తున్నట్లు మూన్ జే తెలిపారు. శాంసంగ్ ప్లాంట్... దక్షిణ కొరియా బేస్డ్ స్మార్ట్ఫోన్ల దిగ్గజ కంపెనీ శాంసంగ్ ప్రపంచంలోకెల్ల అతి పెద్ద మొబైల్ తయారీ యూనిట్‌ను నోయిడాలో ఏర్పాటు చేసింది. ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో మొబైల్ ఫోన్స్ మాత్రమే కాక టీవీ, రిఫ్రిజిరేటర్ వంటి ఎలాక్ట్రానిక్ వస్తువులను కూడా తయారు చేస్తున్నట్టు కంపెనీ అధికారులు తెలిపారు. ఈ ప్లాంట్‌కు సంబంధించిన వివరాలు... 35 ఎకరాల విస్తీరణంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 81లో ఏర్పాటు చేశారు. అయితే నోయిడా ప్లాంట్‌కు 1996లోనే శంకుస్థాపన చేశారు. 1997 నుంచి తొలిసారి ఇక్కడ టెలివిజన్లను తయారుచేయడం ప్రారంభించారు. 2003 నాటికి రిఫ్రిజిరేటర్లను కూడా తయారు చేయడం ప్రారంభించారు. 2007 నుంచి ఇక్కడ మొబైల్ ఫోన్లను తయారుచేస్తున్నారు. ప్రస్తుతం శాంసంగ్ మొబైల్, ఎలాక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తిని రెండు రెట్లు పెంచడం కోసం ఈ నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయిన వస్తువులను సార్క్ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఇప్పటి వరకూ ఇండియాలో శాంసంగ్ తయారీ యూనిట్లు రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి నోయిడాలో ఉండగా మరొకటి తమిళనాడులోని శ్రీపెరంబ్దూర్లో ఉంది. ఇవే కాక 5 ఆర్ అండ్ డీ సెంటర్లతో పాటు నోయిడాలో ఒక డిజైన్ సెంటర్ కూడా ఉంది. వీటిన్నింటి ద్వారా దాదాపు 70 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇవేకాక శాంసంగ్ ఔట్లెట్ల ద్వారా మరో 1.50లక్షల మందికి కంపెనీ ఉపాధి కల్పిస్తోంది. -
ఫోన్ల తయారీ హబ్‌గా ఉత్తరప్రదేశ్
దేశంలో తయారవుతున్న మొబైళ్లలో సగం ఇక్కడి నుంచే న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఉత్తరప్రదేశ్ (యూపీ) అవతరించింది. భారత్‌లో తయారవుతున్న మొత్తం మొబైల్ హ్యాండ్సెట్లలో యూపీ వాటా సగం వరకు ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్స తాజా గణాంకాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నారుు. దీని ప్రకారం.. 2015 సెప్టెంబర్ నుంచి దేశంలో 38 కొత్త మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటయ్యారుు. వీటి సామర్థ్యం నెలకు రెండు కోట్ల యూనిట్ల పైమాటే. ఈ రెండు కోట్ల యూనిట్లలో యూపీ వాటానే కోటిగా ఉంది. ఇక యూపీ తర్వాతి స్థానంలో 25 లక్షల యూనిట్ల వాటాతో హరియాణ నిలిచింది. అలాగే దేశవ్యాప్తంగా ఏర్పాటైన 38 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో 13 వరకు యూపీలోనే ఉన్నారుు. ఢిల్లీలో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు యూనిట్ల స్థాపన జరిగింది. హరియాణ, ఉత్తరఖండ్‌లలో మూడు చొప్పున, మహరాష్ట్ర, తెలంగాణలలో రెండు చొప్పున ఏర్పాటయ్యారుు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, దామన్‌లలో ఒకటి చొప్పున ఉన్నారుు. యూనిట్లు 38 కాదు.. 39: ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ (ఐసీఏ) మాత్రం దేశంలో ఈ ఏడాది జూలై నాటికి 39 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయని చెబుతోంది. దీని ప్రకారం.. యూపీలో 15 యూనిట్లు ఏర్పాటయ్యారుు. ఇక ఏపీలో ఐదు ఉన్నారుు. హరియాణలో మూడు యూనిట్లు ఉన్నారుు. ఉత్తరఖండ్, ఢిల్లీలలో నాలుగు చొప్పున, తెలంగాణ, మహరాష్ట్రలలో రెండు చొప్పున యూనిట్లు ఏర్పాటయ్యారుు. ఇక తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, దామన్‌లలో ఒకటి చొప్పున యూనిట్లు ఉన్నారుు. -
భారత్‌లో సోనీ సొంత ప్లాంటు
• మొబైళ్ల తయారీ కూడా చేపట్టే చాన్స్ • ఈ ఏడాది 20 శాతం వృద్ధి అంచనా • సోనీ ఇండియా ఎండీ కెనిచిరో హిబి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం సోనీ సొంత తయారీ కేంద్రాన్ని భారత్‌లో నెలకొల్పాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ తమిళనాడులో థర్డ్ పార్టీకి చెందిన ప్లాంటులో ఉపకరణాలను అసెంబుల్ చేస్తోంది. సొంత ప్లాంటు ఏర్పాటుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్టు సోనీ ఇండియా ఎండీ కెనిచిరో హిబి తెలిపారు. దక్షిణప్రాంత సేల్స్ మేనేజర్ జి.రాజేశ్, హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ అభిజిత్‌తో కలసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 22-55 అంగుళాల ప్యానెళ్లను ఇప్పటికే భారత్‌లో అసెంబుల్ చేస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో మరింత పెద్ద సైజు ప్యానెళ్ల అసెంబ్లింగ్ చేపడతామన్నారు. స్మార్ట్ఫోన్లను దేశీయంగా తయారీ చేసే అవకాశాన్ని అధ్యయనం చేస్తున్నట్టు పేర్కొన్నారు. మీడియాతో ఆయనింకా ఏమన్నారంటే.. పండుగల సీజన్లో.. గతేడాదితో పోలిస్తే రానున్న పండుగల సీజన్లో అమ్మకాల్లో 40 శాతం వృద్ధిని ఆశిస్తున్నాం. మార్కెటింగ్‌కుగాను రూ.150 కోట్లు కేటాయించాం. సీజన్లో ఎంపిక చేసిన మోడళ్లపై కచ్చిత బహుమతి ఉంటుంది. అన్ని విభాగాల్లోనూ కొత్త మోడళ్లు కస్టమర్ల ముందుకు రానున్నాయి. ఎస్ఎల్ఆర్ కెమెరాలకు గిరాకీ ఏటా 20 శాతం పెరుగుతోంది. వెడ్డింగ్ మార్కెట్ ఇందుకు దోహదం చేస్తోంది. సోనీ ఆదాయం 2015-16తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. ప్రధాన మార్కెట్లలో ఒకటైన తెలుగు రాష్ట్రాల వాటా కంపెనీ ఆదాయంలో 15 శాతముంది. మాతృసంస్థకు సోనీ ఇండియా టాప్-5 మార్కెట్లలో ఒకటి. రెండు మూడేళ్లలో దీనిని టాప్-3కి తీసుకెళతాం. ప్రీమియం స్మార్ట్ఫోన్లే.. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్లలో 90% రూ.5-10 వేల ధరలో లభించేవే. ఇన్నోవేషన్‌కు సోనీ పెట్టింది పేరు. ముఖ్యంగా కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ లైఫ్, కస్టమర్ల అనుభూతిలో కంపెనీ ఉత్పాదనలు ఎప్పుడూ ముందుంటాయి. పరిశోధన, అభివృద్ధికి భారీగా వ్యయం చేస్తున్నాం. అందుకే మా ఉత్పత్తులు ఖరీదైనవి. స్మార్ట్ఫోన్ల విషయంలో రూ.20 వేలు ఆపై విభాగంలోనే పోటీ పడతాం. ఈ సెగ్మెంట్లో కంపెనీ మొబైళ్లకు మంచి ఆదరణ ఉంది. ఇటీవల విడుదల చేసిన ఎక్స్‌పీరియా ఎక్స్ఏ అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌కు డిమాండ్ ఉంది. ఇక ల్యాప్‌టాప్‌ల వ్యాపారం నుంచి సోనీ తప్పుకోవడం ఒక కస్టమర్‌గా చింతిస్తున్నాను. -
భారత్‌లో మరో చైనా కంపెనీ తయారీ ప్లాంట్
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ విక్రయదారి అయిన హువావే కూడా భారత్‌లో హ్యాండ్ సెట్ల తయారీకి సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ కార్యకలాపాలను ప్రారంభించబోతుందట. ఇంకో నెలలో ఈ ప్లాన్‌కు సంబంధించిన వివరాలను హువావే వెల్లడించనుంది. ప్రస్తుతం భారత్‌లో హ్యాండ్ సెట్ల తయారీ సంస్థను ఏర్పాటుచేయడానికి లైసెన్సు పొందామని, త్వరలోనే తయారీ ప్రణాళిక వివరాలను వెల్లడిస్తామని హువావే ఇండియా కన్సూమర్ బిజినెస్ గ్రూపు అధినేత పిటర్ జాయ్ తెలిపారు. చైనా తర్వాత తమ మొబైల్ డివైజ్‌లకు భారత్ రెండో మార్కెట్‌గా ఉండాలని కంపెనీ భావిస్తోంది. అంతర్జాతీయ బ్రాండ్‌గా, సరియైన సమయంలో భారత్‌లో వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపుతున్నామని వెల్లడించింది. భారత్ మార్కెట్లో తమ దూకుడును పెంచి, హువావే స్టోర్లను 50వేలకు పెంచుతామని పిటర్ వివరించారు. గత 16 ఏళ్లుగా హువావే భారత్‌లో మొబైల్ ఫోన్ల విక్రయాలు చేపడుతోంది. 1999లో బెంగళూరులో స్వతంత్ర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేసింది. సొంత బ్రాండెడ్ స్టోర్లను ఏర్పాటుచేసేందుకు కూడా హువావే ప్లాన్ చేస్తోంది. కానీ ఆ ప్లాన్‌కు సంబంధించిన వివరాలను ఇంకా బయటికి వెల్లడించలేదు. బుధవారమే హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్ హువావే పీ9ను రూ.39,999లకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయాలు చేపట్టనున్నట్టు తెలిపింది.