ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా నిలిచిందని కేంద్ర న్యాయ, టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 200కి పైగా మొబైల్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు సోమవారం ప్రకటించారు.
భారతదేశంలో ఇప్పటివరకు 330 మిలియన్ మొబైల్ హ్యాండ్‌సెట్‌లు తయారైనట్టు చెబుతూ దీనికి సంబంధించిన డేటాను కేంద్ర మంత్రి షేర్ చేశారు. 2014లో కేవలం 2 ప్లాంట్లలో 60 మిలియన్ల మొబైల్ ఫోన్లు మాత్రమే తయారు అయ్యాయి. వీటి విలువ కూడా 2014లో 3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2019లో 30 బిలియన్ డాలర్లకు పెరిగింది. అలాగే రేపు (జూన్ 2న) మధ్యాహ్నం 12:00 గంటలకు విలేకరుల సమావేశంలో భారతీయ ఎలక్ట్రానిక్ రంగం కోసం కొత్త పథకాలను ప్రకటించనున్నారు. భారీ దిగుమతిదారుగా ఉన్న భారత్ గత ఐదేళ్లలో బలమైన ఎగుమతిదారుగా అవతరించిందని ఎలక్ట్రానిక్స్ ఇండియా ట్వీట్ చేసింది.
Under the leadership of PM @narendramodi, India has emerged as the 2nd largest mobile phone manufacturer in the world. In the last 5 years, more than 200 Mobile Phone Manufacturing units have been set up. #ThinkElectronicsThinkIndia pic.twitter.com/fGGeCRpj87
— Ravi Shankar Prasad (@rsprasad) June 1, 2020
చదవండి : సీనియర్లకు షాకివ్వనున్న ఇన్ఫోసిస్
షావోమి ల్యాప్‌టాప్ లాంచ్ : ఈ నెలలోనే
Comments
Please login to add a commentAdd a comment