న్యూఢిల్లీ: గతంలో మొబైల్ కొంటే దాంతో పాటు చార్జర్, ఇయర్ ఫోన్స్ వచ్చేవి. కాలక్రమేణా ఇయర్ ఫోన్స్ ఫోన్ తో పాటు రావడం ఆగిపోయింది. రానున్న రోజుల్లో చార్జర్ ను తొలగించి ఖర్చులను తగ్గించుకోవాలని ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, శాంసంగ్ ఫోన్ తయారీ దారులు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల తయారీదారులకు చార్జర్ తయరీ ఖర్చులతో పాటు ఫోన్ ప్యాకేజింగ్ లో అయ్యే అదనపు ఖర్చు కూడా మిగులుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిపై శాంసంగ్, యాపిల్ తయారీదారుల నుంచి అధికారిక సమాచారం ఏదీ రాలేదు. త్వరలో రానున్న ఐఫోన్ 12లో ఇయర్ ఫోన్స్ తో పాటు, చార్జర్ కూడా రాదని యాపిల్ ఎనలిస్ట్ మింగ్ చుకో అంటున్నారు. ప్రస్తుతం వస్తున్న ఫోన్లన్నీ దాదాపు టైప్ సీ పోర్టుతో వస్తున్నాయి. దీనివల్ల మార్కెట్లో ఒకే తరహా చార్జర్ అందుబాటులోకి వస్తుందని తయారీ సంస్థలు భావిస్తున్నాయి. అంతేగాక వైర్ లెస్ చార్జింగ్ సదుపాయంతో వస్తున్న ఫోన్లకు అసలు చార్జర్ అవసరమే ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment