Samsung Mobiles
-
శామ్సంగ్ కొత్త ఫోన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శామ్సంగ్ భారత్‌లో గెలాక్సీ సిరీస్‌లో ఏ55 5జీ, ఏ35 5జీ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టింది. 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లను జోడించింది. ఈ మోడళ్లు 5జీతోపాటు వేగంగా వృద్ధి చెందుతున్న రూ.30–50 వేల ధరల విభాగంలో తమ స్థానాన్ని కన్సాలిడేట్ చేస్తాయని శామ్సంగ్ తెలిపింది. ధర రూ.27,999 నుంచి రూ.42,999 వరకు ఉంది. -
రూ. 32,999 ఫోన్ కేవలం రూ. 2,999కే సొంతం చేసుకోండిలా..!
ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్లను వినియోగించేవారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అయితే ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని ఖరీదైన మొబైల్ ఉపయోగించడానికి కొంత మంది వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఇప్పుడు మార్కెట్లో శాంసంగ్ రూ. 32,999 ధర వున్నా మొబైల్ ఫోన్ కేవలం రూ. 2,999కే లభిస్తుంది. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం53 మొబైల్ మార్కెట్లో రూ. 32,999. కానీ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2,999కి కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉండటం వల్ల మీకు రూ. 25,000 వరకు ఆదా చేయవచ్చు. అది కూడా మీరు ఎక్స్ఛేంజ్ చేయాలనుకునే మొబైల్ ఫోన్ మంచి కండిషన్లో ఉండాలి. అంతే కాకుండా మీ మొబైల్ బ్రాండ్ మీద కూడా ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఆధార పడి ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కాకుండా కొనుగోలు చేయాలనుకుంటే అసలు ధరలో 20 శాతం తగ్గింపు లభిస్తుంది. కావున మీరు రూ. 32,000 ఫోన్ రూ. 27,999కి లభిస్తుంది. HDFC క్రెడిట్ కార్డు ద్వారా కొనాలకునేవారు రూ. 1,500 డిస్కౌంట్ పొందవచ్చు. మొత్తం మీద మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు రూ. 2999కే లభిస్తుంది. కొనుగోలుదారుడు తప్పకుండా ఈ షరతులను గుర్తుంచుకోవాలి. (ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!) శాంసంగ్ గెలాక్సీ ఎం53 మొబైల్ మంచి డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఈ మొబైల్ 120 Hz రిఫ్రెష్ రేట్ 6.7 ఇంచెస్ సూపర్ అమోటెడ్ డిస్ప్లే కలిగి, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ పొందుతుంది. ఇందులోని 500 mAh బ్యాటరీ 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ ఎం53 మొబైల్ అన్ని విధాలుగా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. -
శాంసంగ్ గెలాక్సీ 5జి మొబైల్స్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్: ఈ రోజే లాస్ట్
భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ, ఏ34 5జీ మొబైల్స్ ఎట్టకేలకు సేల్కు వచ్చాయి. కంపెనీ ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ మీద ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా తీసుకువచ్చింది. ఈ 5జి మొబైల్స్ మునుపటి మోడల్స్ కంటే కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. కొత్త శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ & ఏ43 5జీ రెండూ కూడా ఈ రోజు (మార్చి 23) నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఏ54 5జీ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ధర రూ. 38,999, కాగా 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్ ధర రూ. 40,999. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ధరల విషయానికి వస్తే, ఇందులో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర రూ. 30,999 కాగా, టాప్ వేరియంట్ (8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్) ధర రూ.32,999. వీటిని ఇప్పుడు కంపెనీ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు. లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో కూడా తీసుకోవచ్చు. (ఇదీ చదవండి: భయం గుప్పెట్లో ఉద్యోగులు.. నీటి బుడగలా ఉద్యోగాలు: భారత్‌లోనూ..) శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ 6.4 ఇంచెస్ డిస్ప్లే కలిగి వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు పొందుతుంది. అదే సమయంలో ఏ34 5జీ మోడల్ 6.6 ఇంచెస్ డిస్ప్లే కలిగి, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు పొందుతుంది. (ఇదీ చదవండి: ఇది కదా సక్సెస్ అంటే: ఒకప్పుడు ట్యూషన్ టీచర్.. ఇప్పుడు వంద కోట్లకు అధిపతి!) కంపెనీ ఈ లేటెస్ట్ మొబైల్స్ కొనుగోలు మీద ఆఫర్స్ కూడా అందిస్తోంది, ఇందులో భాగంగానే శాంసంగ్ వెబ్సైట్లో కొనుగోలు చేస్తే రూ.1000 వోచర్, ICICI క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా రూ. 3,000 డిస్కౌంట్ పొందవచ్చు. అంతే కాకుండా సుమారు రూ. 5,999 విలువైన గెలాక్సీ బడ్స్ లైవ్ టీడబ్ల్యూఎస్ను కేవలం రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్స్ అన్నీ కూడా కేవలం ఈ రోజు అర్ధరాత్రి (మార్చి 24) వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. -
శాంసంగ్ యూజర్లకు అలర్ట్...! వీటితో జాగ్రత్త..!
శాంసంగ్ యూజర్లకు అలర్ట్..! శాంసంగ్ గెలాక్సీ స్టోర్‌లో మాల్వేర్ ఆధారిత యాప్స్ ఉన్నాయని ప్రముఖ ఆన్లైన్ టెక్ పబ్లికేషన్స్ ఆండ్రాయిడ్ పోలీస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. శాంసంగ్ మొబైల్ స్మార్ట్‌ఫోన్‌లోని ప్రతి గెలాక్సీ స్టోర్‌లో ఈ మాల్వేర్స్ ఉన్నట్లు ఆండ్రాయిడ్ పోలీస్ ఒక ప్రచురణలో పేర్కొంది. నివేదిక ప్రకారం....స్ట్రీమింగ్ యాప్స్‌ల్లో మాల్వేర్ను కలిగి ఉండవచ్చునని అభిప్రాయపడింది. శాంసంగ్ గెలాక్సీ స్టోర్‌లో షోబాక్స్ యాప్ అనేక క్లోన్(నకిలీ)యాప్స్‌ను కలిగి ఉందని పేర్కొంది. షోబాక్స్ యాప్ ఒక మూవీ, టీవీ సిరీస్‌లను ఉచితంగా అందించే ప్రసిద్ధ యాప్. షోబాక్స్ యాప్ తరహ సుమారు ఐదు నకిలీ యాప్స్ స్టోర్‌లో ఉన్నాయని ఆండ్రాయిడ్ పోలీస్ తన నివేదికలో పేర్కొంది. ఈ నకిలీ యాప్స్ అత్యంత ప్రమాదకమైనవని వెల్లడించింది. కొన్ని యాప్స్ కాల్ లాగ్స్, కాంటాక్ట్స్, టెలిఫోన్‌కు యాక్సెస్‌తో సహా అనవసరమైన అనుమతులను కూడా యూజర్ ప్రమేయం లేకుండా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇలాంటి సమస్య గతంలో హువావే స్మార్ట్ఫోన్లలో తలెత్తింది. అప్పట్లో డజనుపైగా హెచ్చరికలను జారీ చేశారు. మీ స్మార్ట్‌ఫోన్‌ను రక్షించుకోవడానికి ఇలా చేయండి...? ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో మాల్వేర్తో నిండిన యాప్స్‌ను ఏదైనా ఇన్స్టాల్ చేశారో లేదో ముందుగా చెక్ చేసి, వెంటనే వాటిని తీసివేయాలి. ఇది ఎలా సాధ్యమౌతుందంటే గూగుల్ ప్లే ప్రోటెక్ట్ను ఆన్ చేయగానే..ఆయా యాప్స్ ప్రమాదకరమైనవని గూగుల్ సూచిస్తుంది. యూజర్లు కాస్పర్‌స్కై, నోర్టన్ 360 వంటి యాంటీ వైరస్ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే మంచింది. కొన్ని యాప్స్ పరిమిత కాలపు వరకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి. మీకు కావాల్సిన యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచే కాకుండా ఆయా యాప్స్ అధికారిక వెబ్‌సైట్స్ నుంచి డౌన్లోడ్ చేయడం ఉత్తమం. థర్డ్ పార్టీ యాప్స్ జోలికి వెళ్లకపోవడం మంచింది. చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్..! ఈ యాప్స్ ఫోన్లో ఉంటే..మీ ఖాతాలు ఖాళీ..! చదవండి: 200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్ హెచ్చరిక..! -
అదిరిపోయిన మడత ఫోన్లు.. సెప్టెంబర్ 10 నుంచి అమ్మకానికి!
సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ తన దూకుడు పెంచింది. అదిరిపోయే ఫీచర్లతో కాంపీటీటర్ల ఫోన్లకు పోటీగా మడత(ఫోల్డబుల్ ) ఫోన్లను మన దేశంలో విడుదల చేసింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 మడత (ఫోల్డబుల్ )ఫోన్లను హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.7,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. భారతదేశంలోని వినియోగదారులు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3లను శామ్సంగ్ పోర్టల్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 09, 2021 వరకు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లు సెప్టెంబర్ 10, 2021 నుంచి అమ్మకానికి రానున్నాయి. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 రెండు డిస్ ప్లేలు ప్రధాన ఫోల్డబుల్ ఇన్నర్ డిస్ ప్లే, ఔటర్ సెకండరీ డిస్ ప్లేతో వస్తాయి. ప్రధాన స్క్రీన్ 7.6 అంగుళాల క్యూఎక్స్ జీఎ+ డైనమిక్ అమోల్డ్ ప్యానెల్ తో వస్తుంది. ఇది 120హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేటుతో 2208×1768 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. రెండో ప్యానెల్ 6.2 అంగుళాల హెచ్ డీ+ డైనమిక్ అమోల్డ్ డిస్ ప్లేతో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వస్తుంది. దీనిలో 4,400 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది. 12 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 12 ఎంపీ కెమెరా ఉంది. 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ బరువు 271 గ్రాముల. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 12జీబీ ర్యామ్, 256జీబీ/ 512 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. 12 జీబీ/256 జీబీ వేరియంట్ ధర రూ.1,49,999, 12 జీబీ/512 జీబీ రూ.1,57,999కు లభిస్తోంది. శామ్సంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3 శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 రెండు వేరియెంట్లలో లభ్యం కానుంది. ఇందులో 8జీబి ర్యామ్/128జీబి స్టోరేజ్ వేరియెంట్, 8జీబి ర్యామ్/256జీబి స్టోరేజ్ వేరియెంట్ ఉన్నాయి. 8జీబీ/128జీబీ వేరియంట్ ధర రూ.84,999, 8 జీబీ/256 జీబి వేరియంట్ ధర రూ.88,999కు లభిస్తాయి. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3లో 6.7 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ డైనమిక్ అమోల్డ్ డిస్ ప్లే, 425పీపీఐ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11, శామ్సంగ్ వన్ యుఐ 3.1తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 12 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. దీనిలో 3,300 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది. -
16వేలకే శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62
ముంబయి: మొబైల్ తయారీ దిగ్గజం శామ్సంగ్ సంస్థ గెలాక్సీ సిరీస్ లో ఎఫ్62 మొబైల్ ను గత కొద్దీ రోజుల క్రితం తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. గత ఏడాది అక్టోబర్‌లో తీసుకొచ్చిన ఎఫ్-సిరీస్ గెలాక్సీ ఎఫ్41కు కొనసాగింపుగా శామ్సంగ్ కంపెనీ గెలాక్సీ ఎఫ్ 62 మోడల్ ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీనిలో ప్రధానంగా భారీ సామర్ధ్యం గల 7,000ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చారు. మిడ్ రేంజ్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62లో ఎక్సినోస్ 9825 ప్రాసెసర్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి ప్రత్యేకతలున్నాయి. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 సేల్ ఫిబ్రవరి 22న ఫ్లిప్‌కార్ట్‌లో ఫస్ట్ సేల్ కి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనేవారికి రూ.2,500 ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఆఫ్ లైన్ భాగస్వాములైన రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్ వెళ్లి శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62ను కొనుగోలు చేస్తే మీకు రూ.10వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. మీకు మొదట రూ.3వేలు ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ లభించగా మొబైల్ కొన్న తర్వాత శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 మొబైల్ లో జియో సిమ్ వేసుకొని రూ.349పైన ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీకు రూ.7వేలు రూపాయలు వోచర్ రూపంలో లభిస్తాయి. మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ తో రిలయన్స్ డిజిటల్ లో కొంటే రూ.5వేలు తగ్గే అవకాశం ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 స్పెసిఫికేషన్స్: డిస్ప్లే: 6.7 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్డీ ప్లస్ బ్యాటరీ: 7,000ఎంఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 25వాట్ ర్యామ్: 6జీబీ, 8జీబీ స్టోరేజ్: 128జీబీ ప్రాసెసర్: ఎక్సినోస్ 9825 బ్యాక్ కెమెరా: 64 ఎంపీ + 12 ఎంపీ + 5 ఎంపీ + 5 ఎంపీ సెల్ఫీ కెమెరా: 32 మెగాపిక్సెల్ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 11 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ కలర్స్: లేజర్ బ్లూ, లేజర్ గ్రీన్, లేజర్ గ్రే కలర్ ధర: 6జీబీ+128జీబీ - రూ.23,999 8జీబీ+128జీబీ - రూ.25,999 చదవండి: జీఎస్టీపై కేంద్రం కీలక నిర్ణయం? బంగారం కొనుగోలుదారులకు తీపికబురు -
నిశ్శబ్దంగా విడుదలైన గెలాక్సీ ఎ02
శామ్సంగ్ సంస్థ ఎంట్రీ లెవల్ స్పెసిఫికేషన్లు గల గెలాక్సీ ఎ02 మొబైల్ ను నిశ్శబ్దంగా థాయ్‌లాండ్ సైట్లో తీసుకొచ్చింది. గెలాక్సీ ఎ-సిరీస్ ఫోన్ భిన్నంగా ఈ గెలాక్సీ ఎ02 మొబైల్ ఉంది. ఇది 6.5-అంగుళాల హెచ్డి ప్లస్ టిఎఫ్టి ఇన్ఫినిటీ-వి డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డెనిమ్ బ్లాక్, డెనిమ్ బ్లూ, డెనిమ్ రెడ్ మరియు డెనిమ్ గ్రే రంగులలో లభిస్తుంది.(చదవండి: టిక్‌టాక్ ఉద్యోగుల తొలగింపు) గెలాక్సీ ఎ02 ఫీచర్స్ డ్యూయల్ సిమ్(నానో) గల శామ్సంగ్ గెలాక్సీ ఎ02 ఆండ్రాయిడ్ 10తో నడుస్తుంది. ఇందులో 6.5-అంగుళాల(720 x 1,600 పిక్సెల్స్) హెచ్డి ప్లస్ ఇన్ఫినిటీ-వి డిస్ప్లే తీసుకొచ్చారు. ఇది 1.5గిగాహెర్ట్జ్ మీడియాటెక్ MT6739W క్వాడ్-కోర్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది 2జీబీ + 32జీబీ, 3జీబీ + 32జీబీ, 3జీబీ + 64జీబీ వంటి స్టోరేజ్ కాన్ఫిగరేషన్లు ఉన్నాయి. స్టోరేజ్ ను విస్తరించడానికి ప్రత్యేకమైన మైక్రో ఎస్ డి కార్డ్(1టీబీ) స్లాట్ కూడా ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఎ02లో వెనుకవైపు 13ఎంపీ(f/1.9) ప్రైమరీ కెమెరా, 2ఎంపీ(f/2.4) మాక్రో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. వీడియో కాలింగ్ కోసం 5ఎంపీ కెమెరా అందించబడుతుంది. కనెక్టివిటీ కోసం ఇందులో డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్‌టిఇ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, డాల్బీ అట్మోస్, వై-ఫై, బ్లూటూత్ 5, జీపీఎస్ ప్లస్ గ్లోనాస్ ఉంది. 7.75వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 206 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2జీబీ ర్యామ్ + 32జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వేరియంట్ ధర థాయ్‌లాండ్‌లో టిహెచ్‌బి 2,999(సుమారు రూ.7,300)గా ఉంది. -
ఇక కొత్త ఫోన్‌తో చార్జర్ రాదు
న్యూఢిల్లీ: గతంలో మొబైల్ కొంటే దాంతో పాటు చార్జర్, ఇయర్ ఫోన్స్ వచ్చేవి. కాలక్రమేణా ఇయర్ ఫోన్స్ ఫోన్ తో పాటు రావడం ఆగిపోయింది. రానున్న రోజుల్లో చార్జర్ ను తొలగించి ఖర్చులను తగ్గించుకోవాలని ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, శాంసంగ్ ఫోన్ తయారీ దారులు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల తయారీదారులకు చార్జర్ తయరీ ఖర్చులతో పాటు ఫోన్ ప్యాకేజింగ్ లో అయ్యే అదనపు ఖర్చు కూడా మిగులుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిపై శాంసంగ్, యాపిల్ తయారీదారుల నుంచి అధికారిక సమాచారం ఏదీ రాలేదు. త్వరలో రానున్న ఐఫోన్ 12లో ఇయర్ ఫోన్స్ తో పాటు, చార్జర్ కూడా రాదని యాపిల్ ఎనలిస్ట్ మింగ్ చుకో అంటున్నారు. ప్రస్తుతం వస్తున్న ఫోన్లన్నీ దాదాపు టైప్ సీ పోర్టుతో వస్తున్నాయి. దీనివల్ల మార్కెట్లో ఒకే తరహా చార్జర్ అందుబాటులోకి వస్తుందని తయారీ సంస్థలు భావిస్తున్నాయి. అంతేగాక వైర్ లెస్ చార్జింగ్ సదుపాయంతో వస్తున్న ఫోన్లకు అసలు చార్జర్ అవసరమే ఉండదు. -
ఇండియన్స్ మెచ్చే బ్రాండ్ ఏంటో తెలుసా...
కోల్ కతా: కొరియా స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం శాంసంగ్ భారతీయులు ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే ఫోన్ అని టీఆర్ఏ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. దేశంలో వినియోగదారులు నమ్మే అన్ని కంపెనీలలోకెల్లా మొబైల్ కంపెనీ శాంసంగ్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో ఎక్కువ మంది వినియోగదారులు శాంసంగ్ మొబైల్స్ నే నమ్ముతారని, ఆ తర్వాత సోనీ, ఎల్జీ, నోకియా, టాటా మొబైల్స్ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. 'బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా సర్వే స్టడీ 2016' లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. తొలి ఐదు స్థానాలు మొబైల్స్ బ్రాండ్ కంపెనీలు చోటు దక్కించుకోవడం విశేషం. ఆరో స్థానంలో హోండా కంపెనీ, ఏడో స్థానంలో బజాజ్, ల్యాప్ టాప్ తయారీ సంస్థ డెల్ ఎనిమిదో స్థానంలో నిలవగా గోద్రెజ్ తొమ్మిదో స్థానం సంపాదించి టాప్ టెన్ బ్రాండ్లలో నిలిచింది. దేశవ్యాప్తంగా 16 నగరాలలో 267 రకాల బ్రాండ్ ప్రొడక్ట్స్ పై సర్వే చేసి ఈ వివరాలు ప్రకటించారు. కింగ్ ఫిషర్ ఎక్కువ మంది మెచ్చే బీర్ బ్రాండ్ కాగా, ఇంటర్నెట్ విభాగంలో గూగుల్ తొలి స్థానంలో నిలిచింది. -
శాంసంగ్.. 2016 విశ్వసనీయమైన బ్రాండ్ ..
ముంబై: దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ మొబైల్స్ దేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా అవతరించింది. టాప్-5లో కేవలం ఒకే ఒక దేశీ సంస్థ టాటా గ్రూప్ చోటు దక్కించుకుంది. ‘బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్-ఇండియా స్టడీ 2016’ పేరుతో ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ (టీఆర్ఏ) ఒక సర్వే నిర్వహించింది. విశ్వసనీయమైన టాప్-5 బ్రాండ్స్‌లో శాంసంగ్ మొబైల్స్, సోనీ, ఎల్జీ, నోకియా, టాటా కంపెనీలు ఉన్నాయి. గతేడాది ఎల్జీ అగ్ర స్థానంలో, శాంసంగ్ రెండోస్థానంలో ఉండేవి. ఈ ఏడాది శాంసంగ్ టాప్‌లోకి వెళ్లింది. ఇక టాటా స్థానం 4 నుంచి 5కి పడింది. రిలయన్స్ స్థానం 14 నుంచి 22కు క్షీణించింది. మారుతీ సుజుకీ స్థానం మాత్రం 16 నుంచి 11కి మెరుగుపడింది. హీరో మోటోకార్ప్ 14వ స్థానంలో నిలిచింది. -
మార్కెట్ లోకి స్యామ్ సంగ్ 'గెలాక్సీ గోల్డెన్'
స్యామ్ సంగ్ గెలాక్సీ కుటుంబంలో సరికొత్త మోడల్ తాజాగా చేరింది. కొరియన్ మోబైల్ ఫోన్ హ్యండ్ సెట్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్యామ్ సంగ్ సోమవారం 'గెలాక్సీ గోల్డెన్' అనే మోబైల్ ఫోన్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. మార్కెట్ లో 'గెలాక్సీ గోల్డెన్' ధర 51, 900 రూపాయలు. డ్యూయల్ స్క్రీన్ ఫ్లిప్ ఫోన్ స్మార్ట్ ఫోన్ల్ వినియోగదారులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. క్లాసిక్ డిజైన్ తో కస్టమర్లను ఆకట్టకుంటుంది అని స్యామ్ సంగ్ కంట్రీ హెడ్ వినీత్ తనేజా తెలిపింది. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీ బీన్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.7 జీహోచ్ జెడ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ ర్యామ్ దీని ప్రత్యేకత అని తెలిపారు.