సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్‌సంగ్ తన దూకుడు పెంచింది. అదిరిపోయే ఫీచర్లతో కాంపీటీటర్ల ఫోన్లకు పోటీగా మడత(ఫోల్డబుల్ ) ఫోన్లను మన దేశంలో విడుదల చేసింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 మడత (ఫోల్డబుల్ )ఫోన్లను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.7,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. భారతదేశంలోని వినియోగదారులు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3లను శామ్‌సంగ్ పోర్టల్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 09, 2021 వరకు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లు సెప్టెంబర్ 10, 2021 నుంచి అమ్మకానికి రానున్నాయి.
శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3
శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 రెండు డిస్ ప్లేలు ప్రధాన ఫోల్డబుల్ ఇన్నర్ డిస్ ప్లే, ఔటర్ సెకండరీ డిస్ ప్లేతో వస్తాయి. ప్రధాన స్క్రీన్ 7.6 అంగుళాల క్యూఎక్స్ జీఎ+ డైనమిక్ అమోల్డ్ ప్యానెల్ తో వస్తుంది. ఇది 120హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేటుతో 2208×1768 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. రెండో ప్యానెల్ 6.2 అంగుళాల హెచ్ డీ+ డైనమిక్ అమోల్డ్ డిస్ ప్లేతో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వస్తుంది.
దీనిలో 4,400 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది. 12 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 12 ఎంపీ కెమెరా ఉంది. 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ బరువు 271 గ్రాముల. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 12జీబీ ర్యామ్, 256జీబీ/ 512 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. 12 జీబీ/256 జీబీ వేరియంట్ ధర రూ.1,49,999, 12 జీబీ/512 జీబీ రూ.1,57,999కు లభిస్తోంది.
శామ్‌సంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3
శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 రెండు వేరియెంట్లలో లభ్యం కానుంది. ఇందులో 8జీబి ర్యామ్/128జీబి స్టోరేజ్ వేరియెంట్, 8జీబి ర్యామ్/256జీబి స్టోరేజ్ వేరియెంట్ ఉన్నాయి. 8జీబీ/128జీబీ వేరియంట్ ధర రూ.84,999, 8 జీబీ/256 జీబి వేరియంట్ ధర రూ.88,999కు లభిస్తాయి. శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3లో 6.7 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ డైనమిక్ అమోల్డ్ డిస్ ప్లే, 425పీపీఐ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11, శామ్‌సంగ్ వన్ యుఐ 3.1తో వస్తుంది.
స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 12 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. దీనిలో 3,300 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment