Flip smartphone
-
లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్.. అప్పుడు కొనలేకపోయారా? ఇప్పుడు కొనేయండి!
మార్కెట్లోకి రకరకాల లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు వస్తూ ఉన్నాయి. ప్రత్యేకమైన సరికొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే లాంచ్ అయినప్పుడు వాటి ధర ఎక్కువగా ఉంటుంది. దీంతో కొంతమంది వాటిని కొనలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం కంపెనీలు కొన్ని నెలల తర్వాత ఆ ఫోన్ల ధరలను తగ్గిస్తుంటాయి. మోటరోలా రేజర్ 40 (Moto Razr 40), మోటరోలా రేజర్ 40 అల్ట్రా (Moto Razr 40 Ultra) ఫ్లిప్ ఫోన్లు గతేడాది జూన్‌లో విడుదలయ్యాయి. 2000ల ప్రారంభం నాటి ఐకానిక్ Motorola Razr ఫ్లిప్ ఫోన్లను పునరుద్ధరిస్తూ లేటెస్ట్ ఫీచర్లతో కంపెనీ వీటిని తీసుకొచ్చింది. ప్రస్తుతం వీటి ధరలను మోటరోలా భారీగా తగ్గించింది. అధిక ధరల కారణంగా అప్పుడు కొనలేకపోయినవారు ఇప్పుడు కొనవచ్చు. రూ.20,000 తగ్గింపు మోటరోలా భారత్‌లో తన మోటో రేజర్ 40, మోటో రేజర్ 40 అల్ట్రా ఫ్లిప్ ఫోన్లకు గణనీయమైన ధర తగ్గింపును ప్రకటించింది. మోటో రేజర్ 40 ధరను రూ. 15,000 తగ్గించింది. దీని అసలు ధర రూ. 59,999 కాగా ఇప్పడు రూ. 44,999కి తగ్గింది. అదేవిధంగా మోటో రేజర్ 40 అల్ట్రా ధరను ఏకంగా రూ. 20,000 తగ్గించింది. రూ. 89,999 ఉన్న ఈ ఫోన్‌ను రూ. 69,999కే కొనుక్కోవచ్చు. మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. మోటో రేజర్ 40 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 144 Hz రిఫ్రెష్ రేట్, 1080×2640 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.90-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే, 1.50-అంగుళాల సెకండరీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ద్వారా ఆధారితం 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్. ఇందులో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ కెమెరా, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అజూర్ గ్రే, చెర్రీ పౌడర్, బ్రైట్ మూన్ వైట్ రంగులలో లభ్యం 4200 mAh బ్యాటరీ, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మోటో రేజర్ 40 అల్ట్రా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 1080×2640 పిక్సెల్స్ రిజల్యూషన్, 165 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ద్వారా ఆధారితం 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 12-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇన్ఫినిట్ బ్లాక్, వివా మెజెంటా రంగులలో లభ్యం వైర్లెస్, వైర్డు ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేసే 3800mAh బ్యాటరీ -
భారత్‌లో ఫోల్డబుల్ ఫోన్ల హవా!
న్యూఢిల్లీ: భారత స్మార్ట్ఫోన్ల విపణిలో ఇప్పుడు ఫ్లిప్ మోడళ్ల హవా నడుస్తోంది. ఫ్లిప్ విభాగంలో గట్టి పట్టు కోసం చైనా కంపెనీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. శామ్సంగ్కు ధీటుగా పోటీ ఇవ్వడానికి ఈ కంపెనీలు వినూత్నంగా ఫ్లిప్ ఫోన్లను తయారు చేసి కస్టమర్లను ఊరిస్తున్నాయి. చైనాకు చెందిన టెక్ దిగ్గజం లెనోవో అనుబంధ కంపెనీ అయిన మోటరోలాతోపాటు టెక్నో, ఒప్పో వీటిలో ఉన్నాయి. పరిశ్రమలో తొలిసారిగా మోటరోలా రూ.50,000 లోపు ధరలో ఫ్లిప్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఈ నెలాఖరులోగా వన్‌ప్లస్ నుంచి ప్రిమియం ఫ్లిప్ ఫోన్ వస్తోంది. 2023 జూలైలో ఫ్లిప్ మోడల్ విడుదల చేసిన తర్వాత రెండు నెలల్లోనే శామ్సంగ్ సుమారు 50–60 వేల యూనిట్లు విక్రయించినట్టు అంచనా అని కౌంటర్‌పాయింట్ రిసర్చ్ తెలిపింది. మోటరోలా, టెక్నో బ్రాండ్స్ నెలకు చెరి 18–20 వేల యూనిట్లను అమ్ముతున్నాయని వివరించింది. ఈ కంపెనీలను టెక్నో, ఒప్పో అనుసరించాయి. సర్క్యులర్ కవర్ డిస్ప్లే, మధ్య స్థాయి ఫీచర్లతో టెక్నో ఫ్లిప్ ఫోన్‌ను రూ.50 వేల ధరలో ప్రవేశపెట్టింది. మెరుగైన కెమెరా, బ్యాటరీకితోడు సాధారణ స్మార్ట్‌ఫోన్ మాదిరి డిస్ప్లేతో ఫ్లిప్ మోడల్‌ను ఒప్పో తీసుకొచ్చింది. -
టెక్నో తొలి ఫ్లిప్ మొబైల్: ఫాంటమ్ వి ఫ్లిప్ 5 జీ..ధర తక్కువే!
Tecno Phantom V Flip 5G చైనా మొబైల్ తయారీదారు టెక్నో తొలి ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫాంటమ్ వి ఫ్లిప్ 5 జీని శుక్రవారం ఆవిష్కరించింది. చక్కటి డిజైన్, బ్యూటిఫుల్ లుక్, అత్యాధునిక టెక్నాలజీతోపాటు, అందుబాటులో ధరలో యూజర్లను ఆకట్టుకోనుంది. కేవలం 15 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. అలాగే టెక్ డైమెన్సిటీ 8050 5జీ చిప్ సెట్ 64MP+13MP+32MP కెమెరా స్పెషల్ ఫీచర్‌గా నిలుస్తోంది. ధర లభ్యత, ప్రస్తుతానికి సింగపూర్ ఆవిష్కరించిన ఫాంటమ్ వి ఫ్లిప్ 5 జీ ఫోన్ అక్టోబర్ 1న ఇండియాలో లాంచ్ అవుతుందనీ, అదే రోజు మధ్యాహ్నం 12 గంటలనుంచి అమెజాన్ లో సేల్ షురూ అవుతుందని కూడా టెక్నో ప్రకటించింది. అంతేకాదు స్పెషల్ ఆఫర్‌గా ఈ ఫ్లిప్ ఫోన్ ధరను రూ. 49,900 కే అందించనుంది. మిస్టిక్ డాన్ , ఐకానిక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. స్పెసిఫికేషన్లు 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ మెయిన్ స్క్రీన్ 1.3 అంగుళాల అమోల్డ్ స్క్రీన్ HiOS 13.5 ఆపరేటింగ్ సిస్టం 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 32 ఎంపీ డ్యూయల్-ఫ్లాష్ ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ 45 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టు -
అదిరిపోయిన మడత ఫోన్లు.. సెప్టెంబర్ 10 నుంచి అమ్మకానికి!
సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ తన దూకుడు పెంచింది. అదిరిపోయే ఫీచర్లతో కాంపీటీటర్ల ఫోన్లకు పోటీగా మడత(ఫోల్డబుల్ ) ఫోన్లను మన దేశంలో విడుదల చేసింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 మడత (ఫోల్డబుల్ )ఫోన్లను హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.7,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. భారతదేశంలోని వినియోగదారులు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3లను శామ్సంగ్ పోర్టల్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 09, 2021 వరకు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లు సెప్టెంబర్ 10, 2021 నుంచి అమ్మకానికి రానున్నాయి. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 రెండు డిస్ ప్లేలు ప్రధాన ఫోల్డబుల్ ఇన్నర్ డిస్ ప్లే, ఔటర్ సెకండరీ డిస్ ప్లేతో వస్తాయి. ప్రధాన స్క్రీన్ 7.6 అంగుళాల క్యూఎక్స్ జీఎ+ డైనమిక్ అమోల్డ్ ప్యానెల్ తో వస్తుంది. ఇది 120హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేటుతో 2208×1768 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. రెండో ప్యానెల్ 6.2 అంగుళాల హెచ్ డీ+ డైనమిక్ అమోల్డ్ డిస్ ప్లేతో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వస్తుంది. దీనిలో 4,400 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది. 12 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 12 ఎంపీ కెమెరా ఉంది. 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ బరువు 271 గ్రాముల. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 12జీబీ ర్యామ్, 256జీబీ/ 512 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. 12 జీబీ/256 జీబీ వేరియంట్ ధర రూ.1,49,999, 12 జీబీ/512 జీబీ రూ.1,57,999కు లభిస్తోంది. శామ్సంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3 శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 రెండు వేరియెంట్లలో లభ్యం కానుంది. ఇందులో 8జీబి ర్యామ్/128జీబి స్టోరేజ్ వేరియెంట్, 8జీబి ర్యామ్/256జీబి స్టోరేజ్ వేరియెంట్ ఉన్నాయి. 8జీబీ/128జీబీ వేరియంట్ ధర రూ.84,999, 8 జీబీ/256 జీబి వేరియంట్ ధర రూ.88,999కు లభిస్తాయి. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3లో 6.7 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ డైనమిక్ అమోల్డ్ డిస్ ప్లే, 425పీపీఐ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11, శామ్సంగ్ వన్ యుఐ 3.1తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 12 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. దీనిలో 3,300 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది. -
శాంసంగ్ హై-ఎండ్ ఫ్లిప్ఫోన్
బీజింగ్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ శాంసంగ్ ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. ‘డబ్ల్యూ 2019’ పేరుతో హైఎండ్ ఫ్లిప్‌మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్ సూపర్ డిస్ప్లే, డ్యుయల్ రియర్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. పుల్ బాడీ 3డీ గ్లాస్ మెటల్ డిజైన్‌తో రూపొందించిన ఈ డివైస్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేసింది. రోజ్ గోల్డ్, ప్లాటినం కలర్ వేరియెంట్లలో లభ్యమవుతున్న శాంసంగ్ డబ్ల్యూ 2019 స్మార్ట్‌ఫోన్ ధర ఎంతో తెలుసా? సుమారు రూ.1,97060 గా ఉంది. శాంసంగ్ డబ్ల్యూ2019 ఫీచర్లు 4.2 ఇంచ్ సూపర్ అమోలెడ్ డ్యుయల్ (ఇంటర్నల్, ఎక్స్టర్నల్) డిస్ప్లేలు 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 6జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్ 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 12+12 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3070 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఈ స్మార్ట్‌ఫోన్‌ను మడవొచ్చు..!
అభివృద్ధి చేస్తున్న శామ్సంగ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మడవగలిగే స్మార్ట్‌ఫోన్.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కొద్ది రోజుల్లో ఇది సాకారం కానుంది. టెక్నాలజీ దిగ్గజం శామ్సంగ్ దీనికోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అన్నీ అనుకూలిస్తే 2017లో ఈ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తేవడానికి రెడీ అవుతోంది. గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఇచ్చిన విజయంతో కంపెనీ కొత్త కాన్సెప్ట్‌తో రంగంలోకి దిగింది. ఓలెడ్ డిస్ప్లే సాంకేతిక పరిజ్ఞానంలో ఇటీవల వచ్చిన మార్పులు కంపెనీకి మార్గాన్ని సుగమం చేశాయి. సిల్వర్ నానోవైర్ ఆధారిత ఫ్లెక్సిబుల్ టచ్ డిస్ప్లే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందుకు వాడుతున్నట్టు సమాచారం. ఫ్యాబ్లెట్స్, ట్యాబ్లెట్స్ను మడిచి జేబులో పెట్టుకునేలా రూపొందించేందుకు కంపెనీలకు ఈ టెక్నాలజీ దోహదం చేస్తుంది. ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ పేటెంటు కోసం యూఎస్ పేటెంట్, ట్రేడ్‌మార్క్ ఆఫీస్‌లో (యూఎస్‌పీటీవో) శామ్సంగ్ దరఖాస్తు చేసింది. మే నెలాఖరులో పేటెంట్ అప్లికేషన్‌ను యూఎస్‌పీటీవో పబ్లిష్ చేసింది. ఇక ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ పేరు గెలాక్సీ ఎక్స్ అని తెలుస్తోంది. పనితీరు ఇతర స్మార్ట్ఫోన్ల మాదిరిగానే ఉం టుంది. ఆరు అంగుళాలు ఆపైన స్క్రీన్ ఉన్న ఫ్యాబ్లెట్, ట్యాబ్లెట్ సైతం జేబులో ఇట్టే ఇమిడిపోతుంది.