
Tecno Phantom V Flip 5G చైనా మొబైల్ తయారీదారు టెక్నో తొలి ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫాంటమ్ వి ఫ్లిప్ 5 జీని శుక్రవారం ఆవిష్కరించింది. చక్కటి డిజైన్, బ్యూటిఫుల్ లుక్, అత్యాధునిక టెక్నాలజీతోపాటు, అందుబాటులో ధరలో యూజర్లను ఆకట్టుకోనుంది. కేవలం 15 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. అలాగే టెక్ డైమెన్సిటీ 8050 5జీ చిప్ సెట్ 64MP+13MP+32MP కెమెరా స్పెషల్ ఫీచర్‌గా నిలుస్తోంది.
ధర లభ్యత,
ప్రస్తుతానికి సింగపూర్ ఆవిష్కరించిన ఫాంటమ్ వి ఫ్లిప్ 5 జీ ఫోన్ అక్టోబర్ 1న ఇండియాలో లాంచ్ అవుతుందనీ, అదే రోజు మధ్యాహ్నం 12 గంటలనుంచి అమెజాన్ లో సేల్ షురూ అవుతుందని కూడా టెక్నో ప్రకటించింది. అంతేకాదు స్పెషల్ ఆఫర్‌గా ఈ ఫ్లిప్ ఫోన్ ధరను రూ. 49,900 కే అందించనుంది. మిస్టిక్ డాన్ , ఐకానిక్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభించనుంది.
స్పెసిఫికేషన్లు
6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ మెయిన్ స్క్రీన్
1.3 అంగుళాల అమోల్డ్ స్క్రీన్
HiOS 13.5 ఆపరేటింగ్ సిస్టం
8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్
32 ఎంపీ డ్యూయల్-ఫ్లాష్ ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా
4,000 ఎంఏహెచ్ బ్యాటరీ 45 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టు




Comments
Please login to add a commentAdd a comment