Chinese smartphone maker
-
టెక్నో తొలి ఫ్లిప్ మొబైల్: ఫాంటమ్ వి ఫ్లిప్ 5 జీ..ధర తక్కువే!
Tecno Phantom V Flip 5G చైనా మొబైల్ తయారీదారు టెక్నో తొలి ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫాంటమ్ వి ఫ్లిప్ 5 జీని శుక్రవారం ఆవిష్కరించింది. చక్కటి డిజైన్, బ్యూటిఫుల్ లుక్, అత్యాధునిక టెక్నాలజీతోపాటు, అందుబాటులో ధరలో యూజర్లను ఆకట్టుకోనుంది. కేవలం 15 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. అలాగే టెక్ డైమెన్సిటీ 8050 5జీ చిప్ సెట్ 64MP+13MP+32MP కెమెరా స్పెషల్ ఫీచర్‌గా నిలుస్తోంది. ధర లభ్యత, ప్రస్తుతానికి సింగపూర్ ఆవిష్కరించిన ఫాంటమ్ వి ఫ్లిప్ 5 జీ ఫోన్ అక్టోబర్ 1న ఇండియాలో లాంచ్ అవుతుందనీ, అదే రోజు మధ్యాహ్నం 12 గంటలనుంచి అమెజాన్ లో సేల్ షురూ అవుతుందని కూడా టెక్నో ప్రకటించింది. అంతేకాదు స్పెషల్ ఆఫర్‌గా ఈ ఫ్లిప్ ఫోన్ ధరను రూ. 49,900 కే అందించనుంది. మిస్టిక్ డాన్ , ఐకానిక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. స్పెసిఫికేషన్లు 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ మెయిన్ స్క్రీన్ 1.3 అంగుళాల అమోల్డ్ స్క్రీన్ HiOS 13.5 ఆపరేటింగ్ సిస్టం 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 32 ఎంపీ డ్యూయల్-ఫ్లాష్ ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ 45 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టు -
దిగ్గజాలకు దడ: మరో చైనా కంపెనీ ఎంట్రీ
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీలు హవా అంతా ఇంకా కాదు. తాజాగా షావోమి, వివో, ఒప్పో లాంటి టాప్ బ్రాండ్ల గుండెల్లో దడ పుట్టిస్తూ ఈ మార్కెట్లోకి మరో చైనా మొబైల్ మేకర్ వోటో ఎంట్రీ ఇస్తోంది. కనీసం రెండు శాతం వాటా లక్ష్యంగా తొలిసారి ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెడుతున్నామని వోటో మొబైల్స్ శనివారం ప్రకటించింది. రూ. 10వేల విలువైన సెగ్మెంట్లో త్వరలోనే మూడు స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నామని వోటో ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి లక్షకుపైగా యూనిట్లను విక్రయించాలని భావిస్తున్నామని తెలిపింది. సరసమైన ధరల్లో అత్యంత విలువైన స్మార్ట్‌పోన్లతో ప్రముఖంగా నిలవాలనేది లక్ష్యమని వోటో ఇండియా సేల్స్ హెడ్ సంతోష్ సింగ్ చెప్పారు. అలాగే ఎయిర్టెల్, వోడాఫోన్ఐడియా, రిలయన్స్ జియో లాంటి టెలికాం మేజర్లతో భాగస్వామ్యాలను కుదర్చుకోవాలని కూడా యోచిస్తున్నట్టు చెప్పారు. -
21 సెకన్లలో 30 వేల ఫోన్ల సేల్
న్యూఢిల్లీ: ఆన్ లైన్ లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సెకన్లలో వేల ఫోన్లు అమ్ముడుపోతున్నాయి. తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ కూల్ ప్యాడ్ విక్రయానికి పెట్టిన నోట్ 3 లైట్ ఫోన్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. అమెజాన్ లో 21 సెకన్లలో 30 వేల ఫోన్లు అమ్ముడయ్యాయని కూల్ ప్యాడ్ తెలిపింది. 'ఫస్ట్ ఫ్లాస్ సేల్ లో కూల్ ప్యాడ్ నోట్ 3కి అద్భుత స్పందన లభించింది. 21 సెకన్లలో 30 వేల ఫోన్లు విక్రయించాం. టెక్నాలజీ అందరికీ చేరువ చేయాలన్న మా ప్రయత్నానికి మద్దతు లభించింద'ని కూల్ ప్యాడ్ ఇండియా సీఈవో సయిద్ తజూద్దీన్ అన్నారు. ఫిబ్రవరి 4న మరోసారి ఫ్లాస్ సేల్ పెడతామని తెలిపారు. కూల్ ప్యాడ్ నోట్ 3 లైట్ ధర రూ.6.999, 360 డిగ్రీల పింగర్ రోటేషన్, 4జీ ఎల్ టీఈను సపోర్ట్ చేస్తుంది. కూల్ ప్యాడ్ నోట్ 3 లైట్ ఫీచర్లు 3 జీబీ ర్యామ్ 5.0 హైడెఫినేషన్ డిస్ ప్లే 16 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ 13 ఎంపీ కెమెరా 2,500 ఏఎంపీ బ్యాటరీ