
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీలు హవా అంతా ఇంకా కాదు. తాజాగా షావోమి, వివో, ఒప్పో లాంటి టాప్ బ్రాండ్ల గుండెల్లో దడ పుట్టిస్తూ ఈ మార్కెట్లోకి మరో చైనా మొబైల్ మేకర్ వోటో ఎంట్రీ ఇస్తోంది. కనీసం రెండు శాతం వాటా లక్ష్యంగా తొలిసారి ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెడుతున్నామని వోటో మొబైల్స్ శనివారం ప్రకటించింది.
రూ. 10వేల విలువైన సెగ్మెంట్‌లో త్వరలోనే మూడు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నామని వోటో ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి లక్షకుపైగా యూనిట్లను విక్రయించాలని భావిస్తున్నామని తెలిపింది. సరసమైన ధరల్లో అత‍్యంత విలువైన స్మార్ట్‌పోన్లతో ప్రముఖంగా నిలవాలనేది లక్ష్యమని వోటో ఇండియా సేల్స్ హెడ్ సంతోష్ సింగ్ చెప్పారు. అలాగే ఎయిర్‌టెల్, వోడాఫోన్‌ఐడియా, రిలయన్స్ జియో లాంటి టెలికాం మేజర్లతో భాగస్వామ్యాలను కుదర్చుకోవాలని కూడా యోచిస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment