ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించేవారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అయితే ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని ఖరీదైన మొబైల్ ఉపయోగించడానికి కొంత మంది వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఇప్పుడు మార్కెట్లో శాంసంగ్ రూ. 32,999 ధర వున్నా మొబైల్ ఫోన్ కేవలం రూ. 2,999కే లభిస్తుంది. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎం53 మొబైల్ మార్కెట్లో రూ. 32,999. కానీ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2,999కి కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉండటం వల్ల మీకు రూ. 25,000 వరకు ఆదా చేయవచ్చు. అది కూడా మీరు ఎక్స్ఛేంజ్ చేయాలనుకునే మొబైల్ ఫోన్ మంచి కండిషన్లో ఉండాలి. అంతే కాకుండా మీ మొబైల్ బ్రాండ్ మీద కూడా ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఆధార పడి ఉంటుంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్ కాకుండా కొనుగోలు చేయాలనుకుంటే అసలు ధరలో 20 శాతం తగ్గింపు లభిస్తుంది. కావున మీరు రూ. 32,000 ఫోన్ రూ. 27,999కి లభిస్తుంది. HDFC క్రెడిట్ కార్డు ద్వారా కొనాలకునేవారు రూ. 1,500 డిస్కౌంట్ పొందవచ్చు. మొత్తం మీద మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు రూ. 2999కే లభిస్తుంది. కొనుగోలుదారుడు తప్పకుండా ఈ షరతులను గుర్తుంచుకోవాలి.
(ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!)
శాంసంగ్ గెలాక్సీ ఎం53 మొబైల్ మంచి డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఈ మొబైల్ 120 Hz రిఫ్రెష్ రేట్ 6.7 ఇంచెస్ సూపర్ అమోటెడ్ డిస్ప్లే కలిగి, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ పొందుతుంది. ఇందులోని 500 mAh బ్యాటరీ 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ ఎం53 మొబైల్ అన్ని విధాలుగా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment