Samsung Galaxy A02 Specifications, Features And Price In India - Sakshi
Sakshi News home page

నిశ్శబ్దంగా విడుదలైన గెలాక్సీ ఎ02

Published Wed, Jan 27 2021 4:01 PM | Last Updated on Wed, Jan 27 2021 4:28 PM

Samsung Galaxy A02 Launched with 5000mAh Battery - Sakshi

శామ్‌సంగ్ సంస్థ ఎంట్రీ లెవల్ స్పెసిఫికేషన్లు గల గెలాక్సీ ఎ02 మొబైల్ ను నిశ్శబ్దంగా థాయ్‌లాండ్ సైట్‌లో తీసుకొచ్చింది. గెలాక్సీ ఎ-సిరీస్ ఫోన్ భిన్నంగా ఈ గెలాక్సీ ఎ02 మొబైల్ ఉంది. ఇది 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ టిఎఫ్‌టి ఇన్ఫినిటీ-వి డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డెనిమ్ బ్లాక్, డెనిమ్ బ్లూ, డెనిమ్ రెడ్ మరియు డెనిమ్ గ్రే రంగులలో లభిస్తుంది.(చదవండి: టిక్‌టాక్ ఉద్యోగుల తొలగింపు)

గెలాక్సీ ఎ02 ఫీచర్స్
డ్యూయల్ సిమ్(నానో) గల శామ్‌సంగ్ గెలాక్సీ ఎ02 ఆండ్రాయిడ్ 10తో నడుస్తుంది. ఇందులో 6.5-అంగుళాల(720 x 1,600 పిక్సెల్స్) హెచ్‌డి ప్లస్ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే తీసుకొచ్చారు. ఇది 1.5గిగాహెర్ట్జ్ మీడియాటెక్ MT6739W క్వాడ్-కోర్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది 2జీబీ + 32జీబీ, 3జీబీ + 32జీబీ, 3జీబీ + 64జీబీ వంటి స్టోరేజ్ కాన్ఫిగరేషన్లు ఉన్నాయి. స్టోరేజ్ ను విస్తరించడానికి ప్రత్యేకమైన మైక్రో ఎస్ డి కార్డ్(1టీబీ) స్లాట్ కూడా ఉంది. 

శామ్‌సంగ్ గెలాక్సీ ఎ02లో  వెనుకవైపు 13ఎంపీ(f/1.9) ప్రైమరీ కెమెరా, 2ఎంపీ(f/2.4) మాక్రో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. వీడియో కాలింగ్ కోసం 5ఎంపీ కెమెరా అందించబడుతుంది. కనెక్టివిటీ కోసం ఇందులో డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్‌టిఇ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, డాల్బీ అట్మోస్, వై-ఫై, బ్లూటూత్ 5, జీపీఎస్ ప్లస్ గ్లోనాస్ ఉంది. 7.75వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 206 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2జీబీ ర్యామ్ + 32జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వేరియంట్ ధర థాయ్‌లాండ్‌లో టిహెచ్‌బి 2,999(సుమారు రూ.7,300)గా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement