Galaxy series
-
శామ్సంగ్ కొత్త ఫోన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శామ్సంగ్ భారత్‌లో గెలాక్సీ సిరీస్‌లో ఏ55 5జీ, ఏ35 5జీ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టింది. 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లను జోడించింది. ఈ మోడళ్లు 5జీతోపాటు వేగంగా వృద్ధి చెందుతున్న రూ.30–50 వేల ధరల విభాగంలో తమ స్థానాన్ని కన్సాలిడేట్ చేస్తాయని శామ్సంగ్ తెలిపింది. ధర రూ.27,999 నుంచి రూ.42,999 వరకు ఉంది. -
గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ: లాంచింగ్ ముందే హల్చల్,ఐఫోన్‌కు ఝలక్?
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ నెక్స్ట్ గెలాక్సీ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఫిబ్రవరి 1వ తేదీన జరగనున్న అన్ప్యాక్డ్ ఈవెంట్లో గెలాక్సీ ఎస్ 23 సిరీస్‌లో మూడు కొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించేందుకు శాంసంగ్ సిద్ధమవుతోంది. భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా వివిధ మార్కెట్లలో ఈ సిరీస్ విడుదల కానుంది. ఈ క్రమంలో ధర, డిజైన్, ఫీచర్ల గురించి లీక్‌లు మొదలయ్యాయి. స్పెసిఫికేషన్ల పరంగా, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ 200ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వస్తోంది. 12ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, రెండు 10ఎంపీ టెలిఫోటో సెన్సార్‌తో రియర్ క్వాడ్-కెమెరా మరో ప్రధాన ఆకర్షణ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ ఫీచర్లు 6.8 అంగుళాల 2x డైనమిక్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ఆండ్రాయిడ్ 13 One UI 5.0 12 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ 45 వాట్ ఛార్జింగ్ ధర (అంచనా) రూ. 1,14,990 యాపిల్ ఐఫోన్14 ప్రో మాక్స్‌కు షాక్? అయితే యాపిల్ 14 ప్రో మాక్స్‌తో పోలిస్తే 8జీబీ ర్యామ్ సహా, 200 ఎంపీ కెమెరా, డిస్ప్లే చివరికి ధర విషయంలో కూడా మెరుగ్గా ఉన్న శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్, యాపిల్‌కు గట్టి పోటీ ఇవ్వనుందని పలు అంచనాలు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. -
నిశ్శబ్దంగా విడుదలైన గెలాక్సీ ఎ02
శామ్సంగ్ సంస్థ ఎంట్రీ లెవల్ స్పెసిఫికేషన్లు గల గెలాక్సీ ఎ02 మొబైల్ ను నిశ్శబ్దంగా థాయ్‌లాండ్ సైట్లో తీసుకొచ్చింది. గెలాక్సీ ఎ-సిరీస్ ఫోన్ భిన్నంగా ఈ గెలాక్సీ ఎ02 మొబైల్ ఉంది. ఇది 6.5-అంగుళాల హెచ్డి ప్లస్ టిఎఫ్టి ఇన్ఫినిటీ-వి డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డెనిమ్ బ్లాక్, డెనిమ్ బ్లూ, డెనిమ్ రెడ్ మరియు డెనిమ్ గ్రే రంగులలో లభిస్తుంది.(చదవండి: టిక్‌టాక్ ఉద్యోగుల తొలగింపు) గెలాక్సీ ఎ02 ఫీచర్స్ డ్యూయల్ సిమ్(నానో) గల శామ్సంగ్ గెలాక్సీ ఎ02 ఆండ్రాయిడ్ 10తో నడుస్తుంది. ఇందులో 6.5-అంగుళాల(720 x 1,600 పిక్సెల్స్) హెచ్డి ప్లస్ ఇన్ఫినిటీ-వి డిస్ప్లే తీసుకొచ్చారు. ఇది 1.5గిగాహెర్ట్జ్ మీడియాటెక్ MT6739W క్వాడ్-కోర్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది 2జీబీ + 32జీబీ, 3జీబీ + 32జీబీ, 3జీబీ + 64జీబీ వంటి స్టోరేజ్ కాన్ఫిగరేషన్లు ఉన్నాయి. స్టోరేజ్ ను విస్తరించడానికి ప్రత్యేకమైన మైక్రో ఎస్ డి కార్డ్(1టీబీ) స్లాట్ కూడా ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఎ02లో వెనుకవైపు 13ఎంపీ(f/1.9) ప్రైమరీ కెమెరా, 2ఎంపీ(f/2.4) మాక్రో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. వీడియో కాలింగ్ కోసం 5ఎంపీ కెమెరా అందించబడుతుంది. కనెక్టివిటీ కోసం ఇందులో డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్‌టిఇ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, డాల్బీ అట్మోస్, వై-ఫై, బ్లూటూత్ 5, జీపీఎస్ ప్లస్ గ్లోనాస్ ఉంది. 7.75వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 206 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2జీబీ ర్యామ్ + 32జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వేరియంట్ ధర థాయ్‌లాండ్‌లో టిహెచ్‌బి 2,999(సుమారు రూ.7,300)గా ఉంది. -
‘గెలాక్సీ ఎస్20’ వచ్చింది..
శాన్ ఫ్రాన్సిస్కో: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ శాంసంగ్.. ‘గెలాక్సీ ఎస్20’ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం ఆవిష్కరించింది. ఈ నూతన సిరీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా టెక్నాలజీ ఉన్నట్లు ప్రకటించింది. ఇందులో ‘గెలాక్సీ ఎస్20’, ‘గెలాక్సీ ఎస్20 ప్లస్’, ‘గెలాక్సీ ఎస్20 అల్ట్రా’ పేర్లతో మూడు వేరియంట్లు ఉన్నాయి. తొలి రెండు వేరియంట్లలో 64 మెగాపిక్సెల్ కెమెరా ఉండగా, అల్ట్రాలో ఏకంగా 108 ఎంపీ కెమెరా ఉన్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, మొబైల్ కమ్యూనికేషన్స్ బిజినెస్ హెడ్ టీఎం రోహ్ వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 6 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ మోడల్ ధరల శ్రేణి 999 నుంచి 1,399 డాలర్లుగా ఉన్నట్లు ప్రకటించారు. ఇక ఇదే కార్యక్రమంలో గెలాక్సీ జెడ్ ఫ్లిప్ పేరిట ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ విడుదలచేసింది. ఫిబ్రవరి 14 నుంచి అందుబాటులోకి రానున్న దీని ధర 1,380 డాలర్లు. -
భారీ కెమెరాతో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా కంపెనీలకు పోటీగా శాంసంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఏ70 ఎస్’ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 64 మెగా పిక్సెల్ భారీ కెమెరా కలిగివుండటం ఈ ఫోన్ ప్రత్యేకత. శాంసంగ్ ఫోన్లలో ఇంత పెద్ద కెమెరా కలిగివుండడం ఇదే మొదటిసారి. సెల్పీల కోసం 32 మెగా పిక్సల్ కెమెరా, 512 జీబీ వరకు పెంచుకునే ప్రాసెసర్‌ను అమర్చారు. చీకటిలోనూ స్పష్టమైన ఫొటో, సూపర్ స్టడీ వీడియో తీసేందుకు అనువుగా ఫీచర్లు ఉన్నాయి. యూఎస్బీ టైమ్-సీతో వేగంగా చార్జింగ్ కాగలదు. 6జీబీ, 8జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. సెక్యురిటీ కోసం పింగర్ ప్రింట్ సెన్సార్‌ను పొందు పరిచారు. గేమింగ్ ప్రియులకు మరింత మజా వచ్చేలా ఏఐ ఆధారిత ‘గేమ్ బూస్టర్’ను ఉంచారు. ఆఫ్‌లైన్, ఆన్లైన్ పోర్టళ్ల ద్వారా ‘గెలాక్సీ ఏ70 ఎస్’ను కొనుగోలు చేయొచ్చు. ఇతర ఫీచర్లు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ, ఇన్ఫినిటీ, యూ-డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 ఆక్టాకోర్ ప్రాసెసర్ యూఐ ఆధారిత ఆండ్రాయిడ్ 9 పైయి 64+8+5 ఎంపీ ట్రిపుల్ కెమెరా 32 మెగా పిక్సల్ సెల్పీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర : 28,999 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర : 30,999 -
శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు వచ్చేశాయ్..ఆఫర్లు కూడా
సాక్షి,న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ మేడిన్ఇండియా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో మంగళవారం లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరలను వరుసగా రూ. 69,990, రూ.79,990గా నిర్ణయించింది. తద్వారా యాపిల్, గూగుల్ లకు షాక్ ఇచ్చింది. భారత్‌లో ఆరా బ్లాక్, ఆరా గ్లో, ఆరా వైట్ రంగుల్లో వీటిని విడుదల చేసింది. ఆగస్టు 22వరకు ప్రధాన రీటైల్ దుకాణాలు సహా ఈ-కామర్స్ సైట్లలో ప్రీ బుక్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. విక్రయాలు ఆగస్టు 23 నుంచి ప్రారంభం. ఇక ఆఫర్ల విషయానికి వస్తే గెలాక్సీ నోట్ 10-సిరీస్ కొనుగోలుదారులు యూట్యూబ్ ప్రీమియం ఆరు నెలల సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది. అలాగే ప్రీ-ఆర్డర్ చేసిన కొనుగోలుదారులు గెలాక్సీ వాచ్ యాక్టివ్‌ను దాని అసలు అమ్మకపు ధర రూ .19,990 కు బదులుగా రూ .9,999 తగ్గింపుతో పొందవచ్చు. లేదా గెలాక్సీ బడ్స్‌ను దాని అసలు ధర ట్యాగ్ 9,999 కు బదులుగా రూ .4,999 కు కొనుగోలు చేయవచ్చు. రీటైల్ దుకాణాలు, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్‌లో హెచ్డీఎఫ్సీ కార్డు ద్వారా ప్రీ బుక్ చేసుకొనే వారికి రూ.6 వేల వరకూ క్యాష్ బ్యాక్ ఆఫర్ రానుంది. మిగిలిన ఈ-కామర్స్ సైట్లలో ఐసీఐసీఐ బ్యాంకు కార్డులకు ఈ ఆఫర్ ఇస్తున్నట్లు శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్లతో నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లను ఇప్పటికే న్యూయార్క్‌లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. గెలాక్సీ నోట్ 10 ఫీచర్లు 6.3 అంగుళాల డిస్ప్లే శాంసంగ్ ఎగ్సినోస్ 9825 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9 పై 1080x2280 పిక్సల్స్ రిజల్యూషన్ 8జీబీ ర్యామ్+256 జీబీ 10 ఎంపీ ఫ్రంట్ కెమెరా 12+16+12 ఎంపీ వెనుక కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : రూ.69,999 (8జీబీ ర్యామ్+256 జీబీ) గెలాక్సీ నోట్ 10 ప్లస్ ఫీచర్లు 6.8 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ 9 పై 1440x3040 పిక్సల్స్ రిజల్యూషన్ శాంసంగ్ ఎగ్సినోస్ 9825 ప్రాసెసర్ 10 ఎంపీ ఫ్రంట్ కెమెరా 12+16+12+0.3 ఎంపీ వెనుక కెమెరా 4300 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : రూ.79,999 (12జీబీ+256జీబీ) -
అద్భుత కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ ఏ80
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త టెక్నాలజీతో గెలాక్సీ కొత్త ఫోన్లను పరిచయం చేసింది. గెలాక్సీ ఏ సిరీస్‌లోభాగంగా గెలాక్సీ ఏ 80, ఏ 70, గెలాక్సీ ఏ 40 పేరుతో మూడు స్మార్ట్ఫోన్లను బ్యాంకాక్‌లో బుధవారం నిర్వహించిన శాంసంగ్ ఈవెంట్లో ఆవిష్కరించింది. గెలాక్సీ ఏ 80 స్మార్ట్‌ఫోన్‌లో 48 ఎంపీ రొటేటింగ్ పాప్ అప్ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంటే సెల్పీ తీసుకోవాలంటే..సెల్ఫీ మోడ్ సెలెక్ట్ చేయగానే ఈ కెమెరా రొటేట్ అవుతుందన్నమాట. బ్లాక్ గోల్డ్, వైట్ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యం కానుంది. అలాగు వాటర్‌డ్రాప్ డిస్ప్లే 4500 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లతో ఏ 70ని తీసుకొచ్చింది. ఇది బ్లాక్‌బ్లూ, వైట్ ,పింక్ కలర్స్‌లో లభ్యం కానుంది. గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్‌ను మే 29న, గెలాక్సీ ఏ 70ని ఏప్రిల్ 26న గ్లోబల్ లాంచ్ చేయనుంది. అయితే ఈరెండు స్మార్ట్ఫోన్ల ధరలను ఇంకా రివీల్ చేయలేదు. గెలాక్సీ ఏ 80 ఫీచర్లు 6.7 ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ కాల్కం స్నాప్‌డ్రాగన్ 730 జీ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0పై 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 48+8+3డీ డెప్త్ టీఓఎఫ్ ఎంపీ రియర్ కెమెరా 3700 ఎంఏహెచ్ బ్యాటరీ గెలాక్సీ ఏ 70 ఫీచర్లు 6.7 ఫుల్హెచ్డీ (వాటర్‌డ్రాప్) డిస్ప్లే 1080 x 2400 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ 32+8+5 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32ఎంపీ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ గెలాక్సీ ఏ 40 5.9 ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1080 x 2280 పిక్సెల్స్ రిజల్యూషన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 512 వరకువిస్తరించుకనే అవకాశం 16+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 25ఎంపీ సెల్పీ కెమెరా 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, బ్లూ , బ్లాక్, కోరల్, వైట్ కలర్స్‌లో ల భ్యం కానుంది. దీని ధర సుమారు రూ. 19500 #GalaxyA80 is for Rotating Camera. Epic on both sides. Learn more: https://t.co/bbVzsoWlIW pic.twitter.com/faYlI5I6uM — Samsung Mobile (@SamsungMobile) April 10, 2019 -
శాంసంగ్ గెలాక్సీ ఎ8 ప్లస్ లాంచ్..ధర ఎంత?
మొబైల్ దిగ్గజం శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ ఎ8 ప్లస్‌ను లాంచ్ చేసింది. ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో డ్యుయల్ సెల్ఫీ కెమెరా తొలి డివైస్‌ను కస్టమర్లకు అందిస్తోంది.బ్లాక్, గోల్డ్ కలర్స్ లో ఇది లభ్యం కానుంది. జనవరి 10నుంచి అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని లాంచింగ్ సందర్భంగా శాంసంగ్ వెల్లడించింది. దీని ధరను రూ.32,990గా నిర్ణయించింది. 6 అంగుళాల ఫుల్హెచ్డీ ఇన్ఫినిటీ డిస్ప్లే, 6జీబీ, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, డ్యూయల్ ఫ్రంట్ కెమెరా, (16ఎంపీ, 8 ఎంపీ) 16ఎంపీ రియర్ కెమెరా,3500 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రధాన ఫీచర్లతో దీన్ని విడుదల చేసింది. అలాగే సులభ లావాదేవీలకోసం ఈ డివైస్‌లో శాంసంగ్ పే కూడా జోడించింది. -
శాంసంగ్ కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌మేకర్ శాంసంగ్ గెలాక్సీ ఎ సిరీస్‌లో కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎ 8, గెలాక్సీ 8 ప్లస్ 2018 మోడల్స్‌ను మార్కెట్లో విడుదల చేసింది. జనవరినుంచి ఈ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. తమ గెలాక్సీ ఎ సిరీస్‌లో మొట్టమొదటి డబుల్ సెల్ఫీ కెమెరా డివైస్‌లని శాంసంగ్ వైస్ ప్రెసిడెంట్ జునో పార్క్ తెలిపారు. అలాగే మిడ్ రేంజ్ సెగ్మెంట్లో 18: 9 ఎడ్జ్ టూ ఎడ్జ్ 'ఇన్ఫినిటీ డిస్ప్లే' లాంటి ప్రీమియం సెగ్మెంట్ ఫీచర్లను అందిస్తున్నట్టు చెప్పారు. నిన్న (సోమవారం) ఈ మోడల్స్ ను వివిధ మార్కెట్లలో ప్రారంభించింది. అలాగే ఎంపిక చేసిన మార్కెట్లలో వచ్చే నెలలో స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. అయితే భారతదేశంలో ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ సంస్థ వెల్లడించలేదు. అలాగే ధరను అధికారికంగా ప్రకటించక పోయినప్పటికి సుమారు రూ.32వేలు (500 డాలర్లు) ఉండొచ్చని అంచనా. మరోవైపు 2018లో గెలాక్సీ ఎ8, ఎ8ప్లస్ బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ఫోన్లలో ఒకటిగా నిలుస్తాయని టెక్ నిపుణుల విశ్లేషిస్తున్నారు. ఇక రెండు స్మార్ట్ఫోన్లలోనూ 18:5:9 డిస్ప్లే , ఆక్టాకోర్ 2.2 గిగా హెడ్జ్ ప్రాసెసర్ , ఆండ్రాయిడ్ నౌగట్ 7.1, 16 ఎంపీ, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు, 16 ఎంపీ రియర్ కెమెరా ఫీచర్లు కామన్ ఫీచర్స్‌గా ఉండగా స్క్రీన్, బ్యాటరీలో స్వల్ప మార్పులు చేసింది. ఎ 8ను 4 జీబీ ర్యామ్, 32 జీబీ/64జీబీ స్టోరేజ్ , ఎ8 ప్లస్ ను 4జీబీ/32జీబీస్టోరేజ్, 6జీబీ/64జీబీస్టోరేజ్ రెండు వేరియంట్లలో అందిస్తోంది. ఇక ఎ 8 లో 5.6 స్క్రీన్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చగా, ఎ8 ప్లస్‌లో 6 అంగుళాల స్క్రీన్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపర్చింది. -
శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9+ ఫీచర్లు లీక్
శాంసంగ్ స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు తాజాగా లీక్ అయ్యాయి. అనుకున్నదానికంటే ముందుగానే శాంసంగ్ ఫ్లాగషిప్ ఫోన్లను లాంచ్ చేయనుందంటూ పలు అంచనాలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌కు కొనసాగింపుగా రానున్న ఈ డివైస్ ఫీచర్లు, ఇతర వివరాలు లీక్ అయ్యాయి. అలాగే 2018 మార్చి నెలలో కాకుండా జనవరి రెండవ వారంలోనే ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9+ పేరుతో తీసుకొస్తున్న ఈ డివైస్‌లను ఇంటర్నేషనల్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES)లో లాంచ్ చేయనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. గెలాక్స్ ఎస్8, ఎస్8 ప్లస్ మాదిరిగా సాధారణంగా మార్చిలో లాంచింగ్ కాకుండా జనవరిలోనే లాంచ్ చేసి.. మార్చినాటికి విక్రయాలను ప్రారంభించేందుకు యోచిస్తోంది. ఈ రెండింటిలోనూ 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ, కర్వ్డ్ఎడ్జ్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 845 క్వాల్కం ప్రాసెసర్, డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్ ప్రధాన ఫీచర్లుగా అంచనా వేస్తున్నారు. దాదాపు గెలాక్సీ ప్రీవియస్ మోడల్ తరహాలోనే బిగ్సిబీ బటన్ , ఫింగర్ పింట్ సెన్సర్ లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. మరోవైపు గెలాక్సీ ఎస్ 9లో 5.8అంగుళాల స్క్రీన్‌ను, గెలాక్సీ ఎస్9 ప్లస్‌లో 6.2-అంగుళాల స్క్రీన్ ను జత చేసినట్టు తెలుస్తోంది. ఇక కెమెరాల విషయానికి వస్తే 16 ఎంపీ రియర్ కెమెరా, 12 ఎంపీ డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను పొందుపర్చినట్టు అంచనా. -
శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో మరో రెండు ఫోన్లు
⇒ జె7 మ్యాక్స్ ధర రూ. 17,900, జె7 ప్రో ధర రూ. 20,900 ⇒ ఈ నెల 20 నుంచి జె7 మ్యాక్స్ విక్రయాలు, జూలై మూడోవారంలో ప్రో సాక్షి, న్యూఢిల్లీ: శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ జె7 మ్యాక్స్, జె7 ప్రో పేర్లతో రెండు స్మార్ట్ ఫోన్లను బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో శాంసంగ్ ఇండియా ఎండీ కెన్ క్యాంగ్, శాంసంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ డైరెక్టర్ సుమిత్ వాలియా ఆవిష్కరించారు. జె7 మ్యాక్స్ 5.7 అంగుళాల హెచ్డీ క్వాలిటీ డిస్ప్లేతో, 13 మెగా పిక్సల్ కెమెరా( ముందు, వెనుక), 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం, 8.1 ఎంఎం డైమెన్షన్, 3,300 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ, 1.6 ఓక్టా మీడియాటెక్ ప్రాసెసర్‌లాంటి ఫీచర్లు కలిగి ఉంది. దీని ధర రూ. 17,900. దీని విక్రయాలను ఈ నెల 20వ తేదీ ప్రారంభించనుంది. ప్రత్యేకతలివి... ఇక జె7 ప్రో: 5.5 అంగుళాల ఫుల్లీ హెచ్డి క్వాలిటీతో, 13 మెగా పిక్సల్ ఫ్లాష్ (ఫ్రంట్ అండ్ బ్యాక్), 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 3 బీజీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం, 7.8 ఎంఎం డైమెన్షన్, 3,600 ఎంఏహెచ్ సామర్థ్యంగల బ్యాటరీ, 1.6 ఓక్టా ఎక్సైనోస్ ప్రాసెసర్‌లాంటి ఫీచర్లతో బ్లాక్, గోల్డ్ కలర్లలో అందుబాటులోకి రానుంది. దీని ధర. 20,900. జె7 ప్రో విక్రయాలను జూలై మూడో వారంలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ డైరెక్టర్ సుమిత్ వాలియా మాట్లాడుతూ.. గెలాక్సీ సిరీస్‌లో జె7 మ్యాక్స్, జె7 ప్రో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రెండు ఫోన్ల ద్వారా తీసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడానికి వీలుగా.. ఫొటో తీసిన వెంటనే డిస్ప్లే మీద ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సింబల్స్‌ను చూపిస్తుందన్నారు. ఈ ఫోన్లు కొనుగోలు చేసిన జియో కస్టమర్లకు రూ. 309 రీచార్జ్‌పై నెలకు 10 బీజీ డేటా 12 నెలలపాటు అదనంగా లభిస్తుందని తెలిపారు. -
శామ్సంగ్ నుంచి డేటా ఆదా చేసే స్మార్ట్‌ఫోన్..
దేశీ మార్కెట్లోకి గెలాక్సీ జే2 ధర రూ. 8,490 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ గెలాక్సీ సిరీస్‌లో జే2 మోడల్‌ను గురువారమిక్కడ ఆవిష్కరించింది. డేటాను ఆదా చేసే అల్ట్రా డేటా సేవింగ్ (యూడీఎస్) ఫీచర్‌ను తొలిసారిగా ఇందులో పొందుపరిచింది. ఈ ఫీచర్‌తో 50 శాతం వరకు డేటా ఆదా అవుతుందని కంపెనీ తెలిపింది. ధర రూ.8,490. కంపెనీ నుంచి చవకైన 4జీ మోడల్ ఇదే. అలాగే జే2తో కలిపి శామ్సంగ్ ఇప్పటి వరకు విడుదల చేసిన 4జీ మోడళ్ల సంఖ్య 17కు చేరుకుంది. భారతీయ మార్కెట్ కోసం దేశీయంగానే దీనిని రూపొందించినట్టు శామ్సంగ్ ఐటీ, మొబైల్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్సి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. కస్టమర్ల నుంచి వచ్చే స్పందన ఆధారంగా యూడీఎస్ ఫీచర్‌ను ఇతర మోడళ్లలో జోడిస్తామని చెప్పారు. 2015లో శామ్సంగ్ 23 మోడళ్లను మారె ్కట్లోకి తీసుకొచ్చింది. ఇవీ గెలాక్సీ జే2 ఫీచర్లు.. క్యూహెచ్డీ సూపర్ అమోలెడ్ స్క్రీన్‌ను గెలాక్సీ జె2 స్మార్ట్‌ఫోన్‌కు జోడించారు. రూ.10 వేలలోపు మోడళ్లలో ఈ తరహా స్క్రీన్‌ను పొందుపర్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సిమ్‌తోపాటు వైఫై నుంచి ఏకకాలంలో ఇంటర్నెట్ను ఆస్వాదించొచ్చు. తద్వారా డేటా వేగం అధికంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 4.7 అంగుళాల స్క్రీన్, ఆన్‌డ్రాయిడ్ 5.1 ఓఎస్, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 5 ఎంపీ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్ ఇతర ఫీచర్లు. 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంది. 128 జీబీ వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 21 నుంచి జే2 అందుబాటులో ఉంటుంది. ఎయిర్టెల్ బండిల్ ఆఫర్లో కస్టమర్లు రెండింతల డేటా ఆరు నెలల వరకు పొందవచ్చు. -
శామ్సంగ్ కొత్త గెలాక్సీ ట్యాబ్స్
బెంగళూరు : ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శామ్సంగ్ ‘గెలాక్సీ సిరీస్‌లో కొత్త మొబైల్ ట్యాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ- ఏ’, ‘గెలాక్సీ- ఈ’ అనే వాయిస్‌కాలింగ్ ఫీచర్ కలిగిన ఈ ట్యాబ్స్ ధరలు వరుసగా రూ.20,500, రూ.16,900. ‘ట్యాబ్ ఏ’ కొనుగోలు చేసిన వారికి రూ.3 వేల విలువైన ఈ-బుక్స్, యుటిలిటీ యాప్స్ ఉచితంగా లభించనున్నాయి. ఇది టైటానియం, తెలుపు రంగుల్లో లభ్యం కానుంది. 4జీ దీని ప్రత్యేకత. ఈ ట్యాబ్ వినియోగదారులకు ఎయిర్టెల్ 2 జీబీ 4జీ డాటాను రెండు నెలల వరకు ఉచితంగా ఇవ్వనుంది. 9.6 అంగుళాల తెర కలిగిన ‘ట్యాబ్ -ఈ’ కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ ట్యాబ్ వినియోగిస్తున్న పోస్ట్-పెయిడ్ కస్టమర్లకు వోడాఫోన్ నెలకు 2జీబీ 3జీ డాటా రెండు నెలల వరకు ఉచితంగా ఇవ్వనుంది. అలాగే ప్రి-పెయిడ్ కస్టమర్లకు 1జీబీ కొనుగోలుపై 1 జీబీ 3జీ డాటా ఉచితంగా లభించనుంది. ఈ ట్యాబ్ న లుపు, తెలుపు రంగుల్లో లభ్యంకానుంది. -
సామ్సంగ్ 4జీ స్మార్ట్‌ఫోన్
- రేటు రూ. 39,990 - అక్టోబర్ తొలి వారం నుంచి భారత మార్కెట్లో లభ్యం న్యూఢిల్లీ: కొరియన్ హ్యాండ్సెట్ దిగ్గజం సామ్సంగ్ తాజాగా గెలాక్సీ సిరీస్‌లో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 39,900. గెలాక్సీ అల్ఫా పేరిట ఇది అక్టోబర్ తొలివారం నుంచి భారత మార్కెట్లో లభ్యం కానుంది. 4.7 అంగుళాల హెచ్డీ సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఆక్టా కోర్ ప్రాసెసర్, 12 ఎంపీ రియర్ కెమెరా మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే, ఫింగర్ ప్రింట్ స్కానర్, హార్ట్ రేట్ మానిటర్ ఫీచర్లతో పాటు గేర్ ఫిట్ గేర్ 2 మొదలైన సామ్సంగ్ వేరబుల్ డివైజ్లతో ఇది నేరుగా అనుసంధానం కాగలదు. టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌తో కలసి సామ్సంగ్ దీన్ని ప్రవేశపెడుతోంది. ఎయిర్టెల్ 4జీ సర్వీసులు ఉన్న ప్రాంతాల్లో రెండు నెలల పాటు 5 జీబీ మేర 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాబోయే రోజుల్లో రూ.40,000 కన్నా తక్కువ ధరలోనే మరిన్ని 4జీ హ్యాండ్‌సెట్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సామ్సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (మొబైల్ అండ్ ఐటీ) అసిమ్ వర్సి తెలిపారు.