శామ్‌సంగ్ కొత్త గెలాక్సీ ట్యాబ్స్ | Samsung's new Galaxy tabs | Sakshi
Sakshi News home page

శామ్‌సంగ్ కొత్త గెలాక్సీ ట్యాబ్స్

Published Fri, Jun 19 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM

శామ్‌సంగ్ కొత్త గెలాక్సీ ట్యాబ్స్

శామ్‌సంగ్ కొత్త గెలాక్సీ ట్యాబ్స్

బెంగళూరు : ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శామ్‌సంగ్ ‘గెలాక్సీ సిరీస్‌లో కొత్త మొబైల్ ట్యాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ- ఏ’, ‘గెలాక్సీ- ఈ’ అనే వాయిస్‌కాలింగ్ ఫీచర్ కలిగిన ఈ ట్యాబ్స్ ధరలు వరుసగా రూ.20,500, రూ.16,900. ‘ట్యాబ్ ఏ’ కొనుగోలు చేసిన వారికి రూ.3 వేల విలువైన ఈ-బుక్స్, యుటిలిటీ యాప్స్ ఉచితంగా లభించనున్నాయి. ఇది టైటానియం, తెలుపు రంగుల్లో లభ్యం కానుంది. 4జీ దీని ప్రత్యేకత. ఈ ట్యాబ్ వినియోగదారులకు ఎయిర్‌టెల్ 2 జీబీ 4జీ డాటాను రెండు నెలల వరకు ఉచితంగా ఇవ్వనుంది.

9.6 అంగుళాల తెర కలిగిన ‘ట్యాబ్ -ఈ’ కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ ట్యాబ్ వినియోగిస్తున్న పోస్ట్-పెయిడ్ కస్టమర్లకు వోడాఫోన్ నెలకు 2జీబీ 3జీ డాటా రెండు నెలల  వరకు ఉచితంగా ఇవ్వనుంది. అలాగే ప్రి-పెయిడ్ కస్టమర్లకు 1జీబీ కొనుగోలుపై 1 జీబీ 3జీ డాటా ఉచితంగా లభించనుంది. ఈ ట్యాబ్ న లుపు, తెలుపు రంగుల్లో లభ్యంకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement