శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌9, ఎస్‌9+ ఫీచర్లు లీక్‌ | Samsung Galaxy S9+ images with dual camera leaked | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌9, ఎస్‌9+ ఫీచర్లు లీక్‌

Published Fri, Nov 24 2017 12:18 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

Samsung Galaxy S9+ images with dual camera leaked - Sakshi - Sakshi - Sakshi

శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు తాజాగా లీక్‌ అయ్యాయి. అనుకున్నదానికంటే ముందుగానే శాంసంగ్‌ ఫ్లాగషిప్‌ ఫోన్లను లాంచ్‌ చేయనుందంటూ  పలు అంచనాలు  ఆన్‌లైన్‌లో  చక్కర్లు కొడుతున్నాయి.  శాంసంగ్‌  గెలాక్సీ సిరీస్‌కు కొనసాగింపుగా రానున్న ఈ డివైస్‌ ఫీచర్లు, ఇతర వివరాలు లీక్‌ అయ్యాయి. అలాగే 2018 మార్చి నెలలో కాకుండా జనవరి రెండవ వారంలోనే ఈ  ప్రీమియం  స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయనుంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌9, ఎస్‌9+ పేరుతో  తీసుకొస్తున్న ఈ డివైస్‌లను ఇంటర్నేషనల్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES)లో లాంచ్‌ చేయనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. గెలాక్స్‌ ఎస్‌8, ఎస్‌8 ప్లస్‌ మాదిరిగా సాధారణంగా మార్చిలో లాంచింగ్‌ కాకుండా జనవరిలోనే లాంచ్‌ చేసి.. మార్చినాటికి విక్రయాలను ప్రారంభించేందుకు యోచిస్తోంది.  ఈ రెండింటిలోనూ 6జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కెపాసిటీ,  కర్వ్‌డ్‌ఎడ్జ్‌  సూపర్‌ అమోలెడ్‌ ఇన్ఫినిటీ డిస్‌ ప్లే,  స్నాప్‌ డ్రాగన్‌  845 క్వాల్కం ప్రాసెసర్‌,  డ్యూయల్‌ సెల్ఫీ కెమెరా  సెటప్‌ ప్రధాన ఫీచర్లుగా అంచనా వేస్తున్నారు. దాదాపు గెలాక్సీ  ప్రీవియస్‌  మోడల్‌ తరహాలోనే బిగ్సిబీ బటన్‌ , ఫింగర్‌ పింట్‌ సెన్సర్‌ లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. మరోవైపు  గెలాక్సీ ఎస్‌ 9లో  5.8అంగుళాల స్క్రీన్‌ను,  గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌లో 6.2-అంగుళాల స్క్రీన్‌ ను జత చేసినట్టు తెలుస్తోంది.  ఇక కెమెరాల విషయానికి వస్తే 16 ఎంపీ రియర్‌ కెమెరా, 12 ఎంపీ డ్యూయల్‌ సెల్ఫీ కెమెరాలను  పొందుపర్చినట్టు అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement