
మొబైల్ దిగ్గజం శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ ఎ8 ప్లస్‌ను లాంచ్ చేసింది. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో డ్యుయల్ సెల్ఫీ కెమెరా తొలి డివైస్‌ను కస్టమర్లకు అందిస్తోంది.బ్లాక్, గోల్డ్ కలర్స్ లో ఇది లభ్యం కానుంది. జనవరి 10నుంచి అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని లాంచింగ్ సందర్భంగా శాంసంగ్ వెల్లడించింది. దీని ధరను రూ.32,990గా నిర్ణయించింది.
6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే, 6జీబీ, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, డ్యూయల్ ఫ్రంట్ కెమెరా, (16ఎంపీ, 8 ఎంపీ) 16ఎంపీ రియర్ కెమెరా,3500 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రధాన ఫీచర్లతో దీన్ని విడుదల చేసింది. అలాగే సులభ లావాదేవీలకోసం ఈ డివైస్‌లో శాంసంగ్ పే కూడా జోడించింది.




Comments
Please login to add a commentAdd a comment