ఎఫర్డబుల్‌ ప్రైస్‌లో శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ కమింగ్‌ సూన్‌ | Samsung Galaxy A04e with 5000mAh battery coming soon | Sakshi
Sakshi News home page

ఎఫర్డబుల్‌ ప్రైస్‌లో శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ కమింగ్‌ సూన్‌

Published Sun, Oct 23 2022 12:23 PM | Last Updated on Sun, Oct 23 2022 2:06 PM

Samsung Galaxy A04e with 5000mAh battery coming soon - Sakshi

సాక్షి, ముంబై:  దక్షిణ కొరియా  సంస్థ శాంసంగ్‌  గెలాక్సీ  ఏ సిరీస్‌లో  మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్‌ చేయనుంది. 
కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో కీలక స్పెసిఫికేషన్‌లు , ఫీచర్లతో  గెలాక్సీ ఏ04ఈ (Galaxy A04e)  లిస్ట్‌ చేసింది. బ్లాక్, బ్లూ, కాపర్ ఇలా మూడు కలర్ ఆప్షన్లలో  రానున్న ఈ ఫోన్‌ ధర, లభ్యతను ఇంకా వెల్లడించలేదు. అయితే వచ్చే నెలలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

అయితే 13,499 రూపాయలువద్ద Galaxy A04s ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత వస్తున్న ఈ ఫోన్‌ ధరను వినియోగదారులకు అందుబాటు ధరలో  సుమారు పదివేలలోపే నిర్ణయించవచ్చని అంచనా.

శాంసంగ్‌ గెలాక్సీ ఏ04ఈ ఫీచర్ల అంచనాలు 
6.5 అంగుళాల HD+ ఇన్-సెల్ టచ్ LCD స్క్రీన్‌
60Hz రిఫ్రెష్ రేట్‌, ఆక్టా-కోర్ చిప్‌సెట్‌
720 x 1600 pixels, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
4 జీబీ ర్యామ్‌  126 జీబీ స్టోరేజ్‌  ( 1టీబీ వరకు విస్తరించుకునే అవకాశం) 
13  ఎంపీ+2 ఎంపీ  డ్యుయల్‌ రియర్‌ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమరా
5 000mAh బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement