ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌మేకర్ శాంసంగ్ గెలాక్సీ ఎ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎ 8, గెలాక్సీ 8 ప్లస్ 2018 మోడల్స్‌ను మార్కెట్లో విడుదల చేసింది. జనవరినుంచి ఈ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. తమ గెలాక్సీ ఎ సిరీస్‌లో మొట్టమొదటి డబుల్ సెల్ఫీ కెమెరా డివైస్‌లని శాంసంగ్ వైస్ ప్రెసిడెంట్ జునో పార్క్ తెలిపారు. అలాగే మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో 18: 9 ఎడ్జ్ టూ ఎడ్జ్ 'ఇన్ఫినిటీ డిస్‌ప్లే' లాంటి ప్రీమియం సెగ్మెంట్ ఫీచర్లను అందిస్తున్నట్టు చెప్పారు.
నిన్న (సోమవారం) ఈ మోడల్స్ ను వివిధ మార్కెట్లలో ప్రారంభించింది. అలాగే ఎంపిక చేసిన మార్కెట్లలో వచ్చే నెలలో స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. అయితే భారతదేశంలో ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ సంస్థ వెల్లడించలేదు. అలాగే ధరను అధికారికంగా ప్రకటించక పోయినప‍్పటికి సుమారు రూ.32వేలు (500 డాలర్లు) ఉండొచ్చని అంచనా. మరోవైపు 2018లో గెలాక్సీ ఎ8, ఎ8ప్లస్ బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లలో ఒకటిగా నిలుస్తాయని టెక్ నిపుణుల విశ్లేషిస్తున్నారు.
ఇక రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ 18:5:9 డిస్‌ప్లే , ఆక్టాకోర్ 2.2 గిగా హెడ్జ్ ప్రాసెసర్ , ఆండ్రాయిడ్ నౌగట్ 7.1, 16 ఎంపీ, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు, 16 ఎంపీ రియర్ కెమెరా ఫీచర్లు కామన్ ఫీచర్స్‌గా ఉండగా స్క్రీన్, బ్యాటరీలో స్వల్ప మార్పులు చేసింది. ఎ 8ను 4 జీబీ ర్యామ్, 32 జీబీ/64జీబీ స్టోరేజ్ , ఎ8 ప్లస్ ను 4జీబీ/32జీబీస్టోరేజ్, 6జీబీ/64జీబీస్టోరేజ్ రెండు వేరియంట్లలో అందిస్తోంది.
ఇక ఎ 8 లో 5.6 స్క్రీన్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చగా, ఎ8 ప్లస్‌లో 6 అంగుళాల స్క్రీన్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపర్చింది.
Comments
Please login to add a commentAdd a comment