introduced
-
ప్రేయసిని పరిచయం చేసిన బిగ్‌బాస్ 8 నబీల్.. ఈమె ఎవరంటే? (వైరల్)
-
ఫ్యామిలీని పరిచయం చేసిన హీరోయిన్ నభా నటేశ్ (ఫొటోలు)
-
పరీక్షల పద్ధతిని ప్రవేశ పెటిందెవరో మీకు తెలుసా..!
'విద్యార్థులు వారి జీవితంలో ఎన్నో చిక్కులను ఎదుర్కుంటూ ఉంటారు. తమాషాగా చెప్పాలనుకుంటే.. వారి జీవితంలో పరీక్షలు కూడా ఒక పెద్ద చిక్కులాగా భావిస్తూంటారు. ఈ పరీక్షలు వారి జీవితాలను మలుపు తిప్పుతాయనీ.., వారి జీవిత పాఠాలను(చదువు) ఎంత నేర్చుకున్నారో వారికే గుర్తుచేస్తాయనే విషయం వారు గ్రహించకపోవడంలో అతిశయోక్తి లేదనే చెప్పవచ్చు. మరి ఇలాంటి పరీక్షలను రాయాలని మొదటగా కనుగొన్న వ్యక్తి ఎవరో తెలిస్తే.. 'అబ్బో' అంటూ నోరెళ్లబెట్టక తప్పదు. ఇక ఎవరో చూద్దాం..' స్కూల్లో చేరింది మొదలు పిల్లలకు రకరకాల పరీక్షలు తప్పవు. మొట్టమొదటి సారిగా ఈ పరీక్షల పద్ధతిని అమెరికాలో స్థిరపడ్డ జర్మన్ ప్రొఫెసర్ హెన్రీ ఫిషెల్ ప్రవేశపెట్టాడు. ఇండియానా యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఈ ఘనకార్యానికి ఒడిగట్టాడు. ఇవి చదవండి: కార్టూన్ సిరీస్‌లతో జర జాగ్రత్త..! ఎందుకంటే? -
బిల్లు ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి రామ్ మెఘ్వాల్
-
మార్కెట్లోకి మళ్లీ హీరో కరిజ్మా..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తాజాగా కరిజ్మా బ్రాండ్‌ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 సీసీ బైక్‌ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1.72 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంటుంది. ప్రీమియం సెగ్మెంట్లో తమ వాటాన్ని పెంచుకునే దిశగా తమకు ఇది మరో మైలురాయి అని హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. తాము ప్రస్తుతం ఈ విభాగంలో ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని, మార్కెట్ వాటా 4–5 శాతం మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రీమియం ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను పూర్తి స్థాయిలో వేగవంతంగా రూపొందించుకోనున్నట్లు గుప్తా చెప్పారు. ప్రస్తుతం 150 సీసీ లోపు సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్ ఇకపై 150 సీసీ నుంచి 450 సీసీ వరకు బైక్‌ల సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది వ్యవధిలో ప్రతి మూడు నెలలకోసారి ఒక కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
కూతురిని ప్రపంచానికి పరిచయం చేసిన కిమ్..
-
లోక్‌సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం..
సాక్షి, ఢిల్లీ: దేశంలోని ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలు చేపట్టేలా తీసుకొచ్చిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఓటరు ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానించేలా రూపొందించిన ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు నేడు సభలో ప్రవేశపెట్టారు. చదవండి: కర్ణాటకలో ఒమిక్రాన్ కలకలం.. ఒక్కరోజే 5, దేశంలో 167కు చేరిన సంఖ్య అయితే ఈ బిల్లును కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపించాయి. అంతేగాక, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టాయి. అయినప్పటికీ దీన్ని ప్రవేశపెట్టేందుకు స్పీకర్ అంగీకరించడంతో కేంద్రమంత్రి బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. అయితే, ఈ బిల్లుతో పాటు లఖింపుర్ ఘటన, ఇతర అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో ఈ బిల్లుపై చర్చ మొదలుపెట్టకుండానే లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఏంటీ సవరణ బిల్లు.. ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలున్న ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఇటీల ఆమోద ముద్రవేసింది. పాన్-ఆధార్ లింక్ చేసినట్లు గానే, ఓటర్ ఐడీ లేదా ఎలక్టోరల్ కార్డుతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయనున్నారు. కాకపోతే వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా ప్రజలే అనుసంధానించుకొనేలా ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు సమాచారం. అలాగే, కొత్త ఓటర్లు నమోదుకు ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం కల్పించే మరో ప్రతిపాదనకు కూడా కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఏటా జనవరి 1 నాటికి 18 ఏళ్లు దాటితేనే ఓటరుగా నమోదుకు అనుమతించనున్నారు. ఇక, ఎన్నికలు నిర్వహించే ప్రాంగణాల ఎంపికపై కేంద్ర ఎన్నికల సంఘానికే పూర్తి అధికారాలు కట్టబెడుతూ మరో సవరణ చేశారు. ఆధార్ నెంబర్‌తో ఓటర్ ఐడీని అనుసంధానం చేయడం.. గోప్యతా హక్కుకు భంగం కలిగించడమేనని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ అన్నారు. బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలో నివసించే అందరికీ ఆధార్ కార్డులు జారీచేస్తారని, ఓటువేసే హక్కు కేవలం భారత పౌరులకే ఉంటుందని మరో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పునకు ఈ బిల్లు వ్యతిరేకంగా ఉందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. అయితే, విపక్షాల వాదనలను కేంద్రం ఖండించింది. ఎన్నికల ప్రక్రియను విశ్వసనీయంగా ఉంచాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. బోగస్ ఓట్లను నిర్మూలించేందుకే ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు తెలిపారు. -
బడ్జెట్‌పై గంపెడాశలు!
సాక్షి, గద్వాల: రాష్ట్ర బడ్జెట్‌పై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ కావడం, అది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రవేశపెట్టనుండటంతో ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తుతున్నాయి. త్వరలో ఎంపీ, మండలి, స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభివృద్ధిలో వెనకబడిన పాలమూరుకు గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ప్రాధాన్యం ఇస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది. గత బడ్జెట్లో.. గత బడ్జెట్లో కులవృత్తులకు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినప్పటికి పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. డబుల్ బెడ్రూం పథకం ఒక్క మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మినహా ఎక్కడా కూడా ఆశించినస్థాయిలో పురోగతి లేదు. చాలాచోట్లా శంకుస్థాపనలకే పరిమితమైంది. దళితులకు మూడెకరాల భూ పంపిణీ కూడా ముందుకు సాగలేదు. పెట్టుబడిసాయం మరింత పెంచిన నేపథ్యంలో బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. మత్స్య, పశు, చేనేతరంగాల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయోనన్న చర్చ జరుగుతోంది. ప్రధానంగా మరోవైపు కీలకమైన ప్రాజెక్టుల విషయంలో నిధుల కేటాయింపు విషయం ఆసక్తికరంగా మారింది. ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఉంటుందా? ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 10లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించక పోవడంతో పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల, కల్వకుర్తి, రాజీవ్‌భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, సంగంబండ, ఆర్డీఎస్, తుమ్మిళ్ల ద్వారా దాదాపు ప్రస్తుతం 7.5లక్షల ఎకరాలకు సాగునీరు అందుంతుండగా భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది బడ్జెట్లో జిల్లాలోని ప్రాజెక్టులకు 4,223.6కోట్లు కేటాయించింది. ఈ ఏడాది పెరుగుతాయా తగ్గుతాయా అనేది నేటి బడ్జెట్లో తేలుతుంది. ప్రస్తుతం పనులు అసంపూర్తిగా ఉన్న ఎత్తిపోతల ప్రాజెక్టుల పనుల పూర్తి కోసం మరో రూ.1000 కోట్లు ఇస్తే గాని పనులు పూర్తయ్యే అవకాశం లేదని సాగునీటిశాఖ అధికారులంటున్న మాట. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయింది. ఇక రాష్ట్ర బడ్జెట్లో పనుల పూర్తి కోసం అవసరమయ్యే నిధులు మంజూరు చేస్తేనే లక్ష్యం నెరవేరుతుందని సాగునీటిశాఖాధికారులంటున్నారు. పాలమూరు రంగారెడ్డి పథకానికి గతేడాది 4వేల కోట్లు కేటాయించారు. ఈ ఏడాది ఎంత కేటాయిస్తారనేది వేచి చూడాలి. పెండింగ్‌లో రూ.403.74కోట్ల బిల్లులు.. జిల్లాలోని నాలుగు ప్రధాన ప్రాజెక్టు కింద పూర్తయిన పనులకు 6నెలలుగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. తుమ్మిళ్ల పథకానికి తప్ప మిగతా నెట్టెంపాడు, రాజీవ్‌భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల కింద చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లేక పనులను కాంట్రాక్టర్లు నెమ్మదిగా చేస్తున్నారు. నెట్టెంపాడు పథకంలోకి ప్యాకేజీల్లో పనులను కాంట్రాక్టర్లు వదిలేసిన క్రమంలో కొత్త కాంట్రాక్టర్లతో పూర్తి చేయించేందుకు సాగునీటి శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మిగతా ప్రాజెక్టుల పరిధిలోనూ ఎలాగైనా సరే ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేయించాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటివరకు నాలుగు ప్రాజెక్టుల కింద పెండింగ్ బిల్లులు సైతం రూ.403.74 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 2019–2020 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం సాగునీటి శాఖాధికారులు ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. సంక్షేమ పథకాల సంగతి? రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. భూమిలేని దళిత కుటుంబాలకు ప్రతి ఒక్కరికి మూడెకరాల భూమిని పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ భూ పంపిణీలోనూ అనుకున్నంత లక్ష్యం చేరలేదు. తాజా బడ్జెట్లో ఈ పథకానికి ఎక్కువ నిధులు కేటాయిస్తారనే ఆశలు ప్రజల్లో ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పథకం ఉమ్మడి జిల్లాలో పెద్దగా ఎక్కడా కార్యరూపం దాల్చలేదు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మాత్రమే కొంత పురోగతి సాధించింది. గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అంతంతమాత్రంగానే ఉంది. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉండి ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, చెరువులతో నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో మత్స్యపరిశ్రమ అభివృద్ధి చెందేందుకు అపారమైన అవకాశాలున్నాయి. గత బడ్జెట్లో చేపల పెంపకానికి, పశుసంవర్ధకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఎంతోమంది మత్స్యకారులకు వాహనాలు అందజేయడంతో పాటు చేపల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చారు గొర్రెల పంపిణీ పథకం రెండోదశ అమలులో కొంత వెనకబాటులో ఉంది. నిధుల కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఇచ్చే స్వయం ఉపాధి రుణాలు, ఉపకారవేతనాల చెల్లింపులోనూ నిధుల కొరత వల్ల పథకాలు సక్రమంగా అమలు కాని పరిస్థితి. ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయిస్తారా లేదా అనేది చూడాలి. జోగుళాంబ గద్వాల జిల్లాలో చేనేత, జౌళి రంగానికి చేనేత కార్మికులకు, సహకార సంఘాలకు మరింత ఊతం ఇచ్చేందుకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. చేనేత పరిశ్రమ అభివృద్ధికి గత బడ్జెట్లో రూ.1200 కోట్లను కేటాయించారు. ఇందులో గద్వాల చేనేత పార్కుకు, చేనేత కార్మికుల అభివృద్ధికి, చేనేత రంగంలో శిక్షణకు అవసరమైన నిధులను కేటాయిస్తారు. అభివృద్ధి జరుగుతుందని భావించినప్పటికి చేనేత పార్కు అభివృద్ధిలో ఎలాంటి పురోగతి సాధించలేదు. విద్య, వైద్య రంగాలకు కూడా బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. -
మళ్లీ ఆశలు
సాక్షి, కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధిపై జిల్లా ప్రజలు మరోసారి ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గత మూడు బడ్జెట్లలో భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం మాస్టర్ ప్లాన్ కోసం రూ.100 కోట్లు ప్రకటించింది. కానీ.. ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో ఈ ప్రాంతవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈసారైనా చిత్తశుద్ధితో వ్యవహరిస్తారని ఆశిస్తున్నారు. ఈ ప్రభావం గత శాసనసభ ఎన్నికల్లోనూ చూపింది. అధికార టీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గంలో మొదటిసారి పాగా వేయాలని ఆశించినా.. నెరవేరలేదు. భద్రాద్రి రామాలయ అభివృద్ధిని పట్టించుకోకపోవడంపై స్థానిక ఓటర్లు వ్యతిరేకత చూపారని పలువురు పేర్కొంటున్నారు. నయా పైసా ఇవ్వలేదు భద్రాద్రి ఆలయ అభివృద్ధి కోసం ఉద్దేశించిన మాస్టర్ ప్లాన్ అమలు కోసం ప్రభుత్వం నయా పైసా ఇవ్వలేదు. దీంతో ఆలయ మాస్టర్‌ప్లాన్ ప్రక్రియ ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదు. మరోవైపు భద్రాచలం చుట్టూ ఉన్న గ్రామాలన్నీ ‘పోలవరం ప్రాజెక్ట్’ విలీన మండలాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాయి. భద్రాచలం పట్టణం నుంచి నియోజకవర్గంలోని మిగిలిన మండలాలకు వెళ్లాలంటే ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దులను రెండుచోట్ల దాటాల్సి వస్తోంది. దీంతో భద్రాచలం పట్టణం అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయింది. అభివృద్ధి నిలిచిపోవడంతో పాటు, పట్టణంలోని చెత్తను, వ్యర్థపదార్థాలను డంప్ చేసేందుకు అవసరమైన డంపింగ్‌యార్డ్‌కు సైతం స్థలం లేదు. భద్రాచలం పట్టణాన్ని గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ కాకుండా త్రిశంకుస్వర్గంలో ఉంచడంతో పరిస్థితి మరింత అస్తవ్యస్తంగా తయారైంది. అభివృద్ధిపై దృష్టి పెట్టాలి పట్టణ అభివృద్ధికి ఆయువుపట్టుగా ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాలు సైతం ఆంధ్రాలోకి వెళ్లాయి. భద్రాచలం పట్టణాన్ని 2003 సంవత్సరంలో టౌన్‌షిప్‌గా ఏర్పాటుచేశారు. తర్వాత 2005లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. దీనిపై కొందరు వ్యక్తులు ఏజెన్సీ చట్టాలకు విరుద్ధమంటూ కోర్టుకు వెళ్లడంతో 2010 మార్చిలో తిరిగి గ్రామ పంచాయతీగా మార్చారు. తాజాగా మళ్లీ మున్సిపాలిటీగా ప్రతిపాదించారు. అయినా ఇప్పటికీ స్పష్టత లేదు. ఆలయ మాస్టర్ ప్లాన్‌తో అమలుతో పాటు పట్టణ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. కనికరం చూపాలి భద్రాచలం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ మూడు సంవత్సరాలుగా రూ.100 కోట్లు ప్రకటిస్తున్నారు. కానీ నిధులు విడుదల చేయడంలేదు. రాష్ట్ర విభజన, జిల్లా విభజన తర్వా భద్రాచలం పట్టణం అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. వ్యాపారాలు కూడా మందగించాయి. సామాన్య జీవులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడైనా కనికరం చూపాలి. – పూనాటి నర్సింహారావు, వ్యాపారి హామీని నిలబెట్టుకోవాలి యాదాద్రిలా భద్రాద్రిని మారుస్తానని, ఇందుకోసం మొదటి విడతగా రూ. 100కోట్లు ఇస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇంత వరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అన్ని విధాలుగా నష్టపోయిన భద్రాచలాన్ని ఆదుకోవాలి. రామాలయం అభివృద్ధికి కేసీఆర్ చొరవ తీసుకోవాలి. –మంగిపూడి లక్ష్మి, గృహిణి -
శాంసంగ్ కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌మేకర్ శాంసంగ్ గెలాక్సీ ఎ సిరీస్‌లో కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎ 8, గెలాక్సీ 8 ప్లస్ 2018 మోడల్స్‌ను మార్కెట్లో విడుదల చేసింది. జనవరినుంచి ఈ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. తమ గెలాక్సీ ఎ సిరీస్‌లో మొట్టమొదటి డబుల్ సెల్ఫీ కెమెరా డివైస్‌లని శాంసంగ్ వైస్ ప్రెసిడెంట్ జునో పార్క్ తెలిపారు. అలాగే మిడ్ రేంజ్ సెగ్మెంట్లో 18: 9 ఎడ్జ్ టూ ఎడ్జ్ 'ఇన్ఫినిటీ డిస్ప్లే' లాంటి ప్రీమియం సెగ్మెంట్ ఫీచర్లను అందిస్తున్నట్టు చెప్పారు. నిన్న (సోమవారం) ఈ మోడల్స్ ను వివిధ మార్కెట్లలో ప్రారంభించింది. అలాగే ఎంపిక చేసిన మార్కెట్లలో వచ్చే నెలలో స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. అయితే భారతదేశంలో ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ సంస్థ వెల్లడించలేదు. అలాగే ధరను అధికారికంగా ప్రకటించక పోయినప్పటికి సుమారు రూ.32వేలు (500 డాలర్లు) ఉండొచ్చని అంచనా. మరోవైపు 2018లో గెలాక్సీ ఎ8, ఎ8ప్లస్ బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ఫోన్లలో ఒకటిగా నిలుస్తాయని టెక్ నిపుణుల విశ్లేషిస్తున్నారు. ఇక రెండు స్మార్ట్ఫోన్లలోనూ 18:5:9 డిస్ప్లే , ఆక్టాకోర్ 2.2 గిగా హెడ్జ్ ప్రాసెసర్ , ఆండ్రాయిడ్ నౌగట్ 7.1, 16 ఎంపీ, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు, 16 ఎంపీ రియర్ కెమెరా ఫీచర్లు కామన్ ఫీచర్స్‌గా ఉండగా స్క్రీన్, బ్యాటరీలో స్వల్ప మార్పులు చేసింది. ఎ 8ను 4 జీబీ ర్యామ్, 32 జీబీ/64జీబీ స్టోరేజ్ , ఎ8 ప్లస్ ను 4జీబీ/32జీబీస్టోరేజ్, 6జీబీ/64జీబీస్టోరేజ్ రెండు వేరియంట్లలో అందిస్తోంది. ఇక ఎ 8 లో 5.6 స్క్రీన్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చగా, ఎ8 ప్లస్‌లో 6 అంగుళాల స్క్రీన్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపర్చింది. -
ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేద్ర కేబినెట్ ఆమోదం
-
జింబాబ్వేలో కొత్త కరెన్సీ!
-
ఐటీ కంపెనీలకు భారీ షాక్
వాషింగ్టన్: హెచ్ 1 బీ,ఎల్ 1 వీసాలపై అత్యధిక ఆదాయన్ని పొందుతున్న భారతీయ ఐటీ కంపెనీలు, దేశ ఐటి నిపుణుల గుండెల్లో గుబులు మొదలైంది. భారత ఐటీ కంపెనీలను నిరోధించడానికి ఉద్దేశించిన '2016 హెచ్-1బీ, ఎల్ 1 వీసా సంస్కరణ చట్టం' బిల్లును సంయుక్త చట్టసభ సభ్యుల ద్వైపాక్షిక సమూహం ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టింది. ఈ వీసాలను నియంత్రించే యాంటి వీసా బిల్లును అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదముద్ర పడాలంటే ఈ బిల్లును సెనెట్ ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార, విపక్ష సభ్యులు హెచ్ 1 బీ, ఎల్ 1 సంస్కరణల బిల్లును సంయుక్తంగా ప్రవేశపెట్టారు. కాలిఫోర్నియా, న్యూ జెర్సీ రాష్ట్రాలకు చెందిన డెమొక్రాటిక్ పార్టీ నుంచి బిల్ పాస్ర్కెల్, రిపబ్లికన్ సభ్యుడు డానా రోహ్రా బాచెర్ ఈ బిల్లును ప్రతిపాదించారు. అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్న హెచ్-1బీ, ఎల్ 1 వీసాల విధానాన్ని కఠినతరం చేయాలంటూ యూఎస్ కాంగ్రెస్ లోఈ బిల్లును ప్రవేశపెట్టారు. విదేశీ అవుట్సోర్సింగ్ కంపెనీల ఉద్యోగులే టాప్ వినియోగదారులుగా ఉన్నారని కాంగ్రెస్ కార్యాలయం విడుదల చేసిన ఒక మీడియా ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. వీసా జారీ ప్రక్రియలోని లోపాలను సవరించాలని సెనేట్ సభ్యులు డిమాండ్ చేశారు. తద్వారా అమెరికా ఉన్నోతోద్యోగులకు, వీసా హోల్డర్ల హక్కులను కాపాడాలని కోరుతున్నారు. విదేశీ ఉద్యోగులను ఎన్నుకునేటపుడు మరింత పారదర్శకంగా వ్యవహారించాలన్నారు. తద్వారా దుర్వినియెగాన్ని అడ్డుకోవాలని, వీసా నిబంధలను ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ సాంకేతిక నిపుణులపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. తక్కువ వేతనాలకే పనిచేయడానికి ఇతర దేశాల నుంచి వస్తున్నవారితో అమెరికా పౌరులు ఉద్యోగాలు కోల్పోతున్నారని వీరు ఆరోపించారు. ఈ కొత్త బిల్లు ప్రకారం- ఏదైనా కంపెనీ తమ ఉద్యోగుల్లో 50 కంటే ఎక్కువ మందిని, లేదంటే మొత్తం ఉద్యోగుల్లో సగం కంటే ఎక్కువ మందిని హెచ్-1బి, లేదా ఎల్-1 వీసాదారులతో భర్తీ చేసుకోవడం కుదరదు. పెద్దఎత్తున విదేశీ కార్మికుల్ని అమెరికాకు దిగుమతి చేసుకుని, స్వల్పకాలిక శిక్షణను ఇచ్చి, ఆ తర్వాత వారిని స్వదేశాలకు పంపించి అక్కడి నుంచే పనిచేసేలా చూసే కంపెనీలపై కొత్త నిబంధనలు కొరడా ఝళిపించనున్నాయి. అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బి వీసా కార్యక్రమంలో సంస్కరణలు తీసుకువచ్చి, వేతన పరిమితుల్ని సవరించడానికి ఉద్దేశించిన బిల్లును అమెరికా 2010లో మొదటిసారి అమెరికా వీరువురు సెనేట్‌లో ప్రవేశపెట్టారు. కానీ అపుడు ఆమోదం లభించలేదు. -
నాన్న , నేను అనుకునే అలా చేశాం : నాగార్జున
‘‘నాన్నగారు ఇంకా చాలా రోజులు ఉండరని అప్పటికే మాకు తెలుసు. అందుకే, ఆయన చేతుల మీదుగా అఖిల్ పరిచయం అయితే బాగుంటుం దను కున్నాం. నాన్న గారి ఆశ కూడా అదే. అందుకే మేమిద్దరం అనుకుని, ‘మనం’ ద్వారా అఖిల్‌ను పరిచయం చేశాం. నాన్నగారి ఆశీర్వాదాలు చిన్నవి కాదు.. చాలా పెద్దవి’’ అంటూ తనయుడు అఖిల్ పరిచయ వేడుకలో అక్కినేని నాగార్జున ఉద్వేగంగా మాట్లాడారు. చిన్నప్పుడే ‘సిసింద్రీ’లో ఆకట్టుకున్న అఖిల్ ‘మనం’లో కొన్ని సెకన్లే కనిపించినా, ‘స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది’ అనిపించుకున్నారు. ఇక, పూర్తిస్థాయి హీరోగా అఖిల్ పరిచయం కానున్న చిత్రం ఆ మధ్య లాంఛనంగా ప్రారంభమైంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, శనివారం రాత్రి హైదరాబాద్‌లో అక్కినేని అభిమానుల సమక్షంలో హీరోగా అఖిల్ పరిచయ వేడుకను భారీయెత్తున నిర్వహించారు. ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ - ‘‘ఈ కథ చాలా బాగుంది. అయితే, ఇది ప్రేమకథా చిత్రం కాదు. పూర్తిగా మాస్ మూవీ’’ అన్నారు. ఇక, అఖిల్ దూసుకెళ్లిపోతాడని దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఆశీర్వదించారు. వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘ఇది అభిమానులు పండగ చేసుకోవాల్సిన సమయం. పరిశ్రమకు కొత్త సూపర్ స్టార్ వచ్చాడు. క్రికెట్లో సిక్సర్లు, సెంచరీలు కొడతాడు. అలాగే, తన ప్రతి సినిమా కూడా సెంచరీయే అవుతుంది. అఖిల్ కచ్చితంగా తెరపైనా ఆల్‌రౌండర్ అవుతాడు’’ అని పేర్కొన్నారు. అమల మాట్లాడుతూ - ‘‘అక్కినేని కుటుంబంలోకి నాగార్జున ఫ్యాన్‌గా ప్రవేశించా. మా అబ్బాయిని మీ (అభిమానులను ఉద్దేశించి) చేతుల్లో పెడుతున్నాం. జాగ్రత్తగా చూసుకోండి. ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్న హీరోయిన్ సాయేషా ఓ క్లాసిక్ బ్యూటీ’’ అని చెప్పారు. నాగచైతన్య మాట్లాడుతూ - ‘‘క్రికెట్ అంటే అఖిల్‌కి హాబీ. దాని కోసమే ఎంతో కష్టపడేవాడు. ఇక, సినిమా అంటే పిచ్చి. దీనికోసం ఏ స్థాయిలో కష్టపడతాడో ఊహించవచ్చు. దేశంలోని ప్రతి అభిమానినీ ఇంప్రెస్ చేస్తాడు’’ అన్నారు. వీవీ వినాయక్ మాట్లా డుతూ, ‘‘నన్ను నమ్మి నాగార్జునగారు పెద్ద బాధ్యతను నాకప్పగిం చారు. ఆయన నమ్మకాన్ని కచ్చితంగా నిలబెడతాను’’ అని తెలిపారు. నితిన్ మాట్లాడుతూ - ‘‘నా ఆప్తమిత్రుడు అఖిల్‌తో సినిమా నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నాగార్జునగారు నటించిన ‘నిన్నే పెళ్లాడతా’, వీవీ వినాయక్ గారి మాస్ సినిమాలు కలిస్తే ఈ సినిమా’’ అని చెప్పారు. ఈ వేడుకలో మహేశ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా ఉద్వేగంగా ఉంది : అఖిల్ అక్కినేని ‘‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన రోజు. చాలా ఉద్వేగంగా ఉంది. ముందుగా ఇద్దరు వ్యక్తులకు ధన్యవాదాలు చెప్పాలి. వాళ్లే మా ‘అమ్మా, నాన్న’. ఒక మంచి వ్యక్తిగా ఎలా ఉండాలో అమ్మ చెబుతుంటుంది. నాన్న అయితే ఎప్పుడూ అభిమానుల గురించే చెబుతుంటారు. మా అన్నయ్య (నాగచైతన్య) నా గురించి మాట్లాడుతుంటే చాలా ఎమోషనల్ అయిపోయాను. మేమిద్దరం సూపర్ హిట్ మల్టీస్టారర్ మూవీ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నా. గత ఐదేళ్లుగా సీసీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా వెంకీ (వెంకటేశ్) మామతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కింది. అసలేం చేయాలి? ఎలాంటి సినిమా చేయాలి? అని తర్జన భర్జన పడుతున్న సమయంలో చీకట్లో సెర్చ్ లైట్లా కనిపించారు వినాయక్ గారు. మంచి కథ చెప్పారు. నేను అన్నయ్యలా భావించే నా స్నేహితుడు నితిన్ దాదాపు రెండు, మూడేళ్లుగా ‘నీ ఫస్ట్ సినిమా కమర్షియల్ హంగులతో ఉండాలి’ అని నసపెడుతూ వచ్చాడు (నవ్వుతూ). చివరికి తనే నా నిర్మాత కావడం ఆనందంగా ఉంది. సోమవారం నుంచి ఈ చిత్రం షూటింగ్లో పాల్గొననున్నాను. ఈ సమయంలో తాతగారు గుర్తొస్తున్నారు. ఆయన దేవుణ్ణి నమ్మేవారు కాదు. ఎందుకంటే అభిమానుల్లోనే దేవుణ్ణి చూసుకున్నారు. నాకూ వాళ్ళే దేవుళ్ళు.’’ -
ఆటోమాటిక్ రైల్వేగేట్ రూపొందించిన విద్యార్ధినులు