శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో మరో రెండు ఫోన్లు
⇒ జె7 మ్యాక్స్ ధర రూ. 17,900, జె7 ప్రో ధర రూ. 20,900
⇒ ఈ నెల 20 నుంచి జె7 మ్యాక్స్ విక్రయాలు, జూలై మూడోవారంలో ప్రో
సాక్షి, న్యూఢిల్లీ: శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో రెండు కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. గెలాక్సీ జె7 మ్యాక్స్, జె7 ప్రో పేర్లతో రెండు స్మార్ట్ ఫోన్లను బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో శాంసంగ్ ఇండియా ఎండీ కెన్ క్యాంగ్, శాంసంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ డైరెక్టర్ సుమిత్ వాలియా ఆవిష్కరించారు. జె7 మ్యాక్స్ 5.7 అంగుళాల హెచ్‌డీ క్వాలిటీ డిస్‌ప్లేతో, 13 మెగా పిక్సల్ కెమెరా( ముందు, వెనుక), 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం, 8.1 ఎంఎం డైమెన్షన్, 3,300 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ, 1.6 ఓక్టా మీడియాటెక్ ప్రాసెసర్‌లాంటి ఫీచర్లు కలిగి ఉంది. దీని ధర రూ. 17,900. దీని విక్రయాలను ఈ నెల 20వ తేదీ ప్రారంభించనుంది.
ప్రత్యేకతలివి...
ఇక జె7 ప్రో: 5.5 అంగుళాల ఫుల్లీ హెచ్‌డి క్వాలిటీతో, 13 మెగా పిక్సల్ ఫ్లాష్ (ఫ్రంట్ అండ్ బ్యాక్), 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 3 బీజీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం, 7.8 ఎంఎం డైమెన్షన్, 3,600 ఎంఏహెచ్ సామర్థ్యంగల బ్యాటరీ, 1.6 ఓక్టా ఎక్సైనోస్ ప్రాసెసర్‌లాంటి ఫీచర్లతో బ్లాక్, గోల్డ్ కలర్లలో అందుబాటులోకి రానుంది. దీని ధర. 20,900. జె7 ప్రో విక్రయాలను జూలై మూడో వారంలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ డైరెక్టర్ సుమిత్ వాలియా మాట్లాడుతూ.. గెలాక్సీ సిరీస్‌లో జె7 మ్యాక్స్, జె7 ప్రో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ రెండు ఫోన్ల ద్వారా తీసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడానికి వీలుగా.. ఫొటో తీసిన వెంటనే డిస్‌ప్లే మీద ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సింబల్స్‌ను చూపిస్తుందన్నారు. ఈ ఫోన్లు కొనుగోలు చేసిన జియో కస్టమర్లకు రూ. 309 రీచార్జ్‌పై నెలకు 10 బీజీ డేటా 12 నెలలపాటు అదనంగా లభిస్తుందని తెలిపారు.