Mobile charger
-
జేబులో ఇమిడిపోయే చార్జర్
ప్రపంచవ్యాప్తంగా చాలారకాల చార్జర్లు వాడుకలో ఉన్నాయి. సాదాసీదా చార్జర్ల గరిష్ఠ సామర్థ్యం 20 వాట్ల వరకు ఉంటుంది. ఈ చార్జర్ వాటన్నింటి కంటే పూర్తిగా భిన్నమైనది. చూడటానికి చాలా చిన్నగా, జేబులో ఇమిడిపోయేంత మాత్రమే ఉంటుంది. దీనికి మూడు యూఎస్బీ పోర్టులు ఉంటాయి. వీటి ద్వారా ఒకేసారి మూడు గాడ్జెట్స్‌ను ఏకకాలంలో చార్జింగ్ చేసుకోవచ్చు.ఇది 100 వాట్ల సామర్థ్యంతో పనిచేస్తుంది. కేవలం అరవై గ్రాముల బరువు మాత్రమే ఉండే నానో చార్జర్ ఇది. ఎక్కడికైనా దీనిని తేలికగా తీసుకుపోవచ్చు. మామూలు ప్లగ్ సాకెట్లలో సులువుగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, ఇది చాలా వేగంగా గాడ్జెట్స్‌ను చార్జ్ చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘ఏంకర్’ ఈ నానో చార్జర్‌ను ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 44.99 డాలర్లు (రూ.3,777) మాత్రమే! -
తండ్రీకొడుకుల మధ్య చిచ్చురేపిన క్రికెట్ మ్యాచ్.. ఛార్జర్ కేబుల్‌తో ఉరేసి..
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాాచ్ను యావత్ క్రికెట్ అభిమానులంతా ఆసక్తికరంగా వీక్షించారు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ హై ఓల్టేజ్ పోరును, టీవీ, హాట్‌స్టార్, పలుచోట్ల భారీ స్క్రీన్ల ద్వారా ఉత్కంఠగా చూశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫైనల్ ఫీవర్ దేశం మొత్తాన్ని ఊపేసింది. అయితే వరల్డ్ కప్ తుది పోరు ఓ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టింది. ఇంట్లో టీవీ చూస్తున్న ఓ తండ్రి.. మ్యాచ్ మధ్యలో టీవీ ఆపేశాడన్న కోపంతో కన్న కొడుకుతో వాగ్వాదానికిదిగాడు. ఈ క్రమంలో గొడవ పెద్దది కావడంతో ఆవేశంలో కొడుకును హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం వెలుగుచూసింది,. వివరాలు.. కాన్పూర్‌కు చెందిన గణేష్ ప్రసాద్ అనే వ్యక్తి ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నాడు. ఈ సమయంలో అతడి కుమారుడు దీపక్.. తనకు ఆకలిగా ఉండటంతో త్వరగా వంట చేయాలని కోరాడు. తన మాటలను తండ్రి పట్టించుకోకుండా మ్యాచ్‌లో లీనమైపోవడంతో దీపక్ టీవీని ఆఫ్ చేశాడు. దీంతో గణేష్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి కొడుకుతో గొడవపడ్డాడు. ఇది ఇద్దరి మధ్య కొట్లాటకు దారితీసింది. చదవండి: అయ్యయ్యో..ఎంత విషాదం: మంచికోసం వెళ్లి..మృత్యు ఒడిలోకి! అప్పటికే మద్యం మత్తులో ఉన్న గణేష్ ప్రసాద్.. పక్కనే ఉన్న మొబైల్ ఛార్జర్ కేబుల్‌తో కొడుకును ఉరేసి చంపాండు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. మెట్లపై దీపక్ మృతదేహాన్ని పడి ఉండటాన్ని గుర్తించిన వారి బంధువు.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కాన్పూర్ ఏసీపీ బ్రిజ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. క్రికెట్ మ్యాచ్ విషయంలో జరిగిన గొడవే హత్యకు కారణమైందని వెల్లడించారు. నిందితుడు హత్యకు మొబైల్ ఛార్జర్ కేబుల్‌ను ఉపయోగించాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారని చెప్పారు. తండ్రీ కొడుకులిద్దరూ తరుచూ మద్యం సేవించి గొడవ పడుతుంటారని తెలిసినట్లు పేర్కొన్నారు. ఇటీవల దీపక్ తన తల్లిని కొట్టాడంతో గతవారం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. -
యాపిల్‌కు భారీ షాక్.. అవి లేకపోతే ఐఫోన్లు అమ్మకండి!
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్‌కి యూత్‌లో ఉన్న క్రేజ్ వేరు. అంతేకాకుండా ఫోన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా సంపాదించుకుంది యాపిల్.అయితే నిబంధనలు తప్పితే ఎంత పెద్ద కంపెనీకైనా జరిమాన తప్పదని బ్రెజిల్ కోర్టు నిరూపించింది. బ్రెజిల్లో ఛార్జర్ లేకుండా ఐఫోన్లను విక్రయిస్తున్నందుకు ఆపిల్‌కు భారీ జరిమానాను విధించింది. దీనిపై స్పందించిన యాపిల్ సంస్థ కోర్టు తీర్పుని అప్పీల్ చేస్తామని తెలిపింది. భారీ జరిమానా! BRL 100 మిలియన్లు ( భారత కరెన్నీ ప్రకారం సుమారు రూ. 150 కోట్లు) చెల్లించాలని కంపెనీని బ్రెజిల్ కోర్టు ఆదేశించింది. యాపిల్ బ్రాండ్ తన ఐఫోన్లను దేశంలో విక్రయించాలంటే ఇకపై స్మార్ట్‌ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను చేర్చాలని తీర్పు ఇచ్చింది.దీనిపై యాపిల్ స్పందిస్తూ.. వాతావరణ కాలుష్యం ప్రధాన కారణంగా తాము చార్జర్లను ఇవ్వడం లేదని తెలిపింది. కర్బన ఉద్గారాలను తగ్గించే చర్యల్లో భాగంగా అడాప్టర్‌ను అందించడం నిలిపివేసినట్లు చెప్పుకొచ్చింది. కానీ, రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఛార్జర్ లేకుండా స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించడం పర్యావరణానికి మేలు చేస్తుందని ఎటువంటి ఆధారాలు లేవని" ఉన్నత అధికారులు యాపిల్‌తో విభేదించారు. ఇదే సమస్యపై ఈ ఏడాది సెప్టెంబర్‌లో యాపిల్‌కు కోర్టు దాదాపు 2.5 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఫోన్బాక్స్లో ఛార్జర్‌ను కూడా అందించాలని అలా కుదరకపోతే తన కంపెనీ ఐఫోన్లను బ్రెజిల్లో విక్రయించకుండా నిషేధిస్తామని కూడా ఆదేశించింది. కాగా అడాప్టర్ అనేది ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేసే ముఖ్యమైన ప్రాడెక్ట్. అది లేకుండా ఫోన్ పని చేయదన్న సంగతి అందరికీ తెలిసిందే. చదవండి: బంధన్ బ్యాంక్ ప్రచారకర్తగా సౌరవ్ గంగూలీ -
యూరోపియన్ యూనియన్ సంచలన నిర్ణయం.. యాపిల్ కంపెనీకి పెద్ద దెబ్బే!
మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రిక్ డివైజ్‌ల విషయంలో కామన్ ఛార్జింగ్ పోర్ట్ కోసం యూరోపియన్ యూనియన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ పరికరాలకు సంబంధించి ఇకపై కామన్ ఛార్జింగ్ పోర్ట్ ఉండాలంటూ కొత్త నిబంధనలతో కూడిన చట్టాన్ని ఆమోదించింది. 2024 కల్లా ఈ నిబంధన పూర్తిగా అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇకపై ఈయూ దేశాల్లో ఫోన్లతో సహా డివైజ్‌లన్నింటికి ఒకే పోర్ట్.. ఒకే ఛార్జర్ కనిపించనున్నాయి. యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం యూరోపియన్ కమిషన్ తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం.. యూఎస్బీ-సీ టైప్ పోర్టల్ ఛార్జర్లే అన్ని డివైజ్లకీ ఉండాలి. వీటితో పాటు ఇ-రీడర్లు, ఇయర్ బడ్స్‌తో పాటు ఇతర సాంకేతిక పరికరాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ క్రమంలో యాపిల్ ఐఫోన్ (Apple iPhone)లతో పాటు పలు సంస్థలు కూడా వారి ఛార్జింగ్ పోర్ట్‌ను మార్చవలసి ఉంది. యూరోపియన్ కస్టమర్లకు ఎలక్ట్రానిక్ పరికరాలను అందించే సంస్థలలో యాపిల్ ప్రధాన సరఫరాదారుడు, దీంతో ఈ నిర్ణయం ఐఫోన్ కంపెనీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఈ నిబంధన ఎందుకంటే! కస్టమర్లు డివైజ్ కొనుగోలు చేసిన ప్రతీసారి కంపెనీలు కొత్త ఛార్జర్లను కూడా ఇస్తుంటాయి. దీంతో పాతది వాడకుండా వ్యర్థంగా మారడం సహజంగా మారుతోంది. ఈ క్రమంలో పాత ఛార్జర్లనే ఉపయోగించే విధంగా యూజర్లను ప్రోత్సహించడంతో పాటు, రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. ఈ అంశంపై ఈయూలో చాలా ఏళ్లుగా పోరాటం, చర్చలు నడుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సింగిల్ ఛార్జర్ వినియోగించడం వల్ల దాదాపు EUR 250 మిలియన్లు (దాదాపు రూ. 2016 కోట్లు) ఆదా అవుతుందని యూరోపియన్ కమిషన్ అంచనా. 2018లో మొబైల్ ఫోన్లతో విక్రయించిన సగం ఛార్జర్లు USB మైక్రో-USB కనెక్టర్‌ను కలిగి ఉండగా, 29 శాతం USB టైప్-సి కనెక్టర్‌ను కలిగి ఉన్నారు. 21 శాతం మంది లైట్నింగ్ కనెక్టర్ చార్జర్‌ను కలిగి ఉన్నారు. చదవండి: Youtube: యూజర్లకు భారీ షాకిచ్చిన యూట్యూబ్.. డబ్బులు చెల్లించాల్సిందేనా! -
మొబైల్ చార్జర్ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చి..
బనశంకరి: మంచి కోసం ఉపయోగించాల్సిన సాంకేతికతను అడ్డుపెట్టుకుని నగ్నచిత్రాలను తీయడం మొదలుపెట్టాడో సైకో. వాటిని చూపి బెదిరిస్తున్న కామోన్మాదిని ఈశాన్య విభాగ పోలీసులు అరెస్ట్ చేశారు. స్పై కెమెరా వినియోగించి ఈ దందాకు పాల్పడుతున్న వ్యక్తి మైసూరు జిల్లా టీ.నరసిపురకు చెందిన మహేశ్. ఇన్‌స్టా ద్వారా వేధింపుల పర్వం ఒక యువతి ఫిర్యాదుతో ఇతని బాగోతం బయటపడింది. ఆ యువతి ఇన్‌స్టా అకౌంట్‌కు మహేశ్ నుంచి మెసేజ్ రాగా, ఎవరో అపరిచితుడు అని బ్లాక్ చేసింది. మళ్లీ వేరే ఇన్‌స్టా ఖాతా నుంచి మెసేజ్‌లు చేసి, తనతో చనువుగా చాట్ చేయాలని డిమాండ్ చేశాడు. లేకపోతే మీ నగ్న వీడియో తన వద్ద ఉందని బెదిరించాడు. ఆమె పట్టించుకోలేదు. దీంతో దుండగుడు నిజంగానే ఒక వీడియోను ఆమెకు పంపాడు. అది చూసి బాధితురాలు భయభ్రాంతురాలైంది. ఎందుకంటే ఆ వీడియో ఆమె ప్రైవేటు రూమ్‌లో చిత్రీకరించినట్లు తెలుసుకుని ఈశాన్య విభాగ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సీఈఎన్ పోలీసులు తీవ్రంగా గాలించి మైసూరులో మహేశ్ ను శనివారం అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి స్పై కెమెరా, ల్యాప్‌టాప్, రెండు మెమొరీ కార్డులు, పెన్ డ్రైవ్, రెండు సెల్పోన్లను స్వాదీనం చేసుకున్నారు. ఎలా చేశాడంటే.. నిందితుడు మహేశ్, ఫిర్యాదురాలికి పరిచయస్తుడు కాగా ఆమె ఇంటికి వెళ్లిన సమయంలో ఆమె రూమ్‌లో మొబైల్ చార్జర్ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చాడు. ఇంకా ఎన్ని చోట్ల ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడు అనేదానిపై విచారణ ప్రారంభించారు. ఈశాన్య విభాగం డీసీపీ అనూప్ ఏ.శెట్టి, సీఐ సంతోష్ రామ్ ఈ కేసును దర్యాప్తు చేశారు. (చదవండి: ముంబైలో రూ.5 కోట్ల కొకైన్ పట్టివేత ) -
వినియోగదారులకు శుభవార్త,అన్ని రకాల గాడ్జెట్స్‌కు ఒకే తరహా ఛార్జర్!
న్యూఢిల్లీ: కొత్త ఎలక్ట్రానిక్ పరికరం తీసుకున్న ప్రతిసారీ, దానికి పనికొచ్చే మరో రకం చార్జర్‌ను కొత్తగా కొనాల్సిన అగత్యాన్ని తప్పించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు మొదలైన వివిధ పరికరాలన్నింటికీ కామన్‌గా ఒకే చార్జర్‌ను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై మొబైల్స్ తయారీ సంస్థలు సహా పరిశ్రమ వర్గాలతో ఆగస్టు 17న సమావేశం కానుంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా బహుళ చార్జర్ల వినియోగాన్ని, ఈ–వ్యర్థాలతో పాటు వినియోగదారులపై భారాన్ని కూడా తగ్గించే సాధ్యాసాధ్యాలను మదింపు చేసేందుకు ఈ భేటీ ఉపయోగపడగలదని పేర్కొన్నారు. 2024 నాటికి చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటికీ యూఎస్బీ–సీ పోర్ట్ తరహా చార్జర్ల వినియోగాన్ని అమల్లోకి తేనున్నట్లు యూరోపియన్ యూనియన్ ఇటీవలే ప్రకటించింది. అమెరికాలో కూడా ఇలాంటి డిమాండే ఉంది. చదవండి👉 నాసిరకం ప్రెజర్ కుక్కర్ల అమ్మకాలు, అమెజాన్‌కు భారీ ఫైన్! -
ముప్ఫై వేల ఫోన్.. 65 లక్షలకు అమ్మేశాడు!!
ఇందులో ఎలాంటి జిమ్మిక్కు లేదు. పైగా మోసానికి పాల్పడలేదు. ఫోన్‌ను పద్ధతిగానే.. అదీ ఆన్లైన్లో అమ్మేశాడు. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రపంచంలో మొట్టమొదటి సీ టైప్ ఛార్జ్ సపోర్ట్ ఉన్న యాపిల్ ఫోన్ ఇదే కాబట్టి. కానీ, ఇది యాపిల్ కంపెనీ రూపొందించింది కాదు. ఓ యంగ్ స్టూడెంట్ డెవలప్ చేశాడు. యూకేకి చెందిన రోబోటిక్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్ కెన్ పిల్లోనెల్ ‘ఐఫోన్ X’(64జీబీ, 3జీబీ ర్యామ్) ఫోన్‌ను చాలా శ్రమించి సీ టైప్ ఛార్జర్ పోర్ట్‌కు మార్చేశాడు. ఈ-బేలో ఈ ఫోన్ ఒరిజినల్ ధర 299 పౌండ్లు (401 యూఎస్ డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు 30 వేల రూపాయలు). కానీ, కెన్ తాను మోడిఫై చేసిన ఐఫోన్‌ను ఏకంగా 86 వేల యూఎస్ డాలర్లకు అమ్మకానికి పెట్టగా.. అది అమ్ముడుపోయింది. అంటే కొన్ని పదుల రేట్లకు హాట్ కేక్‌లా పోయింది అది. మన కరెన్సీలో అది 65 లక్షల రూపాయలు అన్నమాట. అంతేకాదు కెన్ ఇప్పుడు వాటర్ ప్రూఫ్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే యూఎస్బీ-సీ ఐఫోన్‌ను మోడిఫై చేసే పనిలో బిజీగా ఉన్నాడు. యాపిల్‌కు తప్పని పరిస్థితి సాధారణంగా యాపిల్ ఐఫోన్లకు లైట్నింగ్ కనెక్టర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అయితే యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం ఆమధ్య యూరోపియన్ కమిషన్ కొత్త చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. యాపిల్‌తో సహా ఏ మొబైల్ తయారీ కంపెనీ అయినా సరే యూఎస్బీ-సీ టైప్ పోర్టల్, టైప్ సీ ఛార్జర్లనే మార్కెట్లోకి తేవాలి. ఈ లెక్కన కొత్త ఫోన్‌గానీ, డివైజ్‌గానీ కొన్నప్పుడు మళ్లీ ఛార్జర్ ఇవ్వరు. వినియోగదారులు పాతదే వినియోగించుకోవాలి. ఒకవేళ పాడైతే మాత్రం అప్పుడు కొత్తది కొనుక్కునేందుకు వీలు కల్పిస్తారు. ఈ ఆదేశాలతో వచ్చే ఏడాది నుంచి సీ టైప్ పోర్ట్ సపోర్ట్ చేసేలా ఫోన్లను రీ డిజైన్ చేయబోతోంది యాపిల్. ఇక యూనివర్సల్ ఛార్జర్ల ద్వారా రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. పాత, ఉపయోగించని ఛార్జర్ల కారణంగా ప్రతీ ఏటా పదకొండు వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త పేరుకుపోతోంది ఈయూలో!!. కిందటి ఏడాది 420 మిలియన్ మొబైల్ ఫోన్స్, ఇతరత్ర పోర్టబుల్ డివైజ్‌లు అమ్ముడు పోయాయి. ఈ లెక్కల ప్రకారం.. సగటున ప్రతీ యూజర్ దగ్గర మూడు ఛార్జర్లు ఉండగా.. వాటిలో రెండింటిని నిత్యం ఉపయోగిస్తున్నారు. యూరోపియన్ కమిషన్ నిర్ణయం వల్ల మొబైల్ యూజర్లు, ఛార్జర్ల మీద ఒక ఏడాదికి 250 మిలియన్ల యూరోలు(రెండు వేల కోట్ల రూపాయలపైనే) ఖర్చు గణనీయంగా తగ్గనుంది. చదవండి: ఇక కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరంట! -
ఛార్జర్ ఒక్కటే.. కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరు!!
మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రిక్ డివైజ్‌ల విషయంలో కామన్ ఛార్జింగ్ పోర్ట్ కోసం యూరోపియన్ యూనియన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలతో కూడిన చట్టం చేసింది ఎగ్జిక్యూటివ్ బాడీ యూరోపియన్ కమిషన్(ఈసీ). ఈ నిబంధన గనుక అమలులోకి వస్తే ఈయూ దేశాల్లో ఫోన్లతో సహా డివైజ్‌లన్నింటికి ఒకే పోర్ట్.. ఒకే ఛార్జర్ కనిపిస్తాయి. యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం యూరోపియన్ కమిషన్ కొత్త చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. యూఎస్బీ-సీ టైప్ పోర్టల్, టైప్ సీ ఛార్జర్లే అన్నింటికీ ఉండాలి. అంతేకాదు కొత్త ఫోన్‌గానీ, డివైజ్‌గానీ కొన్నప్పుడు మళ్లీ ఛార్జర్ ఇవ్వరు. పాతదే వినియోగించుకోవాలి. ఒకవేళ పాడైతే మాత్రం అప్పుడు కొత్తది కొనుక్కునేందుకు వీలు కల్పిస్తారు. కారణం.. డివైజ్ కొన్న ప్రతీసారి కొత్త ఛార్జర్లు ఇస్తుంటాయి తయారీ కంపెనీలు. ఈ క్రమంలో పాత ఛార్జర్లనే ఉపయోగించే విధంగా యూజర్లను ప్రోత్సహించాలన్నది, రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. ఈ అంశంపై పదేళ్లుగా పోరాటం, చర్చలు నడుస్తున్నాయి అక్కడ. పాత, ఉపయోగించని ఛార్జర్ల కారణంగా ప్రతీ ఏటా పదకొండు వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త పేరుకుపోతోంది ఈయూలో!!. కిందటి ఏడాది 420 మిలియన్ మొబైల్ ఫోన్స్, ఇతరత్ర పోర్టబుల్ డివైజ్‌లు అమ్ముడు పోయాయి. ఈ లెక్కల ప్రకారం.. సగటున ప్రతీ యూజర్ దగ్గర మూడు ఛార్జర్లు ఉండగా.. వాటిలో రెండింటిని నిత్యం ఉపయోగిస్తున్నారు. ఒకవేళ యూరోపియన్ కమిషన్ నిర్ణయం గనుక అమలు అయితే యూజర్లు ఛార్జర్ల మీద ఒక ఏడాదికి 250 మిలియన్ల యూరోలు(రెండు వేల కోట్ల రూపాయల) ఖర్చు పెట్టడం తగ్గుతుంది. 2009లో.. ముప్ఫై రకాల ఛార్జర్లు మార్కెట్లో ఉండేవి. ప్రస్తుతం యూఎస్బీ టైప్ సీ, యూఎస్బీ మైక్రో బీ, లైట్నింగ్ ఛార్జ్‌లను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. యాపిల్‌కు ఎదురుదెబ్బ ఆండ్రాయిడ్ ఫోన్లను మినహాయిస్తే.. యాపిల్ తన ఐఫోన్ల కోసం లైట్నింగ్ కనెక్టర్ ఛార్జింగ్ పోర్ట్‌లను, ఛార్జర్లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే మొదటి నుంచి ఈయూ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈయూ నిబంధనలు కొత్త ఆవిష్కరణలను దెబ్బతీస్తాయని, యూరప్‌తో పాటు వరల్డ్ డివైజ్ మార్కెట్‌పై ప్రభావం చూపెడుతుందని చెబుతోంది. అంతేకాదు 2030 నాటికి కార్బన్ రహిత యాపిల్ డివైజ్‌ల దిశగా అడుగు వేస్తున్న తరుణంలో.. యాపిల్‌కు ఈసీ తీసుకున్న నిర్ణయం అడ్డుతగులుతుందని అంటోంది. అయినప్పటికీ ఈయూ ప్రత్యేక చట్టం ద్వారా ముందుకెళ్తుండడం విశేషం. యాపిల్‌లో సీ ఉందిగా! ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్న యాపిల్.. లైట్నింగ్ కనెక్టర్ అందించాలనే లైన్ మీద నిల్చుంటోంది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే.. ఐప్యాడ్ ప్రో, మ్యాక్బుక్లు మాత్రం యూఎస్బీ-సీ స్టాండర్డ్ మోడర్న్తో వస్తున్నాయి. ఇక ఫ్లగ్‌కు కనెక్ట్ అయ్యే వైపు మాత్రం యూఎస్బీ-సీ, యూఎస్బీ-ఏ ఉపయోగిస్తున్నారు. వేటి వేటి కంటే.. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్స్, కెమెరాలు, హెడ్‌ఫోన్స్, పోర్టబుల్ స్పీకర్లు, వీడియో గేమ్ కన్సోల్స్.. మొదలైనవి. అయితే ఇయర్‌బడ్స్, స్మార్ట్ వాచీలు, ఫిట్నెస్ ట్రాకర్లను ఉపయోగించే విధానం, సైజు కారణాల వల్ల టైప్ సీ తప్పనిసరి నిబంధనల్లో చేర్చట్లేదు. డిజిటల్ అండ్ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా ఈయూ సభ్య దేశాల్లో ఈ చట్టం(డైరెక్టివ్) మీద విస్తృత చర్చ నడిచింది. ఈ చర్చ ఆధారంగా సభ్య దేశాల చట్టసభ్యులు కొన్ని సలహాలు ఇస్తారు. ఈ తతంగం అంతా పూర్తయ్యాక.. యూరోపియన్ కమిషన్ ఆమోదం చెప్పగానే ఈ నిబంధనను అమలులోకి వస్తుంది. బహుశా వచ్చే ఏడాది చివర్లో ఈ చట్టం అమలులోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఛార్జర్ల పోర్టులు మార్చుకునేందుకు వీలుగా కంపెనీలకు రెండు సంవత్సరాల గడువునిచ్చే ప్రతిపాదన చేస్తోంది యూరోపియన్ కమిషన్. - సాక్షి, వెబ్స్ఫెషల్ చదవండి: ఆవులించినా చర్యలు తీసుకునే కెమెరాలు ఇవి! -
మొబైల్ చార్జర్ కేబుల్ మెడకు చుట్టి..
కోల్‌కతా: భర్తను చంపిన ఆరోపణలతో పశ్చిమబెంగాల్లోని 24 పరగణాల జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు, న్యాయవాది అనిందితా పాల్కి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈమె తన భర్త రజత్ డేని మొబైల్ ఫోన్ చార్జర్ కేబుల్‌ని మెడకు చుట్టి చంపిన ఆరోపణలు నిరూపితమవడంతో కోర్టు ఈ శిక్ష విధించింది. ఆమెకు భర్తను చంపినందుకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు పదివేల రూపాయల జరీమానా చెల్లించాలని అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి సుజిత్ తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో సాక్ష్యాలను మాయం చేసినందుకు మరో ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. -
ఇక కొత్త ఫోన్‌తో చార్జర్ రాదు
న్యూఢిల్లీ: గతంలో మొబైల్ కొంటే దాంతో పాటు చార్జర్, ఇయర్ ఫోన్స్ వచ్చేవి. కాలక్రమేణా ఇయర్ ఫోన్స్ ఫోన్ తో పాటు రావడం ఆగిపోయింది. రానున్న రోజుల్లో చార్జర్ ను తొలగించి ఖర్చులను తగ్గించుకోవాలని ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, శాంసంగ్ ఫోన్ తయారీ దారులు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల తయారీదారులకు చార్జర్ తయరీ ఖర్చులతో పాటు ఫోన్ ప్యాకేజింగ్ లో అయ్యే అదనపు ఖర్చు కూడా మిగులుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిపై శాంసంగ్, యాపిల్ తయారీదారుల నుంచి అధికారిక సమాచారం ఏదీ రాలేదు. త్వరలో రానున్న ఐఫోన్ 12లో ఇయర్ ఫోన్స్ తో పాటు, చార్జర్ కూడా రాదని యాపిల్ ఎనలిస్ట్ మింగ్ చుకో అంటున్నారు. ప్రస్తుతం వస్తున్న ఫోన్లన్నీ దాదాపు టైప్ సీ పోర్టుతో వస్తున్నాయి. దీనివల్ల మార్కెట్లో ఒకే తరహా చార్జర్ అందుబాటులోకి వస్తుందని తయారీ సంస్థలు భావిస్తున్నాయి. అంతేగాక వైర్ లెస్ చార్జింగ్ సదుపాయంతో వస్తున్న ఫోన్లకు అసలు చార్జర్ అవసరమే ఉండదు. -
గర్భిణిని హతమార్చిన భర్త
-
గర్భిణిని హతమార్చిన భర్త
జీడిమెట్ల (హైదరాబాద్): ఆరు నెలల గర్భంతో ఉన్న భార్యను భర్తే హతమార్చిన ఘటన నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గాజుల రామారం పరిధిలోని ప్రకాశం పంతులు నగర్‌కు చెందిన హుస్సేన్, గౌసియా బేగం దంపతుల మధ్య కొన్నాళ్లుగా మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం కూడా వీరిద్దరు గొడవపడ్డారు. అదే రోజు రాత్రి హుస్సేన్ తన భార్య గౌసియా బేగంను హత్య చేశాడు. అనంతరం తలాబ్‌కట్టలో ఉండే అత్తా, మామలకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. వారు ఆదివారం ఉదయం కూతురు ఇంటికి వచ్చి చూడగా ఆమె శవమై కనిపించింది. దీంతో వారు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.