స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్‌కి యూత్‌లో ఉన్న క్రేజ్ వేరు. అంతేకాకుండా ఫోన్‌లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా సంపాదించుకుంది యాపిల్.అయితే నిబంధనలు తప్పితే ఎంత పెద్ద కంపెనీకైనా జరిమాన తప్పదని బ్రెజిల్ కోర్టు నిరూపించింది. బ్రెజిల్‌లో ఛార్జర్ లేకుండా ఐఫోన్‌లను విక్రయిస్తున్నందుకు ఆపిల్‌కు భారీ జరిమానాను విధించింది. దీనిపై స్పందించిన యాపిల్ సంస్థ కోర్టు తీర్పుని అప్పీల్ చేస్తామని తెలిపింది.
భారీ జరిమానా!
BRL 100 మిలియన్లు ( భారత కరెన్నీ ప్రకారం సుమారు రూ. 150 కోట్లు) చెల్లించాలని కంపెనీని బ్రెజిల్ కోర్టు ఆదేశించింది. యాపిల్ బ్రాండ్ తన ఐఫోన్‌లను దేశంలో విక్రయించాలంటే ఇకపై స్మార్ట్‌ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను చేర్చాలని తీర్పు ఇచ్చింది.దీనిపై యాపిల్ స్పందిస్తూ.. వాతావరణ కాలుష్యం ప్రధాన కారణంగా తాము చార్జర్లను ఇవ్వడం లేదని తెలిపింది.
కర్బన ఉద్గారాలను తగ్గించే చర్యల్లో భాగంగా అడాప్టర్‌ను అందించడం నిలిపివేసినట్లు చెప్పుకొచ్చింది. కానీ, రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఛార్జర్ లేకుండా స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించడం పర్యావరణానికి మేలు చేస్తుందని ఎటువంటి ఆధారాలు లేవని" ఉన్నత అధికారులు యాపిల్‌తో విభేదించారు.
ఇదే సమస్యపై ఈ ఏడాది సెప్టెంబర్‌లో యాపిల్‌కు కోర్టు దాదాపు 2.5 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఫోన్‌బాక్స్‌లో ఛార్జర్‌ను కూడా అందించాలని అలా కుదరకపోతే తన కంపెనీ ఐఫోన్‌లను బ్రెజిల్‌లో విక్రయించకుండా నిషేధిస్తామని కూడా ఆదేశించింది. కాగా అడాప్టర్ అనేది ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేసే ముఖ్యమైన ప్రాడెక్ట్. అది లేకుండా ఫోన్ పని చేయదన్న సంగతి అందరికీ తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment