
కోల్‌కతా: భర్తను చంపిన ఆరోపణలతో పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు, న్యాయవాది అనిందితా పాల్‌కి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈమె తన భర్త రజత్ డేని మొబైల్ ఫోన్ చార్జర్ కేబుల్‌ని మెడకు చుట్టి చంపిన ఆరోపణలు నిరూపితమవడంతో కోర్టు ఈ శిక్ష విధించింది. ఆమెకు భర్తను చంపినందుకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు పదివేల రూపాయల జరీమానా చెల్లించాలని అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి సుజిత్ తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో సాక్ష్యాలను మాయం చేసినందుకు మరో ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.