కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాను సిలిగురితో కలిపే బెంగాల్ జాతీయ రహదారి 31 యుద్ధభూమిగా మారింది. పాఠశాల బాలికపై సామూహిక అత్యాచారం, హత్యకు నిరసనగా స్థానికులు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. పోలీసులు దాదాపు రెండు గంటలుపాటు నిరసనకారులను చెదరగొట్టడానికి ప్రయత్నించారు. అయితే నిరసనకారులు మాత్రం పోలీసులను తీవ్రంగా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్‌తోపాటు బాష్పవాయువును ప్రయోగించారు. నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన ఈ నిరసన చాలా సేపు కొనసాగింది. రెచ్చిపోయిన నిరసన కారులు మూడు బస్సులు, పోలీసు వాహనాలను తగలబెట్టారు.
చదవండి: భార్యను చంపడానికి ఇన్ని స్కెచ్‌లా!
పదవ తరగతి విద్యార్థిని అదృశ్యం కావడంతో.... కుటుంబ సభ్యులు ఆమెను వెతకడం ప్రారంభించగా ఒక చెట్టు కింద మృతదేహాం లభ్యమయ్యింది. బాలికను సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తన్నారు. ఘటనా స్థలంలో దొరికిన రెండు సైకిళ్ళు, కొన్ని మొబైల్ ఫోన్లను పోలీసులకు అప్పగించారు. పోస్ట్‌మార్టం నివేదికలో బాలిక పాయిజన్ ప్రభావంతో చనిపోయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా బాలిక ఒంటిమీద ఎలాంటి గాయాలు లేవు. దీనికి సంబంధించి వెస్ట్ బెంగాల్ పోలీసులు ట్వీట్ చేశారు. ‘పోస్ట్ మార్టంను మేజిస్ట్రేట్ వీడియోగ్రఫీ ద్వారా విచారించింది. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం బాలిక పాయిజన్ ప్రభావంతో చనిపోయింది. శరీరంలో ఎక్కడా గాయాల గుర్తులు లేవు. ఆమె పై లైంగిక దాడి జరిగిన సంకేతాలు లేవు’ అని పోలీసులు ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment