ప్రేయసి గొంతు నులిమి చంపిన ప్రియుడు
ప్రేయసి గొంతు నులిమి చంపిన ప్రియుడు
Published Mon, Mar 27 2017 4:54 PM | Last Updated on Mon, Apr 8 2019 6:21 PM
కోల్‌కతా: పశ్చిమ్‌బెంగాల్లో దారుణం జరిగింది. తల్లి తండ్రులను కాదని ప్రియుడితో వెళ్లిన యువతి దారుణ హత్యకు గురైంది. నిందితుడు ఆ యువతిని గొంతు నులిమి చంపాడు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిబాద్ జిల్లా షేంషేర్‌గంజ్‌లో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. ప్రేమించానని చెప్పడంతో నమ్మిన యువతి(18) ఇంట్లో చెప్పకుండా అతనితో వెళ్లింది. ఎంత వెతికన ఆచూకీ తెలియకపోవడంతో ఆదివారం రాత్రి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టామని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇంతలోనే శవమై కనిపించిందని ఘటన స్థలం నుంచి నిందితుడు పారిపోవడం చూశామని వారు పోలీసులకు తెలిపారు. ఆమె గొంతు చుట్టూ చేతితో నులిమిన వాతలు ఉండటంతో ఆమె ప్రియుడే అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టన్‌కు పంపించామని, కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement