కోల్‌కతా: ఆర్జీ కర్ హాస్పిటర్ జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో ప్రతిపక్ష బీజేపీ నకిలీ ఆరోపణలు, అసత్య ప్రచారం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) మండిపడింది. ఎంతో సున్నితమైన ఈ ఘటనపై బీజేపీ చెత్త రాజకీయం చేస్తోందని ఆ రాష్ట్ర మంత్రి శశీ పంజ వ్యాఖ్యానించారు.
‘ఈ కేసును పక్కదారి పట్టించడానికి పోలీసులు యత్నించారని, హడావుడిగా తమ కూతురు అంత్యక్రియలు పూర్తి చేయించారు. తమకు లంచం కూడా ఇవ్వజూపారని బాధితురాలి తల్లిండ్రులు ఆరోపించినట్లు ఓ వీడియో వైరల్ అయింది. తాము అలా అనలేదని.. అసత్య ఆరోపణలని ఖండించినట్లు మరో వీడియో వైరల్‌గా మారింది. అందులో వారు తమ కూతురికి జరిగిన దారుణానికి న్యాయం కావాలని కోరారు.
.. ఇప్పటికే బాధితురాలి తల్లిదండ్రుల హృదయం ముక్కలైంది. ఇక్కడ రాజకీయాలు చేయటం సరికాదు. రాజకీయాలతో బాధితురాలి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు. వాళ్లను అలా ఒంటరిగా వదిలేయండి’ అని అన్నారామె. అంతేకాదు ఉద్దేశపూర్వకంగా బీజేపీ, బీజేపీ ఐటీ సెల్ కేసును తప్పుదోవ పట్టించేందుకు నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తోందని మంత్రి ఆరోపించారు. పోస్ట్‌మార్టం రిపోర్టు విషయంలో సైతం బీజేపీ అసత్య ఆరోపణలు చేసిందని అన్నారామె.
‘కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి కేసు బదిలీ అయి 23 రోజులు గడిచాయి. ఇంతవరకు సీబీఐ నుంచి ఎటువంటి పురోగతి నివేదిక వెల్లడికాలేదు. సీబీఐ ఈ కేసు పురోగతిపై నివేదికను అందించాలని కోరుతున్నా. కోల్‌కతా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసినప్పుడు.. రెగ్యులర్ అప్‌డేట్లు ప్రెస్‌మీట్ ద్వారా బయటపెట్టారు’ అని మరో మంత్రి బ్రత్యా బసు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment