doctor family
-
‘ఆమె తల్లిదండ్రుల్ని అనవసరంగా లాగొద్దు’
కోల్‌కతా: ఆర్జీ కర్ హాస్పిటర్ జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో ప్రతిపక్ష బీజేపీ నకిలీ ఆరోపణలు, అసత్య ప్రచారం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) మండిపడింది. ఎంతో సున్నితమైన ఈ ఘటనపై బీజేపీ చెత్త రాజకీయం చేస్తోందని ఆ రాష్ట్ర మంత్రి శశీ పంజ వ్యాఖ్యానించారు. ‘ఈ కేసును పక్కదారి పట్టించడానికి పోలీసులు యత్నించారని, హడావుడిగా తమ కూతురు అంత్యక్రియలు పూర్తి చేయించారు. తమకు లంచం కూడా ఇవ్వజూపారని బాధితురాలి తల్లిండ్రులు ఆరోపించినట్లు ఓ వీడియో వైరల్ అయింది. తాము అలా అనలేదని.. అసత్య ఆరోపణలని ఖండించినట్లు మరో వీడియో వైరల్‌గా మారింది. అందులో వారు తమ కూతురికి జరిగిన దారుణానికి న్యాయం కావాలని కోరారు. .. ఇప్పటికే బాధితురాలి తల్లిదండ్రుల హృదయం ముక్కలైంది. ఇక్కడ రాజకీయాలు చేయటం సరికాదు. రాజకీయాలతో బాధితురాలి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు. వాళ్లను అలా ఒంటరిగా వదిలేయండి’ అని అన్నారామె. అంతేకాదు ఉద్దేశపూర్వకంగా బీజేపీ, బీజేపీ ఐటీ సెల్ కేసును తప్పుదోవ పట్టించేందుకు నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తోందని మంత్రి ఆరోపించారు. పోస్ట్‌మార్టం రిపోర్టు విషయంలో సైతం బీజేపీ అసత్య ఆరోపణలు చేసిందని అన్నారామె. ‘కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి కేసు బదిలీ అయి 23 రోజులు గడిచాయి. ఇంతవరకు సీబీఐ నుంచి ఎటువంటి పురోగతి నివేదిక వెల్లడికాలేదు. సీబీఐ ఈ కేసు పురోగతిపై నివేదికను అందించాలని కోరుతున్నా. కోల్‌కతా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసినప్పుడు.. రెగ్యులర్ అప్డేట్లు ప్రెస్‌మీట్ ద్వారా బయటపెట్టారు’ అని మరో మంత్రి బ్రత్యా బసు అన్నారు. -
Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
పటమట(విజయవాడతూర్పు): తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న ఆర్థోపెడిక్ సర్జన్ ధారావత్ శ్రీనివాస్(40) ఘటన విజయవాడ నగరంలో మంగళవారం సంచలనం రేకెత్తించింది. చిరకాల స్వప్నమైన ఆస్పత్రిని ప్రారంభించిన అనతికాలంలోనే దాన్ని వదులుకోవాల్సి రావడంతో మనస్తాపానికి గురైన అతను తాను అల్లారుముద్దుగా సాకుతున్న ఇద్దరు పిల్లలు, తనతో జీవితాన్ని పంచుకున్న భార్యను, తనను పెంచి పెద్ద చేసిన తల్లిని హతమార్చి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం విజయవాడ గురునానక్ నగర్లో జరిగింది. శ్రీనివాస్ అన్న దుర్గాప్రసాద్ పటమట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన విజయవా డ పోలీస్ కమిషనర్ రామకృష్ణ, డీసీపీ అదిరాజ్‌సింగ్ కేసు దర్యాప్తు చేపట్టారు.పోలీసుల కథనం మేరకు.. విజయవాడ గురునానక్ నగర్‌లోని మారుతీ కో– ఆపరేటివ్ కాలనీలో ప్లాట్ నంబరు 53లోని భవనంలో నివసించే ధారావత్ శ్రీనివాస్ గుంటూరులో వైద్య విద్య అభ్యసించారు. అనంతరం విజయవాడలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ చేశారు. సొంత ఆస్పత్రి ప్రారంభించాలని కలలు కన్నారు. ఈ క్రమంలో తన సేవింగ్స్‌తోపాటు ఓ ప్రైవేటు బ్యాంక్ నుంచి లోను తీసుకుని ఇటీవల సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్ ప్రారంభించారు. పూర్తిస్థాయిలో యంత్రపరికరాలు ఏర్పాటు చేసేందుకు డాక్టర్ ధారవత్ శ్రీనివాస్ స్నేహితులైన నగరంలోని ఆస్పత్రుల్లో పనిచేసే ముగ్గురు వైద్యులు అప్పులు ఇచ్చారు. దీంతో అప్పులు రూ.3 కోట్లకు చేరాయి. బ్యాంకు రుణం, స్నేహితుల వద్ద చేసిన అప్పులతో ఆస్పత్రి నడుపు తున్నా అనుకున్నంత స్థాయిలో ఆదాయం రావడంలేదు. అదే సమయంలో తామిచ్చిన అప్పులు తీర్చాలని స్నేహితులు ఒత్తిడి చేశారు. అప్పు కింద ఆస్పత్రి లో 90 శాతం వాటాను వారు సొంతం చేసుకున్నారు.వారం క్రితమే దారుణానికి వ్యూహం తన ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారడంతో తానే ప్రాణంగా జీవిస్తున్న తల్లి, భార్య, పిల్లలు అనాథలవుతారని డాక్టర్ శ్రీనివాస్ భావించారు. వారి ప్రాణాలు తీసి, ఆత్మహత్య చేసుకోవా లని భావించారు. ఏప్రిల్ 25వ తేదీన గురునానక్ నగర్‌లోని సూపర్ మార్కెట్‌కు వెళ్లి రెండు చాకులు కొన్నారు. మంగళవారం తెల్లవారుజామున నిద్రపోతున్న తల్లి రమణమ్మ (65), భార్య ఉషా (38), కూతురు శైలజ (11), శ్రీహాన్ (6) మెడపై కత్తితో గాట్లు పెట్టి హత్య చేశారు. ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటిలో ఉన్న కొంత నగదు, నగలు, ఆస్తి తాలూక డాక్యుమెంట్లను ఓ బ్యాగులో సర్ది దానిని కారులో పెట్టారు. అనంతరం ఎదురింటి గేటుకు ఉన్న డబ్బాలో తన అన్న దుర్గాప్రసాద్‌కు రాసిన లెటరు, తన కారు తాళం చెవిని అందులో వేశారు. తిరిగి తన ఇంటికి వచ్చి వరండాలో ఉరివేసుకున్నారు.తన వాట్సాప్‌కు వాయిస్ మెసేజ్ ఆత్మహత్య చేసుకునే ముందు డాక్టర్ శ్రీనివాస్ తన వాట్సాప్ నంబరుకు వాయిస్ మెసేజ్ పెట్టుకున్నారు. తన పరిస్థితికి తానే కారణమని, తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసు కుంటున్నానని పేర్కొన్నారు. తాను లేకపోతే తన కుటుంబ సభ్యులు అనాథలు అవుతారన్న భయంతో వారిని కూడా హతమార్చుతున్నానని ఆ మెసేజ్‌లో వివరించారు. క్లూస్ టీంతో ఆధారాల సేకరణ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మరణాలపై విచారణ చేపట్టిన పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ డాగ్‌స్కా్వడ్, క్లూస్ టీంను రప్పించారు. శ్రీనివాస్ హత్యకు వినియోగించిన చాకులు, దాని బిల్లు, సూపర్ మార్కెట్ సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు డాక్టర్ శ్రీనివాసే కుటుంబ సభ్యులను హత్యచేశాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.మోసాన్ని జీరి్ణంచుకోలేక..! ఆర్థోపెడిక్ సర్జన్‌గా విజయవంతంగా కొనసాగు తున్న శ్రీనివాస్‌కు సొంతగా ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్నది కల. ఆ మేరకు సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్‌ను ప్రారంభించారు. దాని నిర్వహణ కోసం స్నేహితులు అప్పులు ఇచ్చారు. ఆ అప్పులు తీర్చాలని ఒత్తిడిచేసి చివరకు ఆస్పత్రిలో 90 శాతం వాటా రాయించుకున్నారు. అనంతరం ఆస్పత్రిలోనే పనిచేయాలని శ్రీనివాస్‌ను ఒత్తిడిచేశారు. దీంతో మనస్తాపం చెంది శ్రీనివాస్ తల్లి, భార్య, పిల్లలను హత మార్చి ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ తండ్రి జమలయ్య నాయక్ విజయవాడ తూర్పు ఏసీపీగా పనిచేశారు. అతని అన్న నల్గొండ జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాస్ అత్తింటి వారు కూడా ఆర్థికంగా స్థితి మంతులే. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మరణానికి తీర్చలేనంత అప్పులు కారణం కాదని, తన స్నేహితులే మానసిక క్షోభకు గురిచేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. -
వైద్యుడి కుటుంబాన్ని వెంటాడిన కరోనా
కర్ణాటక,బొమ్మనహళ్లి : ప్రాణాంతక కరోనా బారిన పడినవారికి ఆయుష్షు పోస్తున్నవైద్యుడి కుటుంబంపై కరోనా పంజా విసిరింది. ఒక రోజు వ్యవధిలో అతని తల్లిని తండ్రిని బలి తీసుకుంది. సారక్కిలో నివాసం ఉంటున్న డాక్టర్ నాగేంద్ర బొమ్మనహవైద్యుడి కుటుంబంళ్లి బీబీఎంపీ విభాగంలో ఆరోగ్యశాఖ అధికారిగా పనిచేస్తున్నారు. కరోనా బారిన పడిన నాగేంద్ర తల్లి గురువారం మృతి చెందగా తండ్రి శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఇదిలా ఉండగా నాగేంద్ర బావ డాక్టర్ మంజునాథ్ చిక్కముదవాడి ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌గా పనిచేసేవారు. మంజునాథ్‌కు పాజిటివ్ రావడంతో నాలుగు ఆస్పత్రులో చికిత్స చేయించుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. వారం రోజుల క్రితం ఆయన మృతి చెందా డు. కరోనా బారిన పడిన ఎంతోమందికి వైద్య సేవలు అందించిన మంజునాథ్ చివరకు కరోనాకు చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. వారం రోజుల వ్యవధిలో వైద్యుడి కుటుంబంలోని ముగ్గురు మృత్యువాత పడటంతో సారక్కి వార్డులో విషాదం చోటు చేసుకుంది. నాగేంద్ర కుటుంబాన్ని ఎమ్మెల్యే సతీష్‌రెడ్డి పరామర్శించారు. -
ఢిల్లీలో ఆ డాక్టర్ కుటుంబానికి కరోనా
న్యూఢిల్లీ : దేశావ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న కూడా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఈశాన్య ఢిల్లీ మౌజ్‌పూర్‌లోని మొహల్లా క్లినిక్ విధులు నిర్వర్తిస్ను వైద్యునికి కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. వైద్యునితో పాటు అతని భార్య, కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలిందని, వారిని ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలిపారు. అలాగే మార్చి 12 నుంచి 18 మధ్య కాలంలో డాక్టర్‌ను కలవడానికి ఆ క్లినిక్‌కు వెళ్లిన వారిని క్వారంటైన్లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. ఒకవేళ కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రాదించాల్సిందిగా కోరారు. అయితే ఆ డాక్టర్ ఇటీవల ఏమైనా విదేశాలకు వెళ్లి వచ్చారా, లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా, ప్రాథమిక స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ఢిల్లీ ప్రభుత్వం మొహల్లా పేరిట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బుధవారం రోజున ఢిల్లీలో కొత్తగా 5 కరోనా కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37కు చేరింది. తొలుత విదేశాల నుంచి వచ్చినవారే కరోనా బాధితుల జాబితాలో ఉండగా.. గత వారం రోజుల నుంచి కాంటాక్ట్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాల వారికి కరోనా సోకితే.. అది చాలా వినాశకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 600 దాటింది. చదవండి : చైనాలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ! -
అమలాపురంలో విషాదం
-
కోడలి వేధింపులతో.. కుటుంబం ఆత్మహత్య
కోడలు పెట్టిన వేధింపులు, ఆమె బెదిరింపులు తట్టుకోలేక నోయిడాకు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. రాంచీలోని ఒక ఫ్లాట్‌లో ఈనెల 9వ తేదీన ఐదుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలు కనిపించాయి. వాళ్లంతా పెద్ద మొత్తంలో మత్తుమందు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారితో పాటు నోయిడాకు చెందిన డాక్టర్ సుకాంత సర్కార్ ఒంటిమీద తీవ్రమైన గాయాలతో కనిపించారని పోలీసులు చెప్పారు. కుటుంబం మొత్తం తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతోందని, వాళ్లు తొలుత నోయిడాలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, తర్వాత రాంచీ వరకు వచ్చి ఇక్కడ చనిపోయారని తెలిపారు. వాళ్లతో పాటు ఆ ఇంటి కోడలు మాత్రం రాలేదు. ఆత్మహత్య వద్దని తమవాళ్లకు చెప్పేందుకు తాను ఎంతగానో ప్రయత్నించినట్లు డాక్టర్ సర్కార్ చెప్పారు. కుటుంబంలో 63 ఏళ్ల సర్కార్, ఆయన భార్య అంజన (60), కుమారుడు సమీర్ (35), మనవరాలు సమీత (7), సమీర్ మరదలు మౌమిత (35), ఆమె కూతురు సుమిత (5) ఉన్నారు. వీళ్లలో మౌమిత.. సర్కార్ కోడలికి సొంత చెల్లెలు. ఈనెల 8వతేదీ రాత్రి 10-11 గంటల మధ్య సమయంలో అంజన, సమీర్, మౌమిత భారీమొత్తంలో మత్తుమందు ఇంజెక్షన్ తీసుకున్నారు. తర్వాత అంజన, మౌమిత కలిసి పిల్లలిద్దరికీ కూడా అవే ఇంజెక్షన్లు ఇచ్చారు. కాసేపటి తర్వాత అందరూ స్పృహతప్పి పడిపోయారు. డాక్టర్ సర్కార్ ఒక కత్తి తీసుకుని తనను తాను తీవ్రంగా పొడచుకుని గాయపర్చుకున్నారు గానీ.. 'దురదృష్టవశాత్తు' తన ప్రాణాలు పోలేదని ఆయన అన్నారు. తన కోడలు తామందరి మీద వరకట్న వేధింపుల కేసు పెడతానంటూ బెదిరించేదని, తన సోదరి మౌమితతో సమీర్, తాను కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నారంటూ ఆరోపించేదని ఆయన వాపోయారు. ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ఆమెకు జత కలిసింది. భోపాల్‌లో ఉండే మౌమిత భర్త కూడా ఈ దుర్ఘటన జరిగినరోజు రాత్రి రాంచీ వచ్చినా.. అతడు వేరే బంధువుల ఇంటికి వెళ్లాడు. డాక్టర్ సర్కార్ ప్రాణాలకు ముప్పు పలేదని, రెండు మూడు రోజుల్లో ఆయనను ఈ కేసు విషయంలో ప్రశ్నిస్తామని పోలీసులు చెప్పారు.