
ప్రపంచవ్యాప్తంగా చాలారకాల చార్జర్లు వాడుకలో ఉన్నాయి. సాదాసీదా చార్జర్ల గరిష్ఠ సామర్థ్యం 20 వాట్ల వరకు ఉంటుంది. ఈ చార్జర్ వాటన్నింటి కంటే పూర్తిగా భిన్నమైనది. చూడటానికి చాలా చిన్నగా, జేబులో ఇమిడిపోయేంత మాత్రమే ఉంటుంది. దీనికి మూడు యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. వీటి ద్వారా ఒకేసారి మూడు గాడ్జెట్స్‌ను ఏకకాలంలో చార్జింగ్ చేసుకోవచ్చు.
ఇది 100 వాట్ల సామర్థ్యంతో పనిచేస్తుంది. కేవలం అరవై గ్రాముల బరువు మాత్రమే ఉండే నానో చార్జర్ ఇది. ఎక్కడికైనా దీనిని తేలికగా తీసుకుపోవచ్చు. మామూలు ప్లగ్ సాకెట్లలో సులువుగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, ఇది చాలా వేగంగా గాడ్జెట్స్‌ను చార్జ్ చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘ఏంకర్’ ఈ నానో చార్జర్‌ను ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర 44.99 డాలర్లు (రూ.3,777) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment