nano
-
జేబులో ఇమిడిపోయే చార్జర్
ప్రపంచవ్యాప్తంగా చాలారకాల చార్జర్లు వాడుకలో ఉన్నాయి. సాదాసీదా చార్జర్ల గరిష్ఠ సామర్థ్యం 20 వాట్ల వరకు ఉంటుంది. ఈ చార్జర్ వాటన్నింటి కంటే పూర్తిగా భిన్నమైనది. చూడటానికి చాలా చిన్నగా, జేబులో ఇమిడిపోయేంత మాత్రమే ఉంటుంది. దీనికి మూడు యూఎస్బీ పోర్టులు ఉంటాయి. వీటి ద్వారా ఒకేసారి మూడు గాడ్జెట్స్‌ను ఏకకాలంలో చార్జింగ్ చేసుకోవచ్చు.ఇది 100 వాట్ల సామర్థ్యంతో పనిచేస్తుంది. కేవలం అరవై గ్రాముల బరువు మాత్రమే ఉండే నానో చార్జర్ ఇది. ఎక్కడికైనా దీనిని తేలికగా తీసుకుపోవచ్చు. మామూలు ప్లగ్ సాకెట్లలో సులువుగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, ఇది చాలా వేగంగా గాడ్జెట్స్‌ను చార్జ్ చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘ఏంకర్’ ఈ నానో చార్జర్‌ను ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 44.99 డాలర్లు (రూ.3,777) మాత్రమే! -
మందు తాగినా లివర్ సేఫ్.. సరికొత్త జెల్ కనిపెట్టిన సైంటిస్టులు
బీరు, విస్కీ, బ్రాందీ, రమ్ము ఏ రూపంలోనైనా మందు(ఆల్కహాల్) హానికరమని అందరికీ తెలుసు. ఇందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న చాలా మంది మందు మానేయాలనుకుంటుంటారు..కానీ అంత ఈజీగా మానలేరు. పార్టీలు, ఫంక్షన్లు, స్నేహితులు, బంధువులతో కలిసినపుడు తప్పక తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. దీంతో ఎక్కడో ఒక మూల భయపడుతూనే తరచూ మందు తాగేస్తుంటారు.ఇలాంటి వారి కోసమే సైంటిస్టులు ఒక సరికొత్త పరిశోధన మొదలు పెట్టారు. మందు తాగినా అది శరీరంపై పెద్దగా చెడు ప్రభావం చూపకుండా ఉండేలా ఒక జెల్‌ను కనిపెట్టారు. ఈ పరిశోధన ప్రస్తుతం ఎలుకల మీద ప్రయోగ దశలో ఉంది. అన్నీ కలిసొస్తే త్వరలో మనుషులకూ జెల్‌ను అందుబాటులోకి తెస్తారు. ఈ విషయాన్ని నేచర్ నానోటెక్నాలజీ జర్నల్ తాజాగా ప్రచురించింది. అసలు మందు(ఆల్కహాల్) బాడీలోకి వెళ్లి ఏం చేస్తుంది..మందు తాగిన వెంటనే కడుపులోని పేగుల్లోని పైపొర మ్యూకస్ మెంబ్రేన్ నుంచి రక్తంలో కలుస్తుంది. తర్వాత కాలేయంలోకి వెళుతుంది. అక్కడ హార్మోన్లు జరిపే రసాయన చర్యల వల్ల ఆల్కహాల్ తొలుత హానికరమైన ఎసిటాల్డిహైడ్గా మారుతుంది. అనంతరం కొద్ది సేపటికే ఎసిటిక్ యాసిడ్‌గా మారుతుంది. ఎసిటిక్ యాసిడ్ మాత్రం శరీరానికి పెద్దగా హానికారకం కాదు. ఈ కెమికల్ రియాక్షన్ మొత్తం వేగంగా జరుగుతుంది. ఈ రియాక్షన్లో శరీరానికి హాని చేసే ఎసిటాల్డిహైడ్ ఎక్కువసేపు ఉనికిలో ఉండకుండా హాని చేయని ఎసిటిక్ యాసిడ్‌గా మారతుంది. అయినా ఆ తక్కువ సమయంలోనే ఎసిటాల్డిహైడ్ లివర్‌కు చాలా నష్టం చేస్తుంది. ఇక తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కాలేయంలో ఈ రియాక్షన్ కాస్త నెమ్మదిగా జరుగుతుంది. దీంతో ఎసిటాల్డిహైడ్ ప్రభావంతో తాగేవారికి కిక్కెక్కుతుంది. అదే సమయంలో శరీరంలోని లివర్‌తో పాటు మిగతా ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ ప్రభావానికి గురవుతాయి. ఇప్పుడు పిక్చర్లోకి నానోజెల్..జెల్ తీసుకున్న తర్వాత పేగుల లోపల ఒకపొరలాగా ఏర్పడుతుంది. నానో ప్రోటీన్లతో తయారైన ఈ జెల్ జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. ఆల్కహాల్ పేగుల్లోకి వచ్చి రక్తంలోకి కలిసే ప్రక్రియను ఈ జెల్ ఆలస్యం చేస్తుంది. దీంతో పాటు జెల్ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఆల్కహాల్ రక్తంలోకి వెళ్లి లివర్‌కు చేరి ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ ఏర్పడకముందే పేగుల్లో ఉండగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆల్కహాల్‌ను హానికరం కాని ఎసిటిక్ ఆసిడ్‌గా మార్చేస్తుంది.దీంతో మందు రక్తంలో కలిసినా లివర్‌పై పెద్దగా ప్రభావం పడదు. ఈ రియాక్షన్లో ఎక్కడకా ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ లేకపోవడం వల్ల తాగే వారికి పెద్దగా కిక్కు కూడా తెలియదు. దీనికి తోడు లివర్‌తో పాటు శరీరంలోని ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ బారిన పడి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. జెల్ ఎలా తయారు చేశారు..స్విట్జర్లాండ్‌లోని జురిచ్ యూనివర్సిటీ సైంటిస్టులు తయారుచేసిన ఈ యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్లో గ్లూకోజ్, గోల్డ్ నానో పార్టికల్స్‌తో పాటు వే ప్రోటిన్ నుంచి ఉత్పత్తైన నానో ఫైబర్లుంటాయి. ఈ నానో ఫైబర్లు ఐరన్ అణువులతో కప్పి ఉంటాయి. గ్లూకోజ్, గోల్డ్ కణాలతో జరిగే రియాక్షన్‌కు ఐరన్ అణువులు ఉత్ప్రేరకంగా పనిచేసి హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఎలుకలపై ప్రయోగం సక్సెస్..ప్రస్తుతానికి యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్‌ను ఎలుకల మీద ప్రయోగించి చూశారు. ఎలుకలకు ఒక డోస్ ముందు పోశారు. కొన్నింటికి నానో జెల్ ఇచ్చారు. మరికొన్నింటికి ఇవ్వలేదు. జెల్ తీసుకున్న ఎలుకల రక్తంలో జెల్ తీసుకోని ఎలుకల రక్తంతో పోలిస్తే 16 శాతం తక్కువ ఆల్కహాల్ ఉండటాన్ని సైంటిస్టులు గుర్తించారు. జెల్ తీసుకున్న ఎలుకల శరీరంలో ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ కూడా కనిపించలేదు. ఆల్కహాల్ కారణంగా ఈ ఎలుకల లివర్ మీద కూడా పెద్దగా ప్రభావం పడకపోవడాన్ని గమనించారు. త్వరలో జెల్‌ను మనుషుల మీద ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు మందు తాగకపోవడమే మేలు‘అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడమే శరీరానికి మంచిది. కానీ తీసుకోకుండా ఉండటం కుదరదనే వారి శరీరాలపై ఆల్కహాల్ పెద్దగా ప్రభావం చూపకుండా యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్ ఉపయోగపడుతుంది’అని జెల్ కనుగొన్న సైంటిస్టుల బృందం హెడ్ రఫ్ఫేల్ మెజ్జెంగా చెప్పారు. -
కిచెన్‌లో ఉండే ఆ రెండిటితోటే మైక్రోప్లాస్టిక్‌కి చెక్!
మైక్రోప్లాస్టిక్‌లు ప్రస్తుతం ఆహారం, నీరు, గాలిలో ఇలా ప్రతి చోట ఉంటున్నాయి. ప్రస్తుతం ఇదొక పెద్ద సమస్యలా మారింది. వీటిని ఫిల్టర్ చేయడానికి శాస్త్రవేత్తలు పలు విధాల ప్రయత్నిస్తున్నారు. అందుకు సంబంధించి పలు టెక్నిక్లను అభివృద్ధి చేశారు. అయితే తాజగా శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేసిన ఈ ప్రయోగం సమర్థవంతంగా మైక్రో ప్లాస్టిక్‌కు చెక్‌పెట్టింది. ఇక్కడ మైక్రోప్లాస్టిక్‌లు అంటే 5 మిల్లీమీటర్లు(0.2 అంగుళాలు) కంటే చిన్నగా ఉండే ప్లాస్టిక్‌లని అర్థం. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలే సౌందర్య ఉత్పత్తుల్లో కూడా కనిపిస్తాయి. ఇవి పెద్దగా ఉండే ప్లాస్టిక్ వస్తువుల కీణత కారణంగా వచ్చేవే ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు. ఇక యునెస్కో ఓషన్ లిటరసీ పోర్టల్ ప్రకారం ఈ మైక్రో ప్లాస్టిక్ ముక్కలు చాలా వరకు మహాసముద్రాల్లోనే కలిసిపోతాయని పేర్కొంది. వాటిలో సుమారు 50 నుంచి 70 మిలియన్ల వరకు పెద్ద, చిన్న సైజులో ప్లాస్టిక్ కణాలు ఉండొచ్చనేది అంచనా. ఈ ప్లాస్టిక్ రేణువుల్లో చాలా విషపూరిత రసాయనాలు ఉంటాయి. ఆ తర్వాత ఇవే కాలక్రమేణ ఈ నానో ప్లాస్టిక్లుగా విచ్ఛిన్నమవుతాయి. ఇవి చాల చిన్నవి కాబట్టి ప్రేగులు, ఊపిరితిత్తులు గుండా నేరుగా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి మన హృదయం, మెదుడు వంటి అవయవాల్లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ సముద్రంలో ఉండే ఈ చిన్న కణాలు తాగు నీటిలో కూడా చేరడం వల్లే ఇదంతా జరుగుతుంది. ఇవి శరీరంలోని సహజ హార్మోన్ల విడుదలకు అంతరాయం కలిగించడమే కాకుండా పునరుత్పత్తి లోపాలు, కేన్సర్ ప్రమాదాలను పెంచుతాయి. దీన్ని చెక్ పెట్టేందుకు చైనాలోని గ్వాంగ్జౌ మెడికల్ యూనివర్సిటీ, జినాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వంటగది సామాన్లనే ఉపయోగించింది. వీటితోనే మైక్రో ప్లాస్టిక్‌లకు సంబంధించి దాదాపు 80%పైగా తొలగించింది. కేవలం ఒక కేటిల్ సాధారణ వాటర్ ఫిల్టర్‌ని ఉపయోగించి మైక్రోప్లాస్టిక్‌లను ఈజీగా తొలగించింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్ జర్నల్‌లో వెల్లడించారు. ఆ పరికరాలతో ఝాన్జున్ లీ, ఎడ్డీ జెంగ్ అనే శాస్త్రవేత్తల బృందం ఖనిజాలతో కూడిని నీటి నమునాలను సేకరించారు. వాటిలో నానో, మైక్రో ప్లాస్టిక్‌ల కణాల డోస్‌ని పెంచింది. వాటిని ఐదు నిమిషాల మరిగించింది. ఐతే ప్రతిసారి ఆ నీరు మరుగుతున్నప్పుడూ పైకిలేచే ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాస్టిక్ మొత్తాన్ని బృందం తొలగించే ముందు చల్లబరిచి వేరు చేసేది. ఖనిజాలతో కూడిని ఈ నీటిలో లైమ్‌స్కేల్, కాల్షియం కార్బోనేట్ వంటి పదార్థాలు ఉంటాయి. ఎప్పుడైతే మరిగిస్తామో అప్పుడు టీ, కాఫీ వంటివి కాచినప్పుడూ ఎలా పైకి నల్లటి తెట్టు వస్తుందో అలా తెట్టులాగా తెల్లటి ఒట్టు ఈ మైక్రో ప్లాస్టిక్ కణాలను నీటి నుంచి వేరు చేస్తుంది. తద్వారా ఈజీగా తాగే నీటి నుంచి ప్లాస్టిక్ కణాలను వేరవ్వుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: భారతీయ సంగీతంతో అలరిస్తున్న జర్మన్ సింగర్!) -
కేన్సర్‌కు నానో వైద్యం...
కీమోథెరపీ వంటి సంప్రదాయ చికిత్సలకూ లొంగని కేన్సర్లను నానోవైద్యంతో అదుపులోకి తేవచ్చునని అంటున్నారు వేన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఆక్సిజన్ సరఫరా తగ్గినా, పెరుగుదలను ప్రోత్సహించే కణాలు చేరినా కేన్సర్ కణితులు కీమోథెరపీకి ప్రతిస్పందించవని ఇప్పటికే గుర్తించారు. ఈ అంశాలను ఆధారంగా చేసుకుని నానోకణాలను ప్రయోగిస్తే మాత్రం భిన్నమైన ఫలితాలు వస్తాయని అరుణ్ అయ్యర్, సమరేశ్ సాహులతో కూడిన శాస్త్రవేత్తల బృందం నిరూపించింది. నానోకణాలు నేరుగా ఆక్సిజన్ తక్కువగా ఉన్న కణాలను, కణితి పెరుగుదలకు కారణమవుతున్న రోగ నిరోధక వ్యవస్థ కణాలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయని, అంతేకాకుండా సాధారణ పరిస్థితుల్లో కేన్సర్ కణితులను నాశనం చేసే రోగ నిరోధక వ్యవస్థ కణాలను ప్రోత్సహిస్తాయని అరుణ్ వివరించారు. అంతేకాకుండా నానో కణాలు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కణితిని గుర్తిస్తాయని, కణితి గుర్తింపు, దశ నిర్ధారణ, శస్త్రచికిత్స ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం వంటి అంశాలన్నింటికీ ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. పైగా నానో కణాలను జోడించడం వల్ల కీమోథెరపి మరింత సమర్థంగా, తక్కువ దుష్ఫలితాలతో పనిచేస్తుందని చెప్పారు. ప్రస్తుతం తాము రీనల్ సెల్ కార్సినోమాకు సంబంధించి కొన్ని ప్రయోగాలు చేసినప్పటికీ ఇతర కేన్సర్ల విషయంలోనూ ఈ పద్ధతి సమర్థంగా పనిచేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. -
నానో కథ కంచికి!?
న్యూఢిల్లీ: లక్ష రూపాయల కారు అంటే చాలు నానో గర్తుకొస్తుంది. దీన్ని రతన్ టాటా మానసపుత్రికగా అభివర్ణిస్తారు. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా నానో కారును ఆవిష్కరించారు. టూవీలర్ జర్నీకి ప్రత్యామ్నాయంగా ప్రజలకు అందుబాటు ధరలో, సురక్షితమైన ప్రయాణానికి ఒక వెసులుబాటు అందించాలని భావించారు. అయితే ఏం లాభం. అంచనాలన్నీ తప్పాయి. టాటా మోటార్స్ కి ఇదో ఫెయిల్యూర్ వెంచర్‌గా మిగిలింది. ఒకే కారు తయారీ... ఇప్పుడు నానో కారు తన ప్రస్థానానికి ముగింపు పలకడానికి కుసుమంత దూరంలో ఉంది. జూన్ నెలలో కేవలం ఒకే ఒక నానో కారు తయారైంది. కంపెనీ గతేడాది ఇదే నెలలో 275 యూనిట్లను తయారు చేసింది. దేశీ మార్కెట్లో మూడు కార్లు మాత్రమే విక్రయమయ్యాయి. గతేడాది ఇదే నెలలో నానో విక్రయాలు 167 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక ఎగుమతుల ఊసే లేదు. కానీ గతేడాది ఇదే నెలలో కంపెనీ 25 యూనిట్లను ఎగుమతి చేసింది. పరిస్థితులు ఆశాజనకంగా లేకపోయినప్పటికీ నానో కార్ల తయారీ నిలిపివేతపై కంపెనీ ఏ నిర్ణయం తీసుకోలేదు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నానోను 2019 తర్వాత కొనసాగించడం కష్టమే. దీని మనుగడకు కొత్త పెట్టుబడులు అవసరం. అయితే దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కీలకమైన మార్కెట్లలో కస్టమర్ డిమాండ్‌ను అందుకోవడానికి నానో తయారీని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆది నుంచీ అడ్డంకులే.. నానో కారును తొలిగా 2008 జనవరిలో జరిగిన ఆటోఎక్స్‌పో కార్యక్రమంలో ప్రదర్శించారు. 2009 మార్చిలో రూ.లక్ష ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. నానోకు ఆది నుంచీ అడ్డంకులే. దీన్ని మొదట పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో ప్లాంట్ ఏర్పాటు చేసి తీసుకురావాలని భావించారు. అయితే ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించడం, ప్రతికూల రాజకీయ పరిస్థితుల వల్ల నానో తయారీ ప్రాజెక్టు గుజరాత్‌లోని సనంద్ ప్లాంటుకు మారింది. నానోను చౌక కారుగా ప్రమోట్ చేయడం తప్పైందని రతన్ టాటా ఒక సందర్భంలో అంగీకరించారు. -
నానోకణాలతో కేన్సర్‌కు కొత్త చికిత్స..
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని నానుడి. ఇది కేన్సర్ విషయంలోనూ వర్తిస్తుందని అంటున్నారు పెన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కేన్సర్ కణాలు రోగనిరోధక వ్యవస్థ కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతుందని.. తద్వారా వ్యాధి ముదిరిపోయేందుకు అవకాశముంటుందన్నది తెలిసిన విషయమే. కేన్సర్ కణితి చుట్టూ ఏర్పడే రక్తనాళాలు రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాలను, మందులను కూడా అడ్డుకోవడం దీనికి కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు పెన్ స్టేట్ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిపై ప్రయోగాలు చేశారు. కేన్సర్ కణితిలోని కణాలను తీసుకుని వాటిల్లోకి కేన్సర్ చికిత్సకు వాడే మందులను జొప్పించారు. ఈ కణాలను మళ్లీ శరీరంలోకి జొప్పించినప్పుడు అవి కేన్సర్ కణాల రక్షణ వ్యవస్థలను తప్పించుకుని నేరుగా కణితిపై దాడి చేయగలిగింది. సాలెగూడు పోగులు, బంగారు నానో కణాలు, తెల్ల రక్తకణాలతో గతంలో ఇలాటి ప్రయత్నం జరిగినప్పటికీ అంతగా ప్రభావం లేకపోయింది. తాజాగా మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్’తో తయారైన నానో కణాల్లోకి గెలోనిన్ అనే మందును జొప్పించి తాము ప్రయోగాలు చేశామని కణితినుంచి సేకరించిన గొట్టంలాంటి నిర్మాణాల్లోకి వీటిని చేర్చి ప్రయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు కనిపించాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సియాంగ్ ఝెంగ్ తెలిపారు. -
గుండెజబ్బులకు నానో మందు!
గుండెజబ్బులతో బాధపడేవారికి నానో స్థాయి కణాలతో సరికొత్త మందును అభివృద్ధి చేశారు ఇటలీ, జర్మనీ శాస్త్రవేత్తలు. సైన్స్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం ఈ మందును ట్యాబ్లెట్ల రూపంలో కాకుండా ఉబ్బస వ్యాధి మందుల్లా పీల్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మందు చాలా వేగంగా గుండెను చేరుకుని కార్డియోమయసైట్ కణాల ద్వారా గుండె పనితీరును మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎముకలు, పళ్లలో ఉండే కాల్షియం ఫాస్పేట్ నానో కణాలను ఉపయోగించుకుని మందును గుండెకు చేర్చడం ఇందులో కీలకమని వివరించారు. ఎలుకలపై ఈ మందును ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని, గుండె నుంచి రక్తం బయటకు పంప్ అయ్యే మోతాదు 17 శాతం వరకూ పెరిగిందని వివరించారు. మనుషుల మాదిరి ఊపిరితిత్తుల వ్యవస్థ ఉన్న పందులపై కొన్ని ప్రయోగాలు చేశామని, సంప్రదాయ పద్ధతుల కంటే చాలా వేగంగా మందు గుండెకు చేరడాన్ని గుర్తించామని చెప్పారు. నానో స్థాయి కణాలను పీల్చుకున్నప్పటికీ ఎలుకలు, పందుల గుండె కణజాలాల్లో ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించలేదు. మరిన్ని పరిశోధనలు చేసిన తరువాత ఈ మందును మానవుల్లోనూ పరీక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. -
మెరుగైన క్యాన్సర్ చికిత్సకు నానో ప్లాట్ఫార్మ్
క్యాన్సర్‌కు ప్రస్తుతం విస్తృతంగా అందుబాటులో ఉన్న చికిత్సలు మూడే. శస్త్రచికిత్స ద్వారా కణుతులను తీసేయడం, కీమో, రేడియో థెరపీలను వాడటం. అయితే ఈ మూడింటితోనూ క్యాన్సర్ కణాలు పూర్తిగా నశిస్తాయన్న గ్యారెంటీ లేదు. ఈ నేపథ్యంలో ఒరెనాగ్ స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నానోస్థాయి మందులతో క్యాన్సర్ కణాలన్నింటినీ నాశనం చేసే వీలు కల్పించే వ్యవస్థను అభివృద్ధి చేశారు. శస్త్రచికిత్స ద్వారా కణితిని ఎంతమేరకు కత్తిరించాలో సూచించడంతోపాటు మిగిలిన క్యాన్సర్ కణాలన్నింటినీ గమనించేలా చేయగలగడం ఈ ప్లాట్ఫార్మ్ ప్రత్యేకత. నానోస్థాయి కణాలకు ప్రత్యేకమైన రంగులాంటిదాన్ని జోడించి శరీరంలోకి పంపడంతో ఈ ప్లాట్ఫార్మ్ పని మొదలవుతుంది. నానో కణాలు వేడెక్కి నాశనం చేసేస్తాయి. సిలికాన్ నాఫ్తాలోసైమీన్ అనే పదార్థం ద్వారా తయారుచేసే నానో కణాలకు సహజసిద్ధంగా నశించిపోయే పదార్థ కణాలను కలుపుతారు. ఈ కణాలు ఒక్కసారి కణితిని చేరగానే నానోస్థాయి కణాలు వెలుతురును ప్రసారం చేయడం మొదలవుతుంది. అతినీల లోహిత కణాల సాయంతో ఈ వెలుతురును చూడటం ద్వారా కణితి ఉన్న ప్రాంతం ఎంతన్నది శాస్త్రవేత్తలకు స్పష్టంగా తెలుస్తుంది. ఫొటో థెరపీ ద్వారా మిగిలిన కణాలపైకి లేజర్ కాంతిని ప్రసరింపచేస్తే.. అవికాస్తా వేడెక్కి, నశించిపోతాయి. సాధారణ కణాలకు ఏమాత్రం హాని జరక్కుండా ఉండటం ఈ ప్లాట్ఫార్మ్కు ఉన్న మరో ప్రత్యేకత. ఎలుకలపై జరిగిన పరిశోధనల్లో ఈ కొత్త ప్లాట్ఫార్మ్ మెరుగైన ఫలితాలు ఇచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
నానో.. కథ ముగిసినట్టేనా!?
సాక్షి, న్యూఢిల్లీ : రతన్ టాటా డ్రీమ్ కార్గా గుర్తింపు తెచ్చుకున్న నానో మార్కెట్‌నుంచి తెరమరుగు కానుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లలో మెజారిటీదారులు.. నానో బుకింగ్స్ నిలిపేసినట్లు తెలుస్తోంది. ఆరంభంలోనే అంతంతమాత్రంగా ఉన్న బుకింగ్స్.. గత నాలుగు నెలలుగా మరింత తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని డీలర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లోనూ నానో కార్ల ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో నానో కార్ల ఉత్పత్తి 180 ఉండగా.. అక్టోబర్ నాటికి దీనిని 5కు తగ్గించారు. టాటా నానో కార్‌ను ప్రకటించిన సమయంలో కేవలం లక్ష రూపాయలకే సామాన్యుడికి కారు అందిస్తున్నట్లు రతన్ టాటా 2008లో ప్రకటించారు. తరువాత అనేక వివాదాలు, సమస్యలు, ప్లాంట్ తరలింపు, ఇతర కారణాల వల్ల దీని ధర మారుతూ వచ్చింది. ప్రస్తుతం నానో ధర.. రూ.2.69 లక్షలుగా ఉంది. ప్రస్తుతం టాటా మోటార్స్‌కు నానో మోడల్ ఒక వైట్ ఎలిఫెంట్‌లా మారింది. -
కేన్సర్ కణాల కాళ్లు విరగొట్టారు!
కేన్సర్ ప్రాణాంతకమే అయినప్పటికీ అది ఏ ఒక్క అవయవానికో పరిమితమైతే ప్రాణాపాయం తక్కువ. ఎప్పుడైతే అది ఒకచోటి నుంచి ఇతర అవయవాలకు విస్తరించడం మొదలవుతుందో అప్పుడే సమస్య. మెటాస్టాసిస్ అని పిలిచే ఈ దశను అడ్డుకునేందుకు జార్జియా టెక్ శాస్త్రవేత్తలు బంగారు నానో కడ్డీలతో ఓ ప్రయోగం చేశారు. మానవ కేన్సర్ కణాలపైకి ఈ నానో బంగారు కడ్డీలను ప్రయోగించి, వాటిని లేజర్ కిరణాల సాయంతో వేడిచేశారు. ఈ వేడికి కేన్సర్ కణాలకు ఉండే కాళ్లలాంటి నిర్మాణాలు ధ్వంసమై పోయాయి. దీనివల్ల ఈ కణాలు ఇతర ప్రాం తాలకు విస్తరించే సామర్థ్యాన్ని కోల్పోతాయి. తాము అభివృద్ధి చేసిన ఈ పద్ధతి భవిష్యత్తులో కేన్సర్ మెటాస్టాసిస్ దశను అడ్డుకునేందుకు.. తద్వారా కేన్సర్ కణితులే లక్ష్యంగా మరింత మెరుగైన చికిత్స పద్ధతులను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడతాయని ఈ ప్రయోగాలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ముస్తఫా ఎల్.సయీద్ అంటున్నారు. -
ఇంటి అందం రెట్టింపు!
♦ విపణిలోకి ఐ మార్బుల్ టైల్స్ ♦ మార్బుల్స్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగం ♦ నాణ్యత ఎక్కువ.. నిర్వహణ తక్కువ ఐ మార్బుల్స్, నానో, స్టోన్ ఆర్ట్, డీ క్రిస్టల్, ఎలిగెంటా.. అరే ఏంటివి అనుకుంటున్నారా? అదేనండి మార్కెట్లో హల్చల్ చేస్తున్న లేటెస్ట్ టైల్స్! కలల గృహాన్ని మరింత అందంగా.. ఆనందంగా తీర్చిదిద్దేవి కూడా టైల్సే. దాదాపు 20 దేశాలకు చెందిన టైల్స్.. 700లకు పైగా రకాలతో టైల్స్ హబ్‌గా మారింది హోమ్ 360 డిగ్రీ.. ఇటీవలే దశాబ్దం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సంస్థ సీఎండీ శ్రీనాథ్ రాఠి, జీఎం కె. శారదలు‘సాక్షి రియల్టీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి, హైదరాబాద్ : ఎవరికి వారు తమ ఇళ్లు అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుం టారు. వారి వారి అభిరుచులకు తగ్గట్టుగా ట్రెండ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉత్పత్తులను పరిచయం చేయాల్సి ఉంటుంది. అలాగనీ కేవలం ఎగువ మధ్యతరగతి ప్రజలకే సేవలు పరిమితం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మా దగ్గర సామాన్య తరగతులకు తగ్గట్టూ టైల్స్ ఉన్నాయి. రూ.25 నుంచి ధర ప్రారంభమం టే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగత గృహాలకే కాకుండా ఎన్సీసీ అర్బన్, వర్టెక్స్, వంశీరాం, వైష్ణవి, ఇన్కార్ వంటి వందలాది నిర్మాణ సంస్థలకు టైల్స్‌ను సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం నెలకు 8-10 లక్షల చ.అ. టైల్స్‌ను విక్రయిస్తున్నాం. ⇔ నిట్కో, సొమానీ, సింపోలో, హెచ్అండ్ఆర్ జాన్సన్ వంటి దేశీయ బ్రాండ్లతో పాటూ జొంగ్యాన్ సెరామిక్స్, న్యూపెర్ల్, యెకాలొన్, సాలొనీ, గ్రుప్పో వంటి స్పానిష్, ఇటలీ, చైనా వంటి విదేశీ బ్రాండ్లు కూడా ఉన్నాయి. సుమారు 700 రకాల టైల్స్ అందుబాటులో ఉన్నాయి. టైల్స్‌తో పాటూ శానిటరీ వేర్, యూపీవీసీ తలుపులు, కిటికీలు కూడా ఉంటాయి. విపణిలోకి ఐ మార్బుల్స్ టైల్స్: రోజురోజుకూ దేశంలో మార్బుల్స్ మైన్స్ తగ్గుతుండటంతో మార్కెట్లోకి ఐ మార్బుల్స్ టైల్స్ వచ్చేశాయి. ఇటాలియన్ మార్బుల్స్‌కు ప్రత్యామ్నాయంగా వీటిని వినియోగిస్తున్నారు. నాణ్యత ఎక్కువ.. నిర్వహణ తక్కువగా ఉండటమే వీటి ప్రత్యేకత. ⇔ ఇటాలియన్ మార్బుల్స్ మూడేళ్లకు మించి నాణ్యత ఉండవు. పగుళ్లు వచ్చేస్తాయి. తరచూ నిర్వహణ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఐ మార్బుల్స్ నిర్వహణ అవసరం లేదు. నీటిని పీల్చుకునే గుణం వీటి సొంతం. పైగా ఇవి పూర్తిగా పర్యావరణహితమైనవి కూడా. ⇔ 9 ఎంఎం మందంతో ఉండే ఈ టైల్స్ 8/4, 4/4, 2.5/4 సైజులున్నాయి. 25 రకాల రంగుల్లో లభిస్తాయి. ధర చ.అ.కు రూ.250 నుంచి 600 వరకుంది. ఇవి అహ్మదాబాద్‌లో తయారవుతున్నాయి. ప్రపంచంలోనే మూడో ప్లాంట్, ఆసియాలోనే ఏకైక ప్లాంట్ ఇదే కావటం గమనార్హం. నానో, స్టోన్ ఆర్ట్: ఇటీవల మార్కెట్‌కు పరిచయమైన మరోరకం టైల్స్ నానో శ్లాబ్స్. 18 ఎంఎం మందంతో 9/5, 8/5 శ్లాబ్స్ ఉన్నాయి. ఇందులో కేవలం తెలుపు రంగు మాత్రమే ఉంది. ఇవి చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. వాణిజ్య, నివాస సముదాయాల్లో రెండింట్లోనూ వినియోగించుకోవచ్చు. ధర చ.అ.కు రూ.350. ⇔ వివిధ దేశాల్లోని స్టోన్స్‌ను వినియోగించడం కూడా ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ప్రకృతి సిద్ధమైన రాళ్లు (స్టోన్ ఆర్ట్) కావటంతో ఇంటి అందం రెట్టింపు అవుతుంది. నార్వే, ఇస్తాంబుల్, కెనడా, అమెరికా, ఆఫ్రికా, టర్కీ వంటి సుమారు 20 దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నాం. ధర చ.అ.కు రూ.600-1,100 వరకుంది. వీటిని ఎక్కువగా ఇండిపెండెంట్ హౌస్, విల్లాల్లో వాడుతుంటారు. ⇔ ఎలిగెంటా, డీ క్రిస్టల్: ఒకవైపు గోడకు వేసుకునే ఎలిగెంటా సిరీస్ టైల్స్ కూడా ఉన్నాయి. లివింగ్ రూమ్‌లో ఒక గోడకు వేసుకుంటే గది అందమే మారిపోతుంది మరి. వీటిని ఎక్కువ స్టార్ హోటళ్లలో వినియోగిస్తారు. ధర చ.అ.కు రూ.600-1,100. ⇔ పూర్తిగా గ్లాస్‌తో తయారు కావటం డీ క్రిస్టల్ టైల్స్ ప్రత్యేకత. ఈ టైల్స్‌పై మనకు నచ్చిన ఫొటోలను ప్రింట్ చేసుకునే వీలుండటంతో అందరినీ ఆకర్షిస్తుంది. 6 ఎంఎం, 8 ఎంఎం మందంతో 300/600 ఎంఎం నుంచి 600/1,800 ఎంఎం వరకు రకరకాల సైజుల్లో, అన్ని రకాల రంగుల్లో ఉన్నాయి. ధర చ.అ. కు రూ.750-900 వరకుంది. ⇔ వీటిని ఎక్కువగా పబ్బులు, రెస్టారెంట్లు, కార్పొరేట్ ఆఫీసుల్లో డెకొరేటివ్ కోసం వాడుతుంటారు. ఇంట్లో అయితే చిన్నపిల్లల గ ది, వంట గది, లివింగ్ రూముల్లో ఉపయోగించొచ్చు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులు, వేడిని కూడా తట్టుకునే గుణం వీటి సొంతం. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com జీఎం శారద ,సీఎండీ శ్రీనాథ్ రాఠి -
అతిపొట్టి కారు
తిక్క లెక్క రోడ్ల మీద తిరిగే కార్లలో ఎంత ‘నానో’లాంటి బుల్లి కారు అయినా కనీసం నాలుగైదు అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న కారు ఎత్తు మాత్రం అడుగున్నర కంటే కాస్తంత తక్కువే. కచ్చితంగా చెప్పాలంటే, దీని ఎత్తు 17.79 అంగుళాలు. జపాన్‌లోని అసాకుచికి చెందిన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విద్యార్థులు, అధ్యాపకులు దీనిని రూపొందించారు. దీనికి ‘మిరాయి’ అని నామకరణం చేశారు. ‘మిరాయి’ అంటే జపానీస్ భాషలో ‘భవిష్యత్తు’ అని అర్థం. రోడ్ల మీద సంచరించడానికి కావలసిన అన్ని హంగులూ ఉన్న ఈ కారు అతి పొట్టి కారుగా గిన్నెస్ బుక్‌లోకి ఎక్కింది. -
మ్యూజియంలో మైక్రోస్కోపిక్ మోనాలీసా
లండన్: ప్రపంచంలో అత్యంత ఖరీదైన... అందమైన పెయింటింగుల్లో మోనాలీసా ఒకటి. ఆమె.. ఇప్పుడు సాంకేతిక నిపుణుల చేతిలో కొత్త రూపం దాల్చింది. పారిస్ లౌన్రే మ్యూజియంలో అతి సూక్ష్మ రూపంలో దర్శనమిస్తోంది. నానో టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన ఆ వర్ణ చిత్రం ఓ పిక్సల్ కంటే తక్కువగా ఉండి, ఐఫోన్ రెటీనా డిస్ ప్లే లా నిజమైన మోనాలీసా కంటే సుమారు పదివేల రెట్లు తక్కువగా కనిపిస్తోంది. లేజర్ ప్రింటింగ్ టెక్నాలజీలో ఇప్పుడు అద్భుతాలను సృష్టించగల్గుతున్నారు. ఏ చిత్రాన్నైనా భిన్నంగా చూపించగల్గుతున్నారు. సుమారు 127.000 (డాట్స్ పర్ ఇంచ్) డిపిఐ రిజల్యూషన్ తో చిత్రాలు రూపొందే అవకాశం ఉండటంతో పాటు...అధిక నాణ్యత ఉండే ఈ కొత్త టెక్నాలజీపైనే అంతా ఆధారపడుతున్నారు. ముఖ్యంగా వార పత్రికలు వంటివి ప్రింట్ చేసేందుకు సుమారు మూడు వందల డిపిఐతో ఇది మంచి ఫలితాలనిస్తోంది. ఈ లేజర్ టెక్నాలజీతో ఓ కొత్త అప్లికేషన్ ను కూడా రూపొందించే అవకాశం ఉన్నట్లుగా డెబ్ మార్క్ టెక్నికల్ యూనివర్శిటీ పరిశోధక బృందం చెప్తోంది. దీంట్లో డేటాను కనిపించకుండా ఉండేంత సూక్ష్మ రూపంలో దాచుకునేందుకు వీలౌతుంది. సీరియల్ నెంబర్లు, బార్ కోడ్ లు వంటి వాటితో పాటు... ఇతర డేటానూ భద్రపరచుకోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో మోసాలకు పాల్పడేవారికి ముకుతాడు వేయొచ్చంటున్నారు అధ్యయనకారులు. ఇప్పుడు ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా మోనాలీసా చిత్రానికి వినియోగించి అతి సూక్ష్మరూపంలో రూపొందించి ప్రత్యేకతను చాటారు. కుడ్య రూపాలు, చిత్రాలకే కాక... అలంకరణలు, మొబైల్ ఫోన్లు వంటి ఉత్పత్తుల కోసం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కార్ల భాగాలు, వాయిద్య పరికరాల ప్యానెల్స్, బటన్స్ వంటి వస్తువుల తయారీ సులభతరం అవుతుండటంతో ఈ కొత్త విధానంపై విదేశీ కంపెనీలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. -
త్వరలో మార్కెట్లోకి జెనెక్స్నానో
-
శిల్పం.. సూక్ష్మం
లండన్ : ఈ బుల్లి శిల్పాన్ని చిన్న చీమ తల మీద నిల్చోబెట్టవచ్చు. వెంట్రుక మీద బ్యాలెన్సింగ్ చేయించవచ్చు. ఫొటో చూడండి. సూది బెజ్జంతో దీన్ని పోల్చినా.. ఎంత చిన్నదిగా ఉందో చూశారుగా.. వీటి సృష్టికర్త లండన్‌కు చెందిన నానో శిల్పకారుడు జాంటీ హర్విట్జ్. ఇలాంటివి మొత్తం ఏడింటిని రూపొందించారు. వీటిలో అతి పెద్దది మన వెంట్రుక మందముంటే.. మిగతావి అందులో సగం కన్నా చిన్నవేనట! 10 నెలల కృషి అనంతరం జాంటీ వీటిని తయారుచేశారు. వీటిని చూడటానికి కేన్సర్ కణాలను పరిశీలించడానికి వాడే అత్యాధునిక మైక్రోస్కోప్‌ను ఉపయోగించారు. తయారీ ఇలా..: ముందుగా ఓ మోడల్‌ను ఫొటోలు తీశారు. ఆమెకు అన్ని వైపులా మొత్తం 250 కెమెరాలు పెట్టి.. అణువణువు క్లిక్‌మనిపించారు. తర్వాత వాటిని అత్యధిక సామర్థ్యమున్న కంప్యూటర్లో ఫీడ్ చేసి.. డిజిటల్ బొమ్మను రూపొందించారు. అనంతరం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి.. ఈ అద్భుత నానో శిల్పాలను రూపొందించారు. ఇంతకీ వెంట్రుక ఎంత మందముంటుందో తెలుసా? 40 నుంచి 50 మైక్రాన్లు. మైక్రాన్ అంటే మిల్లీ మీటర్లో వెయ్యో వంతు. దాని లెక్కన అంచనా వేసుకోండి. ఇవి ఎంత చిన్నగా ఉన్నాయో.. యాంటీ క్లైమాక్స్.. జాంటీ గొప్పతనమంతా విన్నాం. అయితే.. ఆ శిల్పాలను మనం చూడాలంటే.. ప్రస్తుతం ఇలాంటి ఫొటోలే గతి. ఎందుకంటే.. వీటిని తయారుచేసిన కొన్ని గంటలకు జాంటీ సహచరుడొకడు.. వీటిని వేరే యాంగిల్లో చూడాలనే ఉత్సాహంతో మైక్రోస్కోప్ కింద ఉన్న అద్దాన్ని కదిలించాడు. అవి కింద పడ్డాయి. ఏంటీ.. మైక్రోస్కోప్‌లో కనిపించడం లేదంటూ ఆందోళన చెందాడు. ఈ తడబాటులో అతడి చిటికెన వేలు అద్దం పక్కన యథాలాపంగా ల్యాండ్ అయింది. అంతే.. సర్వనాశనం.. 7 నానో శిల్పాలు చరిత్రలో కలిసిపోయాయి. -
చౌక ఇళ్లకు సిడ్కో సై
సాక్షి, ముంబై: నవీముంబైలో పేదలకు గిట్టుబాటయ్యే ధరకే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) నిర్ణయం తీసుకుంది. దీంతో నవీముంబై ప్రాంత ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు ఇప్పటినుంచే ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం ముంబైకర్ల కోసం మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) అక్కడక్కడా చౌక ధరలకు ఇళ్లు నిర్మించి అర్హులైన వారికి అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో సిడ్కో కూడా అర్హులకు లాటరీ ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం సుమారు రూ.16 లక్షలకు వన్ రూం కిచెన్, రూ. 24 లక్షలకు వన్ బెడ్రూం, హాలు, కిచెన్ (1-బీహెచ్‌కే) ఫ్లాట్లు అందజేయనున్నట్లు సిడ్కో అధ్యక్షుడు ప్రమోద్ హిందూరావ్ చెప్పారు. సిడ్కో నిర్మించనున్న మొత్తం 3,292 ఇళ్లకు లాటరీ వేయనున్నట్లు ఆయన వివరించారు. దరఖాస్తులు ఈ నెల 22 నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు విక్రయిస్తారు. ప్రారంభంలో కేవలం 10 వేల దరఖాస్తులు మాత్రమే విక్రయించనున్నారు. ఖార్ ఘర్, సెక్టార్-36లో ఈ ఇళ్లను నిర్మించనుంది. ఈ ప్రాజెక్టులో 7, 11 అంతస్తుల భవనాలుంటాయి. 2016 మార్చి వరకు ఈ ఇళ్లను యజమానులకు అందజేయాలని సంకల్పించినట్లు ఇందురావ్ చెప్పారు. ఈ ప్రాజెక్టు వివరాలు.. జూలై 22 నుంచి దరఖాస్తుల విక్రయం. 3,292 ఇళ్లకు లాటరీ. వన్ రూం కిచెన్ (307 చ.అ.) రూ.16 లక్షలు. బెడ్రూం, హాలు, కిచెన్ (370 చ.అ.) రూ.24 లక్షలు. డిపాజిట్ డబ్బులు వర్గాన్ని బట్టి రూ.25 వేలు, రూ.50 వేలు. అత్యల్ప ఆదాయ వర్గాల వారికి నెలకు రూ.16 వేల వరకు ఆదాయం ఉండాలి. అల్ప ఆదాయ వర్గాల వారికి నెలకు రూ.16-40 వేల వరకు ఆదాయం ఉండాలి. దరఖాస్తు ధర రూ.50. -
ఓటు వేసి నానో కారు గెల్చుకున్న లచ్చవ్వ
-
భవిష్యత్ నానో టెక్నాలజీదే
పెనుగొండ, న్యూస్‌లైన్ : నానో టెక్నాలజీకి మంచి భవిష్యత్ ఉందని, ఒక నానోమీటర్ను ఉపయోగించి అణువు, అంతకంటే తక్కువ పరిమాణం గల పదార్థాల కొలమానంపై అంచనాకు రావచ్చని హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆనంద్పాఠక్ అన్నారు. స్థానిక ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్‌రాజు ఆర్ట్స్ అండ్ సైన్స కళాశాల సెమినార్ హాల్లో కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ అండ్ టెక్నాలజీ రెండో రోజు వర్కుషాప్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. నానో టెక్నాలజీతో కంప్యూటర్ మెమొరీ సామర్థ్యం పెంచవచ్చని, వైద్యరంగంలో క్యాన్సర్ కణాలను నియంత్రించడానికి నానో ట్యూబ్‌లు ఉపయోగపడతాయని చెప్పారు. వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ లిమిటెడ్ హైదరాబాద్‌కు చెందిన మన్నం కృష్ణమూర్తి విజ్ఞానశాస్త్రం నిర్వచనం, రసాయన శాస్త్ర ప్రాధాన్యతలను, హైడ్రోకార్బన్ వర్గానికి చెందిన నూనెలు, కొవ్వు పదార్థాల సంక్లిష్ట నిర్మాణాల గురించి వివరించారు. హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వి.కన్నన్ మాట్లాడుతూ సంఖ్యాశాస్త్రంలో రెండో ఘాతం గురించి వివరించారు. అనంతరం భౌతికశాస్త్రం, కంప్యూటర్, రసాయన శాస్త్రం, బాటనీ, జువాలజీలో విద్యార్థులు ప్రాక్టికల్స్ చేశారు. ప్రిన్సిపాల్ జె.రాజేశ్వరరావు, క్యాంప్ కో-ఆర్డినేటర్ సీహెచ్ శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్.శ్రీనివాసరావు, అకాడమిక్ కో-ఆర్డినేటర్ ఆర్కే కొండముది, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. -
టాటా నానో.. సీఎన్జీ కారు రెడీ!
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ నానో మోడల్లో డ్యుయల్ ఫ్యూయల్(పెట్రోల్, సీఎన్జీ) వేరియంట్, నానో సీఎన్జీ ఈమాక్స్ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధరను రూ.2.40 లక్షలు-రూ.2.65 లక్షల రేంజ్లో నిర్ణయించామని కంపెనీ పేర్కొంది. అధిక వేగం అవసరమైనప్పుడు సీఎన్జీ నుంచి పెట్రోల్ ఇంధనానికి మారేలా ఇంజిన్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఈఎంఎస్) ఈ నానో ప్రత్యేకత అని వివరించింది. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు, లక్నోల్లో ఈ కొత్త వేరియంట్ లభిస్తుందని పేర్కొంది. ప్రారంభం నుంచే నానో సంచలనం సృష్టిస్తోందని, ఈ కొత్త వేరియంట్ ఆ సంచలనానికి జత అయిందని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్-కమర్షియల్) అంకుష్ అరోరా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ వరకూ మొత్తం 10,202 నానో కార్లను టాటా మోటార్స్ విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి మొత్తం 39,623 నానో కార్లు అమ్ముడయ్యాయి.