మెరుగైన క్యాన్సర్‌ చికిత్సకు నానో ప్లాట్‌ఫార్మ్‌ | Nano platform For Cancer Treatment | Sakshi
Sakshi News home page

మెరుగైన క్యాన్సర్‌ చికిత్సకు నానో ప్లాట్‌ఫార్మ్‌

Published Fri, Dec 22 2017 10:06 AM | Last Updated on Fri, Dec 22 2017 10:06 AM

Nano platform For Cancer Treatment - Sakshi

క్యాన్సర్‌కు ప్రస్తుతం విస్తృతంగా అందుబాటులో ఉన్న చికిత్సలు మూడే. శస్త్రచికిత్స ద్వారా కణుతులను తీసేయడం, కీమో, రేడియో థెరపీలను వాడటం. అయితే ఈ మూడింటితోనూ క్యాన్సర్‌ కణాలు పూర్తిగా నశిస్తాయన్న గ్యారెంటీ లేదు. ఈ నేపథ్యంలో ఒరెనాగ్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నానోస్థాయి మందులతో క్యాన్సర్‌ కణాలన్నింటినీ నాశనం చేసే వీలు కల్పించే వ్యవస్థను అభివృద్ధి చేశారు. శస్త్రచికిత్స ద్వారా కణితిని ఎంతమేరకు కత్తిరించాలో సూచించడంతోపాటు మిగిలిన క్యాన్సర్‌ కణాలన్నింటినీ గమనించేలా చేయగలగడం ఈ ప్లాట్‌ఫార్మ్‌ ప్రత్యేకత. నానోస్థాయి కణాలకు ప్రత్యేకమైన రంగులాంటిదాన్ని జోడించి శరీరంలోకి పంపడంతో ఈ ప్లాట్‌ఫార్మ్‌ పని మొదలవుతుంది.

నానో కణాలు వేడెక్కి నాశనం చేసేస్తాయి. సిలికాన్‌ నాఫ్తాలోసైమీన్‌ అనే పదార్థం ద్వారా తయారుచేసే నానో కణాలకు సహజసిద్ధంగా నశించిపోయే పదార్థ కణాలను కలుపుతారు. ఈ కణాలు ఒక్కసారి కణితిని చేరగానే నానోస్థాయి కణాలు వెలుతురును ప్రసారం చేయడం మొదలవుతుంది. అతినీల లోహిత కణాల సాయంతో ఈ వెలుతురును చూడటం ద్వారా కణితి ఉన్న ప్రాంతం ఎంతన్నది శాస్త్రవేత్తలకు స్పష్టంగా తెలుస్తుంది. ఫొటో థెరపీ ద్వారా మిగిలిన కణాలపైకి లేజర్‌ కాంతిని ప్రసరింపచేస్తే.. అవికాస్తా వేడెక్కి, నశించిపోతాయి. సాధారణ కణాలకు ఏమాత్రం హాని జరక్కుండా ఉండటం ఈ ప్లాట్‌ఫార్మ్‌కు ఉన్న మరో ప్రత్యేకత. ఎలుకలపై జరిగిన పరిశోధనల్లో ఈ కొత్త ప్లాట్‌ఫార్మ్‌ మెరుగైన ఫలితాలు ఇచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement