కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల భైరతి రంగల్ చిత్రంలో కనిపించిన ఆయన వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. ఏయిర్‌పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సర్జరీ కోసం యూఎస్ వెళ్తున్నట్లు ప్రకటించారు.
అయితే తాజాగా ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తయినట్లు ఆయన కూతురు నివేదిత శివరాజ్‌కుమార్ వెల్లడించారు. దేవుని దయతో మా నాన్నకి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని ట్విటర్ ద్వారా లేఖ విడుదల చేసింది. అంతేకాకుండా ఆయన భార్య గీతా మాట్లాడిన వీడియోను ఓ అభిమాని ట్విటర్‌లో షేర్ చేశారు. మరికొద్ది రోజుల్లో శివ రాజ్‌కుమార్ తన అభిమానులతో మాట్లాడతారని తెలిపింది. ఈ సందర్భంగా మద్దతుగా నిలిచిన అభిమానులకు ఆయన భార్య గీతా శివరాజ్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 24న యూఎస్‌లోని మియామీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో మూత్రాశయ క్యాన్సర్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.
ప్రస్తుతం శివరాజ్‌కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కూతురు లేఖలో ఆయన కుమార్తె ప్రస్తావించారు. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, మద్దతుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సర్జరీకి ముందు శివ రాజ్‌కుమార్‌కు ఆరోగ్యం చేకూరాలని కోరుతూ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాగా.. శివ రాజ్‌కుమార్ చివరిసారిగా కన్నడ చిత్రం భైరతి రణగల్‌లో కనిపించారు. ఈ చిత్రం నవంబర్ 15న విడుదలైంది. ఆయన ప్రస్తుతం ఉత్తరకాండ, 45, భైరవనా కోనే పాటతో సహా పలు చిత్రాలలో నటిస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ ఆర్‌సీ16లోనూ కనిపించనున్నారు.
Thank You #Geethakka ❤🙏🏼 You Stood with Anna ❤❤❤
Take Rest and Get Well Soon #Shivanna ❤🥹 We Will be waiting for to welcome you on Jan 26th 😍
Special thanks to doctor's🙏🏼 #DrShivarajkumar #Shivarajkumar #ShivaSainya @NimmaShivanna ❤❤❤ @ShivaSainya pic.twitter.com/isgcCcC520— ShivaSainya (@ShivaSainya) December 25, 2024
It is the prayers and love of all the fans and our loved ones that have kept us going through tough times.
Thank you for your support!✨ pic.twitter.com/eaCF7lqybc— Niveditha Shivarajkumar (@NivedithaSrk) December 25, 2024
Comments
Please login to add a commentAdd a comment