
ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన పాయల్ రాజ్ పుత్(Payal Rajput).. మొన్నీమధ్యే టాలీవుడ్ లో నెపోటిజం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు తన కుటుంబంలో జరిగిన బ్యాడ్ న్యూస్ గురించి బయటపెట్టింది.
తన తండ్రి ఎసోఫెగల్ కార్సినోమా (క్యాన్సర్) బారిన పడ్డారని, ఇప్పుడు ట్రీట్ మెంట్ మొదలుపెట్టామని, తొలి కీమో థెరపీ సెషన్ లోనూ ఆయన పాల్గొన్నారని పాయల్ రాజ్ పుత్ చెప్పుకొచ్చింది. దీని వల్ల తనకు కాస్త భయంగా ఉందని పేర్కొంది. ఆయన త్వరలో కోలుకుంటారని, దానికి మీ ప్రేమ, సపోర్ట్ కావాలని రాసుకొచ్చింది.
(ఇదీ చదవండి: సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు)

ఇంత బాధలోనూ తనని పనిచేసుకోమని, షూటింగ్ కి హాజరవ్వమని చెబుతున్నారని పాయల్ రాజ్ పుత్ చెప్పుకొచ్చింది. ఈ మేరకు తండ్రికి సెలైన్ ఎక్కిస్తున్న ఫొటోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో పలువురు నెటిజన్స్ పాయల్ తండ్రి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.
పాయల్ తండ్రికి జీర్ణాశయ క్యాన్సర్ (Cancer) వచ్చింది. పాయల్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం తమిళంలో రెండు, తెలుగులో ఓ మూవీ చేస్తోంది.
(ఇదీ చదవండి: నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం)