‘‘ఓ పోలీసాఫీసర్ జీవితంలో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకుని కల్పిత కథతో ‘రక్షణ’ తీశాను. ఈ సినిమాలో చిన్న సందేశం కూడా ఉంది. సినిమా మొత్తం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లా ఉంటుంది. బాధితుల కోసం పోరాడటంతో పాటు వారిని రక్షించేలా ఉంటుంది కాబట్టి ‘రక్షణ’ అని టైటిల్ పెట్టాం’’ అన్నారు దర్శక–నిర్మాత ప్రణదీప్ ఠాకోర్. పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘రక్షణ’. ప్రణదీప్ ఠాకోర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ప్రణదీప్ ఠాకోర్ మాట్లాడుతూ– ‘‘గుణశేఖర్‌గారి వద్ద ‘ఒక్కడు, సైనికుడు, రుద్రమ దేవి’ సినిమాలకు అసిస్టెంట్ కో డైరెక్టర్‌గా పని చేశాను. ఆనంద్ రంగా ‘ఓయ్’ చిత్రానికి, భాస్కర్ ‘ఆరెంజ్’ సినిమాకి కో–డైరెక్టర్‌గా చేశాను. ఓ పెద్ద కథ పట్టుకుని చాలామంది వద్దకు వెళ్లాను... కానీ కుదరలేదు. అందుకే చిన్న సినిమా తీసి, నిరూపించుకోవాలని ‘రక్షణ’ తీశాను. ఇందులో పాయల్ అద్భుతంగా నటించారు. ‘రక్షణ’ తర్వాత ఆమెకు మరింత పవర్‌ఫుల్ రోల్స్ వస్తాయి. సినిమా తీయడం క్రియేటివ్... రిలీజ్ చేయడం మార్కెటింగ్ థింగ్. నేను సినిమా బాగానే తీశా. కానీ, మార్కెటింగ్‌లో పూర్. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని రిలీజ్ చేయడమే కష్టంగా మారింది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment