ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఇటీవల క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రక్షణ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించింది. ఈ ఏడాది జూన్ 7న థియేటర్లలో రక్షణ్ మూవీ రిలీజైంది. విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆగస్టు 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆహా సంస్థ ట్వీట్ చేసింది. లేడీ సింగ్ గర్జించేందుకు వస్తోంది అంటూ మూవీ పోస్టర్‌ను పంచుకుంది. కాగా.. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ ఏసీపీ పాత్రలో అలరించారు.
కథేంటంటే..
కిరణ్(పాయల్ రాజ్‌పుత్) ఓ పవర్‌ఫుల్ ఏసీపీ. అనేక కేసులను ఈజీగా సాల్వ్ చేసిన కిరణ్.. తన స్నేహితురాలు హత్య కేసును మాత్రం ఛేదించలేకపోతుంది. ఓ సైకో ఆమెను హత్య చేసి..అది ఆత్మహత్యగా చిత్రీకరించాడని కిరణ్ అనుమానిస్తుంది. ఆ దిశగా విచారణ ప్రారంభిస్తుంది. మరోవైపు ప్రేమించమని అమ్మాయిల వెంటపడుతూ హింసించే అరుణ్(మానస్)ని కిరణ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది. దీంతో కిరణ్‌పై అరుణ్ పగపెంచుకుంటాడు. ఓ వెబ్‌సైట్ క్రియేట్ చేసి అందులో కిరణ్ ఫోటోలను పోస్ట్ చేసి..ఆమె మొబైల్ నంబర్‌ని పబ్లిక్‌లో పెడతాడు. దీంతో కిరణ్‌కు అసభ్యకరమైన సందేశాలు..పోన్లు వస్తుంటాయి.
ఇది అరుణ్ చేసిన పనే అని కనిపెట్టిన కిరణ్.. అతన్ని పట్టుకునేందుకు ఓ బంగ్లాకు వెళ్లగా..అరుణ్ ఆమె కళ్లముందే బంగ్లాపై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఏసీపీ కిరణ్ వేధింపుల కారణంగానే చనిపోతున్నానని ఓ వీడియో కూడా చిత్రీకరిస్తాడు. ఈ వీడియో వైరల్ కావడంతో కిరణ్ సస్పెండ్‌కి గురవుతుంది. ఆ తర్వాత కిరణ్ లోతుగా విచారించగా.. తన స్నేహితురాలితో పాటు అరుణ్ ఆత్మహత్యల వెనుక ఎవరో ఒకరు ఉన్నారని, ఆయనే వీరిద్దరిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు తన స్నేహితురాలితో పాటు మరికొంతమంది యువతులను చంపాడు? అరుణ్‌కి ఆ సైకో కిల్లర్‌కి ఉన్న సంబంధం ఏంటి? కిరణ్‌ని లూజర్ చేయాలని ఎందుకు ప్రయత్నించాడు? ఆ సైకో కిల్లర్‌ని కిరణ్ కనిపెట్టిందా? చివరికి ఏం జరిగింది? ఈ కథలో రోషన్ పోషించిన పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Lady Singam is ready to roar!👮🏻♀️
Payal's 'Rakshana' is coming on aha!!🎬 #Rakshana premieres Aug 1st only on aha @starlingpayal @ActorMaanas @RajeevCo @actorchakrapani @sivannarayana_ @PrandeepThakore pic.twitter.com/sOdDmVSHKz— ahavideoin (@ahavideoIN) July 29, 2024
Comments
Please login to add a commentAdd a comment