టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. తను నటించిన 'రక్షణ' సినిమా టీమ్‌పై ఆమె సంచలన ఆరోపణ చేసింది. నాలుగేళ్ల క్రితం నిర్మించిన సినిమాను ఇప్పుడు విడుదల చేస్తున్నారని చెప్పిన ఆమె.. ఆ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్‌లో కొంత తనకు చెల్లించాల్సి ఉందని తెలిపింది. అయితే, తనకు ఇవ్వాల్సిన బకాయిలు పక్కనపెట్టి సినిమాను విడుదల చేయడాన్ని ఆమె తప్పుబట్టింది. అగ్రిమెంట్ ప్రకారం తనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ చెల్లించకుండానే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని నాపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పింది. అలా చేయకుంటే తెలుగు పరిశ్రమ నుంచి తనను బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నట్టు కూడా ఆమె చెప్పుకొచ్చింది.
ఈ విషయంపై చిత్ర యూనిట్ కూడా రియాక్ట్ అయింది. ప్రమోషన్స్‌కు వస్తే పాయల్‌కు చెల్లించాల్సిన రూ.6 లక్షలు ఇచ్చేందుకు నిర్మాత సిద్ధమయ్యారని.. కానీ పాయల్ పట్టించుకోలేదని వారు వెల్లడించారు. ఈ వివాదంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.
సెటిల్మెంట్ కోరుకుంటున్న పాయల్
తాజాగా పాయల్ రాజ్‌పుత్ మరోసారి తన సోషల్ మీడియాలో ఒక నోట్ రాసింది. 'నేను డైరెక్టర్, నిర్మాతకు చాలా గౌరవం ఇస్తాను. నా ఉద్దేశం వారిని బాధపెట్టాలని లేదు. నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సినిమా విడుదల చేయాలనుకోవడం బాధ అనిపిస్తుంది. 2020 నుంచి ఇప్పటికీ కూడా 'రక్షణ' టీమ్‌కు నేను సపోర్ట్ చేస్తున్నాను. ప్రేక్షకులను మెప్పించేందుకు దర్శకుడు, నిర్మాతల టీమ్ ఎంతకష్టపడుతారో నాకు తెలుసు. కాబట్టి వారిని నష్టపెట్టాలని నేను ఎప్పుడూ కోరుకోను. నేను అడిగింది ఒక్కటే నాకు చెప్పకుండా సినిమాను విడుదల చేయడం బాధ అనిపించింది. ఇదీ నా రిక్వెస్ట్.. నేను ఎవరికీ అపకారం చేయను.
రక్షణ టీమ్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుందని నేను ఎదురుచూస్తున్నాను. నా టీమ్‌ను వారు తప్పకుండా సంప్రదిస్తారని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ సమస్యలను పరిష్కరించుకుందాం.' అని పాయల్ సెటిల్మెంట్ కోరుకుంటుంది. ఫైనల్లీ ఈ గొడవకు శుభం కార్డు పడినట్టే. ఇరువురు మధ్య సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా తెలిపింది. జూన్ 7న రక్షణ సినిమా విడుదల కానుంది. పాయల్ రాజ్‌పుత్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండానే ఇలా భారీ ప్రమోషన్‌ను ఆ సినిమాకు తెచ్చిపెట్టిందని నెటిజన్లు అంటున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment