TFC
-
వారి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్‌పుత్
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. తను నటించిన 'రక్షణ' సినిమా టీమ్‌పై ఆమె సంచలన ఆరోపణ చేసింది. నాలుగేళ్ల క్రితం నిర్మించిన సినిమాను ఇప్పుడు విడుదల చేస్తున్నారని చెప్పిన ఆమె.. ఆ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్లో కొంత తనకు చెల్లించాల్సి ఉందని తెలిపింది. అయితే, తనకు ఇవ్వాల్సిన బకాయిలు పక్కనపెట్టి సినిమాను విడుదల చేయడాన్ని ఆమె తప్పుబట్టింది. అగ్రిమెంట్ ప్రకారం తనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ చెల్లించకుండానే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని నాపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పింది. అలా చేయకుంటే తెలుగు పరిశ్రమ నుంచి తనను బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నట్టు కూడా ఆమె చెప్పుకొచ్చింది.ఈ విషయంపై చిత్ర యూనిట్ కూడా రియాక్ట్ అయింది. ప్రమోషన్స్‌కు వస్తే పాయల్‌కు చెల్లించాల్సిన రూ.6 లక్షలు ఇచ్చేందుకు నిర్మాత సిద్ధమయ్యారని.. కానీ పాయల్ పట్టించుకోలేదని వారు వెల్లడించారు. ఈ వివాదంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రెస్ నోట్లో పేర్కొన్నారు.సెటిల్మెంట్ కోరుకుంటున్న పాయల్తాజాగా పాయల్ రాజ్‌పుత్ మరోసారి తన సోషల్ మీడియాలో ఒక నోట్ రాసింది. 'నేను డైరెక్టర్, నిర్మాతకు చాలా గౌరవం ఇస్తాను. నా ఉద్దేశం వారిని బాధపెట్టాలని లేదు. నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సినిమా విడుదల చేయాలనుకోవడం బాధ అనిపిస్తుంది. 2020 నుంచి ఇప్పటికీ కూడా 'రక్షణ' టీమ్‌కు నేను సపోర్ట్ చేస్తున్నాను. ప్రేక్షకులను మెప్పించేందుకు దర్శకుడు, నిర్మాతల టీమ్ ఎంతకష్టపడుతారో నాకు తెలుసు. కాబట్టి వారిని నష్టపెట్టాలని నేను ఎప్పుడూ కోరుకోను. నేను అడిగింది ఒక్కటే నాకు చెప్పకుండా సినిమాను విడుదల చేయడం బాధ అనిపించింది. ఇదీ నా రిక్వెస్ట్.. నేను ఎవరికీ అపకారం చేయను. రక్షణ టీమ్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుందని నేను ఎదురుచూస్తున్నాను. నా టీమ్‌ను వారు తప్పకుండా సంప్రదిస్తారని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ సమస్యలను పరిష్కరించుకుందాం.' అని పాయల్ సెటిల్మెంట్ కోరుకుంటుంది. ఫైనల్లీ ఈ గొడవకు శుభం కార్డు పడినట్టే. ఇరువురు మధ్య సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా తెలిపింది. జూన్ 7న రక్షణ సినిమా విడుదల కానుంది. పాయల్ రాజ్‌పుత్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండానే ఇలా భారీ ప్రమోషన్‌ను ఆ సినిమాకు తెచ్చిపెట్టిందని నెటిజన్లు అంటున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
ఏపీ ఎన్నికలపై బోగస్ సర్వే; ఒకరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటెలిజెన్స్ పెట్టిన కేసులో టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన పాండురంగారావును జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం చేసినట్టుగా చెబుతూ బోగస్ సర్వేను యూట్యూబ్‌లో పెట్టారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ఇంటెలిజెన్స్ కేసు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు పాండురంగారావుతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు త్వరలో మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశముంది. చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణకు చెందిన ఎన్బీకే భవన్లో టీఎఫ్సీ కార్యాలయాన్ని నడిపిన నిందితులు ఇక్కడి నుంచే వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు. వైఎస్ జగన్ సోదరి షర్మిలపై సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేసిన ‘పచ్చ గ్యాంగ్’ ఇదే భవనాన్ని వేదికగా మార్చుకుందని సమాచారం. (చదవండి: బాలకృష్ణ ఇంట్లోనే ‘టీఎఫ్సీ’ కార్యాలయం!) -
బాలకృష్ణ ఇంట్లోనే ‘టీఎఫ్సీ’ కార్యాలయం!
హైదరాబాద్ : తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం పేరుతో మంగళవారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన టీడీపీ అనుకూల ఏపీ ఎన్నికల సర్వేకు సంబంధించిన కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన ఆ విభాగం అధికారులు జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో మంగళవారం రాత్రి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ బోగస్ సర్వేను యూట్యూబ్‌లో పెట్టిన టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లోని ఎన్బీకే (నందమూరి బాలకృష్ణ) భవన్లో కొనసాగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వియ్యంకుడు బాలకృష్ణ తన భవనంలోనే టీఎఫ్సీకి ఆశ్రయం ఇచ్చారని పోలీసు విచారణలో తేలడంతో ఇదంతా టీడీపీ అగ్రనేతల డైరెక్షన్లోనే సాగిందని స్పష్టమవుతోంది. హైదరాబాద్ నుంచే ఆంధ్రప్రదేశ్‌పై కుట్రలు సాగుతున్నాయంటూ ఓ వైపు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు.. అదే హైదరాబాద్ నుంచి వైఎస్సార్సీపీపై దుష్ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తారాస్థాయికి తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. విజయవాడలోనే నిందితులు.. కాగా, టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు శాఖమూరి తేజోభాను, ప్రియదర్శిని, రామకృష్ణ వీరపనేని, ఏదుగాని మల్లేష్, చీపురుపల్లి రాంబాబులపై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 420, 417, 465, 468, 471, 505 (1సీ), 505 (2), 171 (సీ) రెడ్‌విత్ 171 (ఎఫ్), 171 (జీ), 120 (బి), సెక్షన్ 66 (డి) ఆఫ్ ఐటీ యాక్ట్–2000 కింద కేసులు నమోదు చేశారు. అయితే, మంగళవారం రాత్రి ఈ కార్యాలయంపై దాడులు చేయగా, ఆరు నెలల క్రితమే ఇక్కడి నుండి కార్యాలయం ఎత్తేసినట్లు అక్కడున్న సిబ్బంది పోలీసులకు చెప్పారు. ప్రస్తుతం ఈ కార్యాలయంలో ఓ వెబ్‌చానల్ నడుస్తున్నట్లుగా గుర్తించారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీస్ బృందం గాలింపు చేపట్టింది. సెల్ సిగ్నళ్లను బట్టి వీరు విజయవాడలో ఉన్నట్లు తెలుస్తోంది. షర్మిలపై దుష్ట్రచారానికీ అదే వేదిక! బాలకృష్ణ భవనంలోనే టీఎఫ్సీ కార్యాలయాన్ని నడిపిన నిందితులు ఇక్కడి నుంచే వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు. వైఎస్ జగన్ సోదరి షర్మిలపై సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేసిన ‘పచ్చ గ్యాంగ్’ ఇదే భవనాన్ని వేదికగా మార్చుకున్నారని సమాచారం. ఇక్కడి నుంచే రకరకాల పోస్టులు తయారుచేసి వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా విష ప్రచారం చేశారు. ఆరు నెలల క్రితం తమపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారంపై షర్మిల, ఇతర పార్టీ నేతలు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరు తమ ప్రణాళికను మార్చారు. ఇక్కడ ఉంటే టీఎఫ్సీ కార్యకలాపాలు బయటపడి టీడీపీ డ్రామాలు వెలుగులోకొస్తాయనే ఉద్దేశంతో బాలయ్య భవన్, సాగర్ సొసైటీలోని కార్యాలయాలను ఖాళీచేశారు. ఐటీ గ్రిడ్స్ డాటా చోరీ కేసులో ప్రధాన నిందితుడు అశోక్ మాదిరిగానే ఈ కేసులోనూ ఐదుగురు నిందితులకు టీడీపీ సర్కార్ రక్షణ ఇస్తున్నట్టుగా తెలిసింది. -
ఎన్నికల వేళ టీడీపీ మరో ఎత్తుగడ
-
ఓలా యాప్ ద్వారా ట్యాక్సీఫర్‌ష్యూర్ క్యాబ్ బుకింగ్
హైదరాబాద్: ఓలా యాప్ ద్వారా హైదరాబాద్‌లోని వినియోగదారులు ట్యాక్సీఫర్‌ష్యూర్(టిఎఫ్ఎస్) హ్యాచ్‌బాక్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సౌకర్యాన్ని ఢిలీ, ముంబై, బెంగళూరుల్లో ఆఫర్ చేస్తున్నామని ఓలా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ శుక్రవారం నుంచి హైదరాబాద్‌సహా మరో 26 నగరాల్లో ఈ సౌకర్యాన్ని విని యోగించుకోవచ్చని ఓలా సీఓఓ ప్రణయ్ జివ్రాజ్క పేర్కొన్నారు. ఓలా యాప్‌లో టీఎఫ్ఎస్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా ట్యాక్సీఫర్‌ష్యూర్ హ్యాచ్‌బాక్‌ను బుక్ చేసుకోవచ్చని వివరించారు. చార్జీలు రూ.49 నుంచి ప్రారంభమవుతాయి.