
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటెలిజెన్స్ పెట్టిన కేసులో టీఎఫ్‌సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన పాండురంగారావును జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం చేసినట్టుగా చెబుతూ బోగస్ సర్వేను యూట్యూబ్‌లో పెట్టారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ఇంటెలిజెన్స్ కేసు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు పాండురంగారావుతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు త్వరలో మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశముంది.
చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణకు చెందిన ఎన్‌బీకే భవన్‌లో టీఎఫ్‌సీ కార్యాలయాన్ని నడిపిన నిందితులు ఇక్కడి నుంచే వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు. వైఎస్ జగన్ సోదరి షర్మిలపై సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేసిన ‘పచ్చ గ్యాంగ్’ ఇదే భవనాన్ని వేదికగా మార్చుకుందని సమాచారం. (చదవండి: బాలకృష్ణ ఇంట్లోనే ‘టీఎఫ్‌సీ’ కార్యాలయం!)
Comments
Please login to add a commentAdd a comment