bogus survey
-
బోగస్ సర్వేలు చేయించుకోవడం చంద్రబాబుకు అలవాటే
-
బాబు బోగస్ సర్వేలు
-
బాబు కోసం బోగస్ సర్వేలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని ప్రధాన సర్వే సంస్థలు, జాతీయ మీడియా కోడై కూస్తున్న నేపథ్యంలో తమ క్యాడర్ జారిపోకుండా ఉండేందుకు, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ పలు బోగస్ సర్వే సంస్థలను రంగంలోకి దించింది. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వస్తుందని పేరెన్నికగన్న సంస్థలన్నీ చెబుతుండగా, బోగస్ సంస్థలు మాత్రం మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వస్తుందని హడావుడి చేయడం వెనుక ఆ పార్టీ ముఖ్య నేతల ప్రోద్బలం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలో టీడీపీ నేతల అభిప్రాయమే వినిపించింది. ఐఎన్ఎస్ఎస్, ఎలైట్ పేరుతో మరికొన్ని సర్వేలు అదే కోవలో బయటకు వచ్చాయి. ఇవన్నీ టీడీపీ పెద్దల కనుసన్నల్లో పని చేసేవేనని చెబుతున్నారు. టీడీపీ ఓటమి ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడవుతుందని ముందే తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాము గెలుస్తున్నట్లు కొన్ని సంస్థలు చెబుతున్నాయని చూపించుకునేందుకు బోగస్ సంస్థలను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఈ సంస్థలు అసలు సర్వేలు చేయకుండానే చేసినట్లు బిల్డప్ ఇచ్చి, నోటికొచ్చిన సీట్ల లెక్కలు ప్రకటించినట్లు స్పష్టమవుతోంది. లగడపాటి సర్వే తీరిది.. రెండురోజుల నుంచి హంగామా చేస్తున్న లగడపాటి సర్వే పూర్తిగా బోగస్ అని సెఫాలజిస్టులు తేల్చిచెబుతున్నారు. ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరుతో తాను సర్వే చేసినట్లు లగడపాటి చెబుతున్నా, అందులో నిజం లేదని తెలుస్తోంది. ఈ సంస్థను నిర్వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ తాను ఎలాంటి సర్వే చేయలేదని ప్రకటించగా, ఆయనతోనే తాను సర్వే చేయించినట్లు లగడపాటి చెబుతుండడం గమనార్హం. ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరుతో చేసిన సర్వే వివరాలతో లగడపాటి ఒక నోట్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను కేవలం 38 నియోజకవర్గాల్లోనే తాము సర్వే చేశామని, 50 వేల శాంపిల్స్ తీసుకున్నామని అందులో పేర్కొన్నారు. అది కూడా మూడు జిల్లాల్లోనే ఈ సర్వే చేపట్టినట్లు చెబుతున్నారు. కేవలం 38 నియోజకవర్గాల్లో సర్వే చేసి, ఫలితాలను అంచనా వేయడం ఎక్కడా జరగదని సెఫాలజిస్టులు పేర్కొంటున్నారు. అందులోనూ లగడపాటి టీడీపీకి 90కి 20 స్థానాలు అటూ ఇటుగా వస్తాయని చెప్పడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 20 సీట్ల మార్జిన్‌తో ఫలితాలు అంచనా వేయడాన్ని బట్టి వారి సర్వేపై వారికే నమ్మకం లేదని తేటతెల్లమవుతోందని చెబుతున్నారు. చంద్రబాబుతో తెరచాటు సంబంధాలు కొనసాగిస్తూ, ఎన్నికల్లో టీడీపీకి మేలు చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన లగడపాటి సర్వేకు ఏమాత్రం ప్రామాణికత లేదని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే సంస్థలన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పగా, లగడపాటి మాత్రం మహాకూటమి గెలుస్తుందని జోస్యం చెప్పి అభాసుపాలైన సంగతి తెలిసిందే. ఆ రెండు సంస్థలూ అంతే.. ఢిల్లీకి చెందిన ఐఎన్ఎస్ఎస్ సంస్థ పేరుతో విడుదలైన సర్వే కూడా టీడీపీ నాయకుల మెదళ్ల నుంచి బయటకు వచ్చిందే. ఐఎన్ఎస్ఎస్ అనేది ప్రాభవం కోల్పోయిన ఒక తెలుగు దినపత్రికలో పనిచేసిన జర్నలిస్టు ఢిల్లీలో నిర్వహిస్తున్న న్యూస్ ఏజెన్సీ. ఢిల్లీలో అన్ని కార్యక్రమాలను కవర్ చేయడానికి దానికి రిపోర్టర్లే లేరు. అలాంటి సంస్థ ఏపీలో భారీ ఎత్తున సర్వే చేశామని, టీడీపీకి 118, వైఎస్సార్సీపీకి 52, జనసేనకు 5 సీట్లు వస్తాయని తేలినట్లు ప్రకటించింది. ప్రముఖ సర్వే సంస్థలన్నీ వైఎస్సార్సీపీ.. టీడీపీ కంటే 6 నుంచి 8 శాతం ఓట్ల తేడాతో గెలుస్తుందని కచ్చితమైన లెక్కలతో వివరిస్తుండగా, ఈ సంస్థ మాత్రం వైఎస్సార్సీపీ కంటే టీడీపీకి 9.5 శాతం ఓట్లు ఎక్కువగా రానున్నట్లు చెప్పడాన్ని బట్టి ఇది పూర్తిగా టీడీపీ సర్వే అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ‘ఎలైట్ ఎలక్టోరల్ క్యాలిక్యులస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో విడుదలైన సర్వేలో టీడీపీకి 106 సీట్లు, వైఎస్సార్సీపీకి 68 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. ఇది కూడా టీడీపీ నేతలు విడుదల చేయించిన సర్వే అని సమాచారం. ఈ రెండు సర్వే సంస్థలు రాష్ట్రంలో ఏయే నియోజకవర్గాల్లో ఎన్ని శాంపిల్స్ తీసుకున్నది చెప్పకుండా కొన్ని కాకిలెక్కలతో ఫలితాలను అంచనా వేయడం గమనార్హం. టుడేస్ చాణక్య పేరుతో విడుదలైన మరో సర్వే టీడీపీకి 17 నుంచి 20 ఎంపీ సీట్లు, వైఎస్సార్సీపీకి 8 నుంచి 11 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపింది. కొద్దిరోజుల క్రితం కార్పొరేట్ చాణక్య పేరుతో టీడీపీకి అనుకూలంగా ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ఒక సర్వేను విడుదల చేసింది. మిషన్ చాణక్య సర్వే సంస్థ దాన్ని ఖండించింది. తమ పేరును పోలిన సంస్థ పేరుతో బోగస్ సర్వే విడుదల చేశారని పేర్కొంది. ఇప్పుడు మిషన్ చాణక్య సంస్థ వైఎస్సార్సీపీ గెలుస్తుందని చెప్పగా, టుడేస్ చాణక్య పేరుతో టీడీపీకి అనుకూలంగా మరో సర్వేను బయట పెట్టారు. ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా వస్తున్నాయని తెలిసి చంద్రబాబు, ఆయన కోటరీ ఉద్దేశపూర్వకంగా కొన్ని బోగస్ సంస్థలతో తాము గెలుస్తున్నట్లు సర్వేల వివరాలు విడుదల చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. -
ఎవరీ కోటేశ్వరరావు?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వస్తోందంటూ తెలంగాణ ఇంటెలిజెన్స్ పేరుతో బోగస్ సర్వేను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన వ్యక్తిపై కేసు దర్యాప్తులో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ వార్తను రూపొందించిన టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఉద్యోగి ప్రసన్నకుమార్‌ను సోమవారం అరెస్టు చేశారు. ఇతడికి సదరు సర్వే విషయం వాట్సాప్ ద్వారా కోటేశ్వరరావు అనే వ్యక్తి పంపినట్లు వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన ఇతడు టీడీపీ కీలక నేతలకు సన్నిహితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కోటేశ్వరరావును పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏపీకి పంపడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఉన్న భవనం కేంద్రంగా పని చేసిన టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నేతృత్వంలో ఈ కుట్ర జరిగినట్లు పోలీసులు గుర్తించారు. టీఎఫ్సీ సంస్థ డైరెక్టర్ శాఖమూరి తేజోభాను కోసం ముమ్మరంగా వెతుకుతున్నారు. వైఎస్ షర్మిలపై దుష్ప్రచారంలోనూ టీఎఫ్సీ పాత్ర? వైఎస్ షర్మిలపై సోషల్‌మీడియాలో జరిగిన దుష్ఫ్రచారం వెనుకా టీఎఫ్సీ సంస్థ పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరారీలో ఉన్న నిందితులు దొరికితే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. సాంకేతిక ఆధారాలను బట్టి ప్రస్తుతం వీళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ఏపీ ఎన్నికలపై బోగస్ సర్వే; ఒకరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటెలిజెన్స్ పెట్టిన కేసులో టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన పాండురంగారావును జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం చేసినట్టుగా చెబుతూ బోగస్ సర్వేను యూట్యూబ్‌లో పెట్టారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ఇంటెలిజెన్స్ కేసు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు పాండురంగారావుతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు త్వరలో మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశముంది. చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణకు చెందిన ఎన్బీకే భవన్లో టీఎఫ్సీ కార్యాలయాన్ని నడిపిన నిందితులు ఇక్కడి నుంచే వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు. వైఎస్ జగన్ సోదరి షర్మిలపై సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేసిన ‘పచ్చ గ్యాంగ్’ ఇదే భవనాన్ని వేదికగా మార్చుకుందని సమాచారం. (చదవండి: బాలకృష్ణ ఇంట్లోనే ‘టీఎఫ్సీ’ కార్యాలయం!) -
మంగళగిరిలో సర్వేల కలకలం
-
ఆంధ్రజ్యోతి ఎండీపై క్రిమినల్ కేసు పెట్టాలి
సాక్షి, విజయవాడ: ఆంధ్రజ్యోతి పత్రికలో బోగస్ సర్వే ప్రచురించిన ఎండీ వేమూరి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిన్న (బుధవారం) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి.ఎస్ నాగిరెడ్డి, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి తదితరులు సీపీని కలిశారు. బోగస్ సర్వే ప్రచురించిన రాధాకృష్ణ తదితరులపై చీటింగ్, ఫోర్జరీ కేసులు పెట్టాలని కోరారు. చదవండి....(ఫేక్ సర్వేలతో అడ్డంగా దొరికిన ఆంధ్రజ్యోతి) అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 1న ఆంధ్రజ్యోతి పత్రికలో ‘అధికారం టీడీపీదే’ అనే శీర్షికతో తప్పుడు సర్వే రిపోర్టు ప్రచురించారని, అది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని చెప్పారు. లోక్‌నీతి–సీఎస్డీఎస్ సర్వే పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని పేర్కొన్నారు. సదరు సంస్థ తాము ఏపీలో అసలు సర్వేనే చేయలేదని ప్రకటించిదని తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని చానళ్లు, సర్వేలు ఏపీలో అధికారం చేపట్టేది వైఎస్సార్‌సీపీనేనని ప్రకటిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఉనికిని కాపాడుకునేందుకు ఆంధ్రజ్యోతి పత్రికలో బోగస్ సర్వే విడుదల చేయించారన్నారు. ఫిర్యాదు స్వీకరించిన సీపీ కేసును విచారిస్తామని హామీ ఇచ్చారు. -
బోగస్ సర్వేలతో తస్మాత్ జాగ్రత్త
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పబ్లిక్ పల్స్ పేరుతో బోగస్ సర్వే జరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారం విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని గుర్తించి వారి ఆధార్ నెంబర్‌తో బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపించి, సానుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. వీరిపై ఫిర్యాదు చేసినా పోలీసు యంత్రాంగం స్పందించడం లేదని, ప్రజలు బోగస్ టీమ్‌కు సహకరించవద్దన్నారు. తప్పుడు సమాచారంతో జిల్లాలో సర్వే బృందాలు ఉంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. -
‘దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఆయనే’
విజయనగరం: సర్వేల పేరుతో ఎవరైనా ఇళ్లకు కొచ్చి ఆధార్ కార్డు, వివరాలు అడిగితే ప్రతిఘటించాలని ప్రజలకు వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ సూచించారు. అధికార పార్టీ కార్యకర్తలు.. ఓటర్ల జాబితా ఉంచుకుని సర్వే చేస్తున్న నేపథ్యంలో అలాంటి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. మంగళవారం విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నిబంధనలకు విరుద్ధంగా సర్వే చేస్తున్నవారిపై ఫిర్యాదు చేస్తే తమ పార్టీ కార్యకర్తలపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని వాపోయారు. సర్వే చేసే వాళ్లు ఆధార్ కార్డులు అడగటాన్ని.. ఒంటరిగా ఇళ్లల్లో ఉన్న మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే ప్రమాదం ఉందని పోలీసు ఉన్నతాధికారులు దృష్టికి తెచ్చినట్టు తెలిపారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో వ్యవస్దలన్నీ నాశనం అయిపోతున్నాయని, ముఖ్యమంత్రి నుంచి కార్యకర్తల వరకు అధికార పార్టీకి దోచుకోవడమే లక్ష్యంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో తాజాగా ప్రజాభిప్రాయం తమకు వ్యతిరేకంగా ఉందన్న వాస్తవాన్ని గ్రహించిన ప్రభుత్వం అభివృద్ధి అంటూ హడావుడి శంకుస్ధాపనలు చేస్తోందని ఆరోపించారు. నాలుగున్నరేళ్లుగా దోచుకోవడం తప్పా టీడీపీ ప్రభుత్వం చేసిందేమిలేదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అనేక కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. (సోషల్ మీడియా బృందం హల్చల్) బీసీ డిక్లరేషన్ కోసం ఏడాదిగా తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించిందని గుర్తు చేశారు. తమను చూసి చంద్రబాబు బీసీ సదస్సులు పెడుతున్నారని, ప్రజలను మోసం చేయడంలో ఆయన దిట్ట అని ఎద్దేవా చేశారు. వెయ్యి రూపాయల పింఛన్‌ను రెండు వేలు చేస్తామని వైఎస్ జగన్ హామీయిస్తే, దీన్ని వెంటనే చంద్రబాబు కాపీ కొట్టారని వెల్లడించారు. డ్వాక్రా మహిళలకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చిన దుర్మార్గమైన, అన్యాయమైన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని దుయ్యబట్టారు. ఈబీసీలకు కేంద్రం పదిశాతం రిజర్వేషన్లు ప్రకటిస్తే దానిలో ఐదు శాతం రిజర్వేషన్లు కాపులకు ఇస్తామని చంద్రబాబు ప్రకటించడం మోసం చేయడమేనని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
ఒక్కో నియోజకవర్గంలో 10,000 ఓట్ల తొలగింపే లక్ష్యం
జలుమూరు: ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లాలో బోగస్ సర్వేలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక అధికా పార్టీ నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓట్ల తొలగింపు కోసం సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులను కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి రప్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు, నరసన్నపేట, కొత్తూరు, పలాస తదితర మండలాల్లో శనివారం పలు బృందాలు సర్వే చేశాయి. జలుమూరు మండలం పెద్దదూగాం, టి.లింగాలుపాడు, నరసన్నపేట మండలం పారిశిల్లి, బసివలస, సుందరాపురం, బాలసీమ గ్రామాల్లో పలువురు యువకులు సర్వే చేస్తుండగా వైఎస్సార్సీపీ నేతలు ధర్మాన కృష్ణచైతన్య, మూకళ్ల సత్యం, వాన నాగేశ్వరరావు వారిని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సర్వే బృందం సభ్యులు పలు వివరాలు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన బి.భాస్కర్ ఈ బృందానికి నాయకుడిగా వ్యవహారిస్తున్నాడు. గ్రామాల్లో సర్వే పేరిట ఓటర్ల్లను కలిసి వారు అధికార టీడీపీకి చెందిన వారయితే వారిని విడిచిపెట్టి, వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడమే సర్వే లక్ష్యమని బి.భాస్కర్ చెప్పాడు. ఏ సమస్య వచ్చినా వారే చూసుకుంటారు తమకు ఇచ్చిన ట్యాబ్‌ల్లో పలు ప్రశ్నలు ఉంటాయని భాస్కర్ వెల్లడించాడు. ఓటర్లను ప్రశ్నించి, సమాధానాలు రాబట్టాల్సి ఉంటుందని చెప్పాడు. మీరు టీవీ చూస్తారా? గ్రామంలో ఉన్న సమస్యలు, రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? సీఎం పనితీరుపై మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వంతో పోల్చితే ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతిపై మీ అభిప్రాయం? వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడా? రానున్న ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేస్తారు? లాంటి ప్రశ్నలు 18 వరకూ ఉన్నట్లు సర్వే బృందం సభ్యులు చెప్పారు. సర్కారుకి వ్యతిరేకంగా సమాధానాలు చెప్పేవారి ఓట్లను తొలగించాలంటూ తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. ఒక్కో బూత్ నుంచి 25 నుంచి 50 ఓట్లు.. ఒక్కో నియోజకవర్గంలో 10 వేల ఓట్లను తొలగించడమే తమకు అప్పజెప్పిన పని అని బృంద నాయకుడు భాస్కర్ చెప్పాడు. తమకు పైన తిరుమలేశ్వరరెడ్డి, శ్రీరామ్‌రెడ్డి అనే బాస్‌లు ఉన్నారని, తమకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే ఫోన్‌ద్వారా వారికి సమాచారం చేరవేస్తామని, అంతా వారే చూసుకుంటారని అన్నాడు. వారిద్దరితో అప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడాడు. మీకు వచ్చిన భయం ఏం లేదు, మీరు ఇప్పుడు ఎంతమంది పట్టుబడ్డారు, ఏ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నారో చెప్పండి, మీ లోకేషన్ ఆధారంగా మిమ్మల్ని వేరే ప్రాంతానికి తరలిస్తామంటూ అటునుంచి సమాధానం వచ్చింది. సర్వేల పేరిట ఓట్లను తొలగిస్తున్నారంటూ వైఎస్సార్ïïసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఆదేశాల మేరకు నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. -
గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడగొడతా: కోమటిరెడ్డి
చిట్యాల/కనగల్: వచ్చే ఎన్నికల్లో తాను గజ్వేల్ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగి సీఎం కేసీఆర్‌ను ఓడగొడతానని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాలలో, కనగల్ మండలం తెలకంటిగూడెంలో వేర్వేరుగా ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బోగస్ సర్వేలతో ప్రజలను మభ్యపెడుతోందని మండిపడ్డా రు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా త్వరలో దండయాత్ర.. జైత్రయాత్ర పేరిట పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. నకిరేకల్, సూర్యాపేట నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. అడవుల నుంచి వచ్చిన ఎమ్మెల్యే మళ్లీ అక్కడికే వెళ్లే సమయం ఆసన్నమైందని, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంనుద్దేశించి వ్యాఖ్యానించారు. -
'బోగస్ సర్వేలతో టీఆర్ఎస్ మైండ్‌గేమ్'
హైదరాబాద్: బోగస్ సర్వేలు, బోగస్ సభ్యత్వంతో టీఆర్ఎస్ మైండ్‌గేమ్ ఆడుతుదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి.అంతా బోగస్ కాకుంటే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన వారిపై అనర్హతవేటు వేసి ఉప ఎన్నికలకు సిద్దంకావాలని ఆయన సవాల్ చేశారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పరిపాలన బోగస్, సర్వేలు బోగస్, పార్టీ సభ్యత్వం బోగస్, ఇచ్చిన హామీలు బోగస్, హామీలను అమలుచేశామని చెప్పడం బోగస్ అని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నదన్నారు. బడ్జెట్ లెక్కలన్నీ బోగస్ అని కాగ్ నివేదిక వెల్లడించిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నినాదాలుగా ఉన్న నీళ్లు రాలేదు, నిధుల్లేవు, నియామకాలు అసలేలేవని వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఇప్పటిదాకా ప్రచారం చేసుకోవడం, ప్రజలను నమ్మించి మోసం చేయడం తప్ప ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదన్నారు. పార్టీ సభ్యత్వానికి ఎక్కడా లేని ఆదరణ వస్తున్నదని ప్రచారం చేసుకోవడం పెద్ద బోగస్ అని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్లను టీఆర్ఎస్ నాయకులు బెదిరించి, వేధించి సభ్యత్వ పుస్తకాలను నింపి పంపుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారని అన్నారు. టీఆర్ఎస్కు 100 సీట్లు వస్తాయని చేయించుకున్న సర్వే కూడా బోగస్ అని అన్నారు. టీఆర్ఎస్ పాలనపై సీఎం కేసీఆర్‌కు నమ్మకంలేకనే ఇలాంటి అబద్దాల సర్వేలతో ప్రజలను మోసం చేస్తున్నాడని, ప్రజాభిప్రాయాన్ని వక్రీకరిస్తున్నారని చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్‌కు నైతికత ఉంటే, గెలుస్తామనే నమ్మకముంటే ఇతరపార్టీల నుంచి చేరినవారి స్థానాల్లో ఉప ఎన్నికలకు సిద్దంకావాలని సవాల్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి, రీడిజైన్‌లో లోపాలు వంటివాటిపై కాంగ్రెస్‌పార్టీ చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నామన్నారు. పాలమూరు-రంగారెడ్డి మొదటి పంపుహౌజు రీడిజైన్‌ను వ్యతిరేకిస్తున్నామన్నారు. జడ్చర్లకు రైల్వేలైను, జిల్లా ప్రజల ప్రయోజనాలకోసం ముఖ్యమంత్రిని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కలిసినట్టుగా వంశీచంద్‌రెడ్డి వెల్లడించారు. -
ఇదో మైండ్‌గేమ్
ఎమ్మెల్యే వంశీచంద్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అన్నివర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నార ని, టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్టు బోగస్ సర్వేలతో మైండ్‌గేమ్ ఆడుతున్నారని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శిం చారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రైతులు పంట నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలను పరిష్కరించలేక.., తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి బూటకపు సర్వేలు చేయిస్తున్నారని విమర్శించారు. ప్రజలంతా అనుకూలంగా ఉన్నారని వస్తున్న సర్వేలన్నీ నిజమని నమ్మితే టీఆర్ఎస్లో చేరిన ఇతరపార్టీల ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధంకావాలని వంశీచంద్ సవాల్ చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ చేసిన సవాలును టీఆర్ఎస్ స్వీకరించాలని సూచించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాడని వంశీచంద్ ప్రశ్నించారు.