సాక్షి, విజయవాడ: ఆంధ్రజ్యోతి పత్రికలో బోగస్ సర్వే ప్రచురించిన ఎండీ వేమూరి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిన్న (బుధవారం) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి.ఎస్ నాగిరెడ్డి, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి తదితరులు సీపీని కలిశారు. బోగస్ సర్వే ప్రచురించిన రాధాకృష్ణ తదితరులపై చీటింగ్, ఫోర్జరీ కేసులు పెట్టాలని కోరారు.
చదవండి....(ఫేక్ సర్వేలతో అడ్డంగా దొరికిన ఆంధ్రజ్యోతి)
అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 1న ఆంధ్రజ్యోతి పత్రికలో ‘అధికారం టీడీపీదే’ అనే శీర్షికతో తప్పుడు సర్వే రిపోర్టు ప్రచురించారని, అది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని చెప్పారు. లోక్‌నీతి–సీఎస్‌డీఎస్ సర్వే పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని పేర్కొన్నారు. సదరు సంస్థ తాము ఏపీలో అసలు సర్వేనే చేయలేదని ప్రకటించిదని తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని చానళ్లు, సర్వేలు ఏపీలో అధికారం చేపట్టేది వైఎస్సార్‌సీపీనేనని ప్రకటిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఉనికిని కాపాడుకునేందుకు ఆంధ్రజ్యోతి పత్రికలో బోగస్ సర్వే విడుదల చేయించారన్నారు. ఫిర్యాదు స్వీకరించిన సీపీ కేసును విచారిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment