
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పబ్లిక్ పల్స్ పేరుతో బోగస్ సర్వే జరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారం విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని గుర్తించి వారి ఆధార్ నెంబర్‌తో బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపించి, సానుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. వీరిపై ఫిర్యాదు చేసినా పోలీసు యంత్రాంగం స్పందించడం లేదని, ప్రజలు బోగస్ టీమ్‌కు సహకరించవద్దన్నారు. తప్పుడు సమాచారంతో జిల్లాలో సర్వే బృందాలు ఉంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.