ఇదో మైండ్‌గేమ్ | MLA Vamsi Chand about TRS Government | Sakshi
Sakshi News home page

ఇదో మైండ్‌గేమ్

Published Mon, Oct 24 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

MLA Vamsi Chand about TRS Government

ఎమ్మెల్యే వంశీచంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అన్నివర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నార ని, టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నట్టు బోగస్ సర్వేలతో మైండ్‌గేమ్ ఆడుతున్నారని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శిం చారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రైతులు పంట నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలను పరిష్కరించలేక.., తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి బూటకపు సర్వేలు చేయిస్తున్నారని విమర్శించారు.

ప్రజలంతా అనుకూలంగా ఉన్నారని వస్తున్న సర్వేలన్నీ నిజమని నమ్మితే టీఆర్‌ఎస్‌లో చేరిన ఇతరపార్టీల ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధంకావాలని వంశీచంద్ సవాల్ చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ చేసిన సవాలును టీఆర్‌ఎస్ స్వీకరించాలని సూచించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాడని వంశీచంద్ ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement