Vamsi Chand
-
అన్ని వర్గాల సమస్యలపై పోరాటం
సాక్షి, హైదరాబాద్: అన్ని వర్గాల సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ అన్నారు. తెలంగాణ సాధనకు ఉద్య మం చేసిన విద్యార్థులు.. కాలేజీల్లో ఫీజులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. 14 లక్షల మంది విద్యార్థు లకు ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసెంబ్లీ వద్ద శనివారం వారు మీడియాతో మాట్లాడారు. రానున్న శాసనసభ సమావేశాల్లో రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులను నియంత్రించడం లేదన్నారు. శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల్లోని 38 మంది విద్యార్థు్థల మరణాలపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27 లోగా ఫీజు బకాయిలను విడుదల చేయాలని, లేదంటే విద్యార్థి నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తున్నారని, తమ పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామన్నారు. -
అభివృద్ధిని విస్మరించి కాలయాపన
ఎమ్మెల్యే వంశీచంద్‌పై టీఆర్ఎస్ నేతల ధ్వజం సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆలోచించకుండా అనవసర విషయాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుపై చర్చ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు తోకముడిచారని వంశీ చేసిన విమర్శలను ఖండిస్తున్నట్లు చెప్పారు. సంస్కారంలేని వంశీతో మంత్రి చర్చకు ఎలా వస్తారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కు హాజరుకాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తోకముడి చారన్నారు. కాంగ్రెస్ హయాంలో కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులో జూపల్లి అవినీతికి పాల్పడ్డారని వంశీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. అవినీతికి జూపల్లి పాల్పడి ఉంటే అప్పటి సీఎం, ఇరిగేషన్ మంత్రులు పొన్నాల, సుదర్శన్ రెడ్డి ఏం చేశారని నిలదీశారు. -
ప్రాజెక్టు డిజైన్ మార్పుపై చర్చకు సిద్ధమేనా!
మంత్రి జూపల్లికి వంశీచంద్ సవాల్ సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంపుహౌజు డిజైన్ మార్పులో అవినీతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు బహిరంగచర్చకు సిద్ధ మేనా అని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సవాల్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముడుపుల కోసమే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పంపుహౌజుల డిజైన్లు మారుస్తు న్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలకు అనుకూలంగా జూపల్లి పనిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై బహిరంగచర్చకు సిద్ధమని, మంత్రి తాను చేసిన వాదన తప్పు అని నిరూపిస్తే ముక్కును నేలకు రాస్తా అని సవాల్ చేశారు. మంత్రికి రూ.50 కోట్లు ముడుపులుగా ముట్టాయని ఆరోపించారు. -
ఇదో మైండ్‌గేమ్
ఎమ్మెల్యే వంశీచంద్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అన్నివర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నార ని, టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్టు బోగస్ సర్వేలతో మైండ్‌గేమ్ ఆడుతున్నారని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శిం చారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రైతులు పంట నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలను పరిష్కరించలేక.., తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి బూటకపు సర్వేలు చేయిస్తున్నారని విమర్శించారు. ప్రజలంతా అనుకూలంగా ఉన్నారని వస్తున్న సర్వేలన్నీ నిజమని నమ్మితే టీఆర్ఎస్లో చేరిన ఇతరపార్టీల ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధంకావాలని వంశీచంద్ సవాల్ చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ చేసిన సవాలును టీఆర్ఎస్ స్వీకరించాలని సూచించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాడని వంశీచంద్ ప్రశ్నించారు.