
సాక్షి, హైదరాబాద్: అన్ని వర్గాల సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ అన్నారు. తెలంగాణ సాధనకు ఉద్య మం చేసిన విద్యార్థులు.. కాలేజీల్లో ఫీజులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. 14 లక్షల మంది విద్యార్థు లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసెంబ్లీ వద్ద శనివారం వారు మీడియాతో మాట్లాడారు. రానున్న శాసనసభ సమావేశాల్లో రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులను నియంత్రించడం లేదన్నారు.
శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల్లోని 38 మంది విద్యార్థు్థల మరణాలపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27 లోగా ఫీజు బకాయిలను విడుదల చేయాలని, లేదంటే విద్యార్థి నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తున్నారని, తమ పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment