ప్రాజెక్టు డిజైన్‌ మార్పుపై చర్చకు సిద్ధమేనా! | Vamsi Chand challenge to the Minister jupalli | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టు డిజైన్‌ మార్పుపై చర్చకు సిద్ధమేనా!

Published Tue, Feb 14 2017 2:41 AM | Last Updated on Fri, Mar 22 2019 3:19 PM

ప్రాజెక్టు డిజైన్‌ మార్పుపై చర్చకు సిద్ధమేనా! - Sakshi

ప్రాజెక్టు డిజైన్‌ మార్పుపై చర్చకు సిద్ధమేనా!

మంత్రి జూపల్లికి వంశీచంద్‌ సవాల్‌

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంపుహౌజు డిజైన్‌ మార్పులో అవినీతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు బహిరంగచర్చకు సిద్ధ మేనా అని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సవాల్‌ చేశారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముడుపుల కోసమే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పంపుహౌజుల డిజైన్లు మారుస్తు న్నారని ఆరోపించారు.

ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలకు అనుకూలంగా జూపల్లి  పనిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై బహిరంగచర్చకు సిద్ధమని, మంత్రి తాను చేసిన వాదన తప్పు అని నిరూపిస్తే ముక్కును నేలకు రాస్తా అని సవాల్‌ చేశారు. మంత్రికి రూ.50 కోట్లు ముడుపులుగా ముట్టాయని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement