Palamuru - Rangareddy Lift Irrigation project
-
‘పాలమూరు’ అంచనాల పెంపు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–3 కింద నార్లాపూర్ రిజర్వాయర్, ఏదుల రిజర్వాయర్ మధ్య 8.32 కి.మీ.ల ఓపెన్ కాల్వ నిర్మాణం పనుల అంచనాల పెంపు ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. అంచనాలను రూ.416.1 కోట్ల నుంచి రూ.780.63 కోట్లకు సవరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఎస్ ఘన్పూర్ రిజర్వాయర్ ప్రధాన కాల్వను 12.65– 31.2 కి.మీ.ల మధ్య రూ.148.76 కోట్ల అంచనాలతో లైనింగ్ చేసేందుకు గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. రూ.153 కోట్లతో రొల్లవాగు చెరువు సామర్థ్యం పెంపు పనులకు కూడా ఓకే చెప్పింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీలకు తగ్గిస్తూ, ఆ మేరకు రూ.574.56 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతిచ్చింది. గతంలో ఈ పనులను రూ.860.25 కోట్లతో చేపట్టేందుకు పరిపాలనపర అనుమతులివ్వగా, రిజర్వాయర్ సామర్థ్యం పెంపును వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంది. తొలుత ఈ రిజర్వాయర్‌ను 9.8 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించగా, ఆ తర్వాత 4.8 టీఎంసీలకు, తాజాగా 1.41 టీఎంసీలకు తగ్గించారు. సీతారామపై మంత్రుల మధ్య సంవాదం !సీతారామ ఎత్తిపోతల పథకం–సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు అంచనాలు సవరించే అంశంపై ఇద్దరు మంత్రుల మధ్య సంవాదం జరిగినట్టు తెలిసింది. ప్రాజెక్టు అంచనాలను రూ.13,057 కోట్ల నుంచి రూ.19,324 కోట్లకు పెంచాలనే ప్రతిపాదనలపై వాడీవేడి చర్చ జరిగింది. దీంతో ఈ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించకుండా, రాష్ట్ర ఆర్థిక శాఖ పరిశీలనకు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో దీనిని రాజీవ్‌సాగర్/ఇందిరాసాగర్ ప్రాజెక్టుగా ప్రతిపాదించగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుగా రీ ఇంజనీరింగ్ చేసిందంటూ ఓ మంత్రి తప్పుబట్టినట్టు తెలిసింది. 67.5 టీఎంసీల గోదావరి జలాలను తరలించి ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 4.15 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 3.89 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన నేపథ్యంలో మళ్లీ పాత పథకాల ప్రస్తావన అనవసరమని మరో మంత్రి బదులిచ్చినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘంలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ నుంచి అనుమతుల కోసం చేస్తున్న ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయని, మళ్లీ పాత ప్రాజెక్టులను తెరపైకి తెచ్చి సమస్యను జటిలం చేయవద్దంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రూ.7,926.14 కోట్ల అంచనాలతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి 2016 ఫిబ్రవరి 18న గత ప్రభుత్వం పరిపాలనపర అనుమతులు జారీ చేయగా, 2018లో అంచనాలను రూ.13,057 కోట్లకు పెంచింది. -
ముందు డిజైన్లు..ఆపై టెండర్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే డిండి ఎత్తిపోతల పథకం పనులకు చకాచకా అడుగులు పడుతున్నాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీరు తీసుకోవాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత నియోజకవర్గాలైన మునుగోడు, దేవరకొండకు నీరందించే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను చేపట్టేందుకు ఆమోదముద్ర వేసింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవడం, రిజర్వాయర్ల భూసేకరణ, పరిహారం పూర్తి చేస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఇందుకోసం ఏదుల నుంచి రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీల నీటిని తీసుకుంటారు. త్వరలోనే గ్లోబల్ టెండర్లుడిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల నుంచి నీటిని తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం.. అక్కడి నుంచి ఉల్పర వరకు నీటిని తరలించే పనులను రూ.1,800 కోట్లతో చేపట్టాలని నిర్ణయించింది. వాటికి సంబంధించి త్వరలోనే గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. ఏదుల రిజర్వాయర్ నుంచి 800 మీటర్ల అప్రోచ్‌చానల్, అక్కడి నుంచి 2.525 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ తవ్వి, తొమ్మిది మీటర్ల డయాతో 16 కిలోమీటర్ల టన్నెల్, ఆ తర్వాత 3.050 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ తవ్వుతారు. మొత్తంగా ఏదుల నుంచి 21.575 కిలోమీటర్ల తర్వాత నీరు దుందుభి నదిలోకి చేరి, అక్కడి నుంచి 6.325 కిలోమీటర్ల తర్వాత ఉన్న పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్‌కు చేరుతుంది. అయితే అక్కడ చెక్‌డ్యాం స్థానæంలో రబ్బర్ డ్యాం , దానికి 1.5 కిలోమీటర్ల దిగువన ఉల్పర వద్ద బరాజ్‌ను నిర్మిస్తారు. వీటికి సంబంధించిన డిజైన్లపై సాగునీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే వాటిని ఖరారు చేసి, గ్లోబల్ టెండర్లు పిలవనున్నట్టు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. పర్యావరణ అనుమతులు పెండింగ్ పర్యావరణ అనుమతులు లేకుండానే చేపట్టిన డిండి పనులను ఆపేయాలని 2022 డిసెంబర్లో జాతీయ గ్రీన్‌ట్రిబ్యునల్ ఆదేశించింది. అంతేకాదు రూ.92.85 కోట్ల జరిమానా కూడా విధించింది. దీంతో ప్రభుత్వం పర్యావరణ అనుమతులు సాధించే బాధ్యతను ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు (ఈపీటీఆర్ఐ) అప్పగించింది. ఇంతవరకు అనుమతుల వ్యవహారం కొలిక్కి రాలేదు. భూసేకరణ, నిర్వాసితుల సమస్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ పథకానికి డిటైయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయాలని 2007లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడే వరకు కూడా డీపీఆర్‌లు ప్రభుత్వానికి అందలేదు. చివరకు 2015లో జూన్ 11వ తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకానికి ఉత్తర్వులు (జీఓ 107) జారీ చేసింది. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లోని 3.61 లక్షల ఎకరాల్లో ఆయకట్టుకు నీరందించేందుకు రూ.6,194 కోట్లతో ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. అయితే పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్‌ను ఆమోదించి, నిధులు కేటాయించి పనులను వేగంగా చేయించిన నాటి ప్రభుత్వం డిండి డీపీఆర్‌ను ఆమోదించలేదు. అయినా కొంత డబ్బు కేటాయించి 2015లో శివన్నగూడెంలో రిజర్వాయర్ల పనులను శంకుస్థాపన చేసి చేపట్టింది. ఉల్పరకు దిగువ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన కాలువ, డిండి ప్రాజెక్టు ఎత్తు పెంపు, అప్రోచ్ చానల్స్, సింగరాజుపల్లి, ఎర్రవల్లి–గోకారం, ఇర్విన్, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్మాణాలకు సుమారు 16,030 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 12,052 ఎకరాల భూమినే సేకరించారు. భూసేకరణతో నిర్వాసితులు అయ్యే దాదాపు 1,899 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇప్పటివరకు ప్యాకేజీలు కుదరకపోవడంతో నిర్వాసితుల ఆందోళన చేస్తున్నారు. పర్యావరణ అనుమతులు సాధిస్తే అన్ని పనులు వేగిరం అవుతాయి. -
‘నార్లాపూర్’ అంచనాలు పైపైకి!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ సవరణ అంచనాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్యాకేజీ–2 కింద రూ. 800 కోట్ల అంచనా వ్యయంతో రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రారంభించగా గతంలో రూ. 1,448 కోట్లకు అంచనాలు పెంచారు. తాజాగా రూ. 1,784 కోట్లకు అంచనాలను సవరించాలనే ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించినట్లు తెలియవచ్చింది. రాఘవ కన్స్ట్రక్షన్స్–కేఎన్ఆర్ జాయింట్ వెంచర్ ఈ రిజర్వాయర్‌ను నిర్మిస్తోంది. ఏదుల–డిండి అలైన్మెంట్ పనులకు పచ్చజెండాపాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లను తరలించడానికి రూ. 1,788.89 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన అలైన్మెంట్ పనులకు మంత్రివర్గం ఆమోదించింది. ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్‌కు గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు 800 మీటర్ల అప్రోచ్ కాల్వను.. ఆ తర్వాత వరుసగా 2.525 కి.మీ.ల ఓపెన్ కెనాల్, 16 కి.మీ.ల సొరంగం, 3.05 కి.మీ.ల ఓపెన్ కెనాల్, 6.325 కి.మీ.ల వాగు నిర్మాణం కలిపి మొత్తం 27.9 కి.మీ.ల పొడవున కాల్వలు, సొరంగం పనులు చేపట్టనున్నారు. పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్ వద్ద రబ్బర్ డ్యామ్‌ను సైతం నిర్మించనున్నారు. వనపర్తి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్‌కు.. అక్కడి నుంచి ఉల్పర బరాజ్, డిండి, సింగరాజుపల్లి, ఎర్రపల్లి–గోకవరం, ఇర్వేన్, గొట్టిముక్కల, చింతపల్లి, కిస్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్లకు నీటిని తరలిస్తారు. నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీటి తరలింపు ప్యాకేజీ–3 అంచనా వ్యయాన్ని రూ. 416 కోట్ల నుంచి రూ. 780 కోట్లకు పెంచాలన్న ప్రతిపాదనలను మంత్రివర్గం తిరస్కరించినట్లు తెలిసింది. సరైన రీతిలో ప్రతిపాదనలను తమ ముందుంచాలని ఉంచాలని సూచించినట్లు సమాచారం. ‘పీఆర్’లో 588 కారుణ్య నియామకాలకు ఓకే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కారుణ్యనియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 588 కారుణ్య నియామకాలపై ఆర్థిక శాఖ, సీఎంను ఒప్పించి కారుణ్య నియామకాలకు మంత్రి సీతక్క అడ్డంకులు లేకుండా చేశారు. ఈ సందర్భంగా కారుణ్య నియామకాల్లో చేరబోతున్న అభ్యర్థులు మంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. 201 కొత్త గ్రామ పంచాయితీలు, 11 కొత్త మండలాలు, మరో 11 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
ఏదుల నుంచే ‘డిండి’కి నీళ్లు!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లను తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్‌కు నీళ్లను తరలించే అలైన్మెంట్ పనులకు రూ.1,788.89 కోట్ల అంచనా వ్యయంతో నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నెల 4న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదనలు రానున్నాయి. మంత్రివర్గం ఆమోదించిన వెంటనే పనులకు పరిపాలనా అనుమతులు జారీచేసి, ఆ వెంటనే టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 27 కి.మీ.ల అనుసంధానం ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్ కు గ్రావిటీ ద్వారా నీళ్లను తరలించేందుకు 800 మీటర్ల అప్రోచ్ కాల్వను.. ఆ తర్వాత వరుసగా 2.525 కి.మీ.ల ఓపెన్ కెనాల్, 16 కి.మీ.ల సొరంగం, 3.05 కి.మీల ఓపెన్ కెనాల్, 6.325 కి.మీల వాగు నిర్మాణం కలిపి మొత్తం 27.9 కి.మీ.ల పొడవున కాల్వలు, సొరంగం పనులు చేపడతారు.వనపర్తి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్‌కు.. అక్కడి నుంచి ఉల్పర బరాజ్, డిండి, సింగరాజుపల్లి, ఎర్రపల్లి–గోకవరం, ఇర్వేన్, గొట్టిముక్కల, చింతపల్లి, కిస్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్లకు నీళ్లను తరలిస్తారు. 55 శాతం పనులు పూర్తి శ్రీశైలం జలాశయం ఫోర్‌షోర్ నుంచి రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 60 రోజులపాటు మొత్తం 30 టీఎంసీల నీటిని తరలించి ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని దేవరకొండ, మునుగోడు, నాగార్జునసాగర్, నకిరేకల్, నల్లగొండ, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో 3.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు డిండి ఎత్తిపోతల పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. రూ.6,190 కోట్ల అంచనాలతో 2015 జూన్ 11న ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. ప్రాజెక్టు మొత్తంలో ఇప్పటివరకు రూ.3,441.89 కోట్ల విలువైన పనులు పూర్తి కాగా, మరో రూ.2,748.11 కోట్ల విలువైన పనులు చేపట్టాల్సి ఉంది. ఈ లెక్కన ఇప్పటివరకు 55 శాతం పనులు పూర్తయినట్టే. గతంలో రూ.3,929.66 కోట్లతో 7 ప్యాకేజీల పనులకు టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకున్నారు. మిగిలినపనులకు ఇంకా టెండర్లు నిర్వహించలేదు. ఇప్పటివరకు 12,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి రాగా, ఇంకా 3,49,000 ఎకరాల ఆయకట్టుకు రావాల్సి ఉంది. మిగిలిన 45 శాతం పనులు పూర్తయితే మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. రిజర్వాయర్లకు భూసేకరణ సమస్య ఈ ప్రాజెక్టులో భూసేకరణ సమస్యలతో రిజర్వాయర్ల పనులు ముందుకు సాగడం లేదు. సింగరాజుపల్లి (85 శాతం), గొట్టిముక్కల (98 శాతం) రిజ ర్వాయర్ల పనులు దాదాపుగా చివరి దశలో ఉన్నాయి. కిస్టరాంపల్లి (70 శాతం), శివన్నగూడెం (70 శాతం) రిజర్వాయర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. భూసే కరణ సమస్యలతో చింతపల్లి (0 శాతం), ఎర్రపల్లి–గోకవరం (26 శాతం) రిజర్వాయర్ల పనులు ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. ఇదే సమస్యతో ఇర్వేన్ రిజర్వాయర్ పనులు మొదలే కాలేదు. ప్రాజెక్టు అవసరాలకు 16,030 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 12,052 ఎకరాలు సేకరించగా, మిగిలిన 3,977 ఎకరాలు సేకరించాల్సి ఉంది. వీడని పర్యావరణ చిక్కులు పర్యావరణ అనుమతులు లేకుండానే డిండి ప్రాజెక్టు పనులను చేపట్టినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) 2022 డిసెంబర్ 12న రాష్ట్ర ప్రభుత్వానికి రూ.92.85 కోట్ల జరిమానా విధించడంతో పాటు పనులపై స్టే విధించింది. ఎన్జీటీ స్టే ఎత్తేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉంది. మరోవైపు పర్యావరణ అనుమతులు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పర్యావరణ అనుమతులు సాధించే పనులను రూ.87.75 లక్షలతో ఎని్వరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ)కు 2022 ఫిబ్రవరిలో ప్రభుత్వం అప్పగించినా, ఆశించిన ఫలితం కనిపించలేదు. -
‘పాలమూరు’పై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు వరప్రదాయిని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై నీలినీడలు కము్మకున్నాయి. ప్రాజెక్టుకి నీటి కేటాయింపులను ప్రశ్నిస్తూ తాజాగా డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం తిప్పిపంపడంతో ప్రాజెక్టు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఇప్పటికే తీవ్ర ఉల్లంఘనల ఆరోపణలతో పర్యావరణ అనుమతులిచ్చేందుకు కేంద్రం ససేమిరా నిరాకరిస్తుండగా, దీనికి నిధులు, పెండింగ్ బిల్లుల సమస్య తోడుకావడంతో ప్రాజెక్టు నిర్మాణం నీరసించిపోయింది. తాజాగా నీటి కేటాయింపుల అంశం తెరపైకి రావడంతో ప్రాజెక్టు భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది. ట్రిబ్యునల్ ఏమంటుందో..? పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే దానికి బదులుగా సాగర్ ఎగువ రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకునే అవకాశాన్ని దశాబ్దాల కిందట గోదావరి ట్రిబ్యునల్ కల్పించింది. ఈ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటకలు 35 టీఎంసీలు వాడుకోగా, మిగిలి ఉన్న 45 టీఎంసీలు తమవేనని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కొట్లాడుకుంటున్నాయి. ఈ 45 టీఎంసీలకు తోడుగా మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన మరో 45 టీఎంసీలను కలిపి మొత్తం 90 టీఎంసీల జలాలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే దీనిని ఏపీ వ్యతిరేకిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగర్ ఎగువన ఉమ్మడి ఏపీకి లభ్యతలోకి వచ్చిన 45 టీఎంసీల జలాల వినియోగంపై ఏ రాష్ట్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాతో పాటు పోలవరం నిర్మాణంతో సాగర్ ఎగువన లభ్యతలోకి వచి్చన 45 టీఎంసీల జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేసే బాధ్యతను కృష్ణా ట్రిబ్యునల్–2కు గతేడాది కేంద్రం అప్పగించింది. ప్రస్తుతం కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో ఉన్నందున ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించలేమని సీడబ్ల్యూసీ స్పష్టం చేయడంతో ట్రిబ్యునల్ తీసుకోనున్న నిర్ణయంపైనే ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంది. పనులు నత్తనడక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో ‘పాలమూరు’ను చేర్చింది. ఏటా రూ.6 వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేసి వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ప్రస్తుత ఏడాది (2024–25)లో రూ.6130 కోట్లు, వచ్చే ఏడాది (2025–26) రూ.6313 కోట్ల పనులు చేయాలని నిర్దేశించుకుంది. అయితే గత ఏడాది కాలంలో రూ.4743 కోట్లు విలువైన పనులు మాత్రమే జరగడంతో నిర్దేశిత గడువు నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లుల్లో రూ.1500 కోట్లు చెల్లించినప్పటికీ మరో రూ.1437 కోట్ల మేర బిల్లులను చెల్లించాల్సి ఉంది. ఒక్క ఎకరాకూ అందని నీరు శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీల జలాలను తరలించి నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 1200 గ్రామాలకు తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. రూ.35,200 కోట్ల అంచనాలతో 2015 జూన్ 10న ప్రాజెక్టుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనపర అనుమతులు జారీ చేయగా, తర్వాత అంచనా రూ.55,086 కోట్లకు ఎగబాకింది. గత ప్రభుత్వం రూ.27,554 కోట్ల విలువైన పనులు చేయగా, మొత్తం రూ.32,297 కోట్లు విలువైన పనులు పూర్తిచేసినా, ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందలేదు. ప్రాజెక్టుకు మరో రూ.22,789 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఉద్దండాపూర్ పనులను అడ్డుకుంటున్న రైతులు... స్థానిక రైతులు, గ్రామస్తులు అడ్డుకోవడంతో ఈ ప్రాజెక్టు ఆరు రిజర్వాయర్లలో ఒకటైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు 2023 నవంబర్ నుంచి నిలిచిపోయాయి.ముంపునకు గురైన ఉద్దండాపూర్, వల్లూరు, పొలేపల్లి గ్రామాలతో పాటు శామగడ్డ, ఒంటిగుడిసె, చిన్నగుట్ట, రాగడిగుట్ట తండాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తక్షణం రూ.30 కోట్ల పరిహారంగా చెల్లిస్తేనే పనుల పునరుద్ధరణ జరగనుంది. కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌పై మీమాంస గత ప్రభుత్వం ఉద్దండాపూర్ సహా 5 రిజర్వాయర్ల పనులను మాత్రమే ప్రారంభించింది. చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని విరమించుకుని ప్రత్యామ్నాయ మార్గంలో ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను నిర్మిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చినా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లభించని పర్యావరణ అనుమతులు పర్యావరణ అనుమతుల్లేకుండానే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేపట్టి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినందుకు గాను పర్యావరణ పరిహారంగా రూ.528 కోట్లను చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది. తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు మరో రూ.300 కోట్ల జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఈ ప్రాజెక్టుకు పలు షరతులతో పర్యావరణ అనుమతులు జారీ చేయాలని గతేడాది సిఫారసులు చేసింది.పర్యావరణ పునరుద్ధరణకు రూ.153 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పీసీబీ కేసును ఫైల్ చేసింది. తీవ్ర పర్యావరణ ఉల్లంఘనల ఆరోపణలుండడంతో, ఈఏసీ సిఫారసులు చేసినా కేంద్రం పర్యావరణ అనుమతులివ్వడం లేదు. -
ప్రాజెక్టుల్ని పరిగెత్తించండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మినహా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పాలమూరు–రంగారెడ్డితో పాటు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి సూక్ష్మ స్థాయిలో నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా ఆయకట్టుపై నివేదిక సమరి్పంచాలని కోరారు. అన్ని ప్రాజెక్టులపై స్టేటస్ రిపోర్ట్ (స్థాయీ నివేదిక) సమరి్పంచాలని ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి, విద్య, వైద్య సదుపాయాలపై జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులపై కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి ‘పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూసేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులు రెండో ప్రాధాన్యత కింద చెల్లించాలి. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే పనులపై దృష్టి సారించాలి. గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ నెల 14 లేదా 15న సాగునీటి శాఖ మంత్రితో సమీక్షించి.. అదే రోజు ఆమోదం తీసుకోవాలి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సందర్శించి కార్యాచరణ రూపొందించాలి..’అని సీఎం సూచించారు. నెట్టెంపాడు రీ ఎగ్జామిన్ చేయాలి ‘జవహర్ నెట్టెంపాడు ప్రాజెక్టు మొత్తాన్ని మరోసారి పునఃపరిశీలన జరపాలి. సాంకేతిక అంశాలతో పాటు ఇతర సమస్యలను గుర్తించాలి. ప్రాజెక్టు పూర్తికి ఎంత సమయం పడుతుంది? ఎంత మొత్తం నిధులు కావాలో అధికారులు నివేదిక సమరి్పంచాలి. ఇరిగేషన్ శాఖ మంత్రితో చర్చించి తుది ప్రతిపాదనలు తయారు చేయాలి. ఆర్డీఎస్కు సంబంధించి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో చర్చించాల్సిన విషయాలు, పరిష్కరించాల్సిన అంశాలను రూపొందించాలి. తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తికి ప్రతిపాదనలు తయారు చేయాలి. ఆర్డీఎస్‌పై కొత్త ప్రతిపాదన లేమిటో తగిన ఆలోచన చేసి సమర్పించాలి..’అని రేవంత్ చెప్పారు. మహబూబ్‌నగర్ నుంచే పైలట్ ప్రాజెక్టు ‘జిల్లా కేంద్రంలో ఆస్పత్రులు, కళాశాలలు ఒకే చోట ఉండరాదు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయం ఆలోచించాలి. మహబూబ్‌నగర్ వంటి అత్యంత వెనుకబడిన జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖలోని సమస్యలను అధిగమించేందుకు అధ్యయనం చేయాలి. సమస్యల పరిష్కారాన్ని మహబూబ్‌నగర్ నుంచే పైలట్ ప్రాజెక్టు చేపట్టాలి. పాఠశాలలు తనిఖీ చేయాలి అన్ని గ్రామ పంచాయతీల్లో తప్పనిసరిగా ప్రభుత్వ బడి, ప్రతి మండలంలో జూనియర్ కళాశాల, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఉండాలి. ఒకవేళ లేకుంటే ఏర్పాటు చేసేందుకు అవకాశాలు పరిశీలించాలి. ప్రతి పార్లమెంట్ యూనిట్ ఆధారంగా నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాలు, మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల వివరాలు సమర్పించాలి. డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ ప్రతిరోజూ పాఠశాలలను తనిఖీ చేసి జిల్లా కలెక్టర్లకు నివేదించాలి. కలెక్టర్లు వారంలో ఒకరోజు పాఠశాలలు, ఆస్పత్రులను తప్పకుండా తనిఖీ చేయాలి. ఎవరైతే విధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారో వారిపై చర్యలు తీసుకోవాలి..’అని రేవంత్ చెప్పారు. ఆకస్మిక తనిఖీలు..అవసరమైతే చర్యలు ‘ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి రోజున జీతాలు ఇస్తున్నాం. విద్యా శాఖలో అందరికీ ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాం. ఉద్యోగులు, టీచర్లు వారి బాధ్యతను వారు నెరవేర్చాలి. ఇకపై నేను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తా. అవసరమైతే పై అధికారులపైనా చర్యలు తీసుకుంటాం. సెక్రటేరియట్ నుంచి గ్రామపంచాయతీ వరకు హాజరు విషయంలో ఫేస్ రికగ్నిషన్ యాప్ పెడతాం. సెక్రటేరియట్లో కూడా హాజరు పరిశీలిస్తాం..’అని సీఎం తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని ప్రాజెక్టుల కింద ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుపై ప్రతిపాదనలతో వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా మాట్లాడారు. సమావేశానికి ముందు సీఎం రేవంత్ రూ.396.06 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు రూ.334.02 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కు అందజేశారు. సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, డీకే అరుణతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలెక్టర్ విజయేందిర బోయి తదితరులు పాల్గొన్నారు. నెలకోసారి సమీక్ష ‘అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణతో పాటు ఆర్అండ్ఆర్ చెల్లింపులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రాజెక్టులను 18 నెలల్లో పూర్తి చేయాలి. ఆయా ప్రాజెక్టుల కింద కొత్త ప్రతిపాదనలను న్యాయపరమైన వివాదాలకు అవకాశం లేకుండా రూపొందించాలి. ప్రస్తుతం చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేయాలి. ప్రతి ప్రాజెక్టుపై 30 రోజులకు ఒకసారి సమీక్ష ఉంటుంది. అన్ని ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో సందర్శించి పూర్తి నివేదిక ఇవ్వాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. -
‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కోరారు. అదేవిధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం అధిక నిధులు కేటాయించాలని.. రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) పూర్తి చేసేందుకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) నిధుల విడుదల విషయంలో కొన్ని రాష్ట్రాలపట్ల పక్షపాతం చూపరాదని కేంద్రానికి సూచించారు. సీఎస్ఎస్ కింద రాష్ట్రానికి 2023–24కిగాను రూ.4.60 లక్షల కోట్లను విడుదల చేయాల్సి ఉండగా రూ. 6,577 కోట్లు మాత్రమే (1.4 శాతమే) విడుదలయ్యాయని అన్నారు. రాష్ట్ర జనాభా ప్రాతిపాదికన చూసినా ఇది చాలా తక్కువని.. అందువల్ల సీఎస్ఎస్ కేటాయింపులను జనాభా నిష్పత్తి ప్రకారం, నిర్ణీత సమయంలో తెలంగాణకు విడుదల చేయాలని కోరారు. శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన కేంద్ర బడ్జెట్ సన్నాహాక సమావేశం, జీఎస్టీ కౌన్సిల్ భేటీకి భట్టి విక్రమార్క రాష్ట్ర అధికారులతో కలసి హాజరయ్యారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి భేటీ వివరాలు వెల్లడించారు.వెనకబడిన జిల్లాల నిధులు విడుదల కాలేదుఏపీ పునర్విభజన చట్టం–2014 సెక్షన్ 94 (2) కింద తెలంగాణలోని వెనకబడిన జిల్లాలకు రావాల్సిన రూ. 2,250 కోట్లు ఇంకా విడుదల కాలేదని, వాటిని విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలను వెనుకబడినవిగా ప్రకటించి ఇచ్చిన గ్రాంటును వచ్చే ఐదేళ్లు పొడగించాలని కోరామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది సీఎస్ఎస్ గ్రాంట్ల రూపంలో తెలంగాణ కోసం విడుదలైన రూ. 495.21 కోట్లను కేంద్రం పొరపాటుగా ఏపీకి విడుదల చేసిందని.. ఈ మొత్తాన్ని త్వరగా తెలంగాణకు తిరిగి ఇవ్వాలని కోరినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రానికి మరిన్ని నవోదయ పాఠశాలలను కేటాయించాలని.. ప్రధాని సూర్యఘర్ పథకంలో విద్యుత్ సబ్సిడీ, ముఫ్తీ బిజిలీ పథకం కింద రా>ష్ట్ర సబ్సిడీ నిధులను రూటింగ్ చేయడానికి సహకరించాలని కోరినట్లు భట్టి వివరించారు.వీటికి జీఎస్టీ మినహాయించండినిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలు అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ నిర్మాణాలకు జీఎస్టీని తొలగించాలని లేదా తగ్గించాలని కోరారు. అలాగే తెలంగాణలో వాడే ఫెర్టిలైజర్‌పై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. బీడీ ఆకులపైనా జీఎస్టీని తగ్గించాలని కోరారు. అదనపు ఆల్కహాల్ (ఈఎన్ఏ)ని జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలన్నారు. అవగాహనలేమి వల్ల ఆలస్యంగా పన్ను చెల్లించిన వారిపై విధించిన పన్ను, జరిమానా, వడ్డీని కొన్ని షరతులకు లోబడి మినహాయించే ప్రతిపాదనపై జరిగిన చర్చలో పాల్గొని మద్దతు తెలిపారు.కొత్తవి పథకాలు ప్రవేశపెట్టండికేంద్ర ప్రాయోజిత పథకా (సీఎస్ఎస్)ల్లో షరతు లు, పరిమితులు విధించకుండా తెలంగాణకు వెసు లుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరినట్లు భట్టి చెప్పారు. సీఎస్‌ఎస్‌లను సమీక్షించి అనవసరమైన పథకాలను తొలగించి కొత్త పథకాలను ప్రవేశపెట్టా ల్సిన అవసరం ఉందని సూచించినట్లు చెప్పారు. ఆర్థిక సంఘాల సిఫారసుల ప్రకారం... పన్ను విభ జనలో ఆయా రాష్ట్రాలకు వాటా తగ్గిందన్నారు. కేంద్రం సెస్, సర్‌చార్జీల రూపంలో పన్నులు సేకరి స్తోందని.. ఇందులో రాష్ట్రాల వాటా పొందుపరచక పోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నా రు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రాష్ట్రాలకు నికర రుణపరిమితిని, సీలింగ్‌ని తెలియజేయాల ని.. దీనివల్ల రాష్ట్రాలు అభివృద్ధి కార్యక్రమాలకు తమ వనరులను సమర్థంగా ఖర్చు చేసేలా ప్రణా ళికలు రూపొందించుకోగలుగుతాయని నిర్మలా సీతారామన్‌కు చెప్పామన్నారు. -
డీపీఆర్ మార్చితే.. నిధులు నేనే తెస్తా
పాలమూరు: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి నీళ్లు తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి డీపీఆర్ మార్చితే.. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని మహ బూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రకటించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎన్నికల ఇన్చార్జ్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లాకు ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఎంపీటీసీగానే మాట్లాడుతున్నారని విమర్శించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమ ణారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ వైపు ఓటర్లు ఆసక్తి చూపారే తప్ప అది రేవంత్‌రెడ్డి గొప్పతనం ఏమా త్రం కాదన్నారు. ఆనాడు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్లను కొనుగోలు చేస్తున్నాడని ఆరోపించిన రేవంత్ ఇప్పుడు ఇతర పార్టీల వారిని ఎందుకు చేర్చుకుంటున్నారో చెప్పాలన్నారు. సీఎం రేవంత్ ఇంకా జెడ్పీటీసీ స్థాయిలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇద్దరు సీఎం అభ్యర్థులపై తాను విజయం సాధించానంటే బీజేపీ కార్యకర్తల వల్లేనని చెప్పారు. -
పాలమూరు బాధ్యత నాదే..! : సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘పాలమూరులో విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి తగిన నిధులు కేటాయించి వేగంగా పూర్తి చేస్తాం.. దేశంలోనే పాలమూరు ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.. ఇక్కడి బిడ్డగా పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాదే’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘పాలమూరు ప్రజాదీవెన’ బహిరంగసభలో ఆయన పాల్గొని లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ 3,650 రోజులు, కేంద్రంలో మోదీ 3,650 రోజులు అధికారంలో ఉన్నారని.. వీళ్లు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కరీంనగర్ నుంచి పాలమూరుకు వస్తే ఆయనను ఇక్కడి ప్రజలు ఎంపీగా గెలిపించారని గుర్తుచేశారు. ఆనాడు తుమ్మిళ్ల వద్ద కుర్చీ వేసుకొని ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి మరిచాడని, పదేళ్లు అయినా ఆ పనులు పూర్తి చేయలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి జిల్లాలో ఉన్న ఆర్డీఎస్, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు, కల్వకుర్తి, కొడంగల్– నారాయణపేట ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలని, పచ్చని పంటలు పండాలనే ఉద్దేశంతో సమీక్ష చేశామన్నారు. ఈ ధైర్యం ఇక్కడి బిడ్డల చలువే.. ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినప్పుడు నెహ్రూ పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావును మొదటి సీఎంగా చేసి ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ తర్వాత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని.. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఈ పదేళ్లు దుర్మార్గుడు, దుష్టుడు రాష్ట్రాన్ని పరిపాలించాడన్నారు. గుర్తించిన ఉద్యమకారులు, నిరుద్యోగ యువత, అన్నివర్గాల లక్షలాది మంది ప్రజలు నడుం బిగించి రాష్ట్రానికి పట్టిను పీడ నుంచి విముక్తి కల్పించారన్నారు. డిసెంబర్ 3న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రాగా.. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీ సహకారంతో మళ్లీ పాలమూరు బిడ్డకు సీఎంగా అవకాశం వచ్చిందన్నారు. మా తాతలు, ముత్తాతలు ముఖ్యమంత్రి కాదు.. రూ.లక్షల కోట్లు ఇవ్వలేదు.. మా అయ్య పేరు చెప్పుకొని ఈ కుర్చీలో కూర్చోలేదు.. 2006లో సామాన్య కార్యకర్తగా ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గెలిచానని.. మిడ్జిల్ జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా మీరందరూ కష్టపడి నన్ను గెలిపించారన్నారు. తెలంగాణలో సీఎంగా నిటారుగా నిలబడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరితోనైనా కొట్లాడటానికి ఈ ధైర్యం ఉందంటే పాలమూరు బిడ్డలు ఇచ్చిన ఆత్మవిశ్వాసమే కారణం అన్నారు. పాలమూరు ప్రజాదీవెన బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన కొనసాగింది. సీఎం రేవంత్‌రెడ్డి సాయంత్రం 6.28 గంటలకు ఎంవీఎస్ మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదికపైకి వచ్చారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జీఎంఆర్ సీఎం రేవంత్‌రెడ్డిని మొదట సత్కరించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన భారీ చిత్రపటాన్ని కాంగ్రెస్ నేతలు అందజేశారు. రాత్రి 7.38 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రారంభమై.. రాత్రి 8.17 గంటలకు ముగిసింది. మొత్తం 39 నిమిషాల పాటు మాట్లాడారు. రాత్రి 8.20 గంటలకు సీఎం కాన్వాయ్ సభాస్థలం నుంచి బయలుదేరి క్రిస్టియన్‌పల్లి నుంచి బైపాస్ మీదుగా హైదరాబాద్ వెళ్లింది. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో జనంలో మధ్యలో ఓ యువకుడు గురుకులాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్లకార్డు ప్రదర్శించడంతో పోలీసులు అడ్డుకున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడలో సీఎం రేవంత్‌రెడ్డి రాత్రి భోజనం చేశారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. చల్లా, మన్నెను గెలిపించాలి.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్పీ ఎన్నికలు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా మన్నె జీవన్‌రెడ్డిని అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించనుంది. ఆ రోజు నన్ను ఏ విధంగా గెలిపించారో.. జీవన్‌రెడ్డిని అదేవిధంగా గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఆయన జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యుల మర్యాదను కాపాడుతారన్నారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డితో పాటు నాగర్‌కర్నూల్ అభ్యర్థిని గెలిపించాలని.. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలని విజ్ఞప్తి చేశారు. మూడు, ఆరు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇటు కేసీఆర్, అటు మోదీ అంటున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. పాలమూరోడు సీఎం అయిండని కేసీఆర్ అసూయ పడుతున్నారని.. పాలమూరు బిడ్డ సీఎం కాకూడదా.. ఇక్కడి ప్రజలు విద్యావంతులు కాదా అని ప్రశ్నించారు. 2014లో నాగం జనార్దన్‌రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీగా నిలబడినప్పుడు పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇస్తామని మోదీ హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అసెంబ్లీ ఎన్నికల కంటే అధిక మెజార్టీ రావాలన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. పాలమూరులో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను బొందపెట్టాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఇవి చదవండి: ఎవరు ఎటువైపు.. ‘గులాబీ’ గూటికి పగుళ్లు! -
రాజకీయ భిక్ష పెట్టిన జిల్లాకే అన్యాయం
దేవరకద్ర/జడ్చర్ల/కొందుర్గు: పాలమూరు– రంగారెడ్డి పథకాన్ని ఎండబెట్టారని, మేడిగడ్డను బొందపెట్టారని ఏఐసీసీ నేత వంశీచంద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చలో పాలమూరు– రంగారెడ్డి రిజర్వాయర్ల సందర్శన చేపట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి భూత్పూర్ మండలం కర్వెన, జడ్చర్ల మండలం ఉద్ధండాపూర్ రిజర్వాయర్లను సందర్శించారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరిగూడ మండలం లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని కూడా ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వంశీచంద్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు వాస్తవ రూపం ప్రజలకు తెలియాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 2015 లో శిలాఫలకం వేసిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కూర్చొని మూడేళ్లలో పూర్తి చేస్తానని గొప్పలు చెప్పిన కేసీఆర్.. రెండుసార్లు అధికారంలోకి వచ్చి నా ఒక్క ఎకరాకు నీరివ్వలేదని వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. పాల మూరు జిల్లా ఎడారిగా మారుతున్నా పట్టించుకోలేదని, 2009లో ఎంపీగా గెలిపించి రాజకీయంగా భిక్ష పెట్టిన జిల్లాకే తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేయడానికి ఒక పంపును నామమాత్రంగా ప్రారంభించి పూర్తి చేశామని గొప్పలు చెప్పారని విమర్శించారు. కర్వెన రిజర్వాయర్ ఇప్పటికీ అసంపూర్తి పనులతో అస్తవ్యస్తంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా అభివర్ణించిన కాళేశ్వరంను బొంద పెట్టారన్నారు. కమీషన్ల కక్కుర్తితో మేడిగడ్డ పగుళ్లతో కుంగిపోవడానికి కారణం అయ్యారని ఆరోపించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులకు పిచ్చి పట్టిందని.. ఎర్రగడ్డకు వెళ్లాల్సిన నాయకులు, మేడిగడ్డకు వెళ్లారని ఎద్దేవా చేశారు. బృందంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, పరి్ణకారెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకర్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు. -
జాతీయ హోదా చాన్స్ లేదు
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ప్రాజెక్టుకు మరో రకంగా సాయం అందిస్తామని పేర్కొంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో కూడిన రాష్ట్ర బృందానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఏఐసీసీ నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్, ఉత్తమ్.. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. షెకావత్‌తో సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, సీఎస్ శాంతికుమారి, సాగునీటి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్, సీఈ హమీద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ హోదా పరిశీలనే లేదు.. పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదాతో పాటు వివిధ అనుమతులకు సంబంధించిన రెండు వినతిపత్రాలను రాష్ట్ర బృందం షెకావత్‌కు అందజేసింది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. ‘‘ప్రస్తుతం దేశంలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే విషయాన్ని కేంద్రం పరిశీలించడంగానీ, పరిగణనలోకి తీసుకోవడంగానీ లేదు. జాతీయ హోదా అంశాన్ని కేంద్రం పక్కనపెట్టింది. పోలవరం తర్వాత కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు ఇచ్చిన జాతీయ హోదానే వెనక్కి తీసుకోవాలనే యోచన ఉంది. అయితే జాతీయ హోదాకు బదులు పాలమూరు ప్రాజెక్టుకు మరో రకంగా సాయం చేస్తాం. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60ః40 నిష్పత్తిన నిధులు ఇచ్చేందుకు కృషి చేస్తాం. ఈ పథకం ద్వారా గరిష్ట సాయం అందేందుకు ఆస్కారం ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. అనుమతులు ఇప్పించండి పాలమూరు ప్రాజెక్టును మిగులు జలాల ఆధారంగా చేపట్టినా.. తర్వాత ప్రభుత్వం 75శాతం డిపెండబులిటీ ఆధారంగా ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటిని కేటాయించిందని కేంద్ర మంత్రికి రాష్ట్ర బృందం తెలిపింది. ఇందులో మైనర్ ఇరిగేషన్ కింద వినియోగించుకోలేని 45 టీఎంసీలు, గోదావరి మళ్లింపు జలాల ఆధారంగా రాష్ట్రానికి దక్కే వాటా 45 టీఎంసీలు ఉన్నాయని వివరించింది. రూ.55,086 కోట్ల వ్యయఅంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర జల సంంఘం పరిశీలనకు పంపామని వెల్లడించింది. ప్రాజెక్టుకు ఇప్పటివరకు అటవీ, పర్యావరణ, వైల్డ్‌లైఫ్ వంటి అనుమతులు వచ్చాయని.. హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, కాస్ట్ ఎస్టిమేట్, అంతర్రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన అనుమతులు రావాల్సి ఉందని తెలిపింది. ఈ అనుమతులు వీలైనంత త్వరగా ఇప్పించేలా చొరవ చూపాలని కోరింది. సానుకూలంగా స్పందించారు: ఉత్తమ్ ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా విధానం లేదని కేంద్ర‡ మంత్రి షెకావత్ చెప్పారని భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాకు తెలిపారు. ఇతర పథకాల కింద పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ప్రాజెక్టుకు ఇంకా రావాల్సిన అనుమతులు ఇప్పించే అంశంపై సానుకూలంగా స్పందించారని వివరించారు. కేంద్రం వేరే విధంగా సాయం చేస్తామన్న కేంద్ర మంత్రి హామీకి రాష్ట్రం ఓకే చెప్పిందా? అని ప్రశ్నించగా.. దీనిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ‘విభజన’ను పూర్తి చేయండి తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్‌లనే కేటాయించారని తెలిపారు. జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు ఇవ్వాలని కోరారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు అధికారులను అదనంగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రేవంత్ తొలిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఢిల్లీ నార్త్‌బ్లాక్‌లోని అమిత్ షా కార్యాలయంలో గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. ‘‘రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలి. పదో షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలి. ఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను సాఫీగా పూర్తి చేయాలి. చట్టంలో ఎక్కడా పేర్కొనకుండా ఉన్న సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్న విషయంపై దృష్టి సారించాలి. తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి రూ.88 కోట్లు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి రూ.90 కోట్లు అదనంగా కేటాయించాలి. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్, హైకోర్టు భవనం, లోకాయుక్త, ఎస్హెచ్ఆర్సీ వంటి భవనాలను వినియోగించుకున్నందున.. ఆ రాష్ట్రం నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.408 కోట్లు ఇప్పించాలి..’’ అని వినతిపత్రంలో కోరారు. ‘మెట్రో’ సవరణలను ఆమోదించండి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీతో భేటీ అయిన సీఎం రేవంత్ బృందం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించింది. ‘‘హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించండి. సవరించిన ప్రతిపాదనల ప్రకారం ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే విషయాన్ని పరిశీలించండి. హైదరాబాద్‌లోని మూసీ రివర్ ఫ్రంట్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్స్ వాటర్ స్పోర్ట్స్, బిజినెస్ ఏరియా, దుకాణ సముదాయాలతో బహుళ విధాలా ఉపయోగపడేలా చేయాలని నిర్ణయించాం. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అవసరమైన మద్దతు ఇవ్వాలి. రాష్ట్రంలో పేదలకు నిర్మించి ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు చేసేలా అనుమతి ఇవ్వాలి. తెలంగాణకు ఇళ్లు మంజూరు చేయడంతోపాటు పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలి..’’ అని రాష్ట్ర బృందం కోరింది. నేడు యూపీఎస్సీ చైర్మన్‌తో భేటీ సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ శుక్రవారం ఉదయం ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో భేటీ కానున్నారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని రూపొందించాలన్న ఉద్దేశంతో ఈ భేటీ జరగనుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత ప్రభుత్వం పేపర్ లీక్‌లతో టీఎస్పీఎస్సీని భ్రష్టు పట్టించిందని.. దానిని ప్రక్షాళన చేసే దిశగా అవసరమైన చర్యలపై యూపీఎస్సీ చైర్మన్‌తో చర్చిస్తామని వెల్లడించారు. -
అక్కడ పాలి'ట్రిక్స్' అంతా కూడాను పాలమూరు చూట్టే..!
నారాయణ్‌పేట్: రాజకీయ సమీకరణలకు కేరాఫ్‌గా నిలిచే పాలమూరుపైనే ప్రధాన రాజకీయ పార్టీలు కన్నేశాయి. ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ మరింత క్రియాశీలకంగా రంగంలోకి దిగుతున్నాయి. దక్షిణ తెలంగాణలో పాగా వేయాలంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లానే కీలకమని భావించిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఇందుకనుగుణంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. పీఆర్ఎల్ఐఎస్తో షురూ.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు బీఆర్ఎస్ ఏడు, కాంగ్రెస్ ఐదు, టీడీపీ రెండు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిణామాల క్రమంలో నారాయణపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలిచిన రాజేందర్‌రెడ్డి, మక్తల్‌లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి కారెక్కారు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో 13 స్థానాలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నుంచి ఒకే ఒక్కడు బీరం హర్షవర్ధన్‌రెడ్డి గెలుపొందినా.. ఆయన సైతం గులాబీ చెంతన చేరారు. ఈ గణాంకాలు బీఆర్ఎస్ ఆధిక్యతకు నిదర్శనంగా నిలుస్తుండగా.. ఆధిక్యాన్ని నిలుపుకునేందుకు ఆ పార్టీ పాలమూరునే ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి పాలమూరుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొల్లాపూర్‌లో మొదటి పంప్‌ను ప్రారంభించిన ఆయన.. పరోక్షంగా ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. కమలదళం సైతం.. ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత పాలమూరులోని జోగుళాంబ సాక్షిగా బీజేపీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. పలు నియోజకవర్గాల గుండా సాగిన యాత్ర ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అప్పటి నుంచి బీజేపీ ముఖ్యనేతలు క్రమం తప్పకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పర్యటించారు. మరోవైపు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరులో భారీ బహిరంగసభను నిర్వహించడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల శంఖరావాన్ని పూరించారు. ఇప్పటి వరకు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయనప్పటికీ.. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి నిత్యం వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలలు ప్రత్యేక దృష్టి సారించడం వెనుక బృహత్తర ప్రణాళిక ఉందని.. దక్షిణ తెలంగాణలో పాగా వేసేలా ముందుకు సాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ బస్సు యాత్ర కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే పాలమూరులో భారత్ జోడో యాత్ర నిర్వహించారు. వివిధ నియోజకవర్గాల గుండా సాగిన పాదయాత్రతో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. అదేవిధంగా సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పాలమూరు గుండానే కొనసాగింది. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, భట్టి తదితర ముఖ్యనేతలు ఉమ్మడి జిల్లాపైనే నజర్ వేసి పలు పర్యాయాలు పర్యటించారు. తాజాగా వారంలో అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే తదితర స్టార్ క్యాంపెయినర్లతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు సన్నద్ధమవుతున్న హస్తం నేతలు జోగుళాంబ అమ్మవారి సాక్షిగా అలంపూర్ నుంచి కొనసాగించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. -
‘పాలమూరు–రంగారెడ్డి’ జీవోపై సుప్రీంకోర్టుకు ఏపీ
సాక్షి, అమరావతి: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలు కేటాయించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల(జీవో)ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జీవోపై విచారణ చేపట్టడం తమ పరిధిలోకి రాదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్(ఐఏ)ను తిరస్కరిస్తూ కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–2) బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై మరో న్యాయస్థానాన్ని ఆశ్రయించే స్వేచ్చ ఏపీ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపుల వల్ల రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతుందని నివేదించనుంది. ఆ జీవోను రద్దు చేయడం ద్వారా ఏపీ హక్కులను పరిరక్షించాలని సుప్రీంకోర్టుకు విన్నవించనుంది. -
అది మా పరిధిలోకి రాదు
సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలను కేటాయిస్తూ ఆ రాష్ట్ర సర్కారు జారీ చేసిన జీవోపై విచారణ తమ పరిధిలోకి రాదని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 తేల్చి చెప్పింది. ఈ జీవోపై మరో న్యాయస్థానాన్ని ఆశ్రయించే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ జీవోను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ (ఐఏ)ను బుధవారం కొట్టివేసింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలను తరలించేందుకు తెలంగాణ సర్కారు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. చిన్న నీటిపారుదల విభాగంలో మిగులుగా ఉన్న 45 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగాను కృష్ణా జలాల్లో అదనంగా 45 టీఎంసీల వాటా తమకే దక్కుతుందని ఏకపక్షంగా తీర్మానించుకుని మొత్తం 90 టీఎంసీలను ఆ ఎత్తిపోతలకు కేటాయించుకుంటూ 2022 ఆగస్టు 18న తెలంగాణ ప్రభుత్వం జీవో 105 జారీ చేసింది. కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగాను నాగార్జునసాగర్‌కు ఎగువన కృష్ణా నదిలో 45 టీఎంసీలను అదనంగా వాడుకునే వెసులుబాటును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చింది. విభజన నేపథ్యంలో ఆ 45 టీఎంసీలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని, చిన్న నీటి వనరుల విభాగంలో కేటాయింపులకంటే తెలంగాణ అధికంగా వాడుకుంటున్నందున, జీవో 105ను రద్దు చేయాలంటూ కేడబ్ల్యూడీటీ–2లో గతేడాది ఏపీ ప్రభుత్వం ఐఏ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ బ్రిజేష్‌కుమార్ అధ్యక్షతన జస్టిస్ ఎస్.తాళపత్ర, జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి సభ్యులుగా ఉన్న కేడబ్ల్యూడీటీ–2 పలుమార్లు విచారించి, బుధవారం తుది తీర్పు ఇచ్చింది. విభజన చట్టంలో సెక్షన్–89(ఏ) ప్రకారం అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం–1956 కింద ఏర్పాటైన ట్రిబ్యునల్ నీటిని కేటాయించని ప్రాజెక్టులకు మాత్రమే నీటి కేటాయింపులు చేయడం తమ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను విభజన చట్టం అమల్లోకి వ చ్చిన తర్వాత తెలంగాణ చేపట్టిందని తెలిపింది. అందువల్ల ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై విచారణ చేసే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. -
విచారించే పరిధి మాకు లేదు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ గత ఏడాది ఆగస్టు 18న తెలంగాణ రాష్ట్రం జారీ చేసిన జీవో 246ను సవాలు చేస్తూ ఏపీ వేసిన కేసు (ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్)ను జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 కొట్టేసింది. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నిర్దిష్ట జల కేటాయింపులపై కృష్ణా ట్రిబ్యునల్–2 తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ జీవో అమలును నిలిపివేసి తమ రాష్ట్రానికి మధ్యంతర ఉపశమనం కల్పించాలంటూ ఏపీ వేసిన కేసును విచారించే పరిధి తమకు లేదని పేర్కొంది. చట్టానికి లోబడి ఉపశమనం కోసం మరో వేదికను ఆశ్రయించే స్వేచ్ఛను ఏపీకి కల్పించింది. ఈ మేరకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ తలపాత్ర, జస్టిస్ రామ్మోహన్‌రెడ్డితో కూడిన కృష్ణా ట్రిబ్యునల్–2 బుధవారం కీలక తీర్పు వెలువరించింది. మరోవైపు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పాత ప్రాజెక్టేనని, ఉమ్మడి రాష్ట్రంలోనే శ్రీకారం చుట్టారని తెలంగాణ చేసిన వాదనలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. గతేడాది డిసెంబర్ 8న ఏపీ ఈ కేసును దాఖలు చేయగా, రెండు రాష్ట్రాలు దాదాపు 4 నెలల పాటు ట్రిబ్యునల్ ముందు సుదీర్ఘ వాదనలు వినిపించాయి. ఈ జీవోతో ఏపీ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఏపీ చేసిన వాదనలతో తెలంగాణ విభేదించింది. పాలమూరు కొత్త ప్రాజెక్టే.. వేటిని కొత్త ప్రాజెక్టులుగా పరిగణించాలి అన్న అంశంపై రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రూపొందించిన మార్గదర్శకాల ఆధారంగా పాలమూరుపై ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక–ఆర్థిక సాధికారతపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మదింపు జరగని ప్రాజెక్టులు, టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ ఆమోదించని ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా పరిగణిస్తారు. ఇంటేక్ పాయింట్, ప్రాజెక్టు ప్రాంతం, కాల్వలు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఆయకట్టు ప్రాంతం, నిల్వ సామర్థ్యం, నీటి వినియోగం వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నా కొత్త ప్రాజెక్టులుగానే పరిగణిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 70 టీఎంసీల వరద జలాలను జూరాల ప్రాజెక్టు ఫోర్‌షోర్ నుంచి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిపాదించారు. అయితే తెలంగాణ వచ్చాక ప్రతిపాదనలను సమూలంగా మార్చివేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఫోర్‌షోర్ నుంచి 70 శాతం లభ్యత ఆధారంగా 90 టీఎంసీల నికర జలాలను తరలించేలా ప్రాజెక్టును ప్రతిపాదించిన నేపథ్యంలో దీనిని కొత్త ప్రాజెక్టుగా పరిగణిస్తున్నట్టు ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. గతంలో కేటాయింపులు జరపని ప్రాజెక్టులు మా పరిధిలోకి రావు.. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 89 అమలు బాధ్యతలను కృష్ణా ట్రిబ్యునల్–2 చేపట్టిన నేపథ్యంలో.. తెలంగాణ జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉపశమనం కల్పించే అధికారం ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉందని ఏపీ ప్రభుత్వం చేసిన వాదనలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. గతంలో కృష్ణా ట్రిబ్యునల్–1, కృష్ణా ట్రిబ్యునల్–2 లు గంపగుత్తగా కేటాయింపులు జరిపిన ప్రాజెక్టులకు మళ్లీ నిర్దిష్ట కేటాయింపులు జరిపే అధికారాన్ని మాత్రమే రాష్ట్ర పునర్వీభజన చట్టంలోని సెక్షన్ 89 కింద తమకు కేటాయించారని తెలిపింది. గతంలో ఏ ట్రిబ్యునల్ కూడా కేటాయింపులు జరపని ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాలు తమ పరిధిలోకి రావని పేర్కొంది. పునఃకేటాయింపులూ మా పరిధిలోనిది కాదు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పునః కేటాయింపులు జరిపే అంశం తమ పరిధిలో లేదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. కేవలం రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నిర్దిష్ట కేటాయింపులు జరపడమే తమ బాధ్యత అని పునరుద్ఘాటించింది. కాగా సెక్షన్ 89 కింద ట్రిబ్యునల్‌కు పరిమిత అధికారాలే ఉన్నాయని, ఏపీకి మధ్యంతర ఉపశమనం కల్పించే అధికారం అపెక్స్ కౌన్సిల్‌కు మాత్రమే ఉందని తెలంగాణ వాదించింది. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ 11 ప్రకారం జల వివాదాల విషయంలో సుప్రీం కోర్టుకు ఉన్న న్యాయ అధికారాలన్నీ ట్రిబ్యునల్‌కు ఉంటాయని 1993లో కావేరి ట్రిబ్యునల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని ఏపీ గుర్తు చేసింది. ఈ మేరకు అధికారాలను వినియోగించి మధ్యంతర ఉపశమనం కల్పించాలని ఏపీ విజ్ఞప్తి చేసింది. అయితే తమకు అప్పగించిన బాధ్యతలకు లోబడి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్ర పునర్వీభజన చట్టం 2014 వచ్చిన తర్వాత చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి వంటి కొత్త ప్రాజెక్టులు సెక్షన్ 89 కింద తమ పరిధిలోకి రావని కృష్ణా ట్రిబ్యునల్–2 తేల్చి చెప్పింది. ఇలావుండగా గతంలో గంపగుత్తగా కేటాయింపులు పొందిన ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులకు సెక్షన్ 89 కింద నిర్దిష్ట కేటాయింపులు జరిపే అంశం ఇంకా ట్రిబ్యునల్‌లో విచారణ దశలోనే ఉంది. నిర్ణయం వచ్చే సరికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
TS Election 2023: దేశంలోనే అగ్రగామిగా.. : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్: వ్యవసాయ రంగం అభివృద్ధిలో భాగంగా రైతులకు ఉచిత విద్యుత్‌తోపాటు పాలమూరు కరువును శాశ్వతంగా రూపుమాపాలన్న ఉద్దేశంతో రూ.35,200 కోట్లతో చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కలెక్టరేట్ భవన సముదాయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా కర్వెన రిజర్వాయర్ నుంచి సాగునీటిని తీసుకువచ్చి జిల్లా మొత్తం సస్యశ్యామలం చేస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు జిల్లాలో 2.18 లక్షల ఎకరాల సాగు మాత్రమే ఉండగా.. గత తొమ్మిదేళ్లలో సాగు విస్తీర్ణం 3.50 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. -
TS Election 2023: 'పాలమూరు నా గుండె..' ఇక్కడి ఎంపీగానే తెలంగాణ తెచ్చిన..! : సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘నాటి సమైక్య పాలనలో పాలమూరులో గంజి కేంద్రాలు పెట్టారు. ముఖ్యమంత్రులు దత్తత తీసుకున్నా విముక్తి లభించలేదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాతే పాలమూరుకు విముక్తి లభించింది. నెట్టెంపాడు, జూరాల, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతలను పూర్తి చేసుకున్నాం. వీటితో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. పాలమూరు ప్రాజెక్టును సైతం సాధించాం. త్వరలోనే పూర్తి చేసుకుంటాం. ఉమ్మడి జిల్లాలో 20 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే నా ఆశ. ఇక్కడి ఎంపీగానే తెలంగాణ తెచ్చిన..ఆ కీర్తి పాలమూరుకు ఎప్పటికీ ఉంటుంది. పాలమూరు నా గుండె.’అని సీఎం కేసీఆర్ ఉద్వేగంగా మాట్లాడారు. శనివారం కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు వెట్ రన్‌ను సీఎం ప్రారంభించి నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోతలను వీక్షించారు. కృష్ణమ్మకు వాయినం సమర్పించారు. అనంతరం కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడారు. నేడు దేశంలోనే జీడీపీ, తలసరి ఆదాయంలో మనరాష్ట్రమే నంబర్‌వన్‌గా ఉంది. ఈ పురోగతి, అభివృద్ధి ఇంతటితో ఆగద్దు. దొంగ నాయకులతో జాగ్రత్త. అలసత్వం వ హిస్తే వైకుంఠపాళిలో పెద్దపాము మింగినట్లయితది. అందరూ ఆలోచించాలి అని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల నేతలు వచ్చి ప్రాజెక్టులు తన్నుకుపోతుంటే.. పాలమూరు నేత లు మంగళహారతులు పట్టారని విమర్శలు గుప్పించారు. ► తెలంగాణ అభివృద్ధికి కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులతోపాటు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు దేశానికి అన్నం పెట్టే వజ్రపుతునకలుగా మారుతాయన్నారు. ఉద్యమ సమయంలో కర్వెన గుట్టల్లో మూడు రోజులు తిరిగా. పాలమూరు ప్రాజెక్టు నిర్మిస్తే మేలు జరుగుతుందని భావించా. ఇప్పుడు ఆ కల సాకారమైందన్నారు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు నది పారినట్లుగా, కృష్ణమ్మ తాండవం చేస్తున్నట్లుగా అనిపించింది. ఇంతమంచి కార్యక్రమం చేసినందుకు జీవితం ధన్యమైంది అని కేసీఆర్ అన్నారు. కేఎల్ఐ ప్రాజెక్టును కూడా గోకి పెండింగ్‌లో పెడితే దాన్ని పూర్తి చేశామని, దుందుభీలో ఒకప్పుడు దుమ్ము కొట్టుకుపోయేదని, ఇప్పుడు అక్కడ చెక్‌డ్యాం కట్టడంతో నీళ్లు ఆగి కనువిందు చేస్తోందన్నారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలనుకునే లక్ష్యంలో మీ అందరి దీవెనలు కావాలని కేసీఆర్ కోరారు. తలమాసినోళ్లు పైత్యపు మాటలు మాట్లాడతున్నారు..ఎన్నికల్లో మళ్లీ వస్తరు. కొద్దికొద్దిగా బాగుపడుతున్నం. వారి మాటలు వింటే ఆగమైతం. గోసపడతం అని కేసీఆర్ సూచించారు.ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు కేశవరావు, రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ విప్ గువ్వ ల బాలరాజు, ఎమ్మెల్సీలు వాణీదేవి, కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బాల్క సుమన్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరాల జల్లు.. బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పలు హామీలు ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి మేరకు మహబూబ్‌నగర్‌కు ఇంజినీరింగ్ కళాశాల, ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు కొల్లాపూర్‌కు ప్రభుత్వ పాల్టెక్నిక్ కళాశాల మంజూరు చేస్తానన్నారు. జీల్దార్తిప్ప చెరువు లిఫ్టు, మల్లేశ్వరం లిఫ్టులకు, బాచారం హైలెవెల్ కెనాల్, పస్పుల బ్రాంచి కెనాల్‌కు నిధులు మంజూరు చేస్తాని, నియోజకవర్గంలో చెక్‌డ్యాంల నిర్మాణాలకు రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తూ రేపే జీఓ విడుదల చేస్తామన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధి పనుల కోసం రూ.15 లక్షల చొప్పున, కొల్లాపూర్ మున్సిపల్ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. -
పాలమూరులో పాల నురగల జలహేల: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘పల్లేర్లు మొలిచిన పాలమూరులో పాల నురగల జలహేల కనిపిస్తోంది. వలసల వలపోతల గడ్డపై ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిష్కృతమైంది’అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. శనివారం పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం సందర్భంగా ‘కరువు కరాళనృత్యం చేసిన భూముల్లో కృష్ణమ్మ జలతాండవం, శెలిమలే దిక్కైన కాడ ఉద్దండ జలాశయాలు, బాయి మీద పంపుసెట్లు నడవని చోట బాహుబలి మోటార్లు‘ అంటూ కవితాత్మకంగా ట్వీట్ చేశారు. ‘స్వరాష్ట్ర ప్రస్థానంలో సగర్వ సాగునీటి సన్నివేశం, ఆరు జిల్లాలు సస్యశ్యామలం దక్షిణ తెలంగాణకు దర్జాగా జలాభిషేకం, నిన్న పరాయి నేలపైన ప్రాజెక్టులకు రాళ్లెత్తిన పాలమూరు లేబర్.. నేడు సొంత భూమిలో ప్రాజెక్టుల కింద రతనాలు పండిస్తున్న ఫార్మర్‘ అని వ్యాఖ్యానించారు. ‘నాడు నది పక్కన నేల ఎడారిలా ఎండిన విషాదం, సమైక్య పాలకుల పాపం, కాంగ్రెసోళ్ల శాపం. ఆటంకాలు అవరోధాలు అధిగమించి ప్రతిపక్షాల కుట్రలు, కేసులు ఛేదించి సవాల్ చేసి సాధించిన విజయం. నీటి వాటా తేల్చకుండా నిర్లక్ష్యం, అనుమతుల్లో అంతులేని జాప్యం.. అయినా కేంద్ర సర్కారు కక్ష, వివక్షను దీక్షతో గెలిచిన దృఢ సంకల్పం. తీరిన దశాబ్దాల నీటి వెత తెచ్చుకున్న తెలంగాణకు ఇదే సార్థకత‘ అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. -
ఆగమైతే గోసపడతాం!
‘స్కూల్’ ఫీజు కడితే ఎంబీబీఎస్ చదువు రాష్ట్రంలో జిల్లాకో వైద్య కళాశాల కట్టుకుంటున్నాం. నేడు స్కూల్ స్థాయిలో ఫీజు కడితే ఎంబీబీఎస్ చదువుకునే పరిస్థితి ఉంది. తమిళనాడులో స్కూల్ విద్యార్థులకు టిఫిన్ ఇస్తుండటం బాగుందంట. రాష్ట్ర బృందాన్ని అక్కడికి పంపాం. తెలంగాణలో టెన్త్ వరకు విద్యార్థులందరికీ ఉదయం టిఫిన్, కోడిగుడ్డు అందిస్తాం. – సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్: ఎన్నికలు వస్తున్నాయనగానే కొందరు గంటలు పట్టుకుని బయలుదేరుతారని.. అలా వస్తున్న పిచ్చివాళ్ల మాటలు నమ్మి ఆగమైతే గోసపడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. వారి చేతిలో ఒక్కసారి మోసపోతే వైకుంఠపాళిలో పెద్దపాములా మింగేస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు ఇంటి దొంగలే ప్రాణగండంలా మారారని మండిపడ్డారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో కృష్ణా తీరంలోని నార్లాపూర్ వద్ద పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కొల్లాపూర్ శివార్లలో నిర్వహించిన భారీ బహిరంగసభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఒకనాడు పాలమూరు బిడ్డ అంటే వలస కూలీలుగా పేరుపడితే.. నేడు బెంగాల్, యూపీ రాష్ట్రాలతోపాటు పక్కనున్న రాయచూర్, కర్నూల్ జిల్లాల నుంచి కూలీలను రప్పించుకొని పొలాల్లో పని చేయించుకుంటున్న రైతు బిడ్డగా మారాడు. పాలమూరు–రంగారెడ్డిలో ఒక్క పంపును నడిపితేనే వాగు పారేంత నీళ్లు తరలుతున్నాయి. త్వరలో మొత్తం పంపులు, కాలువలన్నీ పూర్తి చేస్తాం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని ప్రాంతాలకూ నీళ్లు అందుతాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని 20 లక్షల ఎకరాల్లో నీటి పారకాన్ని నా కళ్లతో చూసేదాకా ప్రజల దీవెనలు ఉండాలి. ఇప్పుడు ఇంటి దొంగలతోనే గండం ఉద్యమ సమయంలో జోగుళాంబ ఆలయం నుంచే మొదటి పాదయాత్రను ప్రారంభించా. పాలమూరును దత్తత తీసుకున్నామని అప్పట్లో సీఎం చంద్రబాబు, ఆయన తాబేదార్లు మాట్లాడారు. ఆర్డీఎస్ను మూసేయకపోతే బద్దలు కొడతామన్నారు. అదే నేను సుంకేశుల ప్రాజెక్టును వంద బాంబులు పెట్టి పేల్చుతానని చెప్పిన. మాకు కూడా బాంబులేసే మొనగాడు పుట్టిండని పాలమూరు ప్రజలు అప్పుడు సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రాజెక్టులకు ఇంటి దొంగలే, ఈ జిల్లాలో పుట్టిన సన్నాసులే ప్రాణగండంలా మారారు. ప్రాజెక్టు పనులకు అడ్డం పడ్డారు. లేకుంటే పాలమూరు ఎత్తిపోతల పథకం మూడు నాలుగేళ్ల కిందే పూర్తయ్యేది. ఆగమైతే గోస పడతాం.. ఎన్నికలు వస్తున్నాయనగానే కొందరు గంటలు పట్టుకుని బయలుదేరుతారు. నాడు రాష్ట్రం నుంచి బొంబాయి, దుబాయి వలసపోతే ఒక్కడూ సాయం చేయలే. కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చుకుని బాగుచేసుకుంటున్నాం. ఇలాంటి సమయంలో వస్తున్న పిచ్చివాళ్ల మాటలు నమ్మి ఆగమైతే.. గోసపడతాం. ఒక్కసారి మోసపోతే వైకుంఠపాళిలో పెద్దపాము లెక్క మింగేస్తారు. నేను హైదరాబాద్ నుంచి బస్సులో వస్తుంటే బీజేపీ వాళ్లు జెండాలు పట్టుకుని అడ్డం పడుతున్నారు. ఏం పాపం చేశాం, ఎవరిని మోసం చేశామని అడ్డుపడుతున్నారు. కృష్ణా ట్రిబ్యునల్‌లో నీటి వాటా కేటాయింపునకు పదేళ్లు పడుతుందా? సిగ్గు, చీము, నెత్తురు, పౌరుషం ఉంటే జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రులం అని చెప్పుకునేవారు ఢిల్లీలో కూర్చుని లేఖలు రాయాలి. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలి. కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రాకు చెప్పేది ఒక్కటే. మాకు ఎవరి నీళ్లూ అవసరం లేదు. మా వాటా మాకు చెబితే బాజాప్తాగా నీళ్లు తీసుకుంటాం. మేం మంది సొమ్ము అడుగుతలేం. మూడూ పూర్తయితే.. తెలంగాణ వజ్రపు తునకే! తెలంగాణలో అంచనాలు వేసుకొని, హక్కులు చూసుకొని, రావాల్సిన వాటాలు చూసుకొని మూడు పెద్ద ప్రాజెక్టులు మొదలు పెట్టుకున్నాం. గోదావరి మీద కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, పాలమూరు ఎత్తిపోతల. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ ఒక వజ్రపు తునకలా తయారై దేశానికే అన్నం పెట్టే స్థాయికి పోతుంది. మన రైతులు తలఎత్తుకొని బతుకుతారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కాళేశ్వరాన్ని వేగంగా పూర్తి చేసుకున్నాం. సీతారామ పనులు కూడా చకచకా జరుగుతున్నాయి..’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ట్రిబ్యునలే పట్టించుకుని ప్రాజెక్టు ఇచ్చింది మహబూబ్‌నగర్ చరిత్ర చెబితే ఆశ్చర్యం కలుగుతుంది. 1975లో బచావత్ ట్రిబ్యునల్ తీరి్పచ్చినప్పుడు ఏ ఒక్క తెలంగాణ నాయకుడు కూడా మా మహబూబ్‌నగర్‌కు నీళ్లేవని అడగలే. చివరికి ట్రిబ్యునల్ జడ్జి బచావత్ అనే ఆయనే.. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో కలవకుండా ఉండుంటే చాలా బాగుపడి ఉండేదన్నారు. కనీసం ఈ ప్రాంతానికి నీళ్లడగటం లేదని, తమకు చూడబుద్ధి కావడం లేదని చెప్పి.. తామే 17 టీఎంసీలతో జూరాల ప్రాజెక్టును మంజూరు చేస్తున్నామని చెప్పారు. అంతేకాదు జూరాల ప్రాజెక్టును ఏదో కారణం చెప్పి మరోచోటికి తరలించకుండా తాము సూచించిన చోటే కట్టాలన్నారు. ట్రిబ్యునల్ రికార్డుల్లో ఈ రోజుకూ ఈ విషయాలు ఉన్నాయి. అంత జరిగినా 1981 దాకా జూరాల ప్రాజెక్టును మొదలుపెట్టలే.. శంకుస్థాపన చేసినా పనులు చేయలే. 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మీటింగ్ పెట్టి నిలదీశాకే పూర్తిచేసి, నీళ్లు నిల్వ చేశారు. కేసీఆర్ పుణ్యంతో పాలమూరు పచ్చబడింది: నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ సీఎం కేసీఆర్ పుణ్యమా అని పాలమూరు గడ్డ పచ్చబడిందని, వలస వెళ్లినవారంతా తిరిగి వస్తున్నారని మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ కోసం 45వేల మంది 12 ఏళ్లపాటు పనిచేశారని.. సుమారు పదివేల మంది పాలమూరు బిడ్డలు ప్రమాదాల్లో మరణించినా ఈ గడ్డకు మాత్రం ఫలితం దక్కలేదని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అద్భుతమని అభివర్ణించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకప్పుడు వందల ఎకరాలు ఉన్నవాళ్లు కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని, ఇప్పుడు గ్రామాలకు తిరిగి వస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కాగా.. వలసల ప్రాంతంగా గుర్తింపు పొందిన పాలమూరు జిల్లాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి అన్నారు. పాలమూరు ప్రాజెక్టులోని ఏదుల సర్జిపూల్ ఆసియా ఖండంలోనే పెద్దదని, ఇంజనీరింగ్ అద్భుతమని పేర్కొన్నారు. పండుగలా ‘పాలమూరు’ ప్రారంభోత్సవం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. శనివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలసి ప్రగతిభవన్ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో నార్లాపూర్ పంపుహౌస్‌కు చేరుకున్నారు. తొలుత పంపుహౌస్ వద్ద ఏర్పాటుచేసిన పాలమూరు ప్రాజెక్టు పైలాన్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. తర్వాత కేసీఆర్ 145 మెగావాట్ల సామర్థ్యమున్న మొదటి మోటారును ఆన్ చేసి, నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. సర్జ్‌పూల్, పంపుహౌస్‌లను పరిశీలించారు. నార్లాపూర్ పంపుహౌజ్ వద్ద డెలివరీ సిస్టర్న్ నుంచి అంజనగిరి రిజర్వాయర్‌కు తరలుతున్న నీటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జలాలకు పూలు, సారె సమర్పించి, జలహారతి పట్టారు. అనంతరం కొల్లాపూర్ శివార్లలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీలు రాములు, మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, ఆల వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మారెడ్డి, అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈ జిల్లాలో పుట్టిన నేతలే ప్రాజెక్టులకు అడ్డం పడ్డారు: సీఎం కేసీఆర్
-
ఎన్నోసార్లు గెలిచి అక్కడ ఎంపీగా గెలవడమే కిక్కిచ్చింది: సీఎం కేసీఆర్
-
ప్రాజెక్టులన్నీ పూర్తయితే దేశానికే తెలంగాణ అన్నం పెడుతుంది: సీఎం కేసీఆర్
-
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్
-
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం
-
పాలమూరు పచ్చగా..
-
పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు ఏం చేశాడు?: సీఎం కేసీఆర్
Live Updates 18:20PM పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన తర్వాత కొల్లాపూర్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ►ప్రాజెక్టులన్నీ పూర్తయితే దేశానికి తెలంగాణనే అన్నం పెడుతుంది ►ఈ జిల్లాలో పుట్టిన కొంతమంది నేతలే ప్రాజెక్టులకు అడ్డం పడ్డారు. ►తెలంగాణ సాగునీటి వాటా తేల్చాలని చెబితే ప్రధాని మోదీ స్పందించలేదు ►కృష్ణా ట్రైబ్యునల్‌కు లేఖ రాయడానికి పదేళ్లు చాలవా ►ఆనాడు చేయని దద్దమ్మ నాయకులే ఇప్పుడు అడ్డుపడుతున్నారు ►పాలమూరు ముఖచిత్రం పూర్తిగా మారిపోతోంది ►బీజేపీకి పౌరుషం ఉంటే కష్టాల్లో ఉన్న మన వాటాను తేల్చాలి ►వాటా ప్రకారం రావాల్సిన నీటినే అడుగుతున్నాంబీజేపీ నేతలను ప్రజలంతా ప్రశ్నించాలి ►పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు ఏం చేశాడు? ►ఉమ్మడి పాలమూరులో 20 లక్షల ఎకరాలకు సాగునీరు ►అదే లక్ష్యంతో మా ప్రభుత్వం పని చేస్తోంది ►కొల్లాపూర్ అభివృద్ధికి రూ. 25 కోట్ల నిధులు 16:51PM ► డెలివరి సిస్టర్న్ వద్ద సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు, గంగాహారతి 16:29PM ►పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం. నార్లాపూర్ తొలి పంపు స్విచ్ ఆన్ చేసిన సీఎం కేసీఆర్. భూగర్భంలో పంపుహౌజ్ ఏర్పాటు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా కృష్ణా నది నుంచి కోతిగుండు ద్వారా నీరు తీసుకొచ్చేలా ప్రాజక్టు నిర్మాణం. ►శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రోజు 2 టీఎంసీల నీరు లిఫ్ట్ చేసే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. కాళేశ్వరం రికార్డును బ్రేక్ చేసేలా 145 మెగావాట్ల కెపాసిటీ కలిగిన 9 బాహుబలి మోటార్లను ఏర్పాటు చేశారు. 915 కిలోమీటర్ల ప్రాథమిక కాల్వను నిర్మించారు. రోజుకు 3,200 క్యూసెక్కులు ఎత్తిపోయగల కెపాసిటీ ఉన్న ఈ పంపు ద్వారా రెండు టీఎంసీల నీటిని అంజనగిరి (నార్లాపూర్) జలాశయానికి తరలించి నిల్వ చేస్తారు. ►ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.35 వేల కోట్లు ప్రభుత్వం ఇప్పటివరకూ ఖర్చు చేసింది. ►ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలో 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు 1200 గ్రామాలకు తాగునీరందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. పరిశ్రమలకు 0.33 టీఎంసీల నీటిని వినియోగిస్తారు. 16:21PM ► పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్ ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ 16:16PM ► నార్లాపూర్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ 15:54PM September 16 ► మరికాసేపట్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్ ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్ ► పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాసేపట్లో నార్లాపూర్‌కు చేరుకోనున్నారు. ఉమ్మడి జిల్లావాసుల చిరకాల స్వప్నమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీశైలం జలాశయం నుంచి అప్రోచ్ కాల్వ ద్వారా నార్లాపూర్ ఇన్‌టేక్ వెల్‌కు చేరుకునే కృష్ణా జలాలను.. స్విచ్ నొక్కడం ద్వారా 104 మీటర్లు పైకి ఎత్తి సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి పోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ వెంటనే నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుని అక్కడికి చేరుకున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ► నాగర్‌కర్నూల్ నుంచి నార్లాపూర్ పంప్ హౌస్‌కు బయలుదేరిన సీఎం 14:55PM September 16 ► కాసేపట్లో నాగర్‌కర్నూల్ చేరుకోకున్న సీఎం కేసీఆర్ 12:34PM September 16 ►ప్రగతిభవన్ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాకు బయలుదేరిన సీఎం కేసీఆర్ ►పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్న కేసీఆర్ ►భారీ కాన్వాయ్‌తో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి బయల్దేరిన కేసీఆర్ ►నార్లాపూర్‌లో తొలి పంపు స్విచ్ ఆన్ చేయనున్న సీఎం కేసీఆర్ ►పాలమూరు-రంగారెడ్డి పైలాన్ ఆవిష్కరించనున్న కేసీఆర్ ►డెలివరి సిస్టర్న్ వద్ద సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు, గంగాహారతి ►కలశాల్లో కృష్ణా జలాలు గ్రామాలకు చేరవేసేలా ఏర్పాట్లు ►అనంతరం కొల్లాపూర్ బహిరంగసభలో ప్రసంగించనున్న కేసీఆర్ ► శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా హెడ్ రెగ్యులేటరీ, ఇంటెక్ వెల్, సొరంగ మార్గాల ద్వారా సజ్జపూల్‌లోకి చేరిన కృష్ణా జలాలు…..మొదటి పంపు నుంచి డెలివరీ మెయిన్స్ ను దాటుకొని నార్లాపూర్ జలాశయానికి విజయవంతంగా చేరాయి. ► 2015 జూన్‌లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టగా మొదటి పంపు ప్రారంభానికి ఎనిమిదేళ్లు పట్టింది. ఎట్టకేలకు నార్లపూర్లోని పంపుహౌజ్‌లోని మొదటి పంపును రన్ చేసి అంజనగిరి జలాశయంలోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ప్రతి రోజు 0.25 టీఎంసీల చొప్పున మొత్తం 2 టీఎంసీ నీటిని ఎత్తిపోస్తారు. ► శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి దక్షిణ తెలంగాణలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణ్‌పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు 1,200 గ్రామాలకు తాగునీటిని అందించడానికి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ‘పాలమూరు–రంగారెడ్డి’ విశిష్టతలెన్నో.. ► ఆయకట్టు:12.30 లక్షల ఎకరాలు ► జల వనరు: శ్రీశైలం జలాశయం ► ప్రతిరోజూ లిఫ్ట్ చేసే జలాలు: 1.50 టీఎంసీలు ► లిఫ్టుల స్టేజ్‌లు: 5 ► రిజర్వాయర్ల సంఖ్య: 6 ► నీటినిల్వ సామర్థ్యం: 67.52 టీఎంసీలు ► పంపుల గరిష్ట సామర్థ్యం: 145 మెగావాట్లు ► నీటిని లిఫ్ట్ చేసే గరిష్ట ఎత్తు: 672 మీటర్లు ► సొరంగ మార్గం పొడవు: 61.57 కిలోమీటర్లు ► ప్రధాన కాలువల పొడవు: 915.47 కిలోమీటర్లు ► తాగునీటికి వినియోగం: 7.15 టీఎంసీలు ► పరిశ్రమలకు కేటాయింపులు : 3 టీఎంసీలు ► సాగునీటికి కేటాయింపులు : 79.00 టీఎంసీలు ►నాలుగు పంప్‌హౌసుల్లో 145 మెగావాట్ల భారీ సామర్థ్యం కలిగిన మొత్తం 34 పంపులను ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఇదే ప్రథమం. ఇందులో 3 పంపులను అత్యవసర సమయాల్లో స్టాండ్‌బైగా వినియోగించనున్నారు. ► మోటార్లను దేశీయ దిగ్గజ కంపెనీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ బీహెచ్ఈఎల్ తయారు చేయడం విశేషం ►ఏదుల పంప్‌హౌస్ వద్ద ఆసియాలోనే అతిపెద్దదైన సర్జ్ పూల్ ►అత్యధిక సామర్థ్యం గల పంపుల వినియోగంలో కాళేశ్వరం రికార్డు బద్ధలు. ►145 మెగావాట్ల సామర్థ్యం గల మహా బాహుబలి మోటార్ల వినియోగం -
నేడే ‘పాలమూరు’ ఎత్తిపోత.. ప్రాజెక్టు విశేషాలివే..
ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి అప్రోచ్ కాల్వ ద్వారా నార్లాపూర్ ఇన్‌టేక్ వెల్‌కు చేరుకునే కృష్ణా జలాలను.. స్విచ్ నొక్కడం ద్వారా 104 మీటర్లు పైకి ఎత్తి సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి పోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ వెంటనే నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుని అక్కడికి చేరుకున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత కొల్లాపూర్ పట్టణ శివారులో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. – సాక్షి, హైదరాబాద్ 8 రోజులు.. 2 టీఎంసీలు శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి దక్షిణ తెలంగాణలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణ్‌పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు 1,200 గ్రామాలకు తాగునీటిని అందించడానికి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇందులో భాగంగా 6.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టిన నార్లాపూర్ రిజర్వాయర్ పనులు పాక్షికంగానే పూర్తయ్యాయి. నార్లాపూర్ వద్ద 145 మెగావాట్ల భారీ సామర్థ్యంతో 8 బాహుబలి పంపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, 3 పంపుల పనులు మాత్రమే చేపట్టారు. అందులో ఒక పంపు ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటి ఎత్తిపోతను కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఒక పంపు ద్వారా 8 రోజుల పాటు నీళ్లను ఎత్తిపోసి 2 టీఎంసీలను రిజర్వాయర్‌లో నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో స్టేజీ లిఫ్టులో భాగంగా నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీళ్లను ఎత్తిపోసే అంశంపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రాజెక్టు తొలి విడతలో భాగంగా ఐదు స్టేజీల్లో నీళ్లను ఎత్తిపోసి మొత్తం 67.52 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఆరు రిజర్వాయర్లలో వేయాల్సి ఉండగా, ఆ మేరకు పనులు పూర్తి కాలేదు. పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు, సొరంగాల పనులు 80 శాతం పూర్తయ్యాయని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.35,200 కోట్లు కాగా గత మార్చి నాటికి రూ.23,684 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. రెండో విడత ప్రాజెక్టు చేపడితేనే సాగునీరు... ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 5 రిజర్వాయర్లలో కొంతమేరకు నీళ్లను నింపి పెట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. (చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను ప్రభుత్వం అనధికారికంగా విరమించుకుంది). అయితే రిజర్వాయర్ల నుంచి నీళ్లను తాగు, సాగునీటి అవసరాలకు తరలించేందుకు అవసరమైన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పనులను ఇంకా ప్రారంభించలేదు. పర్యావరణ అనుమతులు లభించిన తర్వాత ఈ పనులను రెండో విడతలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల ప్రాజెక్టును ప్రారంభించినా తక్షణ ప్రయోజనాలు ఉండవు. రెండో విడత పనులు పూర్తైన తర్వాతే ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరు అందనుంది. కలశాల్లో గ్రామాలకు కృష్ణా జలాలు సాక్షి, నాగర్‌కర్నూల్: సీఎం కేసీఆర్ శనివారం నార్లాపూర్ జలాశయం వద్ద కృష్ణా జలాల్లోకి పూలు వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత పాలమూరులోని అన్ని గ్రామ పంచాయతీలకు కృష్ణా జలాలను కలశాల్లో పంపిణీ చేయన్నారు. ఈ ప్రక్రియలో ఆయా మండలాల ఎంపీడీఓలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు పాలుపంచుకోనున్నారు. కృష్ణా జలాలతో పాలమూరు వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని దేవతామూర్తులకు అభిషేకం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 4 గంటల పాటు కేసీఆర్ పర్యటన కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఉదయం బస్సులో బయలుదేరతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని తేజ కన్వెన్షన్‌కు చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. 3 గంటలకు నార్లాపూర్ పంపుహౌస్‌కు చేరుకుని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు స్టేజ్–1లోని మొదటి మోటారును ప్రారంభిస్తారు. 3.50 గంటలకు అక్కడి నుంచి కొల్లాపూర్‌కు బయలుదేరుతారు. 4.30 గంటలకు సింగోటం చౌరస్తాలోని బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5.30 గంటలకు సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తిరిగి వెళతారు. ‘పాలమూరు–రంగారెడ్డి’ విశిష్టతలెన్నో.. ► ఆయకట్టు:12.30 లక్షల ఎకరాలు ► జల వనరు: శ్రీశైలం జలాశయం ► ప్రతిరోజూ లిఫ్ట్ చేసే జలాలు: 1.50 టీఎంసీలు ► లిఫ్టుల స్టేజ్‌లు: 5 ► రిజర్వాయర్ల సంఖ్య: 6 ► నీటినిల్వ సామర్థ్యం: 67.52 టీఎంసీలు ► పంపుల గరిష్ట సామర్థ్యం: 145 మెగావాట్లు ► నీటిని లిఫ్ట్ చేసే గరిష్ట ఎత్తు: 672 మీటర్లు ► సొరంగ మార్గం పొడవు: 61.57 కిలోమీటర్లు ► ప్రధాన కాలువల పొడవు: 915.47 కిలోమీటర్లు ► తాగునీటికి వినియోగం: 7.15 టీఎంసీలు ► పరిశ్రమలకు కేటాయింపులు : 3 టీఎంసీలు ► సాగునీటికి కేటాయింపులు : 79.00 టీఎంసీలు ►నాలుగు పంప్‌హౌసుల్లో 145 మెగావాట్ల భారీ సామర్థ్యం కలిగిన మొత్తం 34 పంపులను ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఇదే ప్రథమం. ఇందులో 3 పంపులను అత్యవసర సమయాల్లో స్టాండ్‌బైగా వినియోగించనున్నారు. ► మోటార్లను దేశీయ దిగ్గజ కంపెనీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ బీహెచ్ఈఎల్ తయారు చేయడం విశేషం ►ఏదుల పంప్‌హౌస్ వద్ద ఆసియాలోనే అతిపెద్దదైన సర్జ్ పూల్ ►అత్యధిక సామర్థ్యం గల పంపుల వినియోగంలో కాళేశ్వరం రికార్డు బద్ధలు. ►145 మెగావాట్ల సామర్థ్యం గల మహా బాహుబలి మోటార్ల వినియోగం -
నేడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేయనున్న సీఎం కేసీఆర్
-
సాగునీటి రంగంలో రాష్ట్రంలో మరో ముందడుగు
-
కరువు నేలకు కృష్ణమ్మ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్: కరువు నేలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కే గడియ రానే వచ్చింది. 2015లోనే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అంకురార్పణ జరగ్గా, దాదాపు ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఆ కల సాకారం కానుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంబోత్సవానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నార్లాపూర్ పంపుహౌస్, కృష్ణాతీరంలోని హెడ్‌రెగ్యులేటరీ ఇన్‌టేక్ వద్ద, కొల్లాపూర్ చుట్టుపక్కల పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కొల్లాపూర్‌కు రోడ్డు మార్గంలో వస్తారు. మొదటగా నార్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రాజెక్టు పంప్‌హౌస్‌లోని కంట్రోల్ రూం వద్ద పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరిస్తారు. పంపుహౌస్‌లోని నాలుగో అంతస్తులో మొదటి మోటారు స్విచ్ ఆన్‌చేసి నీటి ఎత్తిపోతలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 1.7 కి.మీ దూరంలో ఉన్న హెడ్ రెగ్యులేటరీ వద్దకు చేరుకొని కృష్ణమ్మకు పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం కొల్లాపూర్ పట్టణ శివారులోని సింగోటం చౌరస్తా సమీపంలో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు కొల్లాపూర్‌లో సీఎం సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి వేర్వేరుగా పర్యవేక్షించారు. అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని, శుక్రవారం రాత్రి వరకు ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు.అంతకుముందు మంత్రి నిరంజన్‌రెడ్డి పాలమూరు ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను పరిశీలించారు. స్విచ్ బోర్డుల పనితీరు గురించి నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి మంత్రికి వివరించారు. మహా బాహుబలి మోటార్లు ♦ పాలమూరు ఎత్తిపోతల్లో మొత్తం 34 మోటార్లు వినియోగిస్తున్నారు. ఒక్కొక్కటి 145 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇంత సామర్థ్యం గల మోటార్లు ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ప్రథమం. ఈ మోటార్లను మహా బాహుబలి పంప్‌లుగా పిలుస్తున్నారు. ♦ఏదుల పంప్‌హౌస్ వద్ద ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ సర్జిపూల్‌ను భూ ఉపరితలం నుంచి 145 మీటర్ల లోతులో నిర్మించారు. 90 మీటర్ల ఎత్తు, 357 మీటర్ల పొడవు, 31 మీటర్ల వెడల్పుతో దీని డిజైన్ రూపొందించారు. ♦పాలమూరు ఎత్తిపోతల్లో విద్యుత్ సబ్స్టేషన్లను భూ ఉపరితలంపైనే నిర్మించారు. పంపులు, విద్యుత్ వ్యవస్థతోపాటు అన్నింటా మానవరహిత వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్కాడా (సాంకేతిక వ్యవస్థ) వినియోగిస్తున్నారు. 550 టన్నుల బరువు ఉండే పంప్ నడుస్తున్నప్పుడు అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ మేరకు చల్లబరిచేందుకు కూలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మోటారుకు 20 భారీ ఏసీలు అమర్చారు. -
అదిరేలా ‘పాలమూరు’ సంబురాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16న తలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంబోత్సవం రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా కనీసం లక్షన్నర మంది రైతులతో బహిరంగ సభను నిర్వహించనున్నామని తెలిపారు. ప్రాజెక్టు విశిష్టతను ప్రజలకు తెలియజేసేలా సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టు ప్రారంభ ఏర్పాట్లపై మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి శనివారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వలసల జిల్లాగా నాడు పడావుపడ్డ పాలమూరు జిల్లాను ఈ ప్రాజెక్టు పచ్చగా చేస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా భూములకు సైతం నీళ్లు అందిస్తుందన్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న గొప్ప ప్రాజెక్టు ఇదని వ్యాఖ్యానించారు. గోదావరి పరీవాహకంలో కాళేశ్వరం, కృష్ణా పరీవాహకంలో పాలమూరు–రంగారెడ్డి వంటి గొప్ప ప్రాజెక్టులను ప్రభు త్వం నిర్మించిందని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పూర్తైతే తెలంగాణ ప్రాజెక్టులు సంతృప్త స్థాయిలో పూర్తవుతాయన్నారు. ప్రారంబోత్సవం ఏర్పాట్లపై సీఎస్, ఇతర శాఖలతో కూలంకషంగా చర్చించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో సభకు ఏర్పాట్లను పూర్తి చేయాలని కేటీఆర్ సూచించారు. -
TS Election 2023: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్! ఎత్తిపోతల ప్రాజెక్ట్..!!
మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో 12.30లక్షల ఎకరాలను సస్యశామలం చేయడంతో పాటు తాగునీటి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ మరోసారి రాజకీయాస్త్రంగా మారింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ భారీ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్‌పై గత ఎన్నికల సమయంలో, ఆ తర్వాత సైతం అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రాజెక్ట్‌కు జాతీయ హోదాపై బీజేపీ, బీఆర్ఎస్.. ఇచ్చిన హామీ మేరకు గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేదని కాంగ్రెస్.. ఇందుకు అడ్డంకులు సృష్టిస్తూ కోర్టులకెక్కింది మీరే కాదా అంటూ గులాబీ పార్టీల పరస్పర విమర్శలతో దూషణలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఎట్టకేలకు ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని పండగలా నిర్వహించుకోవాలని గులాబీ బాస్ పిలుపునివ్వగా.. ప్రాజెక్ట్ పూర్తి చేయకముందే ప్రారంభోత్సవమా అంటూ కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా రిజర్వాయర్ల సందర్శనకు తెర లేపడం పొలిటికల్ వార్‌కు సంకేతాలుగా నిలుస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారగా.. ఎన్నికల షెడ్యూల్ రాకముందే జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. నేడు కాంగ్రెస్ రిజర్వాయర్ల సందర్శన.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పూర్తిస్థాయిలో పనులు చేపట్టకుండా.. ప్రారంభోత్సవాల పేరుతో పండుగలు చేయడమేంటని ప్రశ్నిస్తూ.. ప్రాజెక్ట్ వాస్తవ స్థితిగతులను పరిశీలించేందుకు కాంగ్రెస్ ప్రాజెక్ట్ బాటకు సిద్ధమైంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు శనివారం నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను సందర్శించేందుకు సమాయత్తమయ్యారు. ఇప్పటివరకు ప్రాజెక్ట్ కింద రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణంతో పాటు కొన్ని చోట్ల భూసేకరణ కూడా ఇంకా పూర్తికాలేదని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామని, ఇందుకోసం ప్రత్యేకంగా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఉమ్మడి జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు పెద్దగా స్పందించలేదు. త్వరలో వారు సైతం పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమాచారం. అధికార పార్టీమరింత దూకుడుగా.. ఈ నెల 16న నార్లాపూర్ పంప్‌హౌస్‌లోని ఇన్‌టేక్ వద్ద మొదటి మోటారు స్విచ్ ఆన్ చేసి నీటి పంపింగ్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజల అనంతరం నార్లాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని ప్రతి ఒక్కరూ పండుగలా వైభవంగా జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని గ్రామాల సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్దఎత్తున సభకు హాజరయ్యేలా ఆ పార్టీ నాయకులు సన్నాహాలు మొదలుపెట్టారు. ప్రాజెక్ట్ ప్రారంభించిన మరుసటి రోజు 17న దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల ప్రజలు ఆలయాల్లోని దేవతామూర్తులను కృష్ణా జలాలతో అభిషేకం చేసి మొక్కులు తీర్చుకోవాలని కేసీఆర్ సూచించారు. అధికార బీఆర్ఎస్ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం, ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తుండగా.. తిప్పికొట్టేలా బీఆర్ఎస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు గులాబీ నేతలు మరింతగా దూకుడుగా వ్యవహరించనున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
‘పాలమూరు’ పూర్తికాకుండానే ప్రారంభోత్సవమా?
సాక్షి, హైదరాబాద్: ‘సగం పనులు కూడా కాని ప్రాజెక్టుకు ప్రారంబోత్సవాలట. పూర్తే కాని రిజర్వాయర్లకు పూజలట’ అని ఎద్దేవా చేస్తూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. స్వరాష్ట్రంలో ప్రారంభించిన తొలి ప్రాజెక్టు పాలమూరు– రంగారెడ్డిని కేసీఆర్ సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం నామమాత్రం పనులు చేసి, ప్రాజెక్టు మొత్తం పూర్తయిందనే భ్రమను సృష్టిస్తున్నారన్నారు. వాస్తవానికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 50% కూడా కాలేదని, అందులోని 4 రిజర్వాయర్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదని పేర్కొన్నారు. కానీ ప్రాజెక్ట్ మొత్తం కట్టినట్లు కలరింగ్ ఇస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ కాలువలకు భూసేకరణ కూడా పూర్తి కాలేదంటే, పాల మూరు ప్రాజెక్టుపై కేసీఆర్ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందన్నారు. -
పాలమూరుకు కృష్ణమ్మ..! వచ్చే ఎన్నికల్లో ప్రచారాస్త్రం ఇదే..!!
మహబూబ్‌నగర్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద నీటి ఎత్తిపోతలకు రంగం సిద్ధమైంది. శ్రీశైలం బ్యాక్‌వాటర్ ఆధారంగా నార్లాపూర్ వద్ద నీటిని తోడే విధంగా స్టేజ్–1 పంప్‌హౌస్‌తో పాటు నీటిని నిల్వ చేసేలా 6.4 టీఎంసీల సామర్థ్యంతో అంజనగిరి రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కాగా.. మొదటి మోటారు పంప్ ద్వారా నీటిని ఎత్తిపోసి ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 16న ఆయన చేతుల మీదుగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి అధికార యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే ప్రాజెక్ట్ కింద మొదటి మోటారును సిద్ధం చేసిన అధికారులు ఈ నెల మూడో తేదీన డ్రైరన్ నిర్వహించారు. మొదటగా ఒక మోటారు పంప్ ద్వారా నీటి విడుదల ప్రారంభించి, తర్వాత విడతల వారీగా ఆయకట్టుకు నీరందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్కు ‘పాలమూరు’ ప్రాజెక్ట్ ప్రధాన ప్రచారాస్త్రం కానున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అడ్డంకులను అధిగమించి.. కృష్ణానదిలో శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలోని 70 మండలాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీటితో పాటు పరిశ్రమలకు సైతం నీరందించాలనే లక్ష్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. 2016లో భూత్పూర్ మండలం కరివెన వద్ద సీఎం కేసీఆర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ పనులను ప్రారంభించారు. మొదటి నుంచి పర్యావరణ, ఇతర అనుమతుల పేరుతో ప్రాజెక్ట్ నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రారంభంలో రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ప్రాజెక్టు చివరికి పనుల అంచనా వ్యయం రూ.52 వేల కోట్లకు పెరిగింది. తాజాగా మొదటి పంపును సిద్ధం చేయడంతో ప్రాజెక్ట్ కింద నీటి విడుదలకు రంగం సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో ప్రచారాస్త్రం ఇదే..! పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద నీటిని విడుదల చేసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు అధికార బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 16న నార్లాపూర్ పంప్‌హౌస్‌లోని ఇన్‌టేక్ వద్ద మొదటి మోటారు నీటి పంపింగ్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అదేరోజు నార్లాపూర్ సమీపంలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని గ్రామాల సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఈనెల 17న ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని అన్ని గ్రామాల ప్రజలు ఆలయాల్లోని దేవతామూర్తులను కృష్ణా జలాలతో అభిషేకం చేసి మొక్కులు తీర్చుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా పండగలా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మొదటి పంప్‌తో ఎత్తిపోతలు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద మొదటగా ఒక పంపుతో నీటిని ఎత్తిపోసేలా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రాజెక్ట్ స్టేజ్–1లో భాగమైన నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యం గల పంప్‌ను ఇప్పటికే సిద్ధం చేయగా, ఈ నెల మూడో తేదీన అధికారులు డ్రైరన్ నిర్వహించారు. ఈ ప్రక్రియ సక్సెస్ కావడంతో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మొదటి మోటారు ద్వారా నీటి ఎత్తిపోతలను ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 8.51 టీఎంసీల సామర్థ్యం ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్‌ను నింపనున్నారు. ఆ తర్వాత స్టేజ్–1తో పాటు స్టేజ్–2, 3, 4 పంప్ హౌస్‌లలో మొదటి, రెండో మోటార్‌ను సిద్ధం చేసి ఏదుల, వట్టెం, ఉదండాపూర్ రిజర్వాయర్లను నింపేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. నార్లాపూర్‌లో మొత్తం తొమ్మిది మోటార్లను ఏర్పాటు చేయనుండగా.. ఎనిమిది మాత్రమే నీటి పంపింగ్‌కు వినియోగించనున్నారు. వీటిలో ఏదైనా మోటార్ సాంకేతిక సమస్యలతో మరమ్మతులకు వచ్చినా.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక మోటార్ ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్నారు. సాగునీటి రంగంలో ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 139 మెగావాట్ల సామర్థ్యం గల భారీ మోటార్ల (బాహుబలి)ను వినియోగించగా.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో అంతకుమించి 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటార్లతో నీటిని ఎత్తిపోయనుండడం విశేషం. -
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు..16న జాతికి అంకితం
ప్రపంచంలోనే భారీ పంపులతో.. ప్రపంచంలో మరెక్కడా లేనంత భారీ పంపులతో నిర్మించిన ‘పాలమూరు’ ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణ ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టుకు స్వరాష్ట్రంలో మోక్షం లభించడం చరిత్రాత్మకం. దశాబ్దాల కల సాకారమవుతున్న ఈ సందర్భంలో దక్షిణ తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు ఇది గొప్ప పండుగ రోజు. ప్రాజెక్టును ప్రారంభించిన మరునాడు (సెపె్టంబర్ 17 న) ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పల్లెపల్లెనా ఊరేగింపులతో సంబురంగా జరుపుకోవాలి. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 16న మధ్యాహ్నం ఈ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. తొలుత బటన్ నొక్కి నార్లాపూర్ ఇన్‌టేక్ వెల్ వద్దనున్న బాహుబలి పంపులను కేసీఆర్ ఆన్ చేస్తారు. పంపుల నుంచి కృష్ణా జలాలు సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌కు చేరుతాయి. సీఎం కేసీఆర్ వెంటనే రిజర్వాయర్ వద్దకు చేరుకుని.. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి బుధవా రం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ భేటీలో సీఎం చెప్పి న అంశాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. ‘‘తలాపున కృష్ణమ్మ పారుతున్నా.. నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం, వివక్షతో తాగు, సాగునీటికి నోచుకోక ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలను అనుభవించాయి. పాలమూరులో గంజి కేంద్రాలను నడిపించిన దుస్థితి నాటి పాలకులది. ఎటుచూసినా వలసలే కనిపించేవి. జిల్లా ప్రజల బాధలను చూసిన గోరటి వెంకన్న వంటి పాలమూరు కవులు ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే.. పాలమూరులోనా’ అంటూ పాటలు కూడా రాశారు. బంగారు తెలంగాణ సంపూర్ణమవుతుంది పాలమూరులో నాటి పాలకులు మొదలుపెట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులను తెలంగాణ వచ్చాక యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేశాం. పాలమూరు జిల్లా పచ్చబడింది. వలసలు ఆగిపోయాయి. ప్రాజెక్టును పూర్తి చేసుకుంటే ఇంకెంత గొప్ప అభివృద్ధి అవుతుందో ఊహించుకోవచ్చు. తెలంగాణ వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. సమ్మిళిత, సమగ్ర వ్యవసాయ రంగాభివృద్ధిని సాధిస్తుంది. రైతుల లోగిళ్లు బంగారు పంటలతో తులతూగుతాయి. బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానుంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ప్రాజెక్టుపై స్వయానా పాలమూరు జిల్లా నేతలే వందల కేసులు పెట్టడం దురదృష్టకరం. వారు జిల్లా ప్రజలకు శాపంలా పరిణమించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ముందుకు వెళ్లింది. పర్యావరణ అనుమతులు రావడంతో ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆ దిశగా కృషి చేసిన నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్, సలహాదారు పెంటారెడ్డి, సీఈలు హమీద్‌ఖాన్, రమణారెడ్డిల కృషిని అభినందిస్తున్నాం. కృష్ణా జలాలతో మొక్కులు తీర్చుకోవాలి మనందరి కృషికి దైవ కృప తోడు కావడంతోనే ప్రాజెక్టు పనులు కొలిక్కి వచ్చాయి. ఉద్యమ కాలంలో కృష్ణా నదిలో నాణేలు వేసి నీటి కోసం మొక్కాం. కృష్ణమ్మ ఎత్తిపోతల జలాలతో దేవుళ్ల పాదాలు కడుగుతామన్నాం. మనందరం ఆ మొక్కులను తీర్చుకోవాల్సి ఉంది. రెండు ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు తమతో తెచ్చుకున్న కలశాలతో కృష్ణా జలాలను తీసుకెళ్లి దేవుళ్ల పాదాలకు అభిõÙకం చేయాలి. కొబ్బరికాయలు కొట్టి, పూలుచల్లాలి. పెద్ద ఎత్తున ఊరేగింపులు నిర్వహించి సంబురాలు జరుపుకోవాలి’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. భారీగా బహిరంగ సభ ‘పాలమూరు’ ప్రాజెక్టును ప్రారంభించుకునే చరిత్రాత్మక వేళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి పల్లె నుంచి సర్పంచులు, గ్రామస్తులు ఈ సభకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం, బహిరంగసభ నిర్వహణ, ప్రజలకు రవాణా, భోజన ఏర్పాట్లపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఒక్కోటీ 12 కిలోల బోల్టులు ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా 145 మెగావాట్ల భారీ సింగిల్ పంపులను ‘పాలమూరు–రంగారెడ్డి’ ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్నట్టు అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. వాటికి బిగించే ఒక్కో బోల్టు బరువే 12 కిలోలు ఉంటుందని, దాని రూటర్ 80 టన్నులు ఉంటుందని తెలిపారు. 240 టన్నుల బరువుండే దాదాపు 34 పంపులను వినియోగిస్తున్నామని.. ఇంకా ఎన్నో నమ్మశక్యం గాని సాంకేతిక అంశాలున్నాయని వివరించారు. కాగా.. కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తితో ‘పాలమూరు’ పనులను పూర్తి చేయాలని, కాల్వల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి గతంలో అనుసరించిన పద్దతులనే అవలంబించాలని సూచించారు. అచ్చంపేట, ఉమామహేశ్వరం పనులు ప్రారంభించాలన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో కాల్వల పనులను మంత్రులు, ఇరిగేషన్ అధికారులు కలసి పర్యవేక్షించాలని కోరారు. తర్వాత ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుతో, తాగునీటి తరలింపు చర్యలపై మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డితోనూ సీఎం సమీక్షించారు. -
భారీ పంపులతో ఎత్తిపోతలకు సిద్ధమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు
-
ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి వెట్ రన్ ప్రారంభించనున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సిద్ధమైంది. ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం కానుంది. నార్లాపూర్ ఇన్‌టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి కేసీఆర్ ప్రారంభించనున్నారు. వెట్ రన్లో భాగంగా రెండు కిలో మీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోయనుంది. ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వెట్‌రన్ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా.. సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాలమూరు రంగారెడ్డి జిల్లాలలోని పల్లె పల్లె నుంచి ప్రజలు, గ్రామ సర్పంచులు హాజరవ్వనున్నారు. ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకుపోయి ఈనెల 17 న ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలోని ప్రతీ గ్రామంలో దేవుళ్ళ పాదాలకు అభిషేకం చేయనున్నారు. ఈ మేరకు సచివాలయంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రోజెక్ట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. చదవండి: పెద్దపల్లిలో మావోయిస్టు లేఖ కలకలం.. బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్! పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించుకుందామంటూ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దక్షిణ తెలంగాణకు పండుగ రోజని పేర్కొన్నారు. ఎన్నో మొక్కులు మొక్కితే, దైవకృపతో, ఇంజనీర్ల కృషితో, పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించి సాకారమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలని కేసీఆర్ తెలిపారు. పట్టుదలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషిలో కీలక పాత్ర పోషించిన సీఎంఓ అధికారులకు, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అందనున్నదని చెప్పారు. బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. -
పాలమూరుకు లైన్ క్లియర్!
కుట్రలను ఛేదించి.. కేసులను అధిగమించి.. పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులపై మంత్రి హరీశ్‌రావు ట్వీట్ సాక్షి, హైదరాబాద్: కుట్రలను ఛేదించి, కేసులను అధిగమించి పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ పర్యావరణ అనుమతులు సాధించారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానుంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించడం సీఎం కేసీఆర్ సాధించిన మరో అపూర్వ, చరిత్రాత్మక విజయం..’’అని హరీశ్ పేర్కొన్నారు. కేసీఆర్ మొక్కవోని దీక్షకు, ప్రభుత్వం పట్టువిడవని ప్రయత్నం తోడుగా సాధించిన ఫలితం ఇదని.. పాలమూరు బిడ్డల దశాబ్దాల కల సాకారమైన సందర్భంగా మాటల్లో వర్ణించలేని మధుర ఘట్టమని అభివర్ణించారు. సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ (ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ/ఈఏసీ) పలు షరతులతో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫార్సు చేసింది. గత నెల 24న జరిగిన సమావేశం నిర్ణయాలు తాజాగా వెలువడ్డాయి. దీంతో త్వరలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ కానున్నాయి. రూ.55,086.57 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కింద 6 జిల్లాల్లోని 70 మండలాల పరిధిలో మొత్తం 8,83,945 హెక్టార్ల ఆయకట్టుకు ప్రభుత్వం నీరు అందించనుంది. ఆ అధికారులపై చర్యలు తీసుకున్నాకే.. పర్యావరణ అనుమతులు లేకుండానే పనులను చేపట్టినందుకుగాను.. ప్రాజెక్టును ప్రతిపాదించిన అధికారి (ప్రాజెక్టు ప్రపోనెంట్)పై పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోని సెక్షన్ 19 కింద రాష్ట్ర ప్రభుత్వం/కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ షరతు విధించింది. పర్యావరణ అనుమతుల జారీకి ముందే ఈ చర్యల వివరాలను సమర్పించాలని.. అనుమతులు జారీ చేసే వరకు పనులేవీ చేపట్టరాదని స్పష్టం చేసింది. రూ.106 కోట్ల జరిమానా.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో.. పర్యావరణ ప్రభావం మదింపు (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్/ఈఐఏ) నోటిఫికేషన్ 2006ను నీటిపారుదల శాఖ ఉల్లంఘించినట్టు నిపుణుల మదింపు కమిటీ గతంలోనే నిర్థారించింది. ఇలాంటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల జారీకి ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను అమలు చేయాల్సి ఉంటుందని తేల్చింది. ఈ క్రమంలో.. పర్యావరణ పునరుద్ధరణకు రూ.72.63 కోట్లు, ప్రకృతి వనరుల వృద్ధికి రూ.40.2 కోట్లు, సామాజిక వనరుల అభివృద్ధికి రూ.40.8 కోట్లు కలిపి మొత్తం రూ.153.7 కోట్లతో ఎస్ఓపీ ప్రణాళికలు అమలు చేస్తామని నీటిపారుదల శాఖ ప్రతిపాదించగా.. నిపుణుల కమిటీ ఆమోదించింది. ఈ మొత్తానికి ఐదేళ్ల బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని షరతు విధించింది. ఇక అనుమతులు లేకుండానే రూ.21,200 కోట్లతో పనులు చేసినందున.. నిబంధనల ప్రకారం అందులో 0.5శాతం (రూ.106 కోట్లు) జరిమానాగా పీసీబీకి చెల్లించాలని ఆదేశించింది. కోర్టు కేసుల చిక్కులు తొలగినట్టే! పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను నిలిపేయాలని గతంలో ఎన్జీటీ ఆదేశించింది. అయినా పనులు కొనసాగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానకి రూ.920.85 కోట్ల భారీ జరిమానా కూడా విధించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే పొందింది. తాగునీటి అవసరాల కోసం 7.15 టీఎంసీలను మాత్రమే తరలించేలా ప్రాజెక్టు పనులకు సుప్రీం నుంచి అనుమతులు పొందింది. కానీ ఏకంగా 120 టీఎంసీల నీటి తరలింపునకు వీలుగా ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేస్తోందని ధ్రువీకరిస్తూ కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు తాజాగా సుప్రీంకోర్టులో సంయుక్తంగా అఫిడవిట్ దాఖలు చేశాయి. దీంతో కోర్టు ధిక్కరణ చర్యలకు ఆస్కారం ఉండటంతో నీటిపారుదల శాఖవర్గాలు ఆందోళనలో పడ్డాయి. అక్టోబర్ 6న సుప్రీంకోర్టులో దానిపై విచారణ జరగనుండగా.. ఆలోపే ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల విషయంలో న్యాయపరమైన చిక్కులు తొలగిపోనున్నాయి. నిపుణుల కమిటీ షరతుల్లో ముఖ్యమైనవి పర్యావరణ/సామాజిక నష్టాన్ని నిర్దేశిత గడువులోగా పునరుద్ధరించాలి. మూడేళ్లలోగా రూ.153.7 కోట్లతో నష్ట నివారణ ప్రణాళిక అమలు పూర్తి చేయాలి. ఎన్జీటీ ఆదేశాల మేరకు నియమించిన నిపుణుల కమిటీ సూచనల మేరకు నష్ట నివారణ చర్యలుండాలి. అన్ని రిజర్వాయర్లకు 500 మీటర్ల దూరం వరకు పెద్దెత్తున మొక్కలు నాటి అందులో కనీసం 90శాతాన్ని సంరక్షించాలి. వాటర్షెడ్ల అభివృద్ధి ప్రణాళిక, వన్యమృగాల సంరక్షణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలి. ప్రాజెక్టు ఉద్యోగాలు, ఇతర అవకాశాల్లో స్థానిక గ్రామస్తులకు, నిర్వాసితుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఎల్రక్టీ్టషియన్, ఫిట్టర్, వెల్డర్ వంటి వృత్తుల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో తాగునీరు, వైద్యం వంటి మౌలిక వసతులు కల్పించాలి. ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామస్తులకు సోలార్ ప్యానెళ్లు అందజేయాలి. ప్రభావిత గ్రామాల్లో బయో గ్యాస్ ప్లాంట్లు నెలకొల్పాలి. -
నీటి దోపిడీ కోసమే పాలమూరు–రంగారెడ్డి
సాక్షి, అమరావతి: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో అనుమతి ఇచ్చిన దానికంటే తెలంగాణ సర్కార్ భారీ ఎత్తున పనులు చేసిందని సుప్రీం కోర్టుకు కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు నివేదించాయి. తాగునీటి అవసరాల పేరుతో భారీ ఎత్తున సాగునీటి అవసరాలకు నీటిని తరలించేలా తెలంగాణ ప్రభుత్వం పనులు పూర్తి చేసిందని స్పష్టం చేశాయి. 7.15 టీఎంసీలను తాగునీటి అవసరాలకు తరలించేలా పనులు చేపట్టడానికి అనుమతి ఇస్తే.. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతలు, కాలువల వ్యవస్థ, 65.17 టీఎంసీలను నిల్వ చేసేలా 5 రిజర్వాయర్లను తెలంగాణ పూర్తి చేసిందని తేల్చిచెప్పాయి. ఇప్పటివరకూ పూర్తయిన పనులను పరిశీలిస్తే.. తెలంగాణ సర్కార్ భారీ ఎత్తున కృష్ణా జలాలను తరలించేలా చేపట్టిందని పేర్కొన్నాయి. ఆ ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు లేని నేపథ్యంలో దాని డీపీఆర్‌ను మదింపు చేయలేమని తెలంగాణ సర్కార్‌కు తేల్చిచెప్పామని గుర్తు చేశాయి. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఈ నెల 2న కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు సంయుక్తంగా అఫిడవిట్ దాఖలు చేశాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై ఈ నెల 4న జరగాల్సిన విచారణను సుప్రీం కోర్టు అక్టోబర్‌కు వాయిదా వేసింది. అఫిడవిట్లో ఏం చెప్పాయంటే.. కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను రూ.55,086.57 కోట్లతో తెలంగాణ సర్కార్ చేపట్టింది. ఇందులో నీటిపారుదల వ్యయం రూ.50,508.88 కోట్లు, తాగునీటి విభాగం వ్యయం రూ.4,577.69 కోట్లు. ఈ ఎత్తిపోతల కింద అంజనగిరి (8.51 టీఎంసీలు), వీరాంజనేయ (6.55 టీఎంసీలు), వెంకటాద్రి (16.74 టీఎంసీలు), కరుమూర్తిరాయ (17.34 టీఎంసీలు), ఉద్దండాపూర్ (16.03 టీఎంసీలు), కేపీ లక్ష్మిదేవిపల్లి (2.80 టీఎంసీల) రిజర్వాయర్లను చేపట్టింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు.. ఆ జిల్లాల్లో తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చాలన్నది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ఎత్తిపోతల కింద తరలించే 120 టీఎంసీల్లో తాగునీటి అవసరాల కోసం కేటాయించింది 7.15 టీఎంసీలు. ఇప్పటికే 65.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అంజనగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కరుమూర్తిరాయ, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను.. 120 టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతలు, కాలువల వ్యవస్థను పూర్తి చేసింది. ఆరో రిజర్వాయర్ కేపీ లక్ష్మిదేవిపల్లి వద్ద ఇప్పటిదాకా చేపట్టలేదు. పూర్తయిన 5 రిజర్వాయర్ల కింద తాగునీటి అవసరాల కోసం కేటాయించింది 3.40 టీఎంసీలే. కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీలకు, చిన్న నీటిపారుదల విభాగంలో మిగులుగా ఉన్న 45 టీఎంసీలను జతచేసి.. 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను చేపట్టామని తెలంగాణ సర్కార్ డీపీఆర్‌ను సమర్పించింది. కానీ.. ఈ ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయలేదు. నీటి కేటాయింపులపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను మదింపు చేయలేమని తెలంగాణ సర్కార్‌కు వెనక్కి పంపాం. నేపథ్యం ఇదీ.. చంద్రమౌళీశ్వరరెడ్డి అనే రైతు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను నిలిపేయాలని 2021 అక్టోబర్ 29న ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘించి యథేచ్ఛగా పనులు కొనసాగించిన తెలంగాణ సర్కార్‌పై 2022 డిసెంబర్ 22న ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీటీ.. ఆ రెండు ఎత్తిపోతల పథకాల వ్యయంపై 1.50 శాతం చొప్పున రూ.620.85 కోట్లను తెలంగాణ సర్కార్‌కు జరిమానా విధించింది. తెలంగాణ ఉద్దేశపుర్వకంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నందున రూ.300 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మొత్తం రూ.920.85 కోట్లు మూడు నెలల్లోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వద్ద డిపాజిట్ చేయాలని నిర్దేశించింది. దీనిపై తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్జీటీ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ.. తాగునీటి అవసరాల కోసం 7.15 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు అనుమతిస్తూ 2023 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
‘పాలమూరు’పై 31న భేటీ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును అడ్డుకోవాలంటూ ఏపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఈ నెల 31న ఆ రెండు రాష్ట్రాలతో సమావేశం కానుంది. పోలవరం ద్వారా కృష్ణాకు మళ్లించనున్న 80 టీఎంసీల గోదావరి జలాలకు బదులుగా సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవడానికి గతంలో బచావత్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక వాటాలు పోను మిగిలిన 45 టీఎంసీలతో పాటు మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన 45 టీఎంసీలు కలిసి మొత్తం 90 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ గతంలో తెలంగాణ జీవో జారీ చేసింది. ఈ జీవోపై ఏపీ చేసిన ఫిర్యాదుపై ఇప్పటికే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల వాదనలు విని విచారణ ముగించింది. తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన కృష్ణా జలాల్లో మహారాష్ట్ర, కర్ణాటకల వాటాలు పోగా మిగిలిన 45 టీఎంసీలపై ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి హక్కు ఉందని, తెలంగాణ ఆ నీళ్లను వినియోగించుకోవాలంటే విధిగా ఏపీతో ఒప్పందం చేసుకోవాల్సిందేనని ఇటీవల కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తేల్చి చెప్పింది. ఈ మేరకు తెలంగాణకు లేఖ రాసింది. అయితే సాగర్ ఎగువన తెలంగాణలోనే కృష్ణా బేసిన్ ఉందని, అందువల్ల 45 టీఎంసీలు తమకే దక్కుతాయని తెలంగాణ వాదిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఏపీలో ఉందని, దాని ద్వారా తరలించనున్న 80 టీఎంసీలతో ఏపీలోని కృష్ణా డెల్టాకు ప్రయోజనం కలగనుందని, ఇందుకు బదులుగా కేటాయించిన కృష్ణా జలాల్లో తెలంగాణకు మాత్రమే హక్కు ఉంటుందని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి సమావేశాన్ని తలపెట్టడం ఆసక్తికరంగా మారింది. -
అధికారంలోకి రాగానే పాలమూరు ఎత్తిపోతల పూర్తిచేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగానే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని, రాబోయే వందరోజుల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డిల సమక్షంలో పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్, బీజేపీల నుంచి ఆదివారం గాందీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గద్వాల జిల్లా బంగ్లాలో బందీ అయ్యిందని, ఆ జిల్లా ప్రజలను బంగ్లాల ముందు బానిసలుగా మార్చారని ఆరోపించారు. జిల్లాలో కొందరు బీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లినంత మాత్రాన ఏమీ కాదన్నారు. గద్వాలకు చెందిన బడుగు,బలహీన వర్గాలు ఎప్పు డూ కాంగ్రెస్ వైపే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బిడ్డ అయిన తనకు టీపీసీసీ అధ్యక్ష పదవితో సోనియాగాంధీ గౌరవం ఇచ్చారని, అందుకు ప్రతిగా పాలమూరుజిల్లాలో 14కు 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుపొందేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి తదితరులు పాల్గొన్నారు. జీఓ 111పై నివేదిక సమర్పణ జీఓ 111పై అధ్యయనం చేసేందుకుగాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ రూపొందించిన నివేదికను రేవంత్‌రెడ్డికి అందజేశారు. కమిటీ చైర్మన్ ఎం.కోదండరెడ్డి నేతృత్వంలో సభ్యులు అన్వేశ్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు ఈ నివేదిక తయారు చేశారు. -
‘పాలమూరు–రంగారెడ్డి’ పాత ప్రాజెక్టే
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పాత ప్రాజెక్టేనని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. అది కొత్త ప్రాజెక్టేనని.. దానికి నీటి కేటాయింపులు చేసే అధికారం కొత్త ట్రిబ్యునల్‌కే ఉందంటూ కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ)–2 వద్ద ఏపీ ప్రభుత్వం వాదించిన నేపథ్యంలో అది ముమ్మాటికీ పాత ప్రాజెక్టేనని తెలంగాణ స్పష్టం చేసింది. చిన్న నీటివనరుల విభాగంలో మిగిలిన 45 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు ఏపీ ప్రభుత్వం మళ్లించిన 80 టీఎంసీలకుగాను తమకు దక్కే 45 టీఎంసీలను కలిపి 90 టీఎంసీలను ఆ ప్రాజెక్టుకు కేటా యించామంటూ ట్రిబ్యునల్‌కు తెలంగాణ ప్రభుత్వం వివరించింది. విభజన చట్టం ప్ర కారం ఆ ప్రాజెక్టుకు కృష్ణా బోర్డు, సీడబ్ల్యూ సీ, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం కోసం ప్రయత్నిస్తున్నామని.. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభు త్వం దాఖలు చేసిన ఐఏ(ఇంటర్ లొకేటరీ అప్లికేషన్)ను కొట్టేయాలని ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేసింది. రెండు రాష్ట్రాల వాదనలు విన్న ట్రిబ్యునల్.. తదుపరి విచారణను సెపె్టంబర్ 25కు వాయిదా వేసింది. సెపె్టంబర్ 25 నుంచి 27 వరకూ ట్రిబ్యునల్ విచారించనుంది. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన జలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు పంపిణీ చేసేందుకు జస్టిస్ బ్రిజేష్‌కుమార్ అధ్యక్షతన జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్.తాళపత్ర సభ్యులుగా కేంద్రం ఏర్పాటుచేసిన ట్రిబ్యునల్ బుధవారం నుంచి విచారణను ప్రారంభించింది. బుధవారం, గురువారం తెలంగాణ సర్కార్ తరఫున సీనియర్ కౌన్సిల్ సీఎస్ వైద్యనాథన్ వాదనలు విన్పించగా.. శుక్రవారం ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్ జయదీప్‌గుప్తా వాదనలు విన్పించారు. తెలంగాణకు అన్యాయం చేశారు.. చిన్న నీటివనరుల విభాగంలో దశాబ్దాలుగా తాము ఏడాదికి సగటున 44 టీఎంసీలకు మించి వాడుకోలేదని.. కానీ విభజన సమయంలో 89 టీఎంసీలు వాడుకుంటున్నామ ని ఏపీ ప్రభుత్వం ఎత్తిచూపిందని ట్రిబ్యునల్‌కు తెలంగాణ సర్కార్ వివరించింది. ఆ క్రమంలోనే ఏపీకి 512, తమకు 299 టీఎంసీలు పంచుతూ అన్యాయం చేశారని పేర్కొంది. మిగులు జలాలను వాడుకోవడానికే.. నికర జలాలను బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకు కేటాయించడానికే బచావత్ ట్రిబ్యునల్ తొలి ప్రాధాన్యత ఇచ్చిందని.. నికర జలాల్లో మిగులును మాత్రమే బేసిన్ ఆవల ప్రాజెక్టులకు కేటాయించిందని తెలంగాణ ప్రభు త్వం పేర్కొంది. పాలమూరు–రంగారెడ్డి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టేనని.. ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు న్యాయబద్ధమేనని స్ప ష్టం చేసింది. తెలంగాణ వాదనలు విన్నాక ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేష్‌కుమార్ స్పందిస్తూ.. విభజన చట్టంలో సెక్షన్ 89 ప్రకారం కేటాయింపులు లేని ప్రాజెక్టులకు మాత్రమే నీటిని కేటాయించే అధికారం తమకు ఉందని.. నీటిని పునఃపంపిణీ చేసే అధికారం తమకు లేదని స్పష్టం చేశారు. దీనిపై తెలంగాణ సీనియర్ కౌన్సిల్ వైద్యనాథన్ స్పందిస్తూ.. అలాంటప్పుడు ఏపీ సర్కార్ దాఖలు చేసిన ఐఏను విచారించే అధికారం ట్రిబ్యునల్‌కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కేటాయింపులకు మించి వినియోగం: ఏపీ ఆరోపణ తాము చేపట్టిన మిషన్ కాకతీయ విజయవంతమైందని తెలంగాణ సర్కారే చెబుతోందని.. దీన్ని బట్టి చూస్తే చిన్న నీటివనరుల విభాగంలో వాడుకుంటున్న నీటిపై తెలంగాణ చెబుతున్న లెక్కలు సరైనవి కావంటూ ట్రిబ్యునల్‌కు ఏపీ ప్రభుత్వ సీనియర్ కౌన్సిల్ జయదీప్‌గుప్తా వివరించారు. -
పాలమూరుకు ‘పర్యావరణ’ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల జారీ ప్రక్రియ మళ్లీ వాయి దా పడింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని నిపుణుల మదింపు కమిటీ గత నెల 27న సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన మినిట్స్‌ను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టడం వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని చక్కదిద్దడానికి (పర్యావరణ పునరుద్ధరణకు) రూ.142 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ నివేదించింది. అయితే నష్ట నివారణ వ్యయాన్ని లెక్కించడంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను నీటిపారుదల శాఖ అనుసరించలేదని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. పర్యావరణానికి జరిగిన నష్టం విలువ, నష్ట నివారణ చర్యల వ్యయం, సామాజిక ప్రభావ నివారణ చర్యల వ్యయాలను ఎస్ఓపీ ఆధారంగా మళ్లీ లెక్కించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కాగా రూ.55,086.57 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు, ఇప్పటికే రూ.21,200 కోట్లు ఖర్చు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ శాఖకు తెలియజేసింది. ప్రాజెక్టు ద్వారా 6 జిల్లాల్లోని 70 మండలాల పరిధిలో మొత్తం 8,83,945 హెక్టార్లకు సాగునీరు అందుతుందని, సత్వరం పర్యావరణ అనుమతులు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. గత నవంబర్లోనే ఉల్లంఘనల నిర్ధారణ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం..పర్యావరణ ప్రభావం మదింపు (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్/ఈఐఏ) నోటిఫికేషన్ 2006ను ఉల్లంఘించినట్టు గతేడాది నవంబర్ 14న జరిగిన సమావేశంలో కమిటీ నిర్ధారించింది. వాస్తవానికి ఇలాంటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల జారీ విషయంలో అనుసరించాల్సిన ఎస్ఓపీని 2021లో కేంద్ర పర్యావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ప్రతిపాదనలను సైతం ఎస్ఓపీ ఆధారంగా మదింపు నిర్వహించాలని అప్పట్లో నిపుణుల కమిటీ నిర్ణయించింది. దీంతో ఎస్ఓపీ అమలులో భాగంగా.. అనుమతులు లేకుండా పనులు చేపట్టడంతో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని చక్కదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.6124.36 కోట్లతో పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ)ని సిద్ధం చేసింది. అందులో రూ.142.49 కోట్లను పర్యావరణ పునరుద్ధరణకు కేటాయించింది. అయితే వీటిని లెక్కించే విషయంలో ఎస్ఓపీని పాటించలేదని నిర్ధారించిన నిపుణుల కమిటీ మళ్లీ కొత్తగా అంచనాలు రూపొందించాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా 90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంపై గతంలో ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రూ.528 కోట్లను పర్యావరణ పరిహారంగా కృష్ణా బోర్డుకు చెల్లించాలని అప్పట్లో ఆదేశాలివ్వగా దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. -
‘హరితహారం అంటే కాంగ్రెస్ నేతలు జోకులేశారు’
సాక్షి, రంగారెడ్డి: హరితహారం అంటే తొలినాళ్లలో కాంగ్రెస్ నేతలు జోకులేశారని, కానీ, ఇవాళ దానివల్లే తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందన్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. గత ఏడేళ్లలో హరితహారం కోసం రూ. 10వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారాయన. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని అర్బన్ పార్కులో సీఎం కేసీఆర్ (CM KCR) మొక్కలు నాటి.. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో 85 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయి. గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయి. విడిపోతే తెలంగాణ నాశనం అవుతుందని అన్నారు. కానీ, ఇప్పుడు అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది. గోదావరి నీటిని వందల ఫీట్లువేసినా బోర్లలో నీళ్లు పడేవి కావు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును కాంగ్రెస్ అడ్డుకుంది. కానీ, ఆ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు తెచ్చే బాధ్యత నాది. అలాగే గోదావరి నీటిని గండిపేట, హిమాయత్ సాగర్‌కు లింక్ చేస్తాం. చెవేళ్ల ప్రాంతానికి త్వరలోనే నీళ్లు అందిస్తాం. మహేశ్వరం నియోజకవర్గానిక మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని తుమ్మలూరు బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాగే శంషాబాద్ నుంచి మహేశ్వరం వరకు మెట్రో మార్గం పొడిగించేందుకు చర్యలు సైతం తీసుకుంటామన్నారాయన. ఇదీ చదవండి: మాజీ ఎంపీల భేటీ.. రోజంతా హడావిడి! -
కొత్తగా ‘పాలమూరు’! కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు మంగళం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అలైన్మెంట్లో కీలక మార్పు చోటు చేసుకుంది. ప్రాజెక్టులో తొలుత ప్రతిపాదించిన కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దానికన్నా ముందే ఉన్న ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నుంచే రెండింటి ప్రతిపాదిత ఆయకట్టుకు నీరివ్వాలని, ఇందుకోసం రెండు ప్రధాన కాల్వలను నిర్మించాలని నిర్ణయించింది. నాలుగైదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం దాదాపు 16 నియోజకవర్గాలపై ప్రభావం చూపిస్తుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఆగస్టు నాటికల్లా ఉద్ధండాపూర్ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోయాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశించడం గమనార్హం. అయితే ప్రాజెక్టులో తొలిదశ కింద తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఈ పనులను చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సచివాలయంలో తొలి సంతకం దీనిపైనే.. శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీల కృష్ణా జలాలను ఎత్తిపోసి.. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 12,44,940 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ఆయా జిల్లాలకు తాగునీరు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ‘పాలమూరు’ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్టులో భాగంగా అంజనాగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కురుమూర్తిరాయ, ఉద్ధండాపూర్, కేపీ లక్ష్మీదేవిపల్లి పేర్లతో మొత్తం 6 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ప్రతిపాదించారు. తాజాగా ఇందులో చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రభుత్వం విరమించుకుంది. ఈ రిజర్వాయర్ కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు ఐదో రిజర్వాయరైన ఉద్ధండాపూర్ ద్వారానే సాగునీరు సరఫరా చేయాలని నిర్ణయించింది. 16.03 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న ఉద్ధండాపూర్ రిజర్వాయర్ ద్వారా తొలుత 5,02,000 ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించగా.. కేపీలక్ష్మీదేవిపల్లి ఆయకట్టును సైతం కలపడంతో ఇది 9,06,684 ఎకరాలకు చేరింది. కుడి, ఎడమ కాల్వాల లే అవుట్ ఇదీ.. ఇటీవల ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆయకట్టుకు సాగునీరు అందించడానికి రూ.5,680 కోట్లతో ఉద్ధండాపూర్ కుడి ప్రధాన కాల్వ, ఎడమ ప్రధాన కాల్వ నిర్మాణ పనులకు పరిపాలనపర అనుమతులు జారీ చేస్తూ గత నెల 30న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ సంతకం చేశారు. కావాలనుకుంటే మళ్లీ నిర్మాణం! పాత ప్రతిపాదనల ప్రకారం 2.8 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను నిర్మించి 4.13 లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇప్పటివరకు పనులు మొదలుపెట్టకపోవడంతో ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకుంది. భవిష్యత్తులో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు విస్తరించి అదనపు ఆయకట్టుకు నీరివ్వాలని భావిస్తే.. మళ్లీ కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఈ జలాశయంతో కలిపే ప్రాజెక్టుకు అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించాయి. కుడి ప్రధాన కాల్వ కింద 3,98,568 ఎకరాలకు.. ఉద్ధండాపూర్ కుడి ప్రధాన కాల్వ 105.5 కిలోమీటర్ల పొడవున ఆయకట్టుకు సాగునీరు అందించనుంది. 6,922 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన ఈ కాల్వ ద్వారా 3,98,568 ఎకరాలకు సాగునీరు ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. ► ఇందులో తొలి కుడి బ్రాంచి కాల్వ (ఆర్బీసీ1) ద్వారా 2,19,731 ఎకరాలకు.. రెండో కుడి బ్రాంచి కాల్వ (ఆర్బీసీ2) ద్వారా 1,00,792 ఎకరాలు, ప్రధాన కాల్వ ద్వారా నేరుగా 78,045 ఎకరాలకు నీరు అందుతుంది. ఈ కుడికాల్వకు అనుసంధానంగా ఫతేపూర్ కాల్వ ద్వారా మరో 6,410 ఎకరాలను సర్కారు ప్రతిపాదించింది. ► తాగునీటి అవసరాల కోసం చించోడ్లోని చౌట చెరువు, బ్రహ్మచెరువు, వీర్లపల్లెలోని అంతుకుంట, దామర్పల్లిలోని మల్లప్ప చెరువు, హైతాబాద్‌లోని పెద్ద చెరువు, మాచాన్పల్లిలోని నల్ల చెరువు, చందనవల్లిలోని పెద్ద చెరువు, తాడ్లపల్లిలోని నాగుల చెరువు, లింగారెడ్డి చెరువు, దారప్పల్లిలోని దార్పల్లి చెరువులను కుడి ప్రధాన కాల్వతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎడమ ప్రధాన కాల్వ కింద 5,01,706 ఎకరాలకు.. ఉద్ధండాపూర్ ఎడమ ప్రధాన కాల్వ 133.65 కిలోమీటర్ల పొడవునా సాగుతుంది. దీని సామర్థ్యం 3,790.8 క్యూసెక్కులు. ఈ కాల్వ కింద 5,01,706 ఎకరాల ఆయకట్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. తాగునీటి అవసరాలకు మల్కా చెరువు (కుసుమ సముద్రం), కొత్త చెరువు (ఇప్పాయిపల్లి), చైలమ్మ చెరువు (కుల్కచర్ల), ఖమ్మం చెరువు (ఖమ్మమాచారం), ఊర చెరువు (పాలెపల్లి), కొత్త చెరువు (బాచ్‌పల్లి), ఊర చెరువు (ఊట్పల్లి), సర్పాన్‌పల్లి ప్రాజెక్టు(సర్పాన్‌పల్లి), అలీపూర్ ట్యాంకు (అలీపూర్), పెద్ద చెరువు (పెద్దెముల్)లను ఎడమ ప్రధాన కాల్వ ద్వారా నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన కాల్వలకు వ్యయం రూ.5,678 కోట్లు కుడి/ఎడమ ప్రధాన కాల్వల నిర్మాణానికి మొత్తం రూ.4,659 కోట్ల వ్యయం అవుతుందని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. వీటి నిర్మాణానికి 8,411 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉంటుందని.. ఎకరాకు రూ.12లక్షల చొప్పున అంచనా వేసుకుంటే అదనంగా రూ.1,019.41 కోట్లు అవసరమని తేల్చింది. దీంతో మొత్తంగా ప్రధాన కాల్వల వ్యయం రూ.5,678 కోట్లు అవుతుందని అంచనా వేసింది. సాగునీటి శాఖ ప్రతిపాదనల ప్రకారం.. ఉద్ధండాపూర్ జలాశయం నుంచి ప్రధాన కాల్వ ప్రారంభమవుతుంది. 16.5 కిలోమీటర్ వద్ద ఎడమ, కుడి ప్రధాన కాల్వలుగా విడిపోతుంది. -
ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ బిచ్చగాళ్లలా అడుకుంటున్నారు: కేటీఆర్
సాక్షి, మహబూబ్ నగర్: పాలమూరు ఆశీర్వాదంతో ఎంపీగా గెలిపించిన కేసీఆర్ ఇక్కడి ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాడని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పాలమూరు బిడ్డల ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని చెప్పారు. ఈ మేరకు మహబూబ్‌నగర్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లుడుతూ.. గోదావరి, కృష్ణ జీవనదులతో రాష్ట్ర సస్యశ్యామలవుతోందన్నారు. పాలమూరు జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో ఎక్కడా తాగు, సాగునీటి సమస్య లేదన్నారు. గతంలో వలసల జిల్లాగా పాలమూరు ఉండేదన్నారు. ఒప్పుడు రైతులు కూలీలు వలస వెళ్లేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాలన ఉంచి వలసలు వస్తున్నారని తెలిపారు. పాలమూరు నాడు మైగ్రేషన్ నేడు ఇరిగేషన్ అన్న చందంగా మారిందన్నారు. ఒకప్పుడు పరిశ్రమలు, ఉద్యోగాలు లేవని నేడు ఇండస్ట్రీయల్ ఖిల్లాగా పాలమూరు అవతరించిందన్నారు. కొత్త సచివాలయంలో మొదటి సమీక్ష పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద నేజరిగిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 33 టీఎంసీలతో ఆగస్టులో నీళ్లు నింపుతున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం. 8,700 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మాణం కాబోతున్నాయి. పాలమూరుకు పొలిటికల్ టూరిస్టులొస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ బిచ్చగాళ్లలా అడుకుంటున్నారు. బండి సంజయ్ మంచోడో, పిచ్చోడో అర్థమైతలేదు. 15 లక్షలు ఖాతాలో వేస్తామని మాట తప్పిన మోదీ గొప్పవాడా. 15 లక్షల వలసలు ఆపిన కేసీఆర్ గొప్పవాడో ఆలోచించండి. బీజేపీకి ఎన్నికల సమయంలోనే దేవుళ్ళు గుర్తుకొస్తారు. దేవుళ్ళ పేరుతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పాలమూరు-రంగారెడ్డి రిజర్వాయర్‌కు జాతీయ హోదా కల్పిస్తామన్న ప్రధాని హామీ ఏమైంది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని చూస్తే ప్రతిపక్షాలకు నోట్లో మాట రావడం లేదు. సీఎం వయసు స్థాయి చూడకుండా రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి మాటలు పట్టించుకోనవసరం లేదు. అభివృద్ధి జరుగుతుంటే విమర్శలు వస్తూనే ఉంటాయి. సవాళ్లను దాటుకొని ముందుకు సాగాలి. -
ఆగస్టులోగా ‘పాలమూరు’ తాగునీళ్లు!
సాక్షి, హైదరాబాద్: ‘పాలమూరు’ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి వచ్చే ఆగస్టులోగా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటిని అందిస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇందుకు అనుగుణంగా జూలై నాటికి కరివెన జలాశయానికి, తర్వాతి నెలరోజుల్లో ఉద్ధండాపూర్ జలాశయానికి నీళ్లను ఎత్తిపోసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్ జలాశయాల మిగులు పనులను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ నూతన సచివాలయంలో సోమవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ తొలి సమీక్ష నిర్వహించారు. తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు పనులను కొనసాగించడానికి సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో.. అందుకు సంబంధించిన పనుల పురోగతిపై కూలంకంషంగా చర్చించారు. జలాశయాల పంపుహౌజ్‌లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, కన్వేయర్ సిస్టమ్‌లో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక పాలమూరు జిల్లాలోని ఇతర ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ పనుల పురోగతిపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. వాటిలో మిగిలిన కొద్దిపాటి పనులను జూన్‌లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్సీ మురళీధర్‌రావు, అడ్వైజర్ పెంటారెడ్డి, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ద్వితీయం పూజల్లో పాల్గొన్న సీఎం నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ సోమవారం బిజీబిజీగా గడిపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన తూర్పు ప్రధానద్వారం ద్వారా సచివాలయంలోకి ప్రవేశించారు. నేరుగా యాగశాలకు చేరుకున్నారు. అక్కడ వేదపండితులు నిర్వహించిన ద్వితీయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆరో అంతస్తుకు చేరుకున్నారు. తన కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, పీఆర్వో కార్యాలయాలను పరిశీలించారు. కారిడార్లలో కలియదిరిగారు. అనంతరం తన చాంబర్లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 5.20 గంటల ప్రాంతంలో తిరిగి ప్రగతిభవన్‌కు బయలుదేరారు. -
ఎన్జీటీ విధించిన జరిమానాపై స్టే
సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ విధించిన జరిమానాపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తాగునీటికి సంబంధించి 7.15 టీఎంసీల పనులకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. ధర్మాసనం ఆదేశాలకు ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం 90 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మిస్తోందని పర్యావరణ అనుమతుల్లేవని ఆరోపించింది. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణ ఆగస్టుకు వాయిదా వేసింది. ► పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ఎన్జీటీ విధించిన భారీ జరిమానాను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముఖల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ .. ఎన్జీటీ ఆదేశాలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందన్నారు. కేవలం తాగునీటి కోసమే ప్రాజెక్టు అని ఎలా చెబుతారు..? ఉత్తర్వుల్లో రెండు రకాల ప్రయోజనాలు అని ఉందిగా అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రాజెక్టు తాగు, సాగు నీటి విభాగాలకనీ, రెండింటికీ వేర్వురుగా నిధులు కేటాయింపులు ఉన్నాయని రోహత్గి తెలిపారు. 2050 నాటి అవసరాల మేరకు ప్రాజెక్టు చేపడుతున్నామన్నారు. తాగునీటి నిమిత్తం ఐదు రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని దీంట్లో మొదటి రిజర్వాయరు 24వేల ఎకరాలని ఇది రాష్ట్రపతి భవనం కన్నా వెయ్యి రెట్లు పెద్దదని రోహత్గి తెలిపారు. వంద నుంచి రెండు వందల అడుగుల లోతుగా నిర్మిస్తున్న నిర్మాణాలు హఠాత్తుగా నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశించిందన్నారు. ప్రాజెక్టు పనులు సురక్షిత స్థాయికి తీసుకొచ్చి నిలిపివేయడానికే రూ.కోట్లలో ఖర్చయిందన్నారు. ఈలోగా ఆదేశాలు ఉల్లంఘించారంటూ ఎన్జీటీ భారీగా జరిమానా విధించిందని రోహత్గి తెలిపారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టు వల్ల ఏపీలోని రాయలసీమ పర్యావరణంపై ప్రభావం ఎలా పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు మరో సీనియర్ న్యాయవాది వైద్యనాధన్ ప్రశ్నించారు. తెలంగాణ వారెవరూ ప్రాజెక్టును వ్యతిరేకించలేదని, ఏపీ వారే వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, పర్యావరణ అనుమతుల్లేవంటూ ఏపీ ప్రభుత్వం అంతర్రాష్ట్ర జల వివాదాలు లేపాలని యోచిస్తోందన్నారు. విభేదించిన ఏపీ న్యాయవాది న్యాయస్థానం వాస్తవాల్లోకి వెళ్లాలని వినతి తెలంగాణ న్యాయవాదుల వాదనలతో ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా విభేదించారు. రెండు రాష్ట్రాల అధికారులతో సంయుక్త కమిటీకి తెలంగాణ ఒప్పుకోలేదని తెలిపారు. ప్రాజెక్టు మొత్తంగా చూస్తే తాగునీరు అనేది చాలా చిన్న విషయమని తెలిపారు. తాగునీటి ప్రాజెక్టుకు మినహాయింపు ఇస్తున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. తాగునీటి అవసరాలకు 7.15 టీఎంసీలు సరిపోతాయని సంయుక్త కమిటీ నివేదిక చెప్పిందని, అయితే సాగు, పారిశ్రామిక అవసరాలకు సరిపోయేలా 90 టీఎంసీలతో ప్రాజెక్టు రూపొందించారని జయదీప్ గుప్తా తెలిపారు. న్యాయస్థానం వాస్తవాల్లోకి వెళ్లాలని కోరారు. 7.15 టీఎంసీల పనులే చేపడుతున్నామని తెలంగాణ చెబుతోందిగా అని ధర్మాసనం పేర్కొనగా.. రిజర్వాయర్లకు అనుమతులు లేవని, ప్రాజెక్టు నిలిపివేయాలని గుప్తా కోరారు. ఎన్జీటీ ఎంత మొత్తం జరిమానా విధించిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్జీటీ పాలమూరు–రంగారెడ్డి , డిండి ప్రాజెక్టులకు జరిమానాగా విధించిందని రోహత్గి తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొత్తం వ్యయంరూ.35,200 కోట్లలో 1.5 శాతం రూ.528 కోట్లు ఆదేశాలు ఉల్లంఘించామంటూ మరో రూ.300 కోట్లు జరిమానా వేసిందన్నారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. 7.15 టీఎంసీల తాగునీటి పనులకు మాత్రమే అనుమతిస్తున్నామని పేర్కొంది. తాగునీటి ఎద్దటితో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే అనుమతి ఇస్తున్నామని స్పష్టం చేసింది. అనంతరం, ఎన్జీటీ విధించిన భారీ జరిమానాపై స్టే విధించాలని రోహత్గి కోరారు. ఎన్జీటీ విధించిన పరిహారం మొత్తంపైనా స్టే విధిస్తున్నట్లు పేర్కొన్న ధర్మాసనం తదుపరి విచారణ ఆగస్టుకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఆరువారాల్లోగా ప్రతివాదులు, ఏపీ ప్రభుత్వం, కేంద్రం కౌంటరు దాఖలు చేయాలని, తర్వాత ఆరు వారాల్లోగా తెలంగాణ రిజాయిండర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. పర్యావరణ అనమతులు లేకుండా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపడుతోదంటూ ఏపీ ప్రభుత్వంతో పాటు ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన చందరమౌళీశ్వరరెడ్డి, తదితరులు ఎన్జీటీని ఆశ్రయించారు. పిటిషన్లు విచారించిన ఎన్జీటీ ప్రాజెక్టు పనులు నిలిపి వేయాలని 2021లో ఆదేశాలిచ్చింది. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘించి తెలంగాణ ప్రభుత్వం పనులు చేపడుతోదంటూ పిటిషనర్లు మరోసారి ఎన్జీటీని ఆశ్రయించగా ఎన్జీటీ జరిమానా విధించింది. -
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
-
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టులో పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు మాత్రమే పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అలాగే తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించు కోవాలని స్పష్టం చేసింది. ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొకుండా.. ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశంతో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. అదే విధంగా ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) విధించిన రూ. 500కోట్ల జరిమానాపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులందరికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ. తదుపరి విచారణను ఆగష్టుకు వాయిదా వేసింది. కాగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి రూ. 528 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం ధర్మాసనం విచారణ జరిపింది. చదవండి: సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఈనెల 27కు విచారణ వాయిదా -
‘పాలమూరు– రంగారెడ్డి’కి రూ.13,500 కోట్ల రుణాలు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.13,500 కోట్ల అదనపు రుణం ఇవ్వడానికి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)లు సూత్రప్రాయంగా అంగీకరించాయి. చెరో రూ.6,750 కోట్ల చొప్పున రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. అయితే, పర్యావరణ అనుమతుల్లేని కారణంగా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలుపుదల చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విధించిన స్టేతోపాటు ఇతర న్యాయ వివాదాలు తొలగిన తర్వాతే రుణాలు ఇస్తామని నిబంధన పెట్టాయి. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, అనుమతులు లభించిన తర్వాత స్టే తొలగిపోనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని చేపట్టినందుకు రూ.920.85 కోట్ల జరిమానా విధిస్తూ గత నెలలో ఎన్జీటీ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్ ఇంకా విచారణకు రావాల్సి ఉంది. స్టేతో ఆగిన రూ.3వేల కోట్ల రుణం కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల రుణాలను పీఎఫ్సీ నుంచి సమీకరించేందుకు గతంలో ఒప్పందం జరగగా, ఇప్పటివరకు రూ.7 వేల కోట్లను పీఎఫ్సీ విడుదల చేసింది. ప్రాజెక్టు పనులపై ఎన్జీటీ విధించిన స్టే తొలగిన తర్వాతే మిగిలిన రూ.3వేల కోట్లను విడుదల చేస్తామని పీఎఫ్సీ పేర్కొంటోంది. రోజుకు ఒక టీఎంసీ తరలింపు న్యాయవివాదాలతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు నిలిచిపోయినా, అప్పటికే రోజుకు ఒక టీఎంసీ సామర్థ్యంతో కృష్ణా జలాల తరలింపునకు వీలుగా పనులు జరిగినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది చివరిలోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 67 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఆరు రిజర్వాయర్లను నిర్మిస్తుండగా, తొలి నాలుగు రిజర్వాయర్లయిన నార్లపూర్, ఏదుల, వట్టేం, కరివేనలకు శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లను ఎత్తిపోసేందుకు వీలుగా పంపులు, మోటార్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. చివరి రెండు రిజర్వాయర్లు అయిన ఉదండపూర్, లక్ష్మీదేవిపల్లిలకు నీళ్లను పంపింగ్ చేసే పంపులు, మోటార్లతోపాటు సొరంగం పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఉదండపూర్ జలాశయం నుంచి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లను పంపింగ్ చేసేందుకు మధ్యలో 14 కి.మీ. సొరంగాన్ని నిర్మించాల్సి ఉంది. సొరంగానికి ప్రత్యామ్నాయంగా ఉదండపూర్ నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లను ఎత్తిపోయాలన్న ప్రతిపాదనలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని సుపరిపాలన వేదిక(ఎఫ్‌జీజీ) కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి శనివారం లేఖ రాశారు. ఈఎన్సీ సమగ్ర సర్వే జరిపి జూరాల నుంచి 70 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని డీపీఆర్ తయారు చేయగా.. దానిని సీఎం కేసీఆర్ కాదని శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవాలని సూచించారన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టుపై నిపుణుల రిపోర్టు కాదని రాజకీయ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు. సర్వేకు భిన్నంగా కార్యాలయంలోనే మ్యాపుల ఆధారంతో ఆదరాబాదరాగా రెండు వారాల్లో శ్రీశైలం నుంచి 90 టీఎంసీల నీటిని తీసుకోవడానికి డీపీఆర్ తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. మరోవైపు ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఎటువంటి పర్యావరణ, ఇతర అనుమతుల్లేకుండా మొదలు పెట్టారన్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు, సాలీనా కడుతున్న వడ్డీ, ప్రాజెక్టుకు కావాల్సిన 4,560 మెగావాట్ల విద్యుత్ ఎక్కడి నుంచి తెస్తారో ప్రజలకు వివరించాలన్నారు. -
KTR: మోదీ ఓ అసమర్థ ప్రధాని.. కార్పొరేట్ల కోసమే పాలన
సాక్షి, నారాయణపేట: మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రూ.12లక్షల కోట్లను మాఫీ చేసిందని.. ఇది నిజం కాకపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. మాట్లాడితే దేశం కోసం, ధర్మం కోసం అంటారు.. అది నిజం కాదు. కేవలం అదానీ, అంబానీ కోసమే మోదీ పాలన కొనసాగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పేదలకు రావాల్సిన పైసలన్నీ మోదీ దోస్తులు అదానీ, అంబానీలకు చేరుతున్నాయని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు రూ.12లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్రం చిత్తశుద్ధితో ఆలోచిస్తే దేశంలో రైతాంగానికి రూ.14.50 లక్షల కోట్లతో ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చన్నారు. మంగళవారం నారాయణపేటలో మంత్రులు మహముద్ అలీ, నిరంజన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డితో కలిసి రూ.196కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం సభలో కేటీఆర్ మాట్లాడుతూ దేశాన్ని ఏలిన 14 మంది ప్రధానమంత్రుల పాలనలో రూ.56 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. నరేంద్రమోదీ ఎనిమిదేళ్ల పాలనలో దేశం రూ.వంద లక్షల కోట్లు అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. దేశంలో పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.25 లక్షల అప్పు మోపుతున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. దమ్ముంటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రాష్ట్ర బీజేపీ నేతలు జాతీయ హోదాను ఇప్పించాలని సవాల్ విసిరారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు కావస్తున్నా.. కృష్ణాజలాలపై ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల పంచాయితీ తెంపని అసమర్థత ప్రభుత్వం కేంద్రానిదేనని నిందించారు. ’’మహబూబ్‌నగర్‌లో ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందంట కదా... తెలంగాణకు 500 టీఎంసీల నీటిని ఇవ్వాలనీ, ఈ ఏడాది కేంద్రబడ్జెట్లోనే నిధులు కేటాయిస్తూ పాలమూరు–రంగారెడ్డికి జాతీయహోదాను ఇప్పించాలని అక్కడి నుంచి కేంద్రానికి ఒక తీర్మానం చేసి పంపండి’’ అని సలహా ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ నేతలకు వెన్నముక ఉంటే ఈ పనులు చేయాలని సవాల్ విసిరారు. ఆదాయం కాదు.. కష్టాలు డబుల్ అయ్యాయి ‘మోదీ పాలనలో రైతుల ఆదాయం డబుల్ అయిందని నిన్న ఓ పత్రికలో ప్రధాని ఆర్థిక సలహాదారు ఓ కథనం రాశారు. ఇది ఎంత దుర్మార్గం. ఎవరి ఆదాయాలూ డబుల్ కాలేదు. కష్టాలు, పెట్టుబడులు డబుల్ అయ్యాయి...’’ అని కేటీఆర్ అన్నారు. ఒక్క తెలంగాణలో మన పాలనలో రైతులకు ఆరేళ్లలో రూ.65వేల కోట్లు రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. రైతు బీమా దేశంలో ఎక్కడా లేదు..అని చెప్పారు. బేకార్ గాళ్లతో మనకు పంచాయితీ ఎందుకనీ కులాల మతాల మధ్య చిచ్చులు పెడుతున్న చిల్లరగాళ్లు ఉన్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డిని గెలిపించి హ్యట్రిక్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దమోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అబ్రహం, కార్పొరేషన్ చైర్మన్లు సాయిచంద్, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు. మోదీ ఓ అసమర్థ ప్రధాని ‘నరేంద్రమోదీ ఓ అసమర్థ, పనికి మాలిన ప్రధాని అని కేటీఆర్ ధ్వజమెత్తారు. క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ రూ.30లక్షల కోట్లు అదనంగా గుంజింది కేంద్ర ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. ’’పీఎం కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుగొన్నారు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంటుండు. ఎంత హస్యాస్పదమండి... మోదీ చూ మంత్రం వేస్తే కరోనా వ్యాక్సిన్ తయారైందంట...శాస్త్రవేత్తలు, డాక్టర్లు, నర్సులు వారంతా ఎందుకున్నట్లు.’ అని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదాయం కాదు.. కష్టాలు డబుల్ అయ్యాయి ‘మోదీ పాలనలో రైతుల ఆదాయం డబుల్ అయిందని నిన్న ఓ పత్రికలో ప్రధాని ఆర్థిక సలహాదారు ఓ కథనం రాశారు. ఇది ఎంత దుర్మార్గం. ఎవరి ఆదాయాలూ డబుల్ కాలేదు. కష్టాలు, పెట్టుబడులు డబుల్ అయ్యాయి...’’ అని కేటీఆర్ అన్నారు. ఒక్క తెలంగాణలో మన పాలనలో రైతులకు ఆరేళ్లలో రూ.65వేల కోట్లు రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. రైతు బీమా దేశంలో ఎక్కడా లేదు..అని చెప్పారు. బేకార్ గాళ్లతో మనకు పంచాయితీ ఎందుకనీ కులాల మతాల మధ్య చిచ్చులు పెడుతున్న చిల్లరగాళ్లు ఉన్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డిని గెలిపించి హ్యట్రిక్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దమోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అబ్రహం, కార్పొరేషన్ చైర్మన్లు సాయిచంద్, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నారాయణపేటలో సీనియర్ సిటిజన్లకో పార్కు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్ల కోసం నారాయపేట జిల్లాకేంద్రంలో ఓ పార్కు ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని 8వ వార్డు సత్యసాయికాలనీలో రూ.80 లక్షలతో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్ పార్కును మంత్రి ప్రారంభించి అద్భుతమంటూ కితాబునిచ్చారు. ఈ పార్కును ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని కేటీఆర్ అభినందించారు. పార్కులో ఉన్న ఓ చెట్టుకు విరగకాసిన చింతకాయలను చూస్తూ మంత్రి కేటీఆర్ భలే కాశాయని ముచ్చట పడ్డారు. అంతలోనే చెట్టు చింతకాయను ఓ ప్రజాప్రతినిధి తీసుకువచ్చి ఇవ్వగా కేటీఆర్ వాటిని తింటూ భలేగా ఉన్నాయంటూ అందరినీ ఊరించారు. -
‘పాలమూరు’ అవసరమని ప్రధానే అన్నారు
సాక్షి, హైదరాబాద్: కరువుపీడిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను 2014లో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ స్వయంగా ప్రస్తావించారని, అందువల్ల ఈ ప్రాజెక్టుకు సత్వరమే అనుమతులు జారీ చేయాలని కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టుకు అనుమతులపై సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టు అప్రైజల్ ఆర్గనైజేషన్ (పీపీవో) చీఫ్ ఇంజనీర్‌కు బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ప్రధాని నాడు చేసిన ప్రసంగాన్ని సైతం ప్రదర్శించింది. ఉమ్మడి ఏపీలో 2013 ఆగస్టు 8న ప్రాజెక్టు సమగ్ర సర్వే కోసం రూ. 6.91 కోట్లను విడుదల చేస్తూ జీవో నంబర్ 72 జారీ చేసిన విషయాన్ని గుర్తుచేసింది. 60 రోజుల్లో 90 టీఎంసీలను తరలించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు వివరించింది. శ్రీశైలం జలాశయంలో అన్ని అవసరాలు పోనూ మిగిలిన 230 టీఎంసీల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులైన పాలమూరు–రంగారెడ్డికి 90 టీఎంసీలు, శ్రీశైలం ఎడమగట్టు కాల్వకు 40 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 40 టీఎంసీలు, డిండి ఎత్తిపోతల పథకానికి 30 టీఎంసీల నీటి లభ్యత ఉందని రాష్ట్రం స్పష్టం చేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ సి.మురళీధర్, పాలమూరు–రంగారెడ్డి చీఫ్ ఇంజనీర్ హమీద్ ఖాన్ హాజరయ్యారు. శ్రీశైలంలో 582.5 టీఎంసీల లభ్యత.. 75 శాతం డిపెండబులిటీ (వందేళ్లలో కచ్చితంగా వచ్చిన 75 ఏళ్ల వరద) ఆధారంగా శ్రీశైలం జలాశయంలో 582.5 టీఎంసీల నీటి లభ్యత ఉందని, ఇందులో నాగార్జునసాగర్ అవసరాలకు 280 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 16.5 టీఎంసీలు, చెన్నై నగర తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19 టీఎంసీలు, 22 టీఎంసీల ఆవిరి నష్టా లు కలుపుకుని మొత్తం 352.50 టీఎంసీలు అవసరమని, మిగిలిన 230 టీఎంసీల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టు అయిన పాలమూరు–రంగారెడ్డికి 90 టీఎంసీలు అవసరమని తెలంగాణ తెలిపింది. మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన 45 టీఎంసీలతోపాటు పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలించే 80 టీఎంసీల గోదావరి జలాలకు బదులుగా నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలు వాడుకోవాలని 1978 ఆగస్టు 4న బచావత్ ట్రిబ్యునల్ ముందు ఒప్పందం జరిగిన విషయాన్ని తెలంగాణ గుర్తుచేసింది. ఈ ఒప్పందం ప్రకారం 35 టీఎంసీలు మహారాష్ట్ర, కర్ణాటకలు వాడుకోగా మిగిలిన 45 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డికి కేటాయించామని తెలిపింది. తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ అవసరాలకు 90.81 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిందని, 2012– 13 నుంచి 2021–22 మధ్య 45.15 టీఎంసీలను మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసినట్లు తెలియజేసింది. ఇలా పొదుపు చేసిన 45 టీఎంసీలతోపాటు పోలవరం ద్వారా గోదావరి జలాల తరలింపుతో లభించనున్న 45 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించినట్టు వివరించింది. రూ. 55 వేల కోట్లకు పెరిగిన వ్యయం.. తొలిదశలో నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు, హైదరాబాద్ నగరంతోపాటు 1,226 గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం పనులు చేపట్టేందుకు గతంలో ఎన్జీటీ సైతం అనుమతిచ్చిందని తెలంగాణ తెలిపింది. గత ఆగస్టు 24న రెండోదశ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించింది. 2015లో రూ. 35,200 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా ప్రస్తుతం రూ. 55,086 కోట్లకు పెరిగిందని తెలిపింది. -
తెలంగాణ సర్కార్‌కు ఎన్జీటీ షాక్!
సాక్షి, అమరావతి: పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను నిలుపుదల చేయాలని 2021, అక్టోబర్ 29న జారీచేసిన ఆదేశాలను ఉల్లంఘించి యథేచ్ఛగా పనులు కొనసాగించిన తెలంగాణ సర్కార్‌పై గురువారం జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. యథేచ్ఛగా పనులు చేయడంవల్ల పర్యావరణానికి అపారనష్టం వాటిల్లిందని తేల్చింది. దీంతో ఈ రెండు ఎత్తిపోతల పథకాల వ్యయంలో 1.5 శాతం చొప్పున మొత్తం రూ.620.85 కోట్లను జరిమానాగా తెలంగాణ సర్కార్‌కు విధించింది. అంతేకాక.. చట్టాలను అమలుచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా వాటిని ఉల్లంఘిస్తున్నందున అదనంగా మరో రూ.300 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. ఇలా మొత్తం రూ.920.85 కోట్లను మూణ్నెళ్లలోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వద్ద డిపాజిట్ చేయాలని స్పష్టంచేసింది. తెలంగాణ సర్కార్ జరిమానాగా చెల్లించే రూ.920.85 కోట్లతో నమామి గంగే ప్రాజెక్టు తరహాలో కృష్ణా నదీ పరిరక్షణ చర్యలు చేపట్టాలని కృష్ణా బోర్డును ఆదేశించింది. అలాగే, పర్యావరణ అనుమతి తీసుకునే వరకూ పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులను కొనసాగించకూడదని తెలంగాణ సర్కార్ తేల్చిచెప్పింది. ఆ రెండు ఎత్తిపోతల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లను కృష్ణా బోర్డుకు పంపి, సీడబ్ల్యూసీ నుంచి అనుమతి తీసుకుని, అపెక్స్ కౌన్సిల్ మంజూరు చేశాకే వాటి పనులు చేపట్టాలని స్పష్టంచేసింది. ఈ మేరకు గురువారం ఎన్జీటీ తుది తీర్పు ఇచ్చింది. వివాదం నేపథ్యం ఇదీ.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలు తరలించేలా రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు–రంగారెడ్డి.. రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను రూ.6,190 కోట్ల వ్యయంతో 2015, జూన్ 10న తెలంగాణ సర్కార్ చేపట్టింది. పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన ఈ రెండు ఎత్తిపోతలవల్ల పర్యావరణం దెబ్బతింటోందని, ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన జలాలు దక్కవని.. దీనివల్ల ఆయకట్టులో పర్యావరణం దెబ్బతింటుందని ఏపీకి చెందిన రైతులు 2021లో ఎన్జీటీ (చెన్నె బెంచ్)ను ఆశ్రయించారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులతో జతకలిసింది. కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2060 (పునరుత్పత్తి జలాలతో కలిపి 2130) టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. ఉమ్మడి రాష్ట్రానికి 800 టీఎంసీలు (పునరుత్పత్తితో కలిపి 811) టీఎంసీలు కేటాయించిందని ఎన్జీటికి ఏపీ ప్రభుత్వం వివరించింది. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు నీటి కేటాయింపుల్లేవని.. వాటి ద్వారా 120 టీఎంసీలను తెలంగాణ సర్కార్ తరలిస్తే.. శ్రీశైలం, సాగర్‌పై ఆధారపడ్డ ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టా కూడా నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతుందని, ఇది పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుందని వాదించింది. దీనితో ఏకీభవించిన ఎన్జీటీ.. తక్షణమే పనులు నిలుపుదల చేయాలని 2021, అక్టోబర్ 29న తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. ఎన్జీటీ ఉత్తర్వులు తెలంగాణ బేఖాతరు కానీ, ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించి పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులను తెలంగాణ సర్కార్ కొనసాగించింది. దాదాపు 90 శాతం పనులు పూర్తిచేసింది. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైతులు ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిజానిజాలను నిర్ధారించడానికి కృష్ణా బోర్డు నేతృత్వంలో కమిటీని ఎన్జీటీ నియమించింది. క్షేత్రస్థాయిలో ఆ రెండు ఎత్తిపోతల పథకాలను పరిశీలించిన కమిటీ.. ఎన్జీటీ ఉత్తర్వులను తెలంగాణ సర్కార్ ఉల్లంఘించి యథేచ్ఛగా పనులు కొనసాగించినట్లు తేల్చింది. ఆ మేరకు ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, రైతులు, కేంద్ర ప్రభుత్వం, కృష్ణా బోర్డు వాదనలను విన్న జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగస్టు 17న తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఆ తీర్పును గురువారం వెల్లడించింది. -
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టారని రూ.900 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. మూడు నెలల్లో చెల్లించాలని చెన్నై ఎన్జీటీ ధర్మాసనం ఆదేశించింది. మొత్తం ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో 1.5 శాతం జరిమానా విధించింది. జరిమానాను కేఆర్ఎంబీ వద్ద జమ చేయాలని ఎన్జీటీ పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన తెలిసిందే. చదవండి: కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ -
‘పాలమూరు–రంగారెడ్డి’ పూర్తి చేస్తాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: భారత్ జోడో యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పలు ప్రజాసంఘాలు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ శనివారం వేర్వేరుగా భేటీ అయ్యారు. చేనేత కుటుంబాల సమస్యలు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, విద్యావ్యవస్థ బలోపేతంపై స్పష్టతనిచ్చారు. ►ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నేటికీ పూర్తికాలేదని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ ఆధ్వర్యంలో కన్వీనర్ రాఘవాచారి తదితరులు రాహుల్ దృష్టికి తీసుకెళ్లగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి ప్రాధాన్యతగా ఈ పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ►రాష్ట్రంలో 60 వేల చేనేత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని సినీనటి పూనమ్ కౌర్, పద్మశ్రీ అవార్డుగ్రహీత అంజయ్య రాహుల్ కలసి వివరించగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ►కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు విద్యావిధానాన్ని ప్రోత్సహించడం వల్ల నిరుపేద కుటుంబాలు నష్టపోతున్నాయని రాహుల్‌తో భేటీలో గ్రాడ్యుయేట్లు, రీసెర్చ్ స్కాలర్లు పేర్కొనగా తాము గెలిస్తే ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసి నాణ్యమైన విద్య అందిస్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పక్కాగా అమలు చేస్తామన్నారు. ►దివ్యాంగుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆధ్వర్యంలోని బృందం రాహుల్‌ను కలసి వినతిపత్రం ఇవ్వగా అధికారంలోకొస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఘన స్వాగతానికి ఏర్పాట్లు రాహుల్ భారత్ జోడో యాత్ర నవంబర్ ఒకటిన హైదరాబాద్‌కు చేరుకోనుండటంతో ఈ పాదయాత్రపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలతో విస్తరించి ఉన్న నగరంలో యాత్రను విజయవంతం చేయడం ద్వారా మూడు జిల్లాల్లో తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం నగరం నలుమూలతోపాటు రాహుల్ పాదయాత్ర నిర్వహించే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తోంది. అలాగే యాత్రలో పాల్గొనేందుకు భారీ జనసమీకరణకు ప్రణాళిక రచిస్తోంది. దీనిపై మాజీ ఎంపీ, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ కనీవినీ ఎరుగని విధంగా హైదరాబాద్‌లో రాహుల్ పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. -
‘పాలమూరు–2’ అనుమతులకు నో
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు రెండో దశకు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేసేందుకు కేంద్ర పర్యవరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ(ఎంఓఈఎఫ్) నిరాకరించింది. పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నోటిఫికేషన్–2006 నిబంధనలను ప్రాజెక్టు ఉల్లంఘించిందని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో 2021 జూలైలో జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ) ఆధారంగా పర్యావరణ ఉల్లంఘనలతో జరిగిన నష్టంపై అధ్యయనం జరిపించాలని నిర్ణయించింది. పర్యావరణ శాఖ ఉల్లంఘనల కమిటీ మాజీ సభ్యుడు కె.గౌరప్పన్కు అధ్యయనం జరిపి నివేదిక సమర్పించే బాధ్యతలు అప్పగించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఇటీవల సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చదవండి: వైద్య నోటిఫికేషన్లు వాయిదా!.. ఆలస్యానికి కారణం ఇదే బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలి.. పర్యావరణ అనుమతుల జారీకి ముందు రాష్ట్ర ప్రభుత్వం.. నష్ట నివారణ ప్రణాళిక, ప్రకృతి, ప్రాంతీయ వనరుల వృద్ధి ప్రణాళికల అమలుకు అవసరమైన నిధులకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఎంత మొత్తానికి గ్యారెంటీ ఇవ్వాలో తామే సిఫారసు చేస్తామని, రెగ్యూలేటరీ ఆథారిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఈ ప్రణాళికలను అమలు చేశాకే బ్యాంకు గ్యారెంటీలను విడుదల చేయాల్సి ఉంటుందని సూచించింది. గాలి, నీరు, భూమి, ఇతర పర్యావరణ అంశాలకు ప్రాజెక్టు వల్ల జరిగిన నష్టంపై అధ్యయనం జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణ చట్టం కింద నోటిఫై చేసిన పర్యావరణ ల్యాబ్/సీఎస్ఐఆర్ గుర్తింపుగల ల్యాబ్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరగాలని సూచించింది. అంతర్రాష్ట వివాదాల విషయంలో సంబంధిత శాఖ నుంచి అనుమతులు పొందాలని పేర్కొంది. ఫ్లోరైడ్ జోన్లో ప్రాజెక్టును నిర్మిస్తునందున జలాశయాల్లోని నీటితో భూగర్భ జలాల రిచార్జికి సదుపాయం ఉండాలని, దీనివల్ల ఫ్లోరైడ్ తీవ్రత తగ్గుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల జారీ తీవ్ర జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. -
కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ప్రేమ: వైఎస్ షర్మిల
నాగర్‌కర్నూల్ రూరల్: ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న ప్రేమ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడంలో సీఎం కేసీఆర్‌కు లేదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. బుధవారం ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి పను లు ప్రారంభించి ఎనిమిదేళ్లు కావొస్తున్నా పూర్తి చేయడంలో చిత్తశుద్ధి లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో వేల కోట్లు మామూళ్లు దండుకున్నారని ఆరోపించారు. పాలమూరు జిల్లాకు నీళ్లు పారించి పచ్చగా ఉండాలని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కోరుకున్నారని, అదే సందర్భంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను చేపట్టారని గుర్తు చేశారు. పాలమూరు–రంగారెడ్డి నిర్మాణానికి కూడా ఆయన హయాంలోనే రూపక ల్పన చేశారని షర్మిల తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మహబూబ్‌నగర్ పట్టణంలో 24 గంటల దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించారు. నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాల నిర్మాణానికి 50 మంది దళితుల భూములు గుంజుకున్నారని ఇదెక్కడి న్యాయ మని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు చెరువులోని నల్లమట్టిని అమ్ముకుంటున్నారని, ఆయన్ను మర్రి జనార్దన్‌రెడ్డి అనడం కన్నా నల్లమట్టి జనార్దన్‌రెడ్డి అంటేనే బాగుంటుందని ఎద్దేవాచేశారు. ఇలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా? అని షర్మిల ప్రశ్నించారు. సెప్టెంబర్ 17పై కొత్త రాజకీ యాలు మొదలు పెట్టారని, ఒకరు విలీనం అంటే మరొకరు విమోచనం అని రాజ కీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదీ చదవండి: ఎన్నికలొస్తేనే.. ఫాంహౌస్ నుంచి బయటికొస్తారు: వైఎస్ షర్మిల -
టన్నెల్ పనుల్లో ప్రమాదం
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ శివారులోని రేగుమాన్గడ్డ వద్ద జరుగుతున్న టన్నెల్ పనుల్లో ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు కూలీలు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. టన్నెల్‌లోని పంప్‌హౌస్ వద్ద క్రేన్ వైర్ తెగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. పంప్‌హౌస్‌లో అడుగున జరుగుతున్న పనుల కోసం క్రేన్ సహాయంతో కాంక్రీట్ బకెట్‌ను కిందకు దింపుతుండగా క్రేన్‌వైర్ తెగడంతో అది టన్నెల్లో ఉన్న కార్మికులపై పడినట్లు తెలిసింది. ఆ సమయంలో అక్కడ ఆరుగురు కార్మికులు ఉండగా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలం వద్ద ఇరుక్కుపోయిన మృతదేహాలను ఎయిర్‌ప్రెషర్ సహాయంతో బయటకు తీశారు. ఇందుకోసం సుమారు 3 గంటల సమయం పట్టినట్లు అక్కడివారు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదుగురి మృతదేహాలను అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలుకు చెందిన దయ్యాల శ్రీను (42), జార్ఖండ్‌కు చెందిన బోలేనాథ్ (45), ప్రవీనేజ్ (38), కమ్లేశ్ (36), బిహార్‌కు చెందిన సోను కుమార్(36) ఉన్నట్లు గుర్తించామని ఆసుపత్రివద్ద పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన లాల్ బల్విందర్ సింగ్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని కుడిచేతికి తీవ్రగాయం అయినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే నేపథ్యంలో ప్రాజెక్టు పనులు ప్రస్తుతం నిలిచిపోయాయని, నిర్వహణ పనుల్లో భాగంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాజెక్టు ఈఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని వెల్లడించారు. భవన, నిర్మాణరంగ కార్మికుల కేంద్ర బోర్డు చైర్మన్ శ్రీనివాసులు నాయుడు ఘటనాస్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను సొంతూళ్లకు తరలించారు. -
‘పాలమూరు’ సొరంగంలో ప్రమాదం
కందనూలు (నాగర్‌కర్నూల్): పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల సొరంగం పనుల్లో రాయి కూలి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ సమీపంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగం పనులు కొంతకాలంగా జరుగుతున్నాయి. ఉయ్యాలవాడకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గొంది శ్రీనివాస్‌రెడ్డి ఎప్పటిలాగే నీళ్ల ట్రాక్టర్ తీసుకుని, మరో నలుగురు కూలీలతో కలిసి బుధవారం ఉదయం లోపలికి వెళ్లాడు. సొరంగంలో 400మీటర్ల మేర చేరుకోగానే పైకప్పు నుంచి రాళ్లు విరిగి పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంట ఉన్నవారు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మిగిలిన నలుగురు కూలీలు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్ హెల్మెట్ లేకుండానే ట్రాక్టర్‌తో లోపలికి వెళ్లినట్టు తెలిసింది. -
పనులు పరుగెత్తాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఏడాదిలో చేయాల్సిన ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టుల పనులకు టెండర్లు పిలవాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువపై నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలు, గట్టు ఎత్తిపోతల పథకం, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు మిగులు పనులు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిపోయిన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పనులకు టెండర్లు పిలవాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. అలాగే డా.బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించాల్సిన బ్యారేజీ, చెన్నూర్ ఎత్తిపోతల పథకం, కడెం నదిపై నిర్మించ తలపెట్టిన కుప్టి ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని సూచించారు. నీటిపారుదల, వైద్యారోగ్యం, రోడ్లు, భవనాల శాఖలపై ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టులను పూర్తి చేస్తే రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రతిపాదించిన ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. సాగునీటి రంగంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటామన్నారు. అనుమతులు రాకపోవడంపై అసహనం సీతారామ, సమక్కసాగర్, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతల, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల, మోడికుంట వాగు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించి ఐదు నెలలు గడిచినా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ఇంకా అనుమతులు రాకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ కోరుతున్న అన్ని వివరాలు, అదనపు సమాచారాన్ని సమర్పించి త్వరితగతిన అనుమతులు పొందాలని అధికారులను ఆదేశించారు. ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్‌ను సత్వరం సిద్ధం చేసి సీడబ్ల్యూసీకి, గోదావరి బోర్డుకు సమర్పించాలని ఆదేశించారు. గోదావరి బోర్డు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి ఐదు ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్ నుంచి తొలగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర జల సంఘానికి పంపాలని సూచించారు. సచివాలయం పనుల్లో వేగం పెరగాలి ! కొత్త సచివాలయం భవనం పనులతో పాటు లాండ్ స్కేపింగ్, రక్షణ వ్యవస్థ వంటి అనుబంధ భవనాల పనుల్లో వేగం పెంచాలని సీఎం ఆదేశించారు. సచివాలయానికి పటిష్టమైన భద్రత కల్పించడానికి కావాల్సిన సదుపాయాలపై డీజీపీ మహేందర్ రెడ్డిని సంప్రదించి చర్యలు తీసుకోవాలన్నారు. అధునాతన సాంకేతికతతో 24 గంటల నిఘా కోసం నిర్మిస్తున్న పోలీసు కమాండ్ కంట్రోల్ భవనం పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. -
2 నెలల్లో డీపీఆర్‌లు.. ‘పాలమూరు, నక్కలగండి’పై సదరన్ జోనల్ కౌన్సిల్ సూచన
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా వాటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను జనవరి 15లోగా కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమర్పించాలని దక్షిణ రాష్ట్రాల ప్రాంతీయ మండలి (సదరన్ జోనల్ కౌన్సిల్) సమావేశం సూచించింది. ఇవి మిగులు జలాలపై ఆధారపడి ఉమ్మడి ఏపీలో చేపట్టిన పాత ప్రాజెక్టులేనని.. ఈ రెండు ప్రాజెక్టులకు బ్రిజేష్ ట్రిబ్యునల్ చేసే కేటాయింపులకు లోబడి ఉంటామని తెలంగాణ వినిపించిన వాదన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఆదివారం తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి 29వ సమావేశం జరిగింది. అందులో హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొని తెలంగాణ తరఫున వాదనలు వినిపించారు. ఆ అభ్యంతరాలకు విలువ లేదు కృష్ణా పరీవాహకంలో దిగువన ఉన్న ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మిగులు జలాల ఆధారంగా.. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలను చేపట్టిందని తెలంగాణ వివరించింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు తమ కోటాలను వినియోగించుకున్నాకే కృష్ణా జలాలు దిగువన ఉన్న తెలంగాణ, ఏపీలకు వస్తున్నాయని.. అందువల్ల ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై కర్ణాటక అభ్యంతరాలకు విలువ లేదని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల కేటాయింపు అంశం బ్రిజేశ్ ట్రిబ్యునల్ పరిధిలో ఉందని.. ఈ రెండు పథకాలకు ట్రిబ్యునల్ చేసే కేటాయింపులకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చింది. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సదరన్ కౌన్సిల్ సమావేశం.. జనవరి 15లోగా సీడబ్ల్యూసీకి పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని సూచించింది. ఇక సంగంబండ బ్యారేజీ నిర్మాణంతో కర్ణాటకలో ముంపునకు గురికానున్న గ్రామాలు/భూముల సమస్యను పరిష్కరించడానికి ఇరు రాష్ట్రాల బృందాల ఆధ్వర్యంలో జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించాలని కౌన్సిల్ సమావేశంలో మరో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకే రూ.4,457 కోట్లు రావాలి రాష్ట్ర విభజన అనంతరం ఏపీ నుంచి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ డిస్కంలు రూ.6,015 కోట్లను ఏపీ జెన్కోకు చెల్లించాల్సి ఉందని ఏపీ ఈ సమావేశంలో వాదించింది. అయితే ఏపీ జెన్కోకు చెల్లించాల్సిన బకాయిలను సర్దుబాటు చేశాక కూడా.. తమకే ఏపీ నుంచి రూ.4,457 కోట్లు రావాల్సి ఉంటుందని తెలంగాణ పేర్కొంది. వాస్తవానికి ఏపీజెన్కోకు తెలంగాణ డిస్కంలు కేవలం రూ.3,442 కోట్లను మాత్రమే చెల్లించాల్సి ఉందని తెలిపింది. విద్యుత్ సంస్థల విభజన వివాదాలన్నింటినీ పరిష్కరించుకుందామని తెలంగాణ డిస్కంలు చేసిన విజ్ఞప్తిని ఏపీజెన్కో పెడచెవిన పెట్టిందని, దివాలా స్మృతి(ఐబీసీ) కింద చర్యలు తీసుకోవాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు వేసిందని గుర్తుచేసింది. గత సెప్టెంబర్‌లో ఆ కేసును ఉపసంహరించుకున్నా.. వెంటనే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిందని పేర్కొంది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్నా.. ఇరు రాష్ట్రాలు మరోసారి సమావేశమై సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇటీవల కేంద్రం చేసిన సూచనతో మళ్లీ చర్చల్లో పాల్గొనడానికి సుముఖత తెలిపినట్టు వెల్లడించింది. ఏపీ భవన్ విభజనకు కొత్త ప్రతిపాదన ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల విభజన విషయంలో ఏపీ ప్రభుత్వం గతంలో చేసిన రెండు ప్రతిపాదనలతో అసమానతలు వస్తాయని, అందువల్ల త్వరలో తామే కొత్త పరిష్కారాన్ని ప్రతిపాదించనున్నామని తెలంగాణ పేర్కొంది. ఏపీకి అభ్యంతరాలు తెలిపాం షీలాభిడే కమిటీ సిఫార్సుల మేరకు షెడ్యూల్–9లోని 68 ప్రభుత్వ రంగ సంస్థల విభజన విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలంగాణ స్పష్టం చేసింది. అయితే 23 సంస్థల విభజన విషయంలో ఉన్న అభ్యంతరాలను ఏపీకి ఇప్పటికే తెలిపామని.. వాటిపై ఏపీ స్పందన తెలియజేయాల్సి ఉందని పేర్కొంది. గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయండి రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కేంద్రాన్ని కోరారు. వర్సిటీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 335 ఎకరాలను గుర్తించిందని.. ములుగులోని యువజన శిక్షణ కేంద్రంలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటుకు 200 ఎకరాలను సైతం గుర్తించిందని ఆయన వివరించారు. దీనికి హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ రూ.849 కోట్లతో డీపీఆర్‌ను సిద్ధం చేసిందని, ఈ అంశం కేంద్రం పరిశీలనలో ఉందని గుర్తుచేశారు. ఈ సమావేశంలో తెలంగాణ తరఫున ఆర్థిక, విద్యుత్, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.రామకృష్ణారావు, సునీల్ శర్మ, రజత్‌కుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
దక్షిణ తెలంగాణకు మరణశాసనం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే ఇవ్వడం దక్షిణ తెలంగాణకు మరణ శాసనమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో దక్షిణ తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని.. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సరైన న్యాయ కోవిదులను పెట్టకపోవడంతోనే స్టే వచ్చిందన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టుకు 10 రోజుల్లో పర్యావరణ అనుమతులు ఇప్పించాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డి, సంజయ్‌ల మీద ఉందని చెప్పారు. కేసీఆర్, జగన్‌లు మొదటి నుంచీ కవలపిల్లల్లా కలిసి వెళుతున్నారని, ఇలాంటి కుట్రలను ప్రజలు సహించబోరని అన్నారు. -
కేసీఆర్ వైఫల్యంతోనే పాలమూరుపై ఎన్జీటీ స్టే
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే విధించడానికి సీఎం కేసీఆర్ వైఫల్యమే కారణమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. దక్షిణ తెలంగాణను ఎడారి చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యమని విమర్శించారు. పాలమూరుపై ఆయనకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ పరిణామం చోటుచేసుకుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై ఎన్జీటీ స్టే
-
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే
న్యూఢిల్లీ: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టును నిర్మించొద్దని ఎన్జీటీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తాగునీటి కోసమని చెప్పి సాగునీటి కోసం నిర్మాణాలు చేపట్టారని పిటిషనర్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని చంద్రమౌళీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ తీర్పు వెలువరించింది. చదవండి: (ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ పదవీకాలం పొడిగింపు) -
బడితెపూజ∙తప్పదు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘‘రాష్ట్రంలో 1,91,000 ఉద్యోగ ఖాళీలను భర్తీచేసే వరకు, రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవరకు ఆందోళనలు చేపడతాం. మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేదాకా సీఎం కేసీఆర్‌కు బడితెపూజ తప్పదు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మున్సిపాలిటీలోని అమిస్తాపూర్‌లో ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ సభ నిర్వహించారు. నేతలు ఎనుగొండ నుంచి మహబూబ్‌నగర్ పట్టణం మీదు గా వందలాది వాహనాలతో ర్యాలీగా సభ వద్దకు చేరుకున్నారు. రేవంత్ టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాక సొంతజిల్లాలో తొలిసారిగా నిర్వహిం చిన ఈ సభకు జనం భారీసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ చేసిన ప్రసంగం ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని.. ‘‘తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగినప్పుడు కేసీఆర్ ఆ ముసుగులో రాజకీయ పార్టీని విస్తరించుకున్నారు. పదవులు అనుభవించారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో హరీశ్‌రావుసహా అరడజను మంది మంత్రి పదవులు తీసుకున్నారు. ఆ సమయంలోనే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పోతిరెడ్డిపాడు వెడల్పు పెంచి వందల టీఎంసీల కృష్ణానీటిని రాయలసీమకు తరలించింది. తెలంగాణ హక్కు అయిన జూరాల పూర్తికాలేదు. నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి కట్టలేదు. ఇవన్నీ వదిలేసి రాయలసీమకు నీళ్లు తరలించుకుపోతుంటే.. కేసీ ఆర్ మంత్రి పదవుల కోసం రాజశేఖరరెడ్డి కాళ్ల దగ్గర గులాంగిరీ చేశారు. 2008 ఉప ఎన్నికల్లో సమైక్యవాదులతో చీకటి ఒప్పందం చేసుకుని.. తెలంగాణ హక్కులు, రైతుల జీవితాలను తాకట్టుపెట్టారు. 2009లో తెలంగాణ ద్రోహుల పార్టీ అని చెప్పిన టీడీపీతో పొత్తుపెట్టుకొని 45 ఎమ్మెల్యే, 9 ఎంపీ స్థానాలకు పోటీæపడ్డారు. నీ (కేసీఆర్) నీచమైన బుద్ధి చూసి 35 మందికి డిపాజిట్ కూడా రాలేదు. ఈటల రాజేందర్‌ను ‘నీ తల ఎక్కడ పెట్టుకుంటావ్’ అని అసెంబ్లీలో వైఎస్ అన్నప్పుడు కేసీఆర్ పౌరుషం ఎక్కడ పోయింది? తెలంగాణ పోరాటాన్ని పక్కనపెట్టిన కేసీఆర్‌ను కరీంనగర్ జిల్లా ప్రజలు బొందపెడ్తారనే పాలమూరు జిల్లాకు వలసవచ్చారు. ఇక్కడి ప్రజలు మంచితనంతో ఎంపీగా గెలిపించారు కాబట్టే.. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టిన రోజున తానే కొట్లాడి తెచ్చానని మాట్లాడే అవకాశం కేసీఆర్‌కు వచ్చింది. అందుకే జంగ్ సైరన్.. తెలంగాణ అభివృద్ధి, పునర్నిర్మాణం పాలమూరు నుంచే మొదలుపెడ్తానని కేసీఆర్ హామీ ఇచ్చి.. ఇక్కడి 50 లక్షల మందికి అన్యాయం చేశారు. పాలమూరు ప్రాజెక్టును బొంద పెట్టి ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చారు. టీఆర్ఎస్ హయాంలో పరిశ్రమలు రాలేదు. విద్య, ఉపాధి అవకాశాలూ కల్పించలేదు. అందుకే పాలమూరు గడ్డ మీదినుంచే జంగ్ సైరన్ మోగిస్తున్నాం. పాలమూరు బిడ్డగా నన్ను ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీలను గెలిపించండి. జిల్లా రూపురేఖలు మారుస్తా. ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనివే.. జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, శ్రీశైలం, నాగార్జునసాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినవే. చివరికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సర్వే రిపోర్ట్ చేసి ఆదేశాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. రూ.వెయ్యి కోట్లు ఇస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తయి, 10 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతాయని అడిగితే స్పందించలేదు. కార్యకర్తలను వేధిస్తే ఊరుకోబోం.. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. దేవరకద్రలో మహేశ్ అనే యువకుడిని టీఆర్ఎస్ వాళ్లు కొట్టి చంపారు. కొందరు పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. కేసీఆరే ఎప్పటికి ఉంటాడని అనుకోవద్దు. కార్యకర్తల ను వేధిస్తే ఊరుకోబోం’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
పాలమూరు–రంగారెడ్డిపై కేంద్రం వైఖరి తెలపాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్రం వైఖరి ఏమిటో తెలపాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం ముందు ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్రం తన వైఖరి వెంటనే చెప్పాలని ఏజీ శ్రీరామ్ కోరారు. కేంద్రం వైఖరి ఏమిటో చెప్పకుండా ఆదేశాలు ఇవ్వొద్దని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవంటూ ఏపీకి చెందిన రైతులు డి.చంద్రమౌళీశ్వరరెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఎన్జీటీలో పిటిషన్ దాఖలుకు ఆరు నెలల కాల పరిమితి ఉంటుందని, ఆ సమయం మించి దాఖలు చేసిన పిటిషన్లను విచారించరాదని పేర్కొన్నారు. ఏపీ రైతుల పిటిషన్ ప్రవేశ సమయంలోనే విచారణకు నిరాకరించాలన్నారు. సుప్రీంకోర్టులో కూడా ఈ అంశంలో పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు రాలేదన్న విషయం తెలిసి కూడా ఎన్జీటీని ఆశ్రయించారన్నారు. 2015లో ఇచ్చిన జీవో ప్రకారం తాగునీటి కోసమే ప్రాజెక్టు చేపట్టామన్నారు. పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టబోమని రాంచందర్‌రావు తెలిపారు. కేవలం తాగునీటి కోసమే అయితే అంతంత సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నారు? సాగునీటి కోసం కూడా ప్రాజెక్టు వినియోగించాలన్న ఉద్దేశంతోనే చేపడుతున్నట్టుంది కదా ? అని ధర్మాసనం ప్రశ్నించింది. కృష్ణా నదిలో నిరంతరం నీరు ఉండదని, వర్షాలు తక్కువ పడినా, వరదలు లేకున్నా నాలుగేళ్లపాటు నిర్విరామంగా తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కడుతోందని రాంచందర్‌రావు తెలిపారు. ప్రాజెక్టు సమీప 13 మండలాల్లో ఫ్లోరైడ్ బాధిత గ్రామాలున్నాయని, భూగర్భ జలాల వినియోగం వల్ల ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలోనే భారీ రిజర్వాయర్లు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తొలుత అండర్ టేకింగ్ ఇచ్చినట్టుగా తాగునీటి కోసమే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామనిస్పష్టం చేశారు. ఈ కేసులో కేంద్రం వైఖరి చెప్పాలన్న అంశంపై కేంద్రం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రాథమిక దశలోనే విచారణ ఉందని తుది విచారణలో తప్పకుండా వైఖరి వెల్లడిస్తామని ధర్మాసనానికి తెలిపారు. తదుపరి వాదనలు గురువారం వింటామన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
సమయం మించిపోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిలిపివేయాలని కోరుతూ సమయం మించిపోయిన తర్వాత పిటిషన్ దాఖలు చేయలేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలమూరు రంగా రెడ్డి ఎత్తిపోతల పథకం నిలిపివేయాలంటూ ఏపీకి చెందిన డి.చంద్రమౌళీశ్వరరెడ్డి తదితరులు ఎన్జీటీలో దాఖలు చే సిన పిటిషన్‌ను జస్టిస్ రామకృష్ణన్, విషయనిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ పిటిషన్లో ఇంప్లీడ్ అయిన ఏపీ ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. నిరంతరం కొనసాగింపు పనులు చేపడుతున్న ప్రాజెక్టు కావడంతో సమయం మించిన తర్వాత పిటిషన్ దాఖలు చేశారనడం సరికాదని తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభ సమయంలో తాగునీటి ప్రాజెక్టుగా పేర్కొని రెండో దశలో తెలంగాణ ప్రభుత్వం బహిరంగ విచారణకు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. కృష్ణాబోర్డు నివేదికలో సాగునీటి ప్రాజెక్టు అని పేర్కొందన్నారు. కృష్ణాబోర్డు నివేదికలో ఏపీ అభ్యంతరాలు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. -
‘పాలమూరు–రంగారెడ్డి’లో.. ఉల్లంఘనలు నిజమే
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో తెలంగాణ సర్కార్ పర్యావరణ నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘించినట్లు తేల్చిచెబుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ), చెన్నై బెంచ్‌కు శుక్రవారం జాయింట్ కమిటీ నివేదిక ఇచ్చింది. ముందస్తు పనులు చేపట్టడానికి మాత్రమే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతిస్తే.. 120 టీఎంసీలు తరలించే పూర్తిస్థాయి నిర్మాణ పనులు చేపట్టిందని నివేదికలో స్పష్టంచేసింది. తనిఖీల సమయంలో రిజర్వాయర్ల నిర్మాణం కొనసాగుతోందని తేల్చిచెప్పింది. ఇలా 1,916 రోజులపాటు నిబంధనలకు వ్యతిరేకంగా పనులు చేపట్టారని.. ఇది ఈఐఏ (పర్యావరణ ప్రభావ అంచనా–ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) –2006 ప్రకటనలో నిబంధనలను ఉల్లంఘించడమేనని కుండబద్దలు కొట్టింది. పర్యావరణ అనుమతి తీసుకోకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టడంవల్ల పర్యావరణానికి విఘాతం కలిగిందని.. తక్షణ పరిహారం కింద రూ.3,70,87,500లను తెలంగాణ సర్కార్ నుంచి వసూలుచేయాలని జాయింట్ కమిటీ సూచించింది. ఇప్పటికే దెబ్బతిన్న పర్యావరణాన్ని పునరుద్ధరించేందుకు చేసిన సిఫార్సుల అమలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని పేర్కొంది. ఈ నివేదికపై శుక్రవారం ఎన్జీటీ విచారణ చేపట్టింది. ప్రాజెక్టు నిలిపివేసేలా ఆదేశాలివ్వండి పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని కమిటీ తేల్చిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టు నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ల తరఫున తమిళనాడు మాజీ అడ్వొకేట్ జనరల్ రామన్ కోరారు. దీంతో సంయుక్త కమిటీ నివేదిక శుక్రవారం ఉదయమే అందినందున దానిని పూర్తిగా చదవాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం తరఫు అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు తెలిపారు. ఆరేళ్ల క్రితం నాటి ప్రాజెక్టుపై ఇప్పుడు ఫిర్యాదు చేస్తే విచారించకూడదన్నారు. పిటిషన్‌కు విచారణ అర్హతలేదని, ఈ తరహా పిటిషన్లు విచారించడానికి ఎన్జీటీకి పరిధిలేదని తెలిపారు. నివేదికపై ప్రాథమిక అభ్యంతరాలున్నాయని వాటిపై వాదనలు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, ప్రాజెక్టు ఆరేళ్ల నాటిదైనా ప్రస్తుతం పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్లేనని రామన్ స్పష్టంచేశారు. దీంతో వచ్చే మంగళవారం 5వ తేదీలోపు వైఖరి చెప్పాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం అదే రోజుకు విచారణను వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, న్యాయవాది డి. మాధురిరెడ్డిలు హాజరయ్యారు. జాయింట్ కమిటీ నివేదిక ముఖ్యాంశాలివీ.. ►శ్రీశైలం జలాశయం నుంచి రెండు నెలల్లో 120 టీఎంసీలను తరలించి.. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీరు అందించడానికి రూ.35,200 కోట్లతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ చేపట్టింది. ►తాగునీటి కోసం శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీలను తరలించేందుకు ఈ ఎత్తిపోతలను చేపట్టామని.. ఇందుకు అనుమతివ్వాలని 2017లో కేంద్రాన్ని తెలంగాణ కోరింది. దీంతో ముందస్తు నిర్మాణ పనులు మాత్రమే చేపట్టాలంటూ కేంద్రం షరతులతో అనుమతిచ్చింది. ►కానీ.. తెలంగాణ సర్కార్ 120 టీఎంసీలు తరలించేలా.. 4,97,976 లక్షల హెక్టార్లకు నీళ్లందించేలా ప్రాజెక్టు పనులు చేపట్టింది. నిజానికి 1,226 గ్రామాలకు తాగునీటి కోసం 7.15 టీఎంసీలు సరిపోతాయి. ►ఈ ప్రాజెక్టు అంతర్భాగంగా నార్లాపూర్, ఏదులా, వట్టెం, కర్వెన, ఉదండాపూర్‌లో68 టీఎంసీలు నిల్వచేసేలా రిజర్వాయర్లు నిర్మిస్తోంది. ►ఈఐఏ–2006 ప్రకటన మేరకు ఈ ప్రాజెక్టు పనులకు పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిందే. కానీ.. అవేమీ తీసుకోకుండా తెలంగాణ చట్టాన్ని ఉల్లంఘించింది. è అలాగే, నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద రెండు టన్నెళ్ల పనులు జరుగుతున్నాయి. దీనివల్ల పర్యావరణం దెబ్బతింది. ►దీనివల్ల తక్షణ పరిహారం కింద రూ.3.70 కోట్లను తెలంగాణ సర్కార్ నుంచి వసూలుచేయాలి. ►కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో మెజారిటీ సభ్యులు సాగునీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టు అని నివేదిక ఇవ్వగా.. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు, గనుల శాఖ సహాయ డైరెక్టర్లు మాత్రం తాగునీటి అవసరాలకే ప్రాజెక్టు నిర్మాణం అని పేర్కొన్నారు. -
‘పాలమూరు’ వ్యయం రూ.52,056 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరగనుంది. ప్రాజెక్టు తొలి దశలో కేవలం తాగునీటి అవసరాల పేరిట ప్రధాన పనుల వరకే ప్రాథమిక అంచనా రూపొందించారు. ఆ మేరకు పరిపాలనా అనుమతులు ఇవ్వగా..ప్రస్తుతం సాగు నీటికి సంబంధించిన కాల్వల పనులు జత చేశారు. దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.35,200 కోట్ల నుంచి రూ.52,056 కోట్లకు చేరనుంది. అంటే అదనంగా రూ.16,856 కోట్ల మేర వ్యయం పెరగ నుందన్నమాట. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) లో ఈ వివరాలను పొందుపరిచిన నీటి పారుదల శాఖ.. ప్రభుత్వ అనుమతి అనంతరం వీటిని కేంద్ర జల సంఘం, కృష్ణా బోర్డుకు సమర్పించనుంది. 60 రోజులు .. రోజుకు 1.5 టీఎంసీ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 60 రోజుల్లో రోజుకి ఒకటిన్నర టీఎంసీ నీటిని తీసుకుంటూ మొత్తంగా 90 టీఎంసీల వరద జలాలతో పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలు కలిపి మొత్తంగా 12.30 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగం గా నార్లాపూర్ రిజర్వాయర్ 8.51 టీఎంసీలు, ఏదుల 6.55, వట్టెం 16.74, కరివెన 17.34, ఉద్దండాపూర్ 15.91, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను 2.80 టీఎంసీల తో ప్రతిపాదించారు. ఈ మొత్తం ప్రతిపాదనలకు 2015లో రూ.35,200 కోట్లతో పరిపాలనా అనుమ తులు ఇచ్చారు. అందుకనుగుణంగా డిజైన్లు ఖరారు చేసి నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు 18 ప్యాకే జీలతో రూ.29,333 కోట్లకు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టారు. పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, ప్రధాన కాల్వలకు సంబంధించి ఇంతవరకు రూ.15,810 కోట్ల పనులు జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రధాన కాల్వ నుంచి వ్యవసాయ అవసరాలకు నీటిని మళ్లించే ఇతర కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం మాత్రం చేపట్టలేదు. అయితే కోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసుల సందర్భంగా తాము ప్రస్తుతం చేపట్టిన పనులన్నీ తాగునీటి అవసరాల మేరకేనని, తొలి దశలో తామిచ్చిన పరిపాలనా అనుమతులు కానీ, చేస్తున్న పనులన్నీ తాగునీటి అవసరాలు తీర్చేందుకేనని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. తుది అంచనాల్లో ఇలా.. ప్రస్తుతం కేంద్రానికి డీపీఆర్‌లు సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు అయ్యే వ్యయాలను కలుపుకొని తుది అంచనాలు సిద్ధం చేసింది. అందులో ప్రధాన పనులు (హెడ్ వర్క్స్), ఐదు లిఫ్టులు కలుపుకొని వీటికి రూ.40,515.98కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపింది. రెండో దశలో కాల్వల వ్యవస్థ, వాటికింద డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణానికి రూ.8,069.03 కోట్లు, వీటికి అదనంగా పంపింగ్ కేంద్రాలకు విద్యుత్ సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు మరో రూ.3,471.31 కోట్లు కలిపి మొత్తంగా రూ.52,056.32 కోట్లు ఖర్చవుతుందని పేర్కొంది. ఇప్పటికే ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు వీలుగా ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసినప్పటికీ అనుమతుల కోసం ఇంకా కేంద్రానికి పంపలేదు. అలాగే డీపీఆర్ కూడా ప్రభుత్వం అధికారికంగా చెప్పినప్పుడు మాత్రమే సమర్పించి అనుమతుల ప్రక్రియను మొదలు పెట్టాలని సాగునీటి శాఖ భావిస్తోంది. -
మేం పిలుపు ఇస్తే తట్టుకోలేరు.. బీజేపీపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపాటు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌పై చిల్లరగా మాట్లాడటం సరికాదని, మేం పిలుపు ఇస్తే మీరు తట్టుకోలేరని తెలంగాణ అల్లకల్లోలమవుతుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పిస్తామని గత ఎన్నికలకు ముందు అప్పటి జాతీయ నాయకులు సుష్మా స్వరాజ్, గడ్కరీ ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు పాదయాత్ర లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మహబూబ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో సంభోదిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చెన్నై ఎన్జీటీ ధర్మాసనం విచారణ
సాక్షి, ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ ఉల్లంఘనలపై దాఖలైన పిటిషన్లను చెన్నై ఎన్జీటీ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు లేకుండా చేపడుతున్నారని దాఖలైన పిటిషన్లలో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల తమకు నష్టం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పై తనిఖీ కమిటీ నివేదిక దాఖలు చేయకపోవడం పట్ల ఎన్జీటి అభ్యంతరం వ్యక్తం చేసింది. కమిటీ నోడల్ ఏజెన్సీగా తెలంగాణ మైన్స్ డిపార్ట్మెంట్ను ఎన్జీటీ తొలగించింది. కమిటీ నోడల్ ఏజెన్సీగా కేఆర్ఎంబీని ఎన్జీటీ నియమించింది. త్వరగా పర్యావరణ ఉల్లంఘనలపై నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 22కి వాయిదా వేసింది. ఇవీ చదవండి: చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ అంతర్వేది సాగర తీరం.. విభిన్న స్వరూపం! -
‘పాలమూరు’ రుణాలపై తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తి పోతల పథకం పనుల పూర్తికి నిధుల కొరత వెంటాడుతోంది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన కృష్ణా బోర్డు గెజిట్ నోటిఫికేషన్లో ‘పాలమూరు’ను అనుమతిలేని ప్రాజెక్టుగా పేర్కొనడంతో నిధుల విడుదలపై రుణ సంస్థలు, రుణాల సాధనకు ఇరిగేషన్ శాఖ తర్జనభర్జన పడుతున్నాయి. దీనిపై ఇప్పటికే పలుమార్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) తో చర్చలు జరిపిన ఇరిగేషన్ శాఖ... నిధుల విడుదలకు ఆటంకాలు లేకుండా చూడాలని కోరగా దీని పై స్పష్టత వస్తే తప్ప ముందుకెళ్లలేమని పీఎఫ్సీ తేల్చిచెబుతుండటంతో సందిగ్ధత కొనసాగుతోంది. మరో రూ. 2,183 కోట్లు బ్యాలెన్స్.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును రూ. 32,200 కోట్ల అంచనా వ్యయంతో 2016–17లో చేపట్టగా ప్రస్తుతం దీని అంచనా వ్యయం రూ. 50 వేల కోట్లకు చేరుతోంది. భారీ నిధుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టులోని నార్లాపూర్ నుంచి కనీసం ఒక టీఎంసీని ఉద్ధండాపూర్ రిజర్వాయర్ వరకు తరలించేలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దీనికైనా రూ. 30 వేల కోట్ల మేర నిధుల అవసరాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా పాలమూరు–రంగారెడ్డికి సైతం రూ. 6,160.46 కోట్ల రుణాలను పీఎఫ్సీ నుంచే తీసుకొనేలా ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఇప్పటికే రూ. 3,976.98 కోట్ల మేర రుణాలను పీఎఫ్సీ విడుదల చేసింది. మరో రూ. 2,183.48 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ నేపథ్యంలో రుణాల విడుదలను పీఎఫ్సీ నిలిపివేసింది. అన్ని అనుమతులున్నాయంటూ రాష్ట్రం లేఖ.. రుణాల విడుదల కోరుతూ తెలంగాణ ప్రభు త్వం పీఎఫ్సీకి రెండ్రోజుల కిందట లేఖ రాసిన ట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో ప్రాజె క్టు పనులను ప్రస్తుతానికి తాగునీటి అవసరాలు తీర్చేలాగానే చేపడుతున్నామని, ఇందుకు అను మతులు అవసరం లేదని చెప్పినట్లు సమాచా రం. గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ సైతం తాగునీటి వరకు పనులు చేపట్టుకోవచ్చని, పర్యావరణ అనుమతులు వచ్చాకే సాగునీటి పనులు చేపట్టాలని పేర్కొన్న విషయాన్ని పీఎఫ్సీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా ప్రాజెక్టు కు పర్యావరణ అనుమతులు సాధించే దిశగా చర్యలు మొదలుపెట్టామని, ఆ తర్వాతే సాగు నీటి కాల్వల నిర్మాణ పనులు చేపడతామని వివరించింది. ఈ దృష్ట్యా తాగునీటిని సరఫరా చేసే లా చేపట్టిన ఎలక్ట్రో మెకానికల్, పంపులు, మో టార్ల పనుల కొనసాగింపునకు వీలుగా రుణా లను విడుదల చేయాలని కోరినట్లు తెలిసింది. -
అక్టోబర్ కల్లా అనుమతులు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల సాధన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియకు సంబంధించిన వివరాలను, ఇతర అంశాలను మరో వారం, పదిరోజుల్లో కేంద్ర పర్యావరణ శాఖకు నివేదించనుంది. ఎన్జీటీలో కేసులు, కేంద్రం, బోర్డుల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో అవసరమైన అనుమతులు సాధించే ప్రక్రియకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. అక్టోబర్ కల్లా ఈ ప్రక్రియ పూర్తి లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించింది. ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రభుత్వం ఇప్పటికే సజావుగా ముగించిన సంగతి తెలిసిందే. ఈఏసీకి సమర్పించే నివేదికలపై కసరత్తు ఈ ప్రాజెక్టు కోసం 27,193 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉంది. మరో 205.48 హెక్టార్ల మేర అటవీ భూములు కూడా అవసరం కానున్నాయి. ఇప్పటివరకు 26 వేల ఎకరాల భూసేకరణ పూర్తికాగా, ఈ నెల 10న ఐదు జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ కార్యక్రమం ముగిసింది. దీంతో ఈ వివరాలతో పాటు జీవ వైవిధ్య నిర్వహణ ప్రణాళిక, మత్స్య సంపద పరిరక్షణ, నిర్వహణ, ఆయకట్టు ప్రాంత అభివృద్ధి, పునరావాసం పునర్నిర్మాణం, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, వ్యర్థాల నిర్వహణ, గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, క్వారీల పునరుద్ధరణ ప్రణాళికలకు సంబంధించిన వివరాలు సమర్పించనున్నారు. జల, వాయు, శబ్ద నిర్వహణ ప్రణాళికలు, ప్రజారోగ్యం, పారిశుధ్యం, ఘనవ్యర్థాల నిర్వహణ, స్థానిక ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలు తదితరాలపై వివరాలతో పాటు, వాటిపై వెచ్చించే నిధులపై కేంద్రానికి వివరణ ఇచ్చేలా కాలుష్య నియంత్రణ మండలి, ఇరిగేషన్ శాఖల అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. కాళేశ్వరం అనుభవంతో.. తెలంగాణ తమకు సమర్పించే నివేదికలపై కేంద్ర పర్యావరణ శాఖలోని ప్రాజెక్టుల ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) చర్చించి, ప్రాజెక్టుతో పర్యావరణంపై పడే ప్రభావాన్ని మదింపు చేస్తుంది. బ్యారేజీలు, కాలువలు, పంపుహౌస్‌ల నిర్మాణంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. వీటి నిర్మాణాలపై ఎలాంటి అభ్యంతరం లేదని కమిటీ స్పష్టం చేస్తేనే అనుమతుల ప్రక్రియ పూర్తి కానుంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల ప్రక్రియ సమయంలో ఈఏసీ పలు సూచనలు చేసింది. ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున ప్రాజెక్టు నిర్మాణ దశలో, నిర్మించిన తర్వాత ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలను నివేదించాలని చెప్పింది. అటవీ శాఖ సమన్వయంతో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి, రిజర్వాయర్ రిమ్ ట్రీట్మెంట్ను చేపట్టడంతో పాటు దేశీయ మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలని సూచించింది. దీంతో పాలమూరుకు అనుమతుల విషయంలో.. ఆ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. -
‘ఆ పథకంపై కేసీఆర్‌ది సవతి తల్లి ప్రేమ’
సాక్షి, పరిగి( వికారబాద్): పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని మాజీ మంత్రి గడ్డంప్రసాద్‌కుమార్, మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, జలసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. కృష్ణాజలాల వినియోగం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సాధనకై ఆదివారం పరిగి పట్టణ కేంద్రంలో అఖిలపక్షం నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కావాలనే పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పనులను ఆపేశారన్నారు. ఆ నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు తరలించారన్నారు. ప్లానింగ్ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిధులన్నీ తన సొంత జిల్లాలకే తీసుకెళ్లి పనులు చేపడుతున్నారని విమర్శించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ నిధులను సైతం తన ప్రాంతాలకు తరలించారన్నారు. రోజుకు కొత్త మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ 10 టీఎంసీలు ఉంటే దాన్ని ఒక టీఎంసీకి మార్చారని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మళ్లీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో సామర్థ్యాన్ని పునరుద్ధరించారన్నారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసం ప్రధానమంత్రికి కూడా వినతిపత్రం అందించామన్నారు. అధికార పార్టీ నాయకులు కూడా ఈ విషయంపై స్పందించి మన ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చేందుకు కృషిచేయాలన్నారు. మన ప్రాంతాలకు జలాలను తెచ్చుకునేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయ పార్టీల ముఖ్య నాయకులు హన్మంతుముదిరాజ్, భీంరెడ్డి, రాముయాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘పాలమూరు–రంగారెడ్డి’ పాత ప్రాజెక్టే
జడ్చర్ల టౌన్/కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పుడే మంజూరయిందని, దానిని కేంద్రం గుర్తించకపోవడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా మంగళవారం సీపీఐ రాష్ట్ర బృందం జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్, పంపుహౌస్ నిర్మాణ పనులను పరిశీలించింది. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఏడేళ్లయినా ఇప్పటికీ నీళ్ల పంచాయితీ తెగలేదని, ముఖ్యంగా కృష్ణా నికర జలాలను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు పేరు మార్చినప్పటికీ, ప్రాజెక్ట్ మాత్రం పాతదేనని ఏపీ ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రాజెక్టుపై కేంద్రం, ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. ఏడేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికీ ఉదండాపూర్ రిజర్వాయర్ పనులే పూర్తికాలేదని, ఇక లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ ఎప్పుడు ప్రారంభిస్తారని ఎద్దేవా చేశారు. దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ మొదటి నుంచి పక్షపాత వైఖరి చూపిస్తున్నారని విమర్శించారు. కృష్ణానది 66 శాతం తెలంగాణలో, ఏపీలో 34 శాతమే ప్రవాహం ఉందని, కానీ, నీటి కేటాయింపుల్లో మాత్రం ఏపీకీ 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించడం దారుణమన్నారు. -
తెలంగాణను నిలువరించండి
సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అక్రమ నిర్మాణంతోపాటు శ్రీశైలంలో అసందర్భోచితంగా, అక్రమంగా నీటిని తెలంగాణ వినియోగిస్తున్నందున ఆంధ్రప్రదేశ్, చెన్నై ప్రాంతాలకు తీవ్ర నీటి సమస్య ఏర్పడుతుందని, ఈ పరిస్థితిని నిలువరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ వాదనతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బదులి చ్చారు. వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఈ అంశానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధిం చారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాయలసీమ నాలుగు జిల్లాలతోపాటు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, చెన్నై నగరానికి నీటి విడుదల నిమిత్తం శ్రీశైలం డ్యామ్‌లో కనీస నీటి మట్టాన్ని 854 అడుగులుగా నిర్దేశిస్తూ 2004 సెప్టెంబర్ 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 107 జీఓ జారీచేసింది. ఈ స్థాయిలో నీరు ఉంటేనే ఆయా ప్రాంతాలకు నీటి విడుదల చేసేందుకు సాధ్యమవుతుందని ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయించిం ది. కానీ, తెలంగాణ జెన్కో మాత్రం నీటిమట్టం 800 అడుగుల వద్ద ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేపడుతోంది. ఇలా తెలంగాణ విద్యుదుత్పత్తి చేపట్టకుండా నిలువరించాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి లేఖ రాశారు. విద్యుదుత్పత్తి ఆపాలని కేఆర్ఎంబీ ఇప్పటికే తెలంగాణ జెన్కో కు జారీచేసిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం, కేఆర్ఎంబీలు కచ్చితంగా అమలయ్యేలా చూస్తాయా? అని ప్రశ్నించారు. సంపూర్ణంగా ఏకీభవిస్తున్నా : మంత్రి దీనికి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమాధానమిస్తూ.. ‘రాయలసీమ రైతులకు సంబంధించి సభ్యుడు లేవనెత్తిన అంశంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నా. ఏపీ సీఎం రాసిన లేఖ నాకు అందింది. ఆయన కేఆర్ఎంబీ చైర్మన్‌కు కూడా లేఖ రాశారు. నేరుగా తెలంగాణ జెన్కోకు లేఖ రాస్తూ విద్యుదుత్పత్తిని తక్షణం నిలిపివేయాలని అడిగాం. కానీ, తాము విద్యుదుత్పత్తి నిలిపివేయబోమని, మూడు ప్లాంట్లను పూర్తిస్థాయిలో ఆపరేట్ చేయాలనుకుంటున్నామని తెలంగాణ చెప్పింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి లేఖ రాసి విద్యుదుత్పత్తి నిలిపి వేసి ఉండాల్సిందని చెప్పాం..’ అని మంత్రి వివరించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై.. అనంతరం.. వైఎస్ అవినాష్‌రెడ్డి మరో అనుబంధ ప్రశ్న వేశారు. తెలంగాణ సర్కారు పాలమూరు–రంగారెడ్డి ఎత్తి పోతల పథకాన్నీ నిర్మిస్తోంది. ఇది పూర్తయితే ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ ప్రాజెక్టు, కేసీ కెనాల్, జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, వెలిగొండ ప్రాజెక్టుల ఆయ కట్టుపై, ఏపీ, చెన్నై ప్రాంతాల తాగు నీటి అవస రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?’ అని అవినాష్ ప్రశ్నించారు. మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బదులిస్తూ.. ‘రెండు రాష్ట్రాల ప్రయోజ నాలను కాపాడేందుకు ఏపీ పునర్వ్య వస్థీకరణ చట్టాన్ని అనుసరించి కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ వ్యవస్థలను ఏర్పాటు చేశామని తెలిపారు. -
‘పాలమూరు’ నిబంధనలకు విరుద్ధం
సాక్షి, అమరావతి: పర్యావరణ ప్రభావ అంచనా (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్–ఈఐఏ) నోటిఫికేషన్‌లోని నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని కొనసాగిస్తోందని, ఇందులో జోక్యం చేసుకుని న్యాయం చేయాలంటూ రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రైతులు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ను ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపడుతున్నా కేంద్ర ప్రభుత్వం, కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని డి.చంద్రమౌళీశ్వరరెడ్డి సహా 9 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్లో ఎన్జీటీకి వివరించారు. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ అవార్డుల ప్రకారం ఎలాంటి కేటాయింపులు లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని పిటిషన్లో పేర్కొన్నారు. అక్రమ నిర్మాణానికి పూనుకున్న తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని, కృష్ణా వాటర్ ట్రిబ్యునల్‌ను ఆదేశించాలని అభ్యర్థించారు. ప్రాజెక్టు పనులను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. తెలంగాణ చేపడుతున్న ఈ ప్రాజెక్టు వల్ల తమ ప్రాంత రైతులందరూ తీవ్రంగా నష్టపోతారని పిటిషన్లో వివరించారు. ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోతారు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 90 టీఎంసీల మిగులు జలాలను ఎత్తిపోసేందుకు ఉద్దేశించిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల తమ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమై రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, నాగార్జున సాగర్, కృష్ణా డెల్టాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. తెలుగు గంగ ప్రాజెక్టు కింద వ్యవసాయంపై ఆధారపడి ఉన్న వారిపైన, చెన్నైకి తాగునీరు సరఫరాపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర జల సంఘం, కృష్ణా వాటర్ బోర్డు, అపెక్స్ కౌన్సిల్ ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టరాదని తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్–1 ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టేటస్–కో ఉన్న నేపథ్యంలో, ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నీటిని 512:299 నిష్పత్తిలో పంపిణీ చేసుకునేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని వివరించారు. ఇదిలా ఉండగానే తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 80 టీఎంసీల నీటిని వాడుకునేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందన్నారు. ఈఐఏ నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టును ప్రారంభించాలంటే ముందస్తు పర్యావరణ అనుమతులు తప్పనిసరి కాగా, దీనికి ఎలాంటి అనుమతులు లేవని పేర్కొన్నారు.వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టు విషయంలో జోక్యం చేసుకోవాలని రైతులు హరిత ట్రిబ్యునల్‌ను అభ్యర్థించారు. ఏపీపై తెలంగాణ సర్కారు పిటిషన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు చేయవద్దంటూ గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ అధికారులు క్షేత్రస్థాయిలో పనులు చేపట్టారని, వారితో పాటు సంబంధిత ప్రైవేటు వ్యక్తులపైనా కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీలో ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. ప్రధాన ప్రాజెక్టు పనులు చేపట్టే ఉద్దేశం లేదని, ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించబోమంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్జీటీకీ లిఖితపూర్వక హామీ ఇచ్చారని తన పిటిషన్లో పేర్కొంది. ఈ హామీకి విరుద్ధంగా రూ.3,278 కోట్లతో ప్రాజెక్ట్ పనులను చేపట్టిందని వివరించింది. ముందస్తు అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించింది. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం గాలేరు–నగరి సుజల స్రవంతి, హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాల కింద ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతోందని, ఇందులో జోక్యం చేసుకోవాలంటూ చిత్తూరు జిల్లా రైతులు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం ఎన్జీటీ సభ్యులు జస్టిస్ రామకృష్ణన్, కె. సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు విన్న ధర్మాసనం, ఈ వ్యాజ్యంలో ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసింది. అంతేకాక.. ఈ వ్యాజ్యాన్ని విచారణకు సైతం స్వీకరించలేమంది. ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే స్పందిస్తామని తేల్చిచెప్పింది. అలాగే, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాల్లో ఇది భాగమని తేలితే భారీ జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. -
Telangana: కృష్ణాపై కొత్త ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాను పూర్తిగా వినియోగించుకోవడానికి వీలుగా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. కృష్ణానదిపై జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య అలంపూర్ వద్ద గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారూరు గ్రామాల పరిధిలో జోగులాంబ బ్యారేజీని నిర్మించి 60-70 టీఎంసీల నీటిని తరలించాలని తీర్మానించింది. ఈ నీటిని పాలమూరు-రంగారెడ్డి పథకంలో భాగమైన ఏదుల రిజర్వాయర్‌కు ఎత్తిపోసి.. పాలమూరు, కల్వకుర్తి ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు అందించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులతో పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీటి విషయంగా అన్యాయం జరుగుతోందని, ఈ నేపథ్యంలో కృష్ణా జలాల్లో న్యాయంగా దక్కాల్సిన వాటాను వినియోగించుకునేలా మరిన్ని కొత్త పథకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రాజెక్టులపై ప్రధాని నుంచి ప్రజాక్షేత్రం వరకు.. భేటీ సందర్భంగా ఏపీ చేపట్టిన ప్రాజెక్టులపై చర్చించిన కేబినెట్.. రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ కుడి కాల్వ నిర్మాణాలపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. ఏపీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిందని, సుప్రీంకోర్టులో కేసులు వేసిందని గుర్తు చేసింది. ఆ ప్రాజెక్టులు ఆపాలని కేంద్రం, ఎన్జీటీ ఆదేశించినా ఏపీ ప్రభుత్వం బేఖాతరు చేయడం సరికాదని పేర్కొంది. ఈ విషయంలో ప్రధానమంత్రిని, కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించాలని, ఏపీ ప్రాజెక్టులను ఆపివేయించేలా చూడాలని నిర్ణయించింది. ఇదే సమయంలో ఏపీ జలదోపిడీకి పాల్పడుతోందని ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానాల్లో ఎత్తిచూపాలని.. రాబోయే వర్షకాల పార్లమెంటు సమావేశాల్లోనూ వివరించాలని మంత్రివర్గం ఆలోచనకు వచ్చింది. ఏపీ ప్రాజెక్టుల పర్యవసానంగా రాష్ట్రంలో కృష్ణా బేసిన్ ప్రాంతాలకు జరిగే నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించింది. కేంద్రం తీరుపై ఆవేదన నదీ జలాల విషయంలో కేంద్రం తీరును మంత్రివర్గం తప్పుపట్టింది. తెలంగాణకు న్యాయమైన వాటాకోసం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం– 1956 సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరిన అంశంపై చర్చించింది. సుప్రీంకోర్టులో కేసుల వల్ల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేకపోతున్నామని, తెలంగాణ కేసులను వెనక్కి తీసుకుంటే త్వరగా నిర్ణయం తీసుకుంటామని అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చారని మంత్రివర్గం గుర్తు చేసింది. కేంద్రం సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరిస్తుందనే నమ్మకంతో తెలంగాణ ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకున్నా.. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రం వైఖరి కారణంగా తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించింది. రాష్ట్ర రైతుల ప్రయోజనాల రక్షణ కోసం ఎంత దూరమైనా పోవాలని అభిప్రాయపడింది. ప్రాజెక్టులపై కేబినెట్ నిర్ణయాలివీ.. పులిచింతల ఎడమ కాల్వ నిర్మించి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. సుంకేశుల రిజర్వాయర్ నుంచి మరో ఎత్తిపోతల పథకం ద్వారా నడిగడ్డ ప్రాంతంలో మరో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించాలి. కృష్ణా ఉపనది అయిన భీమా నది తెలంగాణలో ప్రవేశించే కృష్ణ మండలంలోని కుసుమర్తి గ్రామం వద్ద భీమా వరద కాల్వను నిర్మించాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో జలాశయాల సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలి. నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఎగువ భూములకు నీరివ్వాలి. సాగునీటి శాఖ ఈ ప్రాజెక్టులకు సంబంధించి వెంటనే సర్వేలు నిర్వహించి, డీపీఆర్‌ల తయారీ కోసం చర్యలు తీసుకోవాలి. వానాకాలం ప్రారంభంలోనే కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాలకు నీటి ప్రవాహం పెరుగుతుంది. ఈ సమయంలోనే తెలంగాణకు హక్కుగా ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టుల్లో వీలైనంత మేరకు జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. ఎత్తిపోతల పథకాలకు వినియోగించుకోవాలి. తద్వారా ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోసుకోవడంతోపాటు విద్యుత్ ఖర్చును తగ్గించుకోవచ్చు. కృష్ణా, గోదావరి నదులపై 2,375 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో పూర్తి సామర్ధ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసి.. కాళేశ్వరం, దేవాదుల, ఏఎమ్మార్పీ తదితర పథకాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖను కేబినెట్ ఆదేశించింది. -
డిసెంబర్‌కల్లా ‘పాలమూరు’
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల స్ఫూర్తితో పనులు కొనసాగాలని స్పష్టం చేశారు. కృష్టా బేసిన్‌లోని ఇతర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాల పనులను సంపూర్ణంగా పూర్తి చేయాలన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల పురోగతి, పనుల వేగవంతంపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పాలమూరు జిల్లా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, అబ్రహం, అంజయ్య యాదవ్, కృష్ణమోహన్‌రెడ్డి, నరేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్‌రావు, సలహాదారు పెంటారెడ్డి, పాలమూరు సీఈ రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమంలో మహబూబ్ నగర్ నీటి గోసను, నల్లగొండ ఫ్లోరైడ్ కష్టాలను ప్రస్తావించకుండా నా ప్రసంగం సాగలేదు. నాటి పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను కావాలనే పెండింగ్‌లో పెట్టారు. తెలంగాణ వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నం. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయాలని ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు కొందరు దుర్మార్గంగా కోర్టుల్లో కేసులేసి స్టేల ద్వారా అడ్డుపడుతున్నరు. అయినా మనం పట్టుదలతో పనులు చేసుకుంటూ వస్తున్నం. జూరాల సహా ఇప్పటికే మనం కల్వకుర్తి నెట్టెంపాడు భీమా వంటి ప్రాజెక్టులను పూర్తి చేసుకొని దక్షిణ పాలమూరుకు చెందిన 11 లక్షల ఎకరాలను పచ్చగా చేసుకున్నం. ఇంకా వాటిల్లో కొసరు పనులు మిగిలినయి. వాటిని అతిత్వరలో ఎలా పూర్తి చేసుకుందామనే ఆలోచన చేయాలె. కాళేశ్వరం స్ఫూర్తితో పనులు సాగాలె. ఏది ఏమయనా సరే.. పాలమూరు ఎత్తిపోతల పనులు ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఎట్టి పరిస్థితిల్లోనూ పూర్తి చేసుకోవాలి’ అని సీఎం అన్నారు. ప్రతి చుక్కను ఒడిసి పట్టాలి.. గోదావరి ప్రవాహానికి కృష్టా ప్రవాహానికి తేడా వుంటుందని, సముద్రుని వైపు ప్రవహించే కొద్దీ గోదావరి ప్రవాహం పెరుగుతూ పోతుంటే.. కృష్టా ప్రవాహం తగ్గుతూ వస్తుందని సీఎం కేసీఆర్ విశ్లేషించారు. రానురాను వర్షాలు తగ్గిపోవడం, దానికి తోడు కృష్టా నదిపై కర్ణాటక, మహారాష్ట్రలు నిర్మించిన ప్రాజెక్టులు, దిగువ రాష్ట్రం అక్రమంగా ఏర్పాటు చేసిన తూముల వల్ల నదిలో నీటి లభ్యత ప్రమాదంలో పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటాను చుక్కనీరు పోకుండా ఒడిసి పట్టుకోవాల్సిందేనని, అందుకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల సహా కృష్టాపై అన్ని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసుకోవాల్సిందేనని జలవనరుల శాఖ అధికారులకు సీఎం స్పష్టం చేశారు. పాలమూరుతో జూరాలకు లింక్.. కృష్టా జలాలను మలుపుకొని పాలమూరును పూర్తిస్తాయిలో పంట పొలాలతో పచ్చగా మార్చుకుందామని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు ఎంత త్వరగా పూర్తయితే వ్యవసాయ రంగానికి అంత మంచిదని, ఈ పథకాన్ని జూరాలకు లింక్ చేసుకోవచ్చని వివరించారు. పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం కోసం చేపట్టబోయే భూసేకరణ, పునరావాసం, విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం, కాలువల తవ్వకం, పంపుల ఏర్పాటు తదితర నీటి సరఫరా పనులకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చర్చించారు. భూసేకరణ, పునరావాసం కోసం ఎంత డబ్బు అవసరం? ఇంకా భూసేకరణ సహా పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలేమిటి? మొత్తం రిజర్వాయర్లు ఎన్ని? నీటి నిల్వ పెంచుకోవడానికి వాటిని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందా? వాటిల్లో పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం ఎంత? వంటి విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. కాళేశ్వరం స్ఫూర్తితో పనులు జరగాలి.. నార్లాపూర్, ఏదుల, వట్టెం వద్ద ఏర్పాటు చేయాల్సిన పంపులను త్వరలో బిగించాలలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నార్లాపూర్ నుంచి ఏదుల వరకు టన్నెల్ పనుల పూర్తికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని ఇంజనీర్లను ఆరా తీశారు. జూన్ నెలాఖరుకల్లా పనులు పూర్తి కావాలన్నారు. వట్టెం నుంచి కరివేన వరకు కాలువ పనులతోపాటు కాలువ లైనింగ్ కోసం జరుగుతున్న పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. కావాల్సినన్ని నిధులను ప్రభుత్వం అందిస్తున్నా.. పనుల జాప్యంపట్ల అధికారులను ప్రశ్నించిన సీఎం... ఇకపై పనులను వేగంగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారం వారం సమీక్షలు జరుపుతూ క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించాలని ఉన్నతాధికారులు స్మతా సబర్వాల్, రజత్ కుమార్, మురళీధర్‌రావులను సీఎం ఆదేశించారు. కాళేశ్వరం పనులు ఎంత వేగంగా జరిగాయో అదే స్ఫూర్తితో పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం పనులు జరగాలన్నారు. -
‘ఆ ఎమ్మెల్యేది కర్ణాటకా.. తెలంగాణా?’
సాక్షి, మహాబూబ్‌నగర్: నారాయణ పేట అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పార్టీ మారినా ఇంకా ఇక్కడ వలసలు కొనసాగుతున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ 7 సంవత్సరాల పాలనలో నారాయణపేట నియోజకవర్గ పరిధిలో ఒక్క ఎక్కరాకు కూడా నీరు అందించలేదని ఆరోపించారు. జిల్లాకు సాగునీటి విషయంలో సీఎం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. దీని గురించి ఇక్కడున్న ఎమ్మెల్యేలు మాత్రం సీఎంను అడిగే ధైర్యం చేయటం లేదని మండి పడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు రావని తెలిసినా.. ఎమ్మెల్యేలు కిక్కురుమనడటం లేదన్నారు. నారాయణపేట ఎమ్మెల్యేది కర్ణాటకనా లేక తెలంగాణనా అని అర్థం కావడం లేదన్నారు. ఆయన కేవలం రాజకీయ లబ్ది కోసమే ఇక్కడున్నారని అరుణ విమర్శించారు. ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి నారాయణపేట అభివృద్ధిలో ఇంకా వెనకపడిందని అరుణ ఆరోపించారు. జిల్లాకు శాంక్షన్ అయిన సైనిక్ స్కూల్, రైల్వే లైన్‌కు మోక్షమెప్పుడు లభిస్తుందో తెలియన పరిస్థితి ఉందన్నారు. కేవలం పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేటాయించే 0.40టీఎంసీల నీటి ద్వారా 12.50లక్షల ఎకరాలకు నీరు ఎలా అందిస్తారో అర్థం అవటం లేదన్నారు. ప్రాజెక్టుకు భూ సేకరణ పూర్తి కాలేదు కానీ సీఎం ఈ సంవత్సరంలో ప్రాజెక్టు పూర్తి చేస్తానంటున్నారు. ఇది ఎలా సాధ్యం అని ఆమె ప్రశ్నించారు. (చదవండి: ‘ఒకరు కొట్టినట్లు.. ఇంకొకరు ఏడ్చినట్లు’) రామ మందిర నిర్మాణంతో దేశంలో శాంతి హిందువుల వందల సంవత్సరాల కల అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో నెరవేరబోతుందన్నారు అరుణ. పార్టీలకతీతంగా 2023 వరకు మందిర నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఆలయ నిర్మాణంతో దేశంలో శాంతి నెలకొని, అభివృద్ధి జరిగి అగ్రరాజ్యాలకు పోటీగా దేశం ముందుకు వెళ్తుందని అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆ ప్రాజెక్టులకు నిధులు ఆగొద్దు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: వలసల జిల్లా ఉమ్మడి మహ బూబ్‌నగర్‌కు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ఎత్తి పోతల ప్రాజెక్టును ఈ ఏడాది చివరి కల్లా వంద శాతం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఫ్లోరైడ్, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవర కొండ ప్రాంతాలకు సాగునీరు అం దించే డిండి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి, ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని కోరారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధుల వరద ఆగవద్దని, ఈ ఏడాది బడ్జెట్లో కూడా వీటికి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనుల బిల్లులు చెల్లించడానికి తక్షణం రూ.2 వేల కోట్లు విడుదల చేయా లని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావును ఆదేశించారు. పాలమూరు – రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లోని మస్కూరీలను నీటి పారుదల శాఖలో విలీనం చేసి లష్కర్లుగా వినియోగించాలని నిర్ణయించినట్లు కేసీఆర్ ప్రకటించారు. వారికి తగిన శిక్షణ ఇచ్చి ప్రాజెక్టుల నిర్వహణలో ఉపయోగించుకోనున్నట్లు సీఎం వెల్లడించారు. ‘పాలమూరు’తో సస్యశ్యామలం.. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మొత్తం మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన... నార్లాపూర్ రిజర్వాయర్, పంపుహౌజ్, నార్లాపూర్ – ఏదుల కాలువ, ఏదుల పంపుహౌజ్, ఏదుల–వట్టెం కాలువ, వట్టెం రిజర్వాయర్, వట్టెం–కర్వెన కాలువ, కర్వెన రిజర్వాయర్, కర్వెన– ఉద్దండాపూర్ కాలువ, టన్నెల్ పనులను ఆయన సమీక్షించారు. ఉద్దండాపూర్ నుంచి ఎగువ ప్రాంతాలకు నీరందించే మార్గానికి సంబంధించి తుది డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు, జూరాలతో కలిపి 11.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం వెల్లడించారు. డిండి ప్రాజెక్టు పరిధిలోని కాలువలు, రిజర్వాయర్ల పనులను సీఎం సమీక్షించారు. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ పూర్తికి తక్షణం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని నాగర్‌కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను సీఎం కోరారు. చట్టప్రకారం ఇవ్వాల్సిన పరిహారం రైతులకు అందించి, వెంటనే భూ సేకరణను పూర్తి చేసి, భూమిని నీటి పారుదల శాఖకు అప్పగించాలని సూచించారు. బీహెచ్ఈఎల్ అధికారులతో సమావేశమై అవసరమైన మోటార్లను వెంటనే తెప్పించి, బిగించే పనులను పర్యవేక్షించాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌ను సీఎం కోరారు. మిషన్ భగీరథకు నీరివ్వడానికి వీలుగా అన్ని రిజర్వాయర్లలో మినిమమ్ డ్యామ్ డ్రాయింగ్ లెవల్‌ను మెయింటేన్ చేయాలని ఆదేశించారు. ప్రతీ ఏడాది ముందుగా అన్ని చెరువులను నింపాలన్నారు. పనులు ఆగొద్దనే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆర్థికాధికారాలు... ‘కోటి 25 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే వ్యవస్థ సిద్ధమవుతున్నది. ఈ శాఖ ప్రాధాన్యం, పరిధి ఎంతో పెరిగింది. సమర్థవంతంగా నిర్వహించడానికి నీటి పారుదల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఆయా ప్రాదేశిక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, తూములు, చెక్ డ్యాములు, ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు అన్నీ కూడా ఒకే సీఈ పరిధిలోకి తేవడం జరిగింది. డీఈఈ స్థాయి నుంచి ఇంజనీర్ ఇన్ చీఫ్ స్థాయి వరకు ప్రతీ అధికారికి నిర్ధిష్టమైన ఆర్థిక అధికారాలను ప్రభుత్వం బదిలీ చేసింది. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేకుండా, స్థానిక అధికారులే నిధులు మంజూరు చేసి, పనులు నిర్వహించే అధికారం ఇవ్వడం జరిగింది. ఇది చారిత్రాత్మక నిర్ణయం. ఇంజనీర్ ఇన్ చీఫ్ (జనరల్)కు ఒక్కొక్క పనికి రూ.కోటికి మించకుండా ఏడాదికి రూ.25 కోట్ల వరకు, చీఫ్ ఇంజనీర్ (సీఈ)కు ఒక్కొక్క పనికి రూ.50 లక్షలకు మించకుండా ఏడాదికి రూ.5 కోట్ల వరకు, పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్ఈ)కు ఒక్కొక్క పనికి రూ.25 లక్షలకు మించకుండా ఏడాదికి రూ.2 కోట్ల వరకు, కార్యనిర్వాహక ఇంజనీర్ (ఈఈ)కు ఒక్కొక్క పనికి రూ.5 లక్షలు మించకుండా ఏడాదికి రూ.25 లక్షల వరకు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్(డీఈఈ)కు ఒక్కొక్క పనికి రూ.2 లక్షలు మించకుండా ఏడాదికి రూ.5 లక్షల వరకు తమ స్థాయిలోనే మంజూరు చేసే ఆర్థిక అధికారాలను ప్రభుత్వం ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుని చిన్నచిన్న పనులను వెంటనే పూర్తి చేసుకోవాలి. రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగునీరు అందించాలి’అని సీఎం కేసీఆర్ కోరారు. ‘నీటిపారుదల శాఖను ప్రభుత్వం ఇటీవల పునర్వ్యవస్థీకరించింది. ఈ విభజన, ఆయా అధికారులకు నిర్ణయించిన పరిధి సౌకర్యవంతంగా, పనులు చేయడానికి అనువుగా ఉందో? లేదో? ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. అవసరమైన పక్షంలో మార్పులు చేయాలి’అని ఆదేశించారు. -
ఆ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తిచేయాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి వందశాతం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఫ్లోరైడ్, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి, ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధుల వరద ఆగవద్దని, ఈ ఏడాది బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తామని సిఎం స్పష్టం చేశారు. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేకుండా, వివిధ స్థాయిల అధికారులే మంజూరు చేసి, పనులు నిర్వహించే అధికారం ఇచ్చే చారిత్రిక నిర్ణయం తీసుకున్నట్లు సిఎం వెల్లడించారు. మస్కూరీలను నీటి పారుదల శాఖలో విలీనం చేసి లష్కర్లుగా వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు, వారికి తగు శిక్షణ ఇచ్చి ప్రాజెక్టుల నిర్వహణలో ఉపయోగించుకోనున్నట్లు సిఎం కేసీఆర్ వెల్లడించారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సురేందర్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఇఎన్సీ మురళీధర్ రావు, సిఇలు మోహన్ కుమార్, రమేశ్, రఘునాథరావు, ఎస్ఇలు ఆనంద్, విజయభాస్కర్ రెడ్డి, ఉమాపతి రావు, సూర్య నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టుపై సమీక్షలో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్, పంపుహౌజ్, నార్లాపూర్ – ఏదుల కాలువ, ఏదుల పంపుహౌజ్, ఏదుల-వట్టెం కాలువ, వట్టెం రిజర్వాయర్, వట్టెం-కర్వెన కాలువ, కర్వెన రిజర్వాయర్, కర్వెన-ఉద్దండాపూర్ కాలువ, టన్నెల్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఉద్దండాపూర్ నుంచి ఎగువ ప్రాంతాలకు నీరందించే మార్గానికి సంబంధించి తుది డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. కల్వకుర్తి, బీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు, జూరాలతో కలిపి 11.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సిఎం వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మొత్తం మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అవతుందని కేసీఆర్ అన్నారు. డిండి ప్రాజెక్టు పరిధిలోని కాలువలు, రిజర్వాయర్ల పనులను సిఎం సమీక్షించారు. - పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులకు వెంట వెంటనే బిల్లులు చెల్లించడానికి తక్షణం రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. - ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణను పూర్తి చేయడానికి తక్షణం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను సిఎం కోరారు. చట్ట ప్రకారం ఇవ్వల్సిన పరిహారం రైతులకు అందించి, వెంటనే భూ సేకరణను పూర్తి చేసి, భూమిని నీటి పారుదల శాఖకు అప్పగించాలని చెప్పారు. - బిహెచ్ఇఎల్ అధికారులతో సమావేశమై అవసరమైన మోటార్లను వెంటనే తెప్పించి, బిగించే పనులను పర్యవేక్షించాలని నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌ను సిఎం కోరారు. విద్యుత్ శాఖ అధకారులతో ఎప్పటికప్పుడు సమన్వయంతో వ్యవహరించాలి. - ప్రతీ ఏడాది ముందుగా అన్ని చెరువులను నింపాలి. - మిషన్ భగీరథకు నీరివ్వాడానికి వీలుగా అన్ని రిజర్వాయర్లలో మినిమమ్ డ్యామ్ డ్రాయింగ్ లెవల్ ను మెయింటేన్ చేయాలి. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగేది. ఇప్పుడు కోటి పది లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నది. సాగునీటి వసతి పెరగడం వల్లే ఇది సాధ్యమైంది. కోటి 25 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే వ్యవస్థ సిద్ధమవుతున్నది. బోర్ల ద్వారా సాగయ్యే భూమి దీనికి అదనం. సాగునీరు అందించడంతో పాటు మిషన్ భగీరథకు కావాల్సిన నీరు, పరిశ్రమలకు నీరు అందించే బాధ్యత కూడా నీటి పారదుల శాఖకే ఉంది. దీంతో నీటి పారుదల శాఖ ప్రాధాన్యం, పరిధి ఎంతో పెరిగింది. సాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి నీటి పారుదల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఆయా ప్రాదేశిక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, తూములు, చెక్ డ్యాములు, ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు అన్నీ కూడా ఒకే సిఇ పరిధికి తేవడం జరిగింది. డిఇఇ స్థాయి నుంచి ఇంజనీర్ ఇన్ చీఫ్ స్థాయి వరకు ప్రతీ అధికారికి నిర్ధిష్టమైన ఆర్థిక అధికారాలను ప్రభుత్వం బదిలీ చేసింది. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేకుండా, స్థానిక అధికారులే మంజూరు చేసి, పనులు నిర్వహించే అధికారం ఇవ్వడం జరిగింది. ఇది చారిత్రాత్మక నిర్ణయం. దేశంలో మరెక్కడా ఈ విధానం లేదు. ఇంజనీర్ ఇన్ చీఫ్ (జనరల్)కు ఒక్కొక్క పనికి 1 కోటి మించకుండా సంవత్సరానికి 25 కోట్ల రూపాయల వరకు, చీఫ్ ఇంజనీర్(సి.ఈ.)కు ఒక్కొక్క పనికి 50 లక్షలు మించకుండా సంవత్సరానికి 5 కోట్ల వరకు, పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్.ఈ )కు ఒక్కొక్క పనికి 25 లక్షలు మించకుండా సంవత్సరానికి 2 కోట్ల వరకు, కార్యనిర్వాహక ఇంజనీర్(ఇ.ఇ.)కు ఒక్కొక్క పనికి 5 లక్షలు మించకుండా సంవత్సరానికి 25 లక్షల వరకు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్(డి. ఇ. ఇ.)కు ఒక్కొక్క పనికి 2 లక్షలు మించకుండా సంవత్సరానికి 5 లక్షల వరకు ఆర్థిక అధికారాలను ప్రభుత్వం ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుని చిన్న చిన్న పనులను వెంటనే పూర్తి చేసుకోవాలి. రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగునీరు అందించాలి’’ అని సిఎం కేసీఆర్ కోరారు. ‘‘నీటిపారుదల శాఖను ప్రభుత్వం ఇటీవల పునర్వ్యవస్థీకరించింది. ఈ విభజన, ఆయా అధికారులకు నిర్ణయించిన పరిధి సౌకర్యవంతంగా, పనులు చేయడానికి అనువుగా ఉందో లేదో అనే విషయంలో ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. అవసరమైన పక్షంలో మార్పులు చేయాలి’’ అని సిఎం అధికారులను ఆదేశించారు. -
బ్లాస్టింగే ముంచిందా?
సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంపుహౌస్‌తో పాటు అప్రోచ్ చానల్ కోసం భూగర్భంలో చేపట్టిన పేలుళ్ల వల్లనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) పరిధిలోని పంపులు నీట మునిగాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. లిఫ్ట్‌లోకి నీళ్లు రావడానికి గల కారణాల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టులో అండర్ గ్రౌండ్ పంపుహౌస్ నిర్మిస్తే కల్వకుర్తి పంపుహౌస్ దెబ్బతింటుందని సీనియర్ ఇంజనీర్లు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే అండర్ టన్నెల్ (సొరంగం) పనుల్లో ఎక్కువ సామర్థ్యంతో కూడిన కెమికల్‌ను వినియోగిస్తూ బ్లాస్టింగ్ చేయడం వల్ల భూగర్భంలో ఉన్న కేఎల్ఐ లిఫ్ట్‌కు ప్రకంపనలు వస్తున్నాయని, దాని వల్ల లీకేజీలు, స్లాబ్ క్రాక్‌లు, అద్దాలు పగిలిపోతున్నాయని లిఫ్ట్ నిర్వాహకులు రెండేళ్ల క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గతేడాది మేలో కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. గతేడాది ఆగస్టు 7న పాలమూరు ప్రాజెక్టు సీఈ రమేశ్, ఈఈ విజయ్‌కుమార్, కేఎల్ఐ ఎస్ఈ అంజయ్య, ఈఈలు, డీఈలు, ఏఈలు కేఎల్ఐ మొదటి లిఫ్ట్‌ను పరిశీలించారు. బెంగళూర్ నుంచి ఎన్‌ఐఆర్‌ఎంకు ప్రతినిధులను పిలిపించారు. వారు టన్నెల్ పనుల్లో బ్లాస్టింగ్ చేయించి ప్రత్యేక పరికరం ద్వారా కేఎల్ఐ లిఫ్ట్‌లో వచ్చే తీవ్రతను పరీక్షించారు. కానీ పెద్దగా ప్రమాదం లేదని తేల్చి చెప్పారు. అయితే.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కేఎల్ఐ మొదటి లిఫ్ట్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని మొదటి ప్యాకేజీ పనులు చేస్తున్న కంపెనీ వారిని కంట్రోల్ బ్లాస్టింగ్ వినియోగించే విధంగా పటేల్ కంపెనీ వారు కోరారు. ప్రస్తుతం పనులు చేపడుతున్న మెగా కంపెనీ ఇటీవల రెగ్యులర్‌గా నిర్వహించిన బ్లాస్టింగ్ల వల్లనే ప్రమాదం జరిగిందనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా డీవాటరింగ్ చేస్తేనే నిజాలు బయటికి వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ఉద్రిక్తం.. డీకే అరుణ అరెస్ట్) గోడల్లో పగుళ్లు అయితే బ్లాస్టింగ్ వల్లనే పంపుహౌస్‌లో డ్రాఫ్ట్ ట్యూబ్‌లను ఆనుకొని ఉన్న గోడల్లో పగుళ్లు వచ్చి మోటార్లు మొత్తం నీటిలో మునిగిపోయాయి. మూడో మోటార్ బేస్మెంట్ కూడా పగిలిపోయింది. సర్జ్‌పూల్ షట్టర్లు మూసివేసినా నీళ్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అప్రోచ్ చానల్ గేట్లు మూసినా నీళ్లు వస్తున్నాయి. 95 మీటర్ల మేర పంపులు మునిగిపోయాయి. నీటి తోడివేతకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ తగ్గితేనే నీటిని తోడటం సాధ్యమవుతుందని తెలుస్తోంది. సాగు, తాగునీటికి ఇబ్బందులే.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3.40 లక్షల ఎకరాలకు సాగుతో పాటు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఏడు నియోజకవర్గాల్లోని సుమారు 3,088 గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీరు ఎల్లూరు రిజర్వాయర్ నుంచి సరఫరా అవుతుంది. పంపులు నీట మునగడం వల్ల ఈ గ్రామాలన్నింటికీ తాగునీటి ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శనివారం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీవాటరింగ్ను వెంటనే ప్రారంభించడంతో పాటు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా గ్రామాల్లోని సర్పంచులకు ఇప్పటికే తాగునీటి కోసం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించాలని సూచించినట్లు తెలిసింది. (చదవండి: నీట మునిగిన ‘కేఎల్ఐ’ మోటార్లు) -
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అర్థంలేని వాదనలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తోందని.. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంబిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నా అంతట నేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహహస్తం అందించాం. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి స్నేహపూర్వకంగా మెలిగి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం. వృథాగా సముద్రం పాలవుతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలుచేద్దామని చెప్పాం. అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోంది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థంలేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తోంది. అపెక్స్ కమిటీ సమావేశంలో ఆం«ద్రప్రదేశ్ ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థరహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెబుతాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పిస్తాం’అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు సోమవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్రం, ఏపీ అభిప్రాయాలపై చర్చించారు. కేంద్రానిది కూడా తప్పే.. ‘తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పే. తెలంగాణ రాష్ట్రానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదు’అని సీఎం అభిప్రాయపడ్డారు. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం ముందు పెట్టి సమర్థవంతంగా వాదనలను వినిపించాలని నిర్ణయించారు. ‘శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరపెడుతోంది. వాస్తవానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నింపిన తర్వాతే మిగిలిన ప్రాజెక్టులు నింపాలి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టు కాదు. అది జలవిద్యుత్ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదు. ఈ విషయంలో రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్ర వైఖరిని కూడా యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం’అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. రాష్ట్ర హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు.. ‘గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ ఏర్పడే నాటికే ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు మంజూరయ్యాయి. వాటికి నీటి కేటాయింపులు కూడా జరిగాయి. సీడబ్ల్యూసీ సహా ఇతర సంస్థల నుంచి అనుమతులు వచ్చాయి. దాదాపు రూ.23వేల కోట్ల మేర నిధుల ఖర్చు చేశారు. 31,500 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వీటిని కొత్త ప్రాజెక్టులు అనడం అర్థరహితం, అవివేకం. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మంజూరైనప్పటికీ వాటిని పూర్తిచేయలేదు. పైగా తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును ప్రతిపాదించారు. దీనివల్ల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీరవు. చాలా ప్రాజెక్టుల డిజైన్ తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా చేయలేదు. అందువల్ల తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికున్న హక్కులు, అవసరాలు, నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు రీ డిజైన్ చేసి నిర్మిస్తున్నాం. దీన్ని తప్పుబట్టడంలో అర్థంలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నీటి కేటాయింపులు జరిపి, ప్రతిపాదించిన ప్రాజెక్టులు కట్టడంలేదనే అసంతృప్తితోనే, నీటి పారుదల రంగంలో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది’అని కేసీఆర్ వివరించారు. అవన్నీ రీ డిజైన్ చేసిన ప్రాజెక్టులు.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సమ్మక్క సాగర్, రాజీవ్‌సాగర్–ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సీతమ్మసాగర్ నిర్మిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. పెన్‌గంగ ప్రాజెక్టులకు 1975లోనే ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఏఏ అనుమతులు సాధించారు? తెలంగాణ వచ్చేనాటికే ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? విడుదల చేసిన జీవోలు.. తదితర వాస్తవాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా బహిరంగ పరిచి ఫిర్యాదులు చేసినవారికి, సందేహాలు వెలిబుచ్చినవారికి తిరుగులేని సమాధానం చెప్పాలని అధికారులను ఆదేశించారు. ‘గతంలో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రలో చేపట్టిన ముచ్చుమర్రిని ప్రస్తావించింది. దీంతో ఈ రెండింటినీ కొనసాగించాలని నిర్ణయించారు. మళ్లీ ఆ అంశాన్ని లేవనెత్తడం సరికాదు. పాలమూరు–రంగారెడ్డి విషయంలో కూడా వాస్తవాలను మరోసారి వివరిస్తాం’అని సీఎం పేర్కొన్నారు. మంచినీటి అవసరాల కోసం వాడే నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ట్రిబ్యునల్ చెప్పిందని, దాని ప్రకారం తెలంగాణ మంచినీటి కోసం వాడే 110 టీఎంసీల్లో 22 టీఎంసీలను మాత్రమే లెక్కకు తీసుకోవాలని స్పష్టంచేశారు. సాగునీటిలో తెలంగాణకు అంతులేని అన్యాయం... ‘సాగునీటి రంగంలో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయం జరిగింది. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జునసాగర్ ప్రాజెక్టును 17 కిలోమీటర్ల దిగువన కట్టడం వల్ల అన్యాయం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కారణంగా ఎగువ కృష్ణ, తుంగభద్ర, బీమా ప్రాజెక్టులు పోయాయి. నీటివాటాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని సాక్షాత్తూ బచావత్ ట్రిబ్యునల్ పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తన నీటి వాటాను అడిగే సందర్భంలో తెలంగాణను పరిగణనలోకి తీసుకోలేదని స్వయంగా ట్రిబ్యునల్ గ్రహించి, తెలంగాణకు ప్రత్యేకంగా నీటిని కేటాయించింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన జూరాలతో పాటు నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయల్‌సాగర్ వంటి ప్రాజెక్టులను తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి చేసుకోగలిగాం. ఆర్డీఎస్ తూములను ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు బాంబులు పెట్టి పేల్చితే.. గ్రావిటీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాలేదు. ఆర్డీఎస్ ఆయకట్టును స్థిరీకరించడానికి ఎంతో వ్యయం చేసి తుమ్మిళ్ల లిఫ్టు నిర్మించుకోవాల్సి వచ్చింది. ఇలా సాగునీటి రంగంలో అంతులేని అన్యాయం జరిగింది. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు దక్కిన నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. వాస్తవానికి ఇంకా తెలంగాణకు నీటి అవసరం ఉంది. గోదావరి మిగులు జలాల్లో మరో వెయ్యి టీఎంసీలు దక్కాల్సి ఉంది. గోదావరికి తెలంగాణలోనే క్యాచ్‌మెంటు ఏరియా ఎక్కువ. నది ప్రవహించేది తెలంగాణలోనే ఎక్కువ. రాష్ట్రానికి అవసరాలు కూడా ఉన్నాయి. సముద్రంలో కలిసే 2వేల టీఎంసీలలో తెలంగాణకు కనీసం వెయ్యి టీఎంసీలు కేటాయించాలి’అని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. -
‘కేసీఆర్‌కు దోపిడీ తప్ప ఏమీ తెలియదు’
సాక్షి, నాగర్‌కర్నూల్: కృష్ణా జలాల సాధనలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి విమర్శించారు. నాగం జనార్ధన్ రెడ్డి ఓ సమావేశంలో మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అనుభవం లేని వారికి కాంట్రాక్టులు ఇచ్చి అసలుకే మోసం తెచ్చారని విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపకల్పనలో కేసీఆర్ అంతా తెలుసని అంటారు, కానీ దోపిడి తప్ప ఆయనకు ఏమీ తెలియదని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, కృష్ణా జలాలను ఆంధ్రకు తాకట్టు పెట్టారని విమర్శించారు. కేసీఆర్‌కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు పోరాడి ప్రాణాలర్పించింది ఇందు కోసమేనా అని ప్రశ్నించారు. కృష్ణా జలాల వాటా దక్కించుకునేందుకు పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు సమాయత్తం కావాలని నాగం జనార్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. చదవండి: ‘అవినీతిని ప్రజలు అర్థం చేసుకోవాలి’ -
‘పాలమూరు’ గడువు.. మరో రెండేళ్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పనులు మరో రెండేళ్లు అయితే కానీ పూర్తయ్యేలా లేవు. ఈ ప్రాజెక్టుల పరిధిలో చేపట్టిన 18 ప్యాకేజీల పనుల గడువు మరో రెండేళ్లు పెంచక తప్పేలా లేదు. పూర్తికాని భూసేకరణ, సహాయ, పునరావాసంలో ఇబ్బందులు, ఎన్జీటీ, కోర్టు కేసులు ప్రాజెక్టుల ముందరి కాళ్లకు బంధమేయడంతో 2022 జూన్ నాటికి ఈ పనులు పూర్తి చేస్తామంటూ ఇరిగేషన్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ త్వరలో సమీక్షించనున్నారు. భూసేకరణే అసలు సవాల్.. శ్రీశైలం నుంచి రోజుకి 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల వరదనీటిని తరలించి సుమారు 12.30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. 2015లో ఈ ప్రాజెక్టుకు 35,200 కోట్లతో పరిపాలనా అనుమతులు చేపట్టగా, 2016 జూన్‌లో ఉద్దండాపూర్ వరకు 18 ప్యాకేజీల పనులను రూ.29,312 కోట్లతో చేపట్టారు. ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని ఒప్పంద సమయంలో నిర్ణయించారు. అయితే భూసేకరణ సమస్యతో తొలి రెండేళ్లలో పనులు ముందుకు కదల్లేదు. దీనికితోడు ఎన్జీటీ కేసులు సైతం అవాంతరం సృష్టించాయి. ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 27 వేల ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉండగా, ఇంతవరకు 23,500 ఎకరాలు సేకరించారు. మరో 3,500 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2018 నుంచి మరో రెండేళ్లు అంటే 2020 జూన్ వరకు ప్యాకేజీల గడువు పొడిగించారు. అయినప్పటికీ ఇప్పటివరకు అన్ని ప్యాకేజీల్లో 28 శాతం పనులు, అంటే రూ.8వేల కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా ప్రాజెక్టులోని తొలి ప్యాకేజీ అయిన నార్లాపూర్ పంపింగ్ స్టేషన్ పనులు చాలాకాలంగా పెండింగ్‌లో పడ్డాయి. దీన్ని భూగర్భంలో నిర్మించాలా లేక భూఉపరితలం మీదా అన్న అంశం తేలకపోవడంతో ఇక్కడ కేవలం 4 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో పాటే భూసేకరణ సమస్యలతో ప్యాకేజీ–5, 7, 8, 16, 17, 18 పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ ప్యాకేజీల్లో కేవలం 15–30 శాతం పనులే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తి చేయాలంటే కొన్ని ప్యాకేజీలకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు, మరికొన్ని ప్యాకేజీల గడువును 2022 మే చివరి వరకు పొడిగించాల్సి వస్తోంది. అప్పటికి ప్రాజెక్టు పనులు నూటికి నూరుశాతం పూర్తి చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్‌కు ప్రాజెక్టు ఇంజనీర్లు విన్నవించారు. ఈ నేపథ్యంలో ప్యాకేజీల గడువు పొడిగింపులపై స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం చేశాక తుది ఆమోదం తీసుకోనున్నారు. ఇక ఉద్దండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు గతంలోనే రూ.4,268 కోట్లతో అంచనాలు సిద్ధం చేసినా పనులు మాత్రం మొదలు పెట్టలేదు. ఈ పనులకు కొత్త స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల ప్రకారం కొత్త అంచనాలు సిద్ధంచేసి ఇవ్వాలని ప్రభు త్వం సూచించింది. ఈ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కొత్త రేట్ల ప్రకారం ఈ అంచనా రూ.7వేల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటికి ఆమోదం రాగానే ఈ పనులకు టెండర్లు పిలవనున్నారు. -
ఇక పాలమూరు మలిదశ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో ఇంతవరకు మొదలు కాని పనులకు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల నేపథ్యంలో కదిలిన నీటి పారుదల శాఖ ఉద్ధండాపూర్ దిగువన కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు చేపట్టిన పనులను త్వరలోనే మొదలుపెట్టేందుకు కార్యా చరణ సిద్ధం చేస్తోంది. గతంలో ఈ పనులను మూడు ప్యాకేజీలుగా విడగొట్టి చేపట్టేలా అంచనాలు సిద్ధం చేసినా, టెండర్లు పిలవలేదు. ప్రస్తుతం ఆ పనులను కొత్త స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు (ఎస్ఎస్ఆర్) ప్రకారం అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలవాలని నిర్ణయించింది. (చదవండి: హమ్మయ్య.. హమాలీలొచ్చారు) నాలుగేళ్లుగా ఎదురుచూపులే.. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగు నీరు, పరిశ్రమలకు నీటి వసతి కల్పించే ఉద్దేశంతో రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు ప్రాజెక్టును చేపట్టగా అనంతరం ఈ అంచనాలు రూ. 50 వేల కోట్లకు పెంచారు. ఈ పథకంలో 6 రిజ ర్వాయర్లు, 5 లిఫ్టులను ప్రతిపాదించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి వద్ద రిజ ర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో రంగా రెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని 5 రిజ ర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులను 18 ప్యాకేజీలుగా విభజించి, మొత్తంగా రూ.30 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి గతేడాదిలోనే పనులు ప్రారంభిం చారు. ఉద్ధండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి మధ్యలో కొత్త ప్రతిపాదనలు రావడంతో ఈ పనులు చేపట్టలేదు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను వేగిరం చేసిన ప్రభుత్వం.. ఈ పనులను మొదలు పెట్టాలని నిర్ణయించింది. భారీగా అంచనాలు పెరిగే అవకాశం ఉద్ధండాపూర్–కేపీ లక్ష్మీదేవునిపల్లి అనుసంధాన ప్రక్రియకు గతంలో రూ.4,268 కోట్లతో అంచనాలు వేసి 3 ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ–19లో చేర్చిన అధికారులు, ఇక్కడ 18 కి.మీ. మేర ఓపెన్ చానల్, 14 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించాల్సి ఉంటుందని తేల్చారు. దీనికి రూ.1,260 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్యాకేజీ–20లో స్టేజ్–5 పంప్‌హౌజ్ నిర్మాణానికి రూ.885 కోట్లు, 2.8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి రూ.915.9 కోట్లు అంచనా వేశారు. ఈ రిజర్వాయర్ కింద 4.13 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, రిజర్వాయర్ కింద 1,340 ఎకరాల మేర ముంపు ఉండనుంది. దీంతోపాటే ఉద్ధండాపూర్ నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణానికి మరో రూ.1,207 కోట్లతో ప్రతిపాదించారు. మొత్తంగా రూ.4,268 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినా నాలుగేళ్లుగా ఈ ప్రతిపాదన పట్టాలెక్కలేదు. అయితే ఈ పనులు మొదలుపెట్టాలని జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగడం, నార్లాపూర్ పంప్‌హౌస్ మినహా మిగతా 18 ప్యాకేజీల పనులు వేగం పుంజుకున్న నేపథ్యంలో ఒక టీఎంసీ నీటిని ఉద్ధండాపూర్–కేపీ లక్ష్మీదేవునిపల్లికి తరలించే పనులపై దృష్టి పెట్టారు. అయితే ఎప్పుడో ఉన్న రేట్ల ప్రకారం కాకుండా కొత్త రేట్ల ప్రకారం అంచనాలు వేసి పంపాలని ఇటీవలే ప్రాజెక్టు అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్త అంచనాల పనిలో నిమగ్నమయ్యారు. కొత్త రేట్ల ప్రకారం చూస్తే ఈ అంచనాలు రూ.7 వేల కోట్లకు చేరుతాయని తెలుస్తోంది. ఈ కొత్త అంచనాలకు ఆమోదం దక్కితే వెంటనే ఈ మూడు ప్యాకేజీలకు టెండర్లు పిలవనున్నారు. (చదవండి: మృతదేహాలకు పరీక్షలెందుకు చేయరు?) -
కృష్ణాకూ రివర్స్!
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను రివర్స్ పంపింగ్ చేస్తున్నట్లే కృష్ణా నదీ జలాలనూ పాలమూరు–రంగారెడ్డి ద్వారా జూరా లకు తరలించే ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధమ య్యాయి. సాధారణంగా కృష్ణానది సహజ ప్రవా హాలు జూరాల నుంచి శ్రీశైలానికి వెళ్తుంటాయి. అయితే వర్షాకాలం తర్వాత ఎగువ నుంచి వరద ప్రవాహం ముగిశాక జూరాలలో నీటి లభ్యత పడిపోతుండటం, అవసరాలు భారీగా ఉన్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రివర్స్‌లో జూరాలకు నీటిని తరలించాలని సాగునీటి శాఖ ప్రణాళిక రచించారు. ఇందుకోసం శ్రీశైలంపై ఆధారపడి చేపట్టిన పాలమూరు ప్రాజెక్టులోని కర్వెన రిజర్వాయర్ ద్వారా నీటిని జూరాలకు తరలించేందుకు యోచిస్తున్నారు. దీంతో వేసవిలో కూడా జూరాల ద్వారా తాగునీరు, యాసంగి ఆయకట్టుకు సాగు నీరిచ్చే వీలుకలుగుతుంది. ఇందుకోసం దాదాపు రూ.400 కోట్లతో ప్రాథమిక అంచనాలు వేశారు. ఈ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ప్రతిపాదనలకు తుది రూపం రానుంది. సామర్థ్యం తక్కువ, అవసరాలు ఎక్కువ జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, నికర నిల్వ సామర్థ్యం 6.79 టీఎంసీలుగా ఉంది. దీని కింద ఆయకట్టు 1.04 లక్షల ఎకరాలు కాగా, దీనికే 17.84 టీఎం సీల అవసరం ఉంటుంది. దీనికి తోడు జూరాలపై ఆధారపడి నెట్టెంపాడు (21.42 టీఎంసీ–2 లక్షల ఎకరాలు),బీమా(20టీఎంసీ– 2.03లక్షల ఎకరాలు), కోయిల్‌సాగర్ (3.9 టీఎంసీ– 50,250 ఎకరాలు) ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. దీంతో పాటే మిషన్ భగీరథ కింద మరో 7.43 టీఎంసీల అవసరాలకు జూరాలపై ఆధారపడి ఉన్నాయి. జూరాల కింది తాగు, సాగునీటి అవసరాలకు నీటిని అందించాలంటే రోజూ 10 వేల క్యూసెక్కుల మేర నీటి అవసరం ఉంటుంది. అయితే జూరాలలోని నికర నిల్వ సామర్థాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ నిల్వ నీటితో 8 రోజులకు మించి నీరు సరిపోదు. అదీగాక నవంబర్ తర్వాత ఎగువ నుంచి వరద ఆగాక జూరాలకు వచ్చే ప్రవాహాలు 2001–2018 వరకు చూస్తే రోజుకు 2,678 క్యూసెక్కులకు మించి లేదు. ఈ నీటితో జూరాలపై ఉన్న నీటి అవసరా లను, యాసంగిలో సాగునీటి అవసరాలకు నీరివ్వడం సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 215 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలంపై ఆధారపడి చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి జూరాలకు రివర్స్‌లో నీటిని తరలించి, వేసవిలోనూ జూరాలలో నీటిలభ్యత పెంచే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. పాలమూరు ప్రాజెక్టులోని నాలుగో రిజర్వాయర్ అయిన 17.34 టీఎంసీ సామర్థ్యం ఉన్న కర్వెన రిజర్వాయర్ నుంచి కోయిల్‌సాగర్, సంగం బండలకు నెలకు ఒక టీఎంసీ, అటునుంచి జూరాలకు నెలకు 1.5 టీఎంసీల నీటిని తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. దీనిపై ప్రాజెక్టు ఇంజనీర్లు ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తరలింపు ఇలా.. కర్వెన రిజర్వాయర్ కింద హై లెవల్ కెనాల్ (హెచ్ఎల్సీ)108 కిలోమీటర్లు ఉండగా, దాని ప్రవాహ సామర్థ్యం 2,213 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం కోయిల్‌సాగర్, సంగంబండ మీదుగా జూరాల వరకు నీటిని తరలించాలంటే దాని సామర్థ్యాన్ని 3,564 క్యూసెక్కులకు పెంచాల్సి ఉంటుంది. హెచ్ఎల్సీ 32వ కిలోమీటర్ నుంచి ఒక తూము (ఓటీ) నిర్మించి దాని నుంచి 386 క్యూసెక్కుల నీరు (నెలకు ఒక టీఎంసీ) తరలించేలా కాల్వలను నిర్మించి దాన్ని కోయిల్‌సాగర్ రిజర్వాయర్‌లో కలిసే హన్వాడ మండలంలోని చిన్నవాగులో కలపాలి. ఇలా కోయిల్‌సాగర్‌కు నీటిని తరలించేందుకు రూ.65 కోట్లు ఖర్చు కానుంది. ఇక కర్వెన రిజర్వాయర్ కింది హెచ్ఎల్సీ 90.7వ కిలోమీటర్ వద్ద మరో తూము నిర్మాణం చేసి, 965 క్యూసెక్కులు (నెలకు 2.5 టీఎంసీ, ఇందులో 1 టీఎంసీ సంగంబండకు, మరో 1.5 టీఎంసీ జూరాలకు) తరలించేలా కాల్వలను తవ్వి దాన్ని నారాయణపేట మండలం సింగారం గ్రామంలో ఉన్న మాలవాగులో కలపాలి. దీనికి రూ.155 కోట్ల మేర ఖర్చు కానుంది. ఇక సంగంబండలో నీరు మిగులు అయితే అవి పెద్దవాగు ద్వారా జూరాల ప్రాజెక్టును చేరతాయి. అయితే ఈ నీటిని తరలించే క్రమంలో వివిధ నిర్మాణాలకు కలిపి రూ.180 కోట్లు ఖర్చు కానుంది. అయితే కర్వెన నుంచి జూరాలకు వరద నీటిని తరలించే క్రమంలో ఇప్పటికే ఎన్ని నిర్మాణాలు ప్రభావితం అవుతాయి.. ఇప్పటికే సాగులో ఉన్న ఆయకట్టు ఏమైనా దెబ్బతింటుందా? అన్న అంశం సమగ్ర సర్వేలోనే తేలనుంది. ప్రస్తుతం సిద్ధం చేసిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించిన అనంతరం ఆయన ఆమోదం మేరకు తుది ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. -
అందని పరిహారం.. ఆగని ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు భూ పరిహారం విషయంలో జరుగుతున్న జాప్యం రైతుల్లో ఆందోళనను పెంచుతోంది. సేకరణకు సమ్మతించిన భూ ములపై ప్రభుత్వం అవార్డు ప్రకటించి ఎనిమిది నెలలైనా పరిహారం ఇవ్వకపోవడంతో వారంతా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా నిరసనలకు దిగుతున్నారు. ప్రత్యామ్నాయ భూములు కొనేలా సత్వరమే పరిహారం ఇప్పించా లంటూ ప్రభుత్వ శాఖల చుట్టూ తిరుగుతూ ఒత్తిడి పెంచుతుండటంతో నీటిపారుదల శాఖ నిధుల విడుదలకోసం ప్రభుత్వానికి మొరపెట్టుకుంటోంది. 961 ఎకరాలు..8 నెలలు.. పూర్వ మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరా లకు సాగునీరిచ్చే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కింద రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు నిర్మించేందుకు 12,082 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని గుర్తించారు. ఇప్పటికే 10,980 ఎకరాల భూమిని సేకరించేలా వివిధ రకాల ప్రక్రియలను పూర్తి చేశారు. ఇందులో 10,019 ఎకరాలకు పరిహారం చెల్లించగా, 961 ఎకరాలను తీసుకోవడానికి ప్రభుత్వం అవార్డు చేసింది. ఈ భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించి వాటిని పూర్తిగా స్వాధీనపరచుకొని నిర్మాణ పనులు కొనసాగించాల్సి ఉంటుంది. అయితే ఈ 961 ఎకరాల భూమిని ఈ ఏడాది మే నెలలో అవార్డు చేసినా వీటికి సంబంధించిన రూ.62 కోట్లు పరిహారం మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. దీంతో కొందరు రైతులు కోర్టులను ఆశ్రయించగా, మరికొందరు ప్రాజెక్టు పనులు జరుగనీయకుండా అడ్డుకుంటున్నారు. రైతుల డిమాండ్‌పై ఏదో ఒకటి తేల్చితే కానీ పనులు ముందుకుసాగే అవకాశం లేకపోవడంతో నీటిపారుదల శాఖ దీనిపై ప్రభుత్వానికి లేఖ రాసింది. -
పాలమూరుపై విచారణ జనవరి 14కు వాయిదా
న్యూఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో నిధులకు సంబంధించి సవరించిన అంచనాలను సవాలు చేస్తూ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సవరించిన అంచనాలతో ప్రాజెక్ట్ వ్యయంలో నిధులకు సంబంధించి అంకెలు అసాధారణ రీతిలో పెరిగాయని ఈ మేరకు పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ప్రాజెక్టులో భారీగా అవకతవకలు జరిగాయని, కాంట్రాక్టు తీసుకున్న సంస్థలపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆదాయపన్ను శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తమ సంస్థ పేర్లు లేవని మేఘా సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరి 14కు వాయిదా వేసింది. -
బిల్లులు కట్టాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం దృష్ట్యా నిధుల కొరతతో సాగునీటి పథకాలకు పెండింగ్ బిల్లులను చెల్లించలేక ఆ శాఖ సతమతమవుతోంది. మరో వైపు ప్రధాన ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నందున బిల్లులు చెల్లించాల్సిందేనని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) నీటి పారుదల శాఖపై ఒత్తిడి పెంచుతోంది. తమ ఆర్థిక నిర్వహణ, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా తక్షణమే రూ.2,728 కోట్లు కట్టాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి నీటి పారుదల శాఖకు తాజాగా లేఖ రాశారు. దీంతో ఈ బిల్లుల చెల్లింపు ఎలా చేయాలన్న దానిపై నీటి పారుదల శాఖ తలలు పట్టుకుంటోంది. నిధులకు కటకట.. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన ఎత్తిపోతల పథకాలైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, దేవాదుల, ఎల్లంపల్లి, అలీసాగర్, ఏఎంఆర్ ఎస్‌ఎల్‌బీసీల ద్వారా మోటార్లను నడిపి నీటిని తాగు, సాగు అవసరాలకు మళ్లిస్తున్నారు. దీనికయ్యే విద్యుత్ సరఫరాను టీఎస్ఎస్పీడీసీఎల్ చేస్తోంది. వీటి బిల్లులను నీటి పారుదల శాఖ చెల్లించాల్సి ఉంటుంది.ఆర్థిక పరిస్థితి సరిగా లేక కాళేశ్వరం, దేవాదుల, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు సరిపడినన్ని నిధులు లేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పనులు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశం కనిపించడమే లేదు. దీంతో మొత్తంగా ఎత్తిపోతల పథకాల పరిధిలో రూ.3,237.39 కోట్ల మేర బిల్లులు బకాయి పడింది.వీటిని తీర్చే మార్గాలే లేని దుస్థితిలో నీటిపారుదలశాఖ ఉంటే.. బకాయిలు కట్టాల్సిందేనని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ లేఖ రాసింది. బకాయిలు పెరిగాయి.. ‘ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లుల బకాయిలు గత ఆగస్టు 31 నాటికి రూ.2,728.73 కోట్లకు ఎగబాకాయి. దీర్ఘకాలికంగా ఈ బిల్లులు చెల్లించకపోవడంతో టీఎస్ఎస్పీడీసీఎల్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. టీఎస్ఎస్పీడీసీఎల్ వివిధ రకాల విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది. ఈ బిల్లులు చెల్లించేందుకు టీఎస్ఎస్పీడీసీఎల్ ఎత్తిపోతల పథకాల వంటి బల్క్ విద్యుత్ కొనుగోలుదారులు చెల్లించే బిల్లులపైనే ప్రధానంగా ఆధారపడుతోంది. ఈ బిల్లులను నీటి పారుదల శాఖ 2019–20 బడ్జెట్ కేటాయింపుల నుంచి చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కదిలిన నీటి పారుదల శాఖ ఈ బకాయిల చెల్లింపునకు వీలుగా ప్రతి నెలా కనిష్టంగా రూ.100 కోట్లయినా తమకు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మొత్తం బకాయిలు 2728,కల్వకుర్తి ఎత్తిపోతల బకాయిలు 1,433,ఎస్ఎల్బీసీ బకాయిలు 637 ,భీమా బకాయిలు 110 ,మిగిలిన బకాయిలు 548(అంకెలు రూ.కోట్లలో) -
పాలమూరు, డిండిలపై తీరు మార్చుకోని కర్ణాటక
సాక్షి, హైదరాబాద్ : పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై ఎగువ కృష్ణా బేసిన్లో ఉన్న కర్ణాటక తన తీరు మార్చుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి అడ్డుపుల్లలు వేయాలన్న లక్ష్యంతో గట్టిగా తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇటీవలే జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో దీనిపై తెలంగాణ కొంత స్పష్టతనిచ్చినా మళ్లీ కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసింది. కృష్ణా బేసిన్లో నదీ జలాల నీటి లభ్యత ప్రాతిపదికన అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా, కృష్ణా జలాలను వినియోగించుకుంటూ తెలంగాణ కానీ, ఏపీ కానీ ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టరాదని పునర్విభజన చట్టంలో ఉందని జలశక్తి శాఖకు రాసిన లేఖలో పేర్కొంది. కొత్త ప్రాజెక్టులు ఏవైనా చేపడితే ప్రాథమికంగా సాంకేతిక అనుమతులను కృష్ణాబోర్డు నుంచి తీసుకోవాలని, అనంతరం అపెక్స్ కౌన్సిల్ అనుమతులు పొందాలని పేర్కొంది. దీంతో పాటే కృష్ణా బేసిన్లో మిగులు జలాలపై హక్కులు కేవలం దిగువ రాష్ట్రాలకే ఉంటాయని, ఎగువ రాష్ట్రాలకు ఉండవంది. తెలంగాణ ఎగువ రాష్ట్రం అయినందున మిగులు జలాలపై హక్కులు లేవని తెలిపింది. కర్ణాటక ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ దీనిపై వివరణ తీసుకోవాలంటూ కృష్ణాబోర్డుకు రెండు రోజుల కిందట లేఖ రాసింది. దీంతో ప్రాజెక్టులపై స్పందించాలని బోర్డు గురువారం తెలంగాణకు లేఖ రాసింది. ప్రాజెక్టు డీపీఆర్, ప్రస్తుత ప్రాజెక్టు స్థితిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఇటీవలే చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలోనే ఈ ప్రాజెక్టులపై తెలంగాణ స్పష్టతనిచ్చింది. ఈ 2 ప్రాజెక్టులు కొత్తవి కావని, ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టారని చెప్పింది. మిగులు జలాల్లో తమకు హక్కు ఉంటుందని వివరించింది. అయినప్పటికీ కర్ణాటక తన వైఖరి మార్చుకోవడంలేదు. -
సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన విద్యుత్ బకాయిలు
సాక్షి, మహబూబ్‌నగర్: పాలమూరు సాగునీటి పథకాలకు అసలే అరకొర కేటాయింపులు ఉండడంతో విద్యుత్ బిల్లుల చెల్లింపుకు జాప్యం జరుగుతోంది. అయితే ప్రతిసారి బడ్జెట్లో మంజూరైన నిధుల్లో పనులు, పునరావాసం, విద్యుత్ బిల్లుల చెల్లింపు, ఇతరాత్ర ఖర్చులు ఇలా అన్ని కేటగిరీలకు అవసరం మేరకు కేటాయిస్తారు. ఇందులో విద్యుత్ బిల్లుల కోసం కేటాయించిన నిధుల్లోనూ భారీగా కోత విధించి కనీసం పదిశాతం కూడా చెల్లించకపోవడంతో బిల్లులు ప్రతినెలా గుట్టల్లా పేరుకుపోతున్నాయి. దీంతో ఆ భారం విద్యుత్ సంస్థకు గుదిబండగా మారింది. ప్రస్తుతం ఐదు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి రూ.1,641.57 కోట్ల మేర విద్యుత్ బకాయిలు ఉండడంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. ఇలాంటి బిల్లుల పెండింగ్ ఇతర రంగాలకు చెందినవి అయితే వాటికి విద్యుత్ సరఫరా నిలిపేసే పరిస్థితి ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తోన్న నేపథ్యంలో ఎత్తిపోతల పథకాల నిర్వహణకు విద్యుత్ సరఫరా నిలిపేసే ప్రసక్తే లేకుండా పోయింది. ఇదీలా ఉంటే కనీసం బడ్జెట్లో జరిగిన కేటాయింపుల మేరకైనా బిల్లులు చెల్లిస్తే అంత సమస్య ఉండదని విద్యుత్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాల బిల్లుల చెల్లింపులు సంబంధిత శాఖ ద్వారా నేరుగా ట్రాన్స్‌కోకు ఉండడంతో తమకు సంబంధం లేదని చెబుతున్నారు. భారీ మోటార్లు.. బిల్లులు తడిసిమోపెడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణ కోసం ప్రభుత్వం 30మెగావాట్లతో కూడిన 15మోటార్లు ఏర్పాటు చేసింది. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 17 మెగావాట్లతో కూడిన ఏడు మోటార్లు నడుస్తున్నాయి. భీమా 1,2 ఎత్తిపోతలకు సంబంధించి రెండు చోట్లా 12మెగావాట్లతో కూడిన మూడు మోటార్లు, నాలుగు మెగావాట్లతో కూడిన మూడు మోటార్లు పని చేస్తున్నాయి. కోయిల్‌సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి ఐదు మెగావాట్లతో కూడిన నాలుగు మోటార్లు పని చేస్తున్నాయి. మోటార్లన్నీ భారీగా ఉండడంతో పంపులు పని చేసే సమయాన్ని బట్టి నెలకు కనిష్టంగా రూ.50లక్షలు గరిష్టంగా రూ.2కోట్ల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. రూ.328.21బడ్జెట్లో రూ.6.32 కోట్లే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్వహణకు రూ.328.21కోట్ల కేటాయింపు జరిగింది. అందులో రూ.97.97 కోట్లతో విద్యుత్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ గత నెలాఖరు వరకు కేవలం రూ. 6.32 కోట్లు మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఓటాన్ అకౌంట్లో రూ. 67.74 కోట్లు కేటాయించగా.. రూ. 18.01 కోట్లు విద్యుత్ బిల్లుల కోసం కేటాయించారు. కానీ అందులో నయాపైసా కూడా విద్యుత్ బిల్లుల కోసం ఖర్చు చేయలేదు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.146 కోట్ల కేటాయించగా... అందులో రూ.69.89 కోట్లు విద్యుత్ బకాయిలకు కేటాయించారు. అయినా అందులో నయాపైసా కూడా బిల్లులు చెల్లించలేదు. దీంతో పాత బకాయిలతో కలిపి మొత్తం రూ. 1433.06 కోట్ల మేర విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూ.64.31 కోట్లు కేటాయించగా... రూ. 6.32 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించారు. పాత బకాయిలతో కలిపి రూ. 104.70కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కోయిల్‌సాగర్ పథకానికి సంబంధించి ఓటాన్ అకౌంట్లో రూ. 50.16 కోట్లు కేటాయించగా.. విద్యుత్ బిల్లుల కోసం రూ. 1.29 కేటాయించారు. కానీ అందులో ఒక్కరూపాయి కూడా విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. ఇదీలావుంటే.. ఈ నెల 9న ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్లో ఎత్తిపోతల పథకాలకు కేవలం రూ. 79 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ కేటాయింపులు నిర్మాణ పనుల పెండింగ్ బిల్లులకే సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో నయాపైసా కూడా విద్యుత్ బిల్లుల కోసం చెల్లించలే ని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. నిధుల సమస్య ఉంది జిల్లాలో ఎత్తిపోతల పథకాల నిర్వహణకు సంబం ధించిన విద్యుత్ బకాయిలు చెల్లించాలంటే అవసరం మేరకు నిధుల కేటాయింపులు లేవు. పథకాల వారీగా మంజూరైన నిధుల్లో నిర్మాణ పనులు, పునరావాసం, విద్యుత్ బకాయిలు, ఇతరాత్ర ఖర్చుల విభజన చేసుకుని వాటిలో ఏది ఎంత అవసరమో గుర్తించి అందులో ఖర్చు చేస్తాం. విద్యుత్ బిల్లులకు అరకొర కేటాయింపులు ఉండడంతోనే చెల్లింపుకు జాప్యం జరుగుతోంది. – ఖగేందర్, సీఈ -
‘పాలమూరు’పై కర్ణాటక పేచీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై కర్ణాటక పేచీకి దిగుతోంది. కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు ఇప్పటికే ఫిర్యాదు చేసిన కర్ణాటక, తాజాగా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం చెన్నైలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్లో దీనిపై చర్చించాలని డిమాండ్ చేసింది. కర్ణాటక ఫిర్యాదు పై స్పందించిన హోంశాఖ అంతర్రాష్ట్ర వ్యవహారాల కౌన్సిల్ సెక్రటేరియట్ దీనిపై చర్చించేందుకు అనుమతిస్తూనే, దీనిపై వివరణ కోరింది. మిగులును చూపించి చర్చకు.. ‘కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్–2 నవంబర్ 29, 2013న ఇచ్చిన తుది ఉత్తర్వుల ప్రకారం మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ తెలంగాణకు ఇవ్వలేదు. సముద్రంలోకి వృథాగా వెళ్లే మిగులు జలాలను దిగువ రాష్ట్రంగా వాడుకునే హక్కును ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది. అదే సమయంలో ఎగువ రాష్ట్రా లైన కర్ణాటక, మహారాష్ట్రకు మిగులు జలాలు వాడుకునే హక్కులు ఇవ్వలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం సైతం ఎగువ రాష్ట్రమైనందున దానికి సైతం మిగులు జలాలు వాడుకునే హక్కు లేదు’అని కర్ణాటక తెలిపింది. ఈ దృష్ట్యా మిగులు జలాలపై ఆధారపడి పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను చేపట్టరాదని కేంద్రానికి తెలిపింది. -
ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలి: మంత్రి
సాక్షి, రంగారెడ్డి: ‘ప్రాజెక్టులు పూర్తికావాలి.. బీడు భూముల్లో నీళ్లు పారి జిల్లా సస్యశ్యామలం కావాలి. పుష్కలంగా పంటలు పండి రైతులు సంతోషంగా ఉండాలి. ఇదే మా లక్ష్యం. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి జిల్లా వాసుల కలను నెరవేరుస్తాం’ అని విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్‌పై తనకు కొండంత విశ్వాసం ఉందని, కాళేశ్వరం స్ఫూర్తితో పాలమూరు–రంగారెడ్డిని కూడా పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రాతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణాన్ని మూడేళ్ల వ్యవధిలోనే పూర్తిచేశారని.. ఇదే తరహాలో ఇక్కడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తారని అన్నారు. ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సబిత మంగళవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి కృషిచేస్తామని, పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పరుస్తామన్నారు. బడుల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ కష్టంగా మారిందని, ఈ సమస్య పరిష్కారానికి ప్రముఖ కంపెనీలు, సంస్థలను సంప్రదించి వాటి సహకారం తీసుకుంటామన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద నిధులను పాఠశాలల కోసం ఖర్చుచేసేలా వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌లు కూడా దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. అంతేగాక రియల్టర్లు, బిల్డర్లు కొన్ని పాఠశాలలను దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సమాజానికి ఎంతో కొంత చేయాలన్న దృక్పథం ప్రతిఒక్కరిలో ఉండాలన్నారు. త్వరలో సమీక్ష.. జిల్లాలో ప్రభుత్వ విభాగాల వారీగా సమీక్ష సమావేశాలను నిర్వహిస్తామని పేర్కొన్న మంత్రి.. వాటిలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామని తెలిపారు. అన్ని విభాగాల అధికారులతోపాటు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమీక్షకు హాజరయ్యేలా చూస్తానని అన్నారు. వీటిపైనా దృష్టి.. మ్యుచువల్లీ ఎయిడెడ్ ట్రిప్‌టైన్డ్ కోఆపరేటివ్ సొసైటీ (ఎంఏటీసీఎస్) బ్యాంకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరలో పరిష్కారం చేస్తానని చెప్పారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు అధికంగా ఉన్నాయని, ఇక్కడికి ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి కంపెనీలో స్థానికులకు 20 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాల్సిందేనన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం విడుదల చేసిన జీఓ స్పష్టం చేస్తున్నా.. కొన్ని కంపెనీలు పాటించడం లేదన్నారు. జీఓ ప్రకారం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కేలా చూస్తానని పేర్కొన్నారు. అనంతగిరిని తీర్చిదిద్దుతాం ఎత్తయిన గుట్టలు, పచ్చని చెట్లతో అలరారే అనంతగిరిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ విషయమై సీఎంతో ప్రత్యేకంగా మాట్లాడి కార్యరూపం దాల్చేందుకు చొరవ తీసుకుంటానని తెలిపారు. హైదరాబాద్ మహానగరానికి అత్యంత చేరువులో ఇంతటి సుందరమైన ప్రాంతం మరోటి లేదన్నారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించేందుకు కృషిచేస్తామని సబిత అన్నారు. విస్తరణపై తాజాగా ఓ వ్యక్తి కేసు వేశారని, ఆయనతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. తాండూరు ప్రాంతంలో కంది బోర్డు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని, దానిని సాధిచేందుకు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సహకారం తీసుకుంటామని ఆమె చెప్పారు. -
లక్ష కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మరో లక్ష కోట్ల నిధుల అవసరం ఉంది. లక్ష కోట్ల మేర ఖర్చు చేస్తే ప్రభుత్వం నిర్ణయించిన 1.24 కోట్ల ఎకరాల ఆయకట్టు రాష్ట్రంలో సాగులోకి రానుంది. మొత్తంగా రాష్ట్రంలోని 38 భారీ, మధ్యతరహా ఎత్తిపోతల పథకాల పూర్తికి రూ.2.19 లక్షల కోట్ల మేర అవసరం ఉండగా, ఇందులో ప్రభుత్వం ఇప్పటికే 1.15 లక్షల కోట్ల మేర ఖర్చు చేసింది. మరో 1.04 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో అధికంగా కాళేశ్వరం ఎత్తిపోతలపైనే రూ.54 వేల కోట్ల మేర ఖర్చు చేసింది. ఈ ఏడాది నుంచి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను వేగిరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి రోజుకు ఒక టీఎంసీ నీటిని 60 రోజుల పాటు ఎత్తిపోసేలా పనులు చేయాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా రూ.10 వేల కోట్ల రుణాలు సేకరించగా, దీని నుంచే అధికంగా ఖర్చు చేయనుంది. లక్ష్యం మేరకు పనులు పూర్తయితే ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాదికే 7 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యంగా ఉంది. రాష్ట్రంలో మొత్తంగా 1.24 కోట్ల ఎకరాలకు ఆయకట్టు వసతి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 70.1 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల కింద 2004 నుంచి ఇంతవరకు 16.77 లక్షల ఎకరాల మేర సాగులోకి రాగా, రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఏకంగా 12.9 లక్షల ఎకరాలను సాగులోకి తేగా, మరో 53.33లక్షల ఎకరాలను వృద్ధిలోకి తేవాల్సి ఉంది. రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సమగ్ర స్వరూపం ఇలా.. - మొత్తం భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు: 38 - ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన మొత్తం: రూ.2,19,513.9 కోట్లు - ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం: రూ.1,15,417.72 కోట్లు - ఇంకా ఖర్చు చేయాల్సిన మొత్తం: రూ.1,04,096.18 కోట్లు - రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఖర్చు చేసిన మొత్తం: రూ.80 వేల కోట్లు - ప్రాజెక్టులతో సాగులోకి రావాల్సిన ఆయకట్టు: 70.1 లక్షల ఎకరాలు - ఇప్పటివరకు సాగులోకి వచ్చిన ఆయకట్టు: 16.77 లక్షల ఎకరాలు - ఇంకా సాగులోకి రావాల్సింది: 53.33 లక్షల ఎకరాలు -
అడుగడుగునా అడ్డంకులే..
సాక్షి, మహబూబ్‌నగర్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముందుగా నార్లాపూర్ రిజర్వాయర్ పనులకు సంబంధించి అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ లేదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నిధులు విడుదల కాలేదు. ఈ కారణంగా ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్మిస్తున్న నార్లాపూర్, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల కాల్వ పనుల్లో పురోగతి ఆశించిన మేరకు కనిపించలేదు. తాజాగా నిధుల సమస్య తీరిందంటే ఆయా రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులు పరిహారం కోసం రోడ్డెక్కుతున్నారు. ఇన్ని చిక్కుల మధ్య గడువులోగా పనులను పూర్తి చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. నిధులు మంజూరైనా.. ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా గత నెల 28న ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ వాటి పరిధిలో నిర్మాణ దశలో ఉన్న కర్వెన, వట్టెం, నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల పనులను పరిశీలించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.10 వేల కోట్ల రుణం మంజూరు కావడంతో ఇకపై ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించాలని, వచ్చే ఖరీఫ్ నాటికి ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులూ అసంపూర్తి పనుల పూర్తితోపాటు కొత్తగా చేపట్టాల్సిన పనులపై దృష్టిసారించారు. అయితే పనులు చేపట్టాలంటే ముందుగా తమకు రావాల్సిన పరిహారం విషయాన్ని తేల్చాలంటూ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగుతున్నారు. దీంతో గడువులోగా పనుల పూర్తి సంబంధిత అధికారులకు సవాల్‌గా మారింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను స్థానిక మంత్రుల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉదండాపూర్ ప్రాజెక్టు.. జడ్చర్ల మండల పరిధిలో వల్లూరు– ఉదండాపూర్ గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న 15.97 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ పనులు ఆటంకాల మధ్య కొనసాగుతున్నాయి. రిజర్వాయర్ నిర్మాణ పనులకు సంబంధించి 5,107 ఎకరాలను సేకరించాలని గుర్తించారు. సాగునీటి సౌకర్యం కలిగిన భూములకు ఎకరానికి రూ.6.50 లక్షలు, బీడు భూములకు రూ.5.50 లక్షలు ఇవ్వాలని రేటు ఖరారు చేశారు. అందు లో భాగంగా ఉదండాపూర్ నిర్వాసితులకు 900 ఎకరాలకు ఇప్పటి వరకు రూ.65.5 కోట్ల పరిహారం అందజేశారు. మరో 480 ఎకరాలకు ఇం కా సుమారు రూ.18 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉంది. అలాగే వల్లూరు నిర్వాసితులకు సంబంధించి 1,200 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు వంద ఎకరాలకు రూ.73 కోట్ల వరకు పరిహారం అందజేశారు. సకాలంలో అందని డబ్బులు సేకరించిన భూములకు సంబంధించి రైతులకు సకాలంలో పరిహారం డబ్బులు ఇవ్వలేదు. రైతుల ఆందోళనలు, నిరసనల అనంతరం దశల వారీగా పరిహారాన్ని అందించారు. అయితే ఎకరాకు ఇచ్చిన పరిహారానికి బహిరంగ మార్కెట్లో వంద చదరపు గజాల ప్లాటు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇంకా చాలా మంది రైతులకు పరిహారం అందాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ముంపునకు గురయ్యే వల్లూరు, ఉదండాపూర్ గ్రామాలతోపాటు వాటి పరిధిలోని ఒంటిగుడిసె తండా, తుమ్మలకుంట తండా, ర్యాగడిపట్ట తండా, చిన్నగుట్టతండాలకు సంబంధించి ఇంతవరకు పునరావాస చర్యలు చేపట్టలేదు. ఆయా గ్రామాలకు సంబంధించి ఇప్పటి వరకు కొత్తగా నిర్మించే ఇళ్లకు స్థల సేకరణ జరగలేదు. ఇటీవల ఉదండాపూర్ గ్రామానికి ఇళ్ల నిర్మాణాలకు గాను బండమీదిపల్లి గ్రామ శివారులో దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి చదును చేసే పనులు ప్రారంభించారు. వల్లూరుకు సంబంధించి ఇప్పటి వరకు స్థలాన్ని ఖరారు చేయలేదు. కరివెన రిజర్వాయర్ భూత్పూర్ మండలంలో చేపట్టిన ఈ రిజర్వాయర్‌కు సంబంధించి 6,676 ఎకరాలు భూమి సేకరించాల్సి ఉండగా వంద శాతం సేకరించారు. రూ.760 కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఈ పనులు రూ.425 కోట్ల ఖర్చుతో దాదాపు 70 శాతం పూర్తయ్యాయి. అయితే ఈ రిజర్వాయర్ కోసం కొత్తూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బోరోనిగుట్టతండా, కర్వెన గ్రామ పంచాయ తీలోని ఏకులగట్టు తండా, ఎల్కిచర్ల గ్రామ పంచాయతీలోని భట్టుపల్లి తండా ప్రజల వ్యవసాయ భూములతోపాటు ప్రజలు ఇళ్లు కోల్పోయారు. వీరిలో కొందరికి 123 జీఓ ప్రకారం ప్రభుత్వం ఎకరానికి రూ.3.50 లక్షల నుంచి రూ.5.50 లక్షల వరకు అందజేసింది. ఏదుల రిజర్వాయర్ రేవల్లి మండలంలో చేపట్టిన ఈ రిజర్వాయర్‌కు సంబంధించి 5,470 ఎకరాలు సేకరించాల్సి ఉండగా 5,011 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణ వివిధ దశల్లో ఉంది. రూ.664 కోట్ల వ్యయానికి గాను రూ.642 కోట్లు ఖర్చు చేసి 98 శాతం పనులను పూర్తి చేశారు. వట్టెం రిజర్వాయర్ బిజినేపల్లి మండలంలో చేపట్టిన ఈ రిజర్వాయర్‌కు 4,526 ఎకరాలు సేకరించాల్సి ఉండగా దాదాపు 4 వేలు సేకరించారు. రూ.6 వేల కోట్ల వ్యవయానికి గాను రూ.1,800 కోట్లతో 30 శాతం పనులు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి తిమ్మాజిపేట మండలంలోని పోతిరెడ్డిపల్లి, బిజినేపల్లి మండలంలోని కారుకొండతండా, అనెకాన్పల్లి, అనెకాన్పల్లితండా, రాంరెడ్డిపల్లితండా, జీగుట్టతండా వట్టెం గ్రామాల పరిధిలో 4,230 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు 3,370 ఎకరాల భూమి సేకరణ పూర్తి కాగా మరో 860 ఎకరాలు పెండింగ్‌లో ఉంది. పెండింగ్‌లో ఉన్న భూములకు సంబంధించి నిర్వాసితులకు పంటలను బట్టి రూ.3.50 లక్షల నుంచి రూ.5.50 లక్షలకు అందించింది. అయితే కొంతమంది రైతులు మాత్రం మల్లన్న సాగర్‌లో భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చిన పరిహారం ప్రకారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోతున్న వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు, ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ప్రాజెక్టుల సందర్శనకు వచ్చిన కేసీఆర్‌కు సైతం వినతిపత్రం అందజేశారు. నార్లాపూర్ రిజర్వాయర్ కొల్లాపూర్ మండలంలో చేపట్టిన నార్లాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించి మొత్తం 2,465 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,275 ఎకరాలు సేకరించారు. రూ.760 కోట్ల వ్యయానికి గాను రూ.425 కోట్లు ఖర్చు చేసి 60 శాతం పనులు పూర్తిచేశారు. రెండో ప్యాకేజీలో భాగంగా సున్నపుతండా వద్ద డిస్ట్రీబ్యూటరీ గేట్స్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు కాల్వలు తవ్వుతున్నారు. ఈ కాల్వ పనులు కుడికిళ్ల గ్రామ సమీపంలో 1.5 కి.మీ మేరకు నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో 267 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఇక్కడ రైతులు భూములు ఇవ్వడానికి మొదటి నుంచి ఒప్పుకోవడం లేదు. గతంలో కేఎల్ఐ ప్రాజెక్టు కాల్వల్లో తమ భూములు కోల్పోయామని, మిగిలిన భూములను రెండోసారి పాలమూరు ప్రాజెక్టు కోసం లాక్కోవడం తగదని ప్రభుత్వాన్ని కోరుతున్న వీరు మల్లన్నసాగర్ నిర్వాసితుల తరహాలో ఎకరాకు రూ.15 లక్షలు చొప్పున ఇస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఎకరాకు రూ.5.50 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో కుడికిళ్లలో పావు ఎకరం భూమి కూడా ఇప్పుడు తాము కొనుగోలు చేయలేమని, పరిహారం పెంచితేనే భూములు ఇస్తామని రైతులు చెబుతున్నారు. పరిహారంపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే సర్వేకు మా భూముల్లోకి రావాలని రైతులు గతంలో ఆందోళనలు చేపట్టారు. దీంతో రెండు రోజుల క్రితం భారీ పోలీసు బందోబస్తుతో అధికారులు భూ సేకరణ సర్వే పూర్తిచేశారు. -
జూరాలకు పాలమూరు నీళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల కింద సాగునీటి అవసరాలకు నీటి లభ్యత పెంచే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేయనుంది. కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టులకు రెండు సీజన్లలోనూ సాగునీటిని అందించేలా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి వచ్చే నీటితో కోయిల్‌సాగర్, సంగంబండ రిజర్వాయర్లను నింపుతూనే జూరాల వరకు నీటిని తరలించే ప్రణాళిక రచిస్తోంది. దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంజనీర్లు ఆ పనిలో పడ్డారు. ఈ ప్రతిపాదనపై జిల్లాకు చెందిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏడాదంతా నీటి లభ్యత జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, నికర నిల్వ సామర్థ్యం 6.80 టీఎంసీలు మాత్రమే. దీనికింద 1.02 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ప్రాజెక్టుపై ఆధారపడి నెట్టెంపాడు (21.42 టీఎంసీ), భీమా (20 టీఎంసీ), కోయిల్ సాగర్ (3.9 టీఎంసీ) ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. అన్ని ప్రాజెక్టుల కింద కలిపి 5.50 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. జూరాలకు వరద ఉండే రోజు ల్లోనే నీటిని ఎత్తిపోసే వీలుంది. దీనికి తోడు వరద నీటికి ఎగువ నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడాల్సి ఉంటోంది. ఒక సీజన్లో మాత్రమే జూరాలలో నీటి లభ్యత ఉంటుండగా, రెండో సీజన్‌కి కనీసం తాగునీటి అవసరాలు తీర్చే పరిస్థితి లేదు. దీంతో జూరాలకు నీటి లభ్యతను పెంచేందుకు వీలుగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కర్వెన రిజర్వాయర్‌కు తరలించే నీటిని జూరాలకు తరలించాలని సీఎం ఇటీవల ఇంజనీర్లను ఆదేశించారు. కర్వెన రిజర్వాయర్ నుంచి ప్రత్యేక కెనాల్స్‌ను ఏర్పాటు చేసి నీటిని నారాయణపేట్ నియోజకవర్గానికి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నారాయణపేట వరకు ఏర్పాటు చేసిన కెనాల్ ద్వారా కోయిలకొండ మండల సమీపంలో ఉన్న పెద్దవాగు నుంచి కోయిల్‌సాగర్‌ను నింపా లని ప్రతిపాదించారు. నారాయణపేట జాయమ్మ చెరువు నుంచి ఉట్కూర్ మీదుగా సంగంబండ రిజర్వాయర్ వరకు పాలమూరు ఎత్తిపోతల పథకం జలాలు తరలించి, అటు నుంచి జూరాలకు నీటిని తరలించాలన్నది ప్రస్తుత ప్రతిపాదనగా ఉంది. ఈ ప్రతిపాదనలపై ఇంజనీర్లు కసరత్తు మొదలు పెట్టారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే జూరాలకు ఏడాదంతా నీటి లభ్యత ఉండనుంది. అనుసంధానంపై మంత్రుల సమీక్ష పూర్వ పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, పాలమూరు–రంగారెడ్డి నీళ్లు జూరాలకు తరలింపు, కొత్త ఎత్తిపోతల పథకాలపై శనివారం మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు హరితప్లాజాలో ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, మర్రి జనార్ధన్ రెడ్డి, అంజయ్య యాదవ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అబ్రహం, ఈఎన్సీ మురళీధర్, సీఈలు ఖగేందర్, రమేశ్ హాజరయ్యారు. ఈ సందర్భం గా గత వేసవిలో జూరాల కింద తాగునీటి అవసరాలకు కర్ణాటకలోని నారాయణపూర్ నుంచి నీటిని తీసుకో వాల్సి వచ్చిందని, భవిష్యత్తులో ఆ పరిస్థితి రాకుండా కర్వెన రిజర్వాయర్ నుండి సంగంబండ, సంగంబండ నుండి జూరాల రిజర్వాయర్‌కు నీటిని నింపేలా ప్రతిపాదనలు వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని నిర్ణయించారు. -
ఏడాదిలోగా పాలమూరు– రంగారెడ్డి
సాక్షి, నాగర్‌కర్నూల్/ వనపర్తి: వచ్చే వర్షాకాలం నాటికి పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పారు. గురువారం పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల పరిశీలనకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. కర్వెన, వట్టెం, నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల పరిశీలన అనంతరం ఏదుల రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. ప్రగతి నిరోధకులు కేసులు వేయడం వల్లనే ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని వెల్లడించారు. జూరాల నుంచి పాలమూరు ఎత్తిపోతలకు కృష్ణాజలాలను తీసుకోవాలంటూ.. ఈ జిల్లాకు చెందిన వారే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో జూరాల ద్వారానే సాగునీటితోపాటు మిషన్ భగీరథ తాగునీరు అందిస్తున్నామని, చిన్న ప్రాజెక్టు అయిన జూరాల నుంచి పాలమూరు ఎత్తిపోతలకు జలాలను ఎత్తిపోస్తే.. సామర్థ్యం సరిపోదనే కనీస అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికే జూరాల నుంచి అన్ని రిజర్వాయర్లకు, ప్రాజెక్టులకు, తాగునీటి కోసం దాదాపు 71.1 టీఎంసీల నీటిని వాడుకుంటున్నామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యం 200 టీఎంసీలపైగా ఉంటుంది కాబట్టి.. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి ముందుచూపుతో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అనుసంధానం చేశామన్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ తదితర ప్రాజెక్టుల ద్వారా 11.20 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు, ఎత్తిపోతల ద్వారా గొలుసుకట్టు చెరువులను నింపేందుకు రూ.4 వేల కోట్లు విడుదల చేశామన్నారు. ప్రతి ఏటా ఉమ్మడి జిల్లాలో వెయ్యి నుంచి 1,500 చెరువులను కృష్ణాజలాలతో నింపుతున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులతోపాటు పాలమూరు ప్రాజెక్టు పనులు పూర్తయితే వచ్చే ఖరీఫ్ నాటికి నీరందించేందుకు తొల విడతగా.. కర్వెన, ఉద్దండాపూర్‌తో వికారాబాద్ జిల్లాకు సాగునీరు ఇస్తామన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు ఎలాంటి నిధుల కొరత లేదని రూ.10 వేల కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకున్నామని, వచ్చే ఏడాది బడ్జెట్లో కూడా నిధులు కేటాయించి పూర్తి చేస్తామన్నారు. మూడు షిఫ్టుల్లో పనులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 15 నుంచి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను కాళేశ్వరం తరహాలో మూడు షిఫ్టుల్లో నిరంతరాయంగా చేపట్టి ఏడాదిలోగా పూర్తిచేస్తామని సీఎం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేపట్టినప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా అని ప్రతిపక్షాలు హేళన చేస్తూ మాట్లాడయని, కాళేశ్వరం పూర్తయిన తర్వాత ఇదో అద్భుతమంటూ ప్రపంచమే ప్రశంసలు కురిపించిందని కేసీఆర్ గుర్తుచేశారు. వందకు వందశాతం పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు అందించి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. హైదరాబాద్‌లో విలువైన భూములను కూడా అమ్మకానికి పెట్టామని.. వచ్చిన డబ్బులను పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తామని చెప్పారు. ఇకపై పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతాయని, ప్రతి పదిహేను రోజులుకు ఒకసారి పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను తాను స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం చెప్పారు. ప్రాజెక్టు పరిశీలనలో సీఎం వెంట వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు రాములు, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అబ్రహం, పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జూరాలకు ఏడాదంతా నీళ్లు!
సాక్షి, గద్వాల: గోదావరి నదీ జలాలను సంగంబండ ద్వారా జూరాల జలాశయానికి అందించాలని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఏడాదంతా నీటినిల్వ ఉండే అవకాశం ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురిసి, అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండిన తర్వాత రాష్ట్రంలోకి కృష్ణానది వరద వస్తేనే జూరాల ప్రాజెక్టుకు జలకళ వచ్చే పరిస్థితులు ఇన్నాళ్లు ఉండగా.. ఇప్పుడు ఆ పరిస్థితులు మారబోతున్నాయి. ప్రియదర్శిని జూరా ల ప్రాజెక్టు జలాశయంపై ప్రాజెక్టు ఆయకట్టుతోపాటు, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, గట్టు ఎత్తిపోతల పథకాలకు 64 టీఎంసీల నీళ్లు ఏటా అవసరం ఉంది. జూరాల ప్రాజెక్టు జలాశయంలో నీటి నిల్వ 9.66 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. ఖరీఫ్‌లో ఎగువ నుంచి వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా ఆయకట్టుకు నీటిని అందిస్తున్నారు. రైతులకు తీరనున్న నీటి కష్టాలు ఇదిలాఉండగా, కర్ణాటక నుంచి వరద రాకుంటే ఇక్కడి రైతులు తమ పంటకు విరామం ప్రకటించుకోవాల్సింది. జూరాల జలాశయంపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలకు నీటిని అందించే అవకాశం ఉండదు. గత ఏడాది జూరాలకు ఎగువ నుంచి నీటి లభ్యత లేకపోవడంతో ఒకే పంటకు పరిమితమయ్యారు. వేసవిలో తాగు నీటి అవసరాలకు ఆదుకోవాలని కర్ణాటకను కోరారు. కర్ణాటక ప్రభుత్వం స్పందించి 2 టీఎంసీల నీటిని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసినా ఆ రాష్ట్రం దాటి జూరాలకు చేరింది కేవలం 0.75 టీఎంసీలు మాత్రమే. గత నాలుగు ఏళ్లుగా కర్ణాటకను తాగునీటి కోసం, పంటలను చివరి దశలో కాపాడడం కోసం వేడుకుంటేనే ఉన్నాం. సీఎం నిర్ణయంతో ఇక రైతుల నీటి కష్టాలు తీరనున్నాయి. గట్టు సామర్థ్యం పెంపునకు నిర్ణయం రైతుల పంట పొలాలు, తాగునీటి ఇక్కట్లకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే గట్టు ఎత్తిపోతల జలాశయాన్ని 15 టీఎంసీల సామర్థ్యంకు పెంచాలని సీఎం కేసీఆర్ గత ఏడాది జూన్‌లో నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. అందుకు అనుగుణంగా సర్వే పూర్తయింది. వచ్చే నెలలో పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. కృష్ణానదికి వరద రాని కాలంలోనూ జూరాలకు గోదావరి నదీ జలాలను అందించాలని సంకల్పించామని సీఎం ప్రకటించడంతో జూరాలకు ఏడాంత నీటి లభ్యత ఉండే కాలం రాబోతుంది. గోదావరి నది నీటిని శ్రీశైలం జలాశయంకు మళ్లిస్తారు. శ్రీశైలం జలాశయం నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సంగంబండ జలాశయానికి నీటిని అందిస్తారు. సంగంబండ నుంచి జూరాల జలాశయంకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. గ్రావిటీ ఫ్లో ద్వారానే సంగంబండ నుంచి జూరాల జలాశయంకు నీటిని విడుదల చేసేలా లెవెల్స్ ఉన్నాయి. గోదావరి నదిలో నీటి లభ్యత పుష్కలంగా ఉన్నందున కృష్ణానదికి వరద రానప్పుడు ఆదుకోవడం, వేసవిలో జూరాల అవసరాలకు కర్ణాటకను వేడుకునే పరిస్థితి శాశ్వత పరిష్కారం ఇవ్వనున్నారు. జూరాల ప్రాజెక్టుతో పాటు, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల పరిధిలోని 6.11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయకట్టు పరిధిలోని రైతులు ఏటా నీళ్లు వస్తాయో లేదో అనే సంశయాన్ని వీడి పంటల సాగుకు సిద్దమయ్యే రోజులు రానున్నాయి. -
రైతుల కోసం ఎంతైనా వెచ్చిస్తాం!
సాక్షి , మహబూబ్‌నగర్ : వచ్చే ఖరీఫ్ నాటికి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులన్నింటినీ పూర్తి చేయడంతో పాటు భవిష్యత్‌లో ఈ నీటిని సంగంబండకు సరఫరా చేసి అక్కడ్నుంచి జూరాలకు తరలించే ఆలోచనతో ఉన్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ఎత్తిపోతల పథకంలో కీలకమైన కరివెన రిజర్వాయర్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలకు ఆయన ఆదేశించారు. ప్రస్తుతం నడుస్తున్న పనులను మూడు షిఫ్టులకు పెంచి నిరంతరాయంగా పనులు కొనసాగించాలన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో వాడుకునేలా రెండు నదులను అనుసంధానం చేస్తామని, దీనిద్వారా మహబూబ్‌నగర్‌తో పాటు వికారాబాద్, నల్లగొండ (పాక్షికం) జిల్లాకు తాగు, సాగు నీటితో పాటు హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి సుముఖంగా ఉన్నారని చెప్పిన కేసీఆర్ త్వరలోనే చర్చలు జరిపి జలాల వినియోగంపై ఓ ఒప్పందానికి వస్తామన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనలో భాగంగా సీఎం కేసీఆర్ గురువారం పాలమూరు, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఆయా జిల్లాల్లో కొనసాగుతున్న కరివెన, నార్లాపూర్, వట్టెం, ఏదుల రిజర్వాయర్ల పనులను పరిశీలించారు. ఏదుల రిజర్వాయర్ వద్ద మీడియాతో మాట్లాడారు. గత పాలకుల అసమర్థత, వివక్ష కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టు పనులు ఆగిపోయి తాగు, సాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ‘కొంతమంది చవటలు జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు తీసుకురావాలని చెబుతున్నరు. అసలు వాళ్లకు ప్రాజెక్టులపై అవగాహన లేదు. జూరాల 6 టీఎంసీల ప్రాజెక్టు.. దాని కింద ఉన్న నెట్టెంపాడు, జూరాల సొంత ఆయకట్టు, భీమా, గట్టు, కోయిల్‌సాగర్ కింద సుమారు 4లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించడంతో పాటు మిషన్ భగీరథ కోసం 3.37 టీఎంసీల నీళ్లు అవసరముంటది. ఇందుకోసం 71.1% నీటిని వాడుకుంటున్నం. జూరాలలో నీళ్లు లేకపోతే ఆయా ప్రాజెక్టుల ఆయకట్టుకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చలేని పరిస్థితి. ఇప్పుడే జూరాలకు నీరు రాక ప్రతి ఏటా కర్ణాటకను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లు ఎక్కడొస్తయ్? అందుకే శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను పాలమూరు–రంగారెడ్డికి వాడుకుంటున్నం’ అని సీఎం అన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలో 15–20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చి పాలమూరును సస్యశ్యామలం చేస్తామన్నారు. ఎన్నో శక్తులు తమను అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. ఆ ఆటంకాలను ఎదుర్కొని కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసుకున్నామని.. అదే స్ఫూర్తితో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు సాధించింది శూన్యమే ! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లాభం కలిగించే గోదావరి, కృష్ణా జలాల అనుసంధానం విషయంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సంకుచితంగా ఏదేదో మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ‘గతంలో బాబ్లీ విషయంలోనూ ఇలాంటి గొడవే. సాధించింది గుండు సున్నా. ఎక్కడ ప్రాజెక్టు అన్నా.. బస్తీమే సవాల్ అనడం.. కోర్టుకెళ్లడం.. హంగామా చేయడం తప్ప సాధించిందేం లేదు. అదే మేం అధికారంలో వచ్చిన తర్వాత మహారాష్ట్రకు పొయి బాబ్లీ విషయంలో అగ్రిమెంట్ చేసుకుంటే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. బ్రహ్మాండంగా 570 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఏర్పడింది. చంద్రబాబు లేదా ఆయనలాగా ఆలోచించేవారికి ఇప్పుడు ఒక్కటే చెబుతున్న రేపు కృష్ణా, గోదావరి జలాల అనుసంధానం విషయంలో నీటి వినియోగంపై పూర్తిస్థాయిలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పందానికి వచ్చిన తర్వాతే పనులు ప్రారంభిస్తాం’అని కేసీఆర్ స్పష్టంచేశారు. పనులపై అసంతృప్తి ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని 4రిజర్వాయర్ల వద్ద జరుగుతున్న పనులను సీఎం పరిశీలించారు. ఇప్పటి వరకు జరగాల్సిన పనులెంత? అయిన పనులెన్ని? పనుల జాప్యానికి కారణాలంటేని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆశించిన మేరకు పనులు జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై మూడు షిఫ్టుల్లో పనులు పూర్తిగా చేపట్టి.. వచ్చే ఖరీఫ్ నాటికి నీరందించాలన్నారు. కరివెన ప్రాజెక్టు పనులపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చెప్పండి? చేతకాకపోతే పక్కకు తప్పుకోండి. పనులు చేసేందుకు చాలా మంది క్యూలో ఉన్నారు’అని అసహనం వ్యక్తంచేశారు. వచ్చే 4నెలల్లో కరివెన పనులు పూర్తి కావాలని కాంట్రాక్టర్‌తో పాటు సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఏదుల రిజర్వాయర్ పరిశీలించిన అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.10వేల కోట్ల రుణం మంజూరైందన్నారు. నిధులకొరత లేనందున.. ఎప్పుడేం కావాలన్నా చెప్పాలని.. ఉదయం ఇండెంట్ పెడితే సాయంత్రాని కల్లా బిల్లులు మంజూరు చేస్తామని అన్నారు. ‘మీరు బిల్లులకు ఆందోళన చెందాల్సిన పనిలేదు. పొద్దున బిల్లులు పెడితే సాయంత్రానికి క్లియర్‌చేసే బాధ్యత నాది. వర్క్ ఫోర్స్ పెంచుకోండి. పని షిఫ్ట్‌లు పెంచుకోండి. అధికారులు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. నాలుగున్నర నెలల టార్గెట్ పెట్టుకొని.. అంతకు ముందే పని పూర్తిచేయండి’అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే ఇకపై పదిహేను రోజులకోసారి సమీక్ష నిర్వహిస్తానన్నారు. పనుల పర్యవేక్షణలో అలసత్వం ప్రదర్శించే ఇంజనీర్లపై చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే కాంట్రాక్టర్ల టెండర్లను రద్దు చేసి ఇతరులకు పని కల్పించాలన్నారు. వారంలో వట్టెం పూర్తవ్వాలి 16.7 టీఎంసీ సామర్థ్యంతో నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్ పనులను వారం రోజుల్లో మూడు షిఫ్టుల్లో పూర్తి చేయాలని పనులు దక్కించుకున్న మూడు నిర్మాణ సంస్థలకు సీఎం ఆదేశించారు. ఇందుకు అవసరమైన కార్మికులను రప్పించుకోవాలని కోరారు. రివిట్మెంట్ పనులను వచ్చే మార్చిలోపే పూర్తిచేయాలని ఆదేశించారు. రిజర్వాయర్, పంప్ హౌస్ పనులను సమాంతరంగా పూర్తిచేయాలన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం రిజర్వాయర్ పనులను ఏరియల్‌వ్యూ ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం పనులకు సంబంధించి తక్షణమే రూ.200 కోట్ల నిధులు విడుదల చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో పనులు ఆగొద్దని స్పష్టం చేశారు. ఇప్పటికే 100% నిర్మాణం పూర్తి చేసుకున్న ఏదుల రిజర్వాయర్‌లో ఇతర మార్గాల ద్వారా నీటిని తెచ్చి నింపుకోవాలని, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని నింపే అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నీటిని ఎత్తిపోసేందుకు కాళేశ్వరం మాదిరి ఇక్కడ కూడా బాహుబలి పంపు మోటార్లను వినియోగించనున్నారు. వాటిని బయటనుంచి కాకుండా వీలైనంతవరకు బీహెచ్ఈఎల్ కంపెనీ ద్వారానే కొనుగోలు చేయాలి అని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి మెగా కృష్ణారెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు. రైతుల కోసం ఎంతైనా వెచ్చిస్తాం! సమైక్య పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డ తెలంగాణ రైతుల కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తానని సీఎం స్పష్టంచేశారు. ‘ప్రస్తుతం ప్రతి రైతు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నడు. రైతు ఆర్థికంగా బలపడాలంటే మరో ఎనిమిదేళ్లు కూడా పట్టొచ్చు. తర్వాత ప్రతి రైతు బ్యాంకుఖాతాలో సొంతగా నగదు జమ కావాలి. అప్పటి వరకు కచ్చితంగా ఉచిత కరెంటందిస్తాం. అందుకోసం రూ.15వేల కోట్లయినా ఖర్చు చేస్తాం. ఇప్పటికే నీటి తీరువా రద్దు చేశాం. ఇది మా పాలసీ.. మా పార్టీ సిద్ధాంతం.. ప్రభుత్వ సిద్ధాంతం’అని సీఎం అన్నారు. ఇకపై సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పాలమూరు–రంగారెడ్డి పనుల పురోగతిపై ప్రతి 10రోజులకోసారి వచ్చి సమీక్ష జరుపుతారని సీఎం తెలిపారు. ఉమ్మడి పాలమూరు–రంగారెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీలు చర్చించి తమ అభిప్రాయాలను ఆమెకు తెలియచేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పార్లమెంటు సభ్యులు పి.రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అబ్రహం, పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు శ్వేతామహంతి, శ్రీధర్, రొనాల్డ్‌రోస్, ఈఎన్సీ మురళీధర్, సీఈ రమేష్, మెగా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మిషన్ భగీరథ పనుల పురోగతిపై సంబంధిత ఈఎన్సీ కృపాకర్ రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. అతి త్వరలో ట్యాంకుల నిర్మాణం, అంతర్గత పైపుల నిర్మాణం సంపూర్ణంగా పూర్తిచేసి తాగునీటిని అందించాలని ఆదేశించారు. -
బాబ్లీ గొడవతో చంద్రబాబు ఏం సాధించారు?
-
కరివెన రిజర్వాయర్ పరిశీలించిన సీఎం కేసీఆర్
సాక్షి, మహబూబ్‌నగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు గురువారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథక పనులను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. కరివెన రిజర్వాయర్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన ఆయన ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక ప్రాజెక్టు పరిధిలో ప్యాకేజీల వారీగా పనుల పురోగతి.. అడ్డంకులు.. సమస్యలను తెలుసుకునేందుకు ఆయన రోజంతా ఉమ్మడి జిల్లాలో గడపనున్నారు. సర్కిల్–1 పరిధిలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల వద్ద పనులను ఆయన పర్యవేక్షిస్తారు. సీఎం కేసీఆర్ సాయంత్రం వరకు సుమారు ఎనిమిది గంటల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. కాగా వచ్చే ఖరీఫ్ నాటికి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి జిల్లా పరిధిలోని పది లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. అలాగే వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుల వద్ద క్యాంప్ కార్యాలయంలో మధ్యాహ్నం 2గంటల నుంచి 5:30గంటల వరకు సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటి వరకు విడుదలైన నిధులు.. అయిన ఖర్చు, బిల్లుల పెండింగ్ అంశాలను సమీక్షలో చర్చకొచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల అధికారులందరూ సమగ్ర నివేదికలు సిద్ధం చేసుకున్నారు. -
పాలమూరు...పరుగులే
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇక పై పరుగులు పెట్టనున్నాయి. గత రెండున్నరేళ్లుగా ఆటుపోట్లను ఎదుర్కొన్న ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇప్పటికే పలుమార్లు ఇంజనీర్లతో సమీక్షలు జరిపిన ఆయన.. గురువారం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనున్నారు. ఉదయం 9 గంటలకు హెలికాప్టర్లో కరివెన ప్రాజెక్టు వద్దకు చేరుకుని కరివెన, వట్టెం, నార్లాపూర్, ఏదులలో జరుగుతున్న పనులను పరిశీలిస్తారు. వచ్చే ఖరీఫ్ నాటికి కృష్ణా జలాల్లోంచి ఒక టీఎంసీ నీటిని తీసుకుంటూ కనిష్టంగా 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా పనులు చేపట్టడంపై అధికార్లు, ఇంజనీర్లకు మార్గదర్శనం చేయనున్నారు. రుణాలతోనే పాలమూరు పనులు.. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరం దించేలా రూ.35,200 కోట్ల అంచనాతో పాలమూ రు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. నిధుల కొరత, భూసేకరణలో జాప్యం కారణంగా పనులు ముందుకు కదల్లేదు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉద్దండాపూర్, కరివెన రిజర్వాయర్ల పరిధిలోని పనులు చేపట్టినా.. పంప్‌హౌస్‌ల పనులు మాత్రం మొదలు కాలేదు. ఇప్పటివరకు ప్రాజెక్టు పరిధిలో నిర్మాణ, భూసేకరణ పనుల కోసం రూ.5,880 కోట్ల మేర నిధులు ఖర్చు చేశారు. ఒక టీఎంసీ నీటిని అందించాలన్నా కనిష్టంగా రూ.12 వేల కోట్ల మేర నిధులు అవసరం ఉంటుందని గుర్తించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే పాలమూరు–రంగారెడ్డికి రూ.10వేల కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే.. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలు దేరి 10:15 గంటలకు కరివెన చేరుకుంటారు. 10: 45 గంటలకు వట్టెం, 11:20 గంటలకు నార్లాపూర్, 12:10 ఏదులకు వెళ్లి అక్కడ ప్రాజెక్టు నిర్మాణంపై సమీక్ష చేపడతారు. సాయంత్రం 5:30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. నార్లాపూర్‌పై నేడు స్పష్టత పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో మొదటిదైన నార్లాపూర్ రిజర్వాయర్‌పై సీఎం పర్యటన సందర్భంగా స్పష్టత రానుంది. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ డ్యాంలో నిర్మించిన రాక్‌ఫిల్ డ్యాం తరహా నిర్మాణాన్నే నార్లాపూర్‌లోనూ చేపట్టాలని గతంలో నిర్ణయించారు. నార్లాపూర్ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర మట్టి కొరతను అధిగమించేందుకు ఈ తరహా నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ తరహా నిర్మాణాలు గతంలో ఎన్నడూ లేకపోవడం, ఇంజనీర్లకు అనుభవం కూడా లేని దృష్ట్యా ఈ ప్రతిపాదనను పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నారు. మట్టికట్ట ద్వారానే నిర్మాణం చేపట్టిన పక్షంలో కట్ట పొడవును పెంచి ఎత్తును తగ్గించాలన్నది ఇంజనీర్ల అభిప్రాయం. అదే జరిగితే నార్లాపూర్ రిజర్వాయర్ సామర్థ్యం 8.6 టీఎంసీల నుంచి 6.5 టీఎంసీలకు తగ్గనుంది. రాక్‌ఫిల్ డ్యాం తరహా నిర్మాణం చేపడతారా లేక మట్టికట్ట వైపే మొగ్గు చూపుతారా అన్నది గురువారం సీఎం పర్యటనలో తేలనుంది. -
అడవిలో ఉండటం వల్లే కొంత ఆలస్యం : మంత్రి
సాక్షి, నాగర్‌కర్నూల్ : త్వరలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం క్షేత్రస్థాయి పరిశీలనకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా శరవేగంగా ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం పూర్తితో కేసీఆర్‌పై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందన్నారు. రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోయాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశమన్నారు. అడవిలో ఉండడంతో నార్లాపూర్ పంపు హౌస్ పనులు కొంత ఆలస్యంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీరందించడం కేసీఆర్ లక్ష్యమని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా మొత్తం సస్యశ్యామలమవుతుందని భరోసా వ్యక్తం చేశారు. -
వచ్చే ఖరీఫ్‌కు ‘పాలమూరు’
సాక్షి, హైదరాబాద్ : పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పాక్షికంగా అందుబాటులోకి తెచ్చేలా నిర్మాణ పనులు సాగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కనిష్టంగా ఒక టీఎంసీ నీటిని తరలించేలా పంప్‌హౌస్, టన్నెల్, కాల్వల పనులు పూర్తి చేయాలని సూచించారు. దీని ద్వారా వచ్చే ఏడాది ఖరీఫ్‌లోనే 7 లక్షల ఎకరాలకు నీరందించాలని స్పష్టం చేశారు. శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పై నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, సీఈ రమేశ్, ఇతర అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ప్రాజెక్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) ద్వారా అందనున్న రుణాలు, వాటి వినియోగం, వచ్చే ఏడాది ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరు, దానికి తగ్గట్లు నిర్మాణ పనులు తదితర అంశాలపై ఆయన చర్చించారు. మొత్తం 12.3 లక్షల ఎకరాలకు.. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 6 జిల్లాల్లోని 70 మండలాల పరిధిలో 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. ఇందుకు 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని తీసుకోవాలని నిర్ణయించగా, ఇందులో 30 టీఎంసీలు డిండికి కేటాయించగా, 90 టీఎంసీలు పాలమూరు–రంగారెడ్డికి కేటాయించారు. ఈ మొత్తం ఆయకట్టులో వచ్చే ఏడాది ఖరీఫ్‌లో నాగర్‌కర్నూల్ జిల్లాలోని 8 మండలాల పరిధిలో 1.03 లక్షలు, నారాయణపేట 9 మండలాల పరిధిలో 1.6 లక్షలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 13 మండలాల పరిధిలో 2.35 లక్షలు, రంగారెడ్డి జిల్లాలోని మొత్తం 3.6 లక్షల ఎకరాల ఆయకట్టులో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ఇంజనీర్లను సీఎం ఆదేశించారు. ఈ ఆయకట్టుకు నీరందిచేలా శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి రోజుకు ఒక టీఎంసీ నీటిని వరద ఉండే 60 రోజుల్లో తీసుకునేలా నిర్మాణ పనులు చేయాలని సూచించారు. ప్రాజెక్టులోని ప్రధానమైన నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉద్ధండాపూర్ పంప్‌హౌస్‌లలో 145 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్లను అమర్చాల్సి ఉండగా, ఇందులో తొలిదశలో 4 చొప్పున మోటార్లను వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సిద్ధం చేయాలని, 2021 మార్చి–ఏప్రిల్ నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిసింది. నిధుల కొరత లేకుండా చూస్తా.. ప్రాజెక్టుకు సంబంధించి సివిల్ పనులు మాత్రం పూర్తిగా చేయాలని తెలిపినట్లుగా సమాచారం. నిర్మాణ పనుల పూర్తికి సంబంధించిన టైమ్ షెడ్యూల్‌ను సైతం ఈ సమావేశంలో ఖరారు చేశారు. ఇక వీటికి అనుగుణంగా జంట టన్నెల్ నిర్మాణాలు ఉన్న చోట కనీసం ఒక టన్నెల్ నిర్మాణ పనులైనా పూర్తి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణాల పూర్తికి వీలుగా పీఎఫ్సీ ద్వారా రూ.10 వేల కోట్ల రుణాల ఒప్పంద ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ రుణాలను వినియోగిస్తూ పంప్‌హౌస్‌ల నిర్మాణాలను పూర్తి చేయాలని, మిగతా వాటికి ప్రభుత్వపరంగా నిధుల కొరత లేకుండా చూస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే వారం పాలమూరు ప్రాజెక్టు పరిధిలో పర్యటిస్తానని చెప్పినట్లు నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి. నార్లాపూర్‌లో రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణం చేయాలన్న గత ప్రతిపాదనను పక్కన పెట్టారని, ఇక్కడి రిజర్వాయర్ సామర్థ్యాన్ని సైతం 8.5 టీఎంసీల నుంచి 6.5 టీఎంసీలకు తగ్గిస్తూ నిర్ణయించినట్లు సమాచారం. కాళేశ్వరం మాదిరి వేగంగా..: సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేసి, వచ్చే వర్షాకాలంలో పంట పొలాలకు నీరందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులపై సమీక్షించిన సీఎం.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా పాలమూరు జిల్లాలోని సగం వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. మిగతా సగానికి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీరివ్వాలని సీఎం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే రేయింబవళ్లు, మూడు షిఫ్టుల్లో పనిచేసి ప్రాజెక్టు పూర్తి చేసి.. వచ్చే వర్షాకాలంలో సాగునీరు అందించాలని ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు, పంపు హౌస్‌లు, కాల్వల పనులు సమాంతరంగా చేపట్టాలని చెప్పారు. సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర పర్యటన జరిపి, పనుల్లో వేగం పెంచాలని సూచించారు. -
త్వరలో పాలమూరుకు సీఎం
సాక్షి, మహబూబ్‌నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల బాట పట్టనున్నారు. ఉమ్మడి పాలమూరులో కొనసాగుతున్న ప్రాజెక్టులు..ఎత్తిపోతల పథకాల పురోగతిని తెలుసుకునేందుకు త్వరలోనే ఆయన మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పర్యటించనున్నారు. పాలమూరులో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జిల్లా కలెక్టర్ల సదస్సు తర్వాత సీఎం పర్యటన పాలమూరులోనే ఉంటుందనే చర్చ రాజకీయ.. అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులందరూ అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగానే ఈ నెల 19న మంత్రి శ్రీనివాస్ గౌడ్ జడ్చర్ల, నారాయణపేట, దేవరకద్ర, కొడంగల్, షాద్‌నగర్ ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో పాలమూరు–రంగారెడ్డి పథకం పనులు వేగవంతానికి కార్యాచరణ, మిగులు ఆయకట్టుకు నీరు అందించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. మరో రెండురోజుల్లో సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశాలున్నందున అధికారులూ ప్రాజెక్టుల పురోగతిపై నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదీలా ఉంటే కేసీఆర్ కరివెనతో పాటు గట్టు ఎత్తిపోతల పథక పనులను పరిశీలిస్తారని విశ్వసనీయ సమాచారం. ఇదే క్రమంలో సీఎం గట్టు మండలం మొసలిదొడ్డిలో మొక్కలు నాటే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుంది.. కానీ ఎప్పుడు వస్తారు..? ఏ ప్రాంతంలో పర్యటిస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు’ అని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. పాలమూరు–రంగారెడ్డిపై ప్రత్యేక దృష్టి.. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో 12.30లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేలా ప్రభుత్వం రూ.35,200 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.10వేల కోట్ల రుణం మంజూరు అయిన విషయం తెలిసిందే. దీంతో నిధుల సమస్యతో నత్తనడకన సాగుతున్న పనులు పరుగులు పెట్టే విధంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇటు సీఎం కేసీఆర్ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పూర్తితో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి.. పనుల ప్రగతిపై దిశానిర్దేశం చేశారు. ఈ పథకం పనుల్లో జాప్యంపై చర్చించారు. భూసేకరణ సమస్యను పరిష్కరించడంతో పాటు నిర్వాసితులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ పథకంలో భాగమైన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించి రూ.8,184కోట్ల మేరకు పనులు జరగాల్సిన ఉండగా నిధుల సమస్యతో ఇప్పటివరకు రూ. 3,272కోట్ల పనులు జరిగాయి. వీటితో పాటు కాలువల నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. దీంతో పాటు 35వేల ఎకరాలకు సాగునీరందిచేలా అప్‌గ్రేడ్ అయిన గట్టు ఎత్తిపోతల పథకానికి సుమారు రూ.2వేల కోట్లు అవసరమున్నాయని అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇటు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం స్టేజ్–2 పరిధిలో తనగల, జూలకల్, రామాపురం గ్రామాల్లో జలాశయాల నిర్మాణాలకు రూ.300కోట్లు అవసరమున్నట్లు అధికారులు నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం. -
పరిహారం ఇచ్చి కదలండి..
సాక్షి, జడ్చర్ల : తమకు ఇప్పటి వరకు పరిహారం డబ్బులు ఇవ్వలేదని, పునరావాసం కల్పించలేదని ఇలాంటి పరిస్థితుల్లో పనులు ఎలా ప్రారంభిస్తారంటూ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భాగంగా ఉదండాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను గురువారం వల్లూరు గ్రామస్తులు అడ్డుకున్నారు. కాళేశ్వరం పూర్తికావటంతో పెద్ద ఎత్తున యంత్రాలను ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు చేసేందుకు తరలించారు. రిజర్వాయర్‌లో ఇప్పటికే నవాబుపేట మండలం ఖానాపూర్‌లో పనులు పూర్తికావస్తుండగా వల్లూరు, ఉదండాపూర్‌లో మాత్రం ప్రారంభించలేదు. ఇదిలాఉండగా పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టరు ప్రయత్నించగా వల్లూరు గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పనులు ప్రారంభించే ప్రాంతానికి చేరుకోవటంతో పోలీసులు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి సైతం అక్కడికి చేరుకొని గ్రామస్తులతో ఆయన చర్చలు జరిపారు. శంకరాయపల్లి వద్ద ఇంటి నిర్మాణాలు చేయాలి తమకు పునరావాసం కింద శంకరాయపల్లి వద్ద ఇండ్ల నిర్మాణానికి స్థలం కేటాయించాలని గ్రామస్తులు కోరారు. బండమీదిపల్లి శివారులో స్థలాన్ని ఖరారు చేశామని తహసీల్దార్ వారికి తెలియజేయగా తమకు సమాచారం లేకుండా, అంగీకరించకుండా ఎలా నిర్ణయిస్తారని వారు ప్రశ్నించారు. తమకు శంకరాయపల్లి వద్దే స్థలం కావాలని గ్రామస్తులు కోరారు. శంకరాయపల్లి వద్ద కేటాయించిన స్థలంకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ వేశామని తహసీల్దార్ గుర్తుచేశారు. పరిహారం డబ్బులు సైతం ఇంకా రాలేదని కొందరు రైతులు వివరించారు. నిర్వాసితులకు సరైన న్యాయం చేయాలి: బీజేపీ ఉదండాపూర్ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు సరైన న్యాయం చేయాలని బీజేపి నాయకుడు పాలాది రాంమోహన్ డిమాండ్ చేశారు. వల్లూరు వాసుల ఆందోళనకు బీజేపి గురువారం మద్దతునిచ్చింది. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డితోనూ రాంమోహన్ మాట్లాడుతూ.. గ్రామస్తులు అడిగిన చోట ఇంటి నిర్మాణాలు చేయాలని, పరిహారం అందరికి వెంటనే ఇవ్వాలన్నారు. రైతులు, గ్రామస్తుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తాము అండగా ఉంటామని ప్రకటించారు. -
లక్ష్మి.. సరస్వతి.. పార్వతి..
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరంలో ప్రాజెక్టులో ప్రధాన బ్యారేజీలకు అమ్మవార్ల పేర్లతో నామకరణం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ప్రాజెక్టు మొదటి దశలోని మొదటిదైన మేడిగడ్డకు లక్ష్మి, అన్నారానికి సరస్వతి, సుందిళ్లకు పార్వతి పేర్లను పెట్టాలనే నిశ్చయానికి వచ్చారు. దీంతోపాటే రెండో దశలో ఉన్న నంది మేడారం పంప్‌హౌస్‌కు నంది పేరును సీఎం ప్రతిపాదించగా రామడుగులోని లక్ష్మీపూర్‌కు మంచి పేరు చెప్పాలని ఇంజనీర్లకు సూచించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి గురువారం పాలమూరు ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగానే ఇంజనీర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లోని రిజర్వాయర్లకు స్థానిక ప్రజల కోరిక మేరకు ఆయా ప్రాంతాల ప్రముఖ దేవాలయాలు, దేవుళ్ల పేర్లతో నామకరణం చేశారు. అంజనగిరి, వీరాంజనేయ, కురుమూర్తిరాయ పేర్లను రిజర్వాయర్లకు పెట్టారు. ఇటీవలే గట్టు ఎత్తిపోతల పథకానికి నల సోమనాద్రి పేరు పెట్టారు. అదే రీతిన కాళేశ్వరం పథకంలోని రిజర్వాయర్లకు అమ్మవార్ల పేర్లను, పంప్‌హౌస్‌లకు ఇతర దేవతల పేర్లను పెట్టాలన్నది సీఎం ఆలోచనగా ఉంది. ఈ బ్యారేజీలకు అమ్మవార్ల నామకరణానికి సంబంధించి వచ్చే వారం ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. -
జెట్ స్పీడ్‌తో ‘పాలమూరు’
సాక్షి, హైదరాబాద్ : అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేసిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మాదిరే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇంజనీర్లను ఆదేశించారు. ప్రాజెక్టు పనులకు ప్రధాన అవరోధంగా ఉన్న నిధుల సమస్యను అధిగమించిన దృష్ట్యా పనులను జెట్ స్పీడ్‌తో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో రూ.10 వేల కోట్ల రుణాలు వస్తున్న నేపథ్యంలో పంప్‌హౌస్ పనులతోపాటు రిజర్వాయర్లు, కాల్వలు, విద్యుత్ సబ్స్టేషన్ల పనులన్నీ సమాంతరంగా జరగాలని మార్గదర్శనం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు పూర్వ జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, తుమ్మిళ్ల పనులపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో ఇంజనీర్లతో సుమారు 6 గంటలపాటు సమీక్షించారు. ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న సమస్యలు, వాటిని అధిగమించే చర్యలు, ప్రాజెక్టుల పూర్తి, వాటి నుంచి నీటి విడుదల తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. ఈ భేటీకి జిల్లా మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, సీఈ ఖగేందర్, రమేశ్, ఎస్ఈలు అంజయ్య, మనోహర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పథకం కింద ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 18 ప్యాకేజీల్లో జరుగుతున్న పనులపై అధికారులు వివరణ ఇచ్చారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లతోపాటు ఆయా అప్రోచ్ కాల్వలు, టన్నెళ్ల నిర్మాణాలు సాగుతున్న తీరును వివరించారు. ఏదుల పనులు 90 శాతం మేర పూర్తవగా నార్లాపూర్, కరివెన పనులు 55 శాతం దాటాయని, వట్టెం రిజర్వాయర్ పనులు 30 శాతం వరకు పూర్తవగా, ఉదండాపూర్ పనులు ఇప్పుడిప్పుడే సాగుతున్నాయని తెలిపారు. అప్రోచ్ కాల్వల పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయని, వట్టెం, ఉదండాపూర్ రిజర్వాయర్ల కింద భూసేకరణ పూర్తయితే తప్ప పనులు ముందుకు సాగే పరిస్థితి లేదని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పం దిస్తూ రిజర్వాయర్ల పనుల్లో అప్రమత్తత పాటించాలని, పెద్ద రిజర్వాయర్లు కావడం వల్ల ఎలాంటి నాణ్యతా లోపాలున్నా ఇబ్బందులు తలెత్తుతాయని, ప్రాజెక్టు ఇంజనీర్లు, ఏజెన్సీలు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు పూర్తి అప్రమత్తతతో పని చే యాలని ఇంజనీర్లను ఆదేశించారు. టన్నెల్ పనుల భద్రత విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని రక్షణ ఏర్పాట్లతోనే పనులు జరిపేలా సిబ్బందికి సూచించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి జిల్లాలో పాక్షికంగా ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు జరగాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం వెంటనే చెల్లించాలని, అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. వరద నీటితో పూర్తిఆయకట్టుకు నీరు.. కృష్ణా బేసిన్లో విస్తృత వర్షాలు కురుస్తున్నాయని, దీంతో మరో 20 రోజులు జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద కొనసాగే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. వచ్చిన వరదను వచ్చినట్లుగా ఒడిసిపడుతూ ఆయకట్టుకు తరలించాలని, గతేడాది మాదిరే ఈ ఏడాదీ చెరువులు నింపేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కల్వకుర్తి కింద 3.50 లక్షల ఎకరాలకు, మొత్తం ప్రాజెక్టు కింద 7.50 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాలమూరు–రంగారెడ్డితోపాటు తుమ్మిళ్ల ఎత్తిపోతలను పరిశీలించేందుకు త్వరలోనే జిల్లాకు వస్తానని సీఎం చెప్పినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
బ్లాస్టింగ్‌తో పొంచి ఉన్న ముప్పు
సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మొదటి ప్యాకేజీ పనుల్లో భాగంగా కొనసాగుతున్న అండర్ టన్నెల్(సొరంగం) పనుల్లో వినియోగిస్తున్న బ్లాస్టింగ్ వల్ల కేఎల్ఐ మొదటి లిఫ్ట్‌కు ప్రకంపనలు వస్తున్నాయని లిఫ్ట్‌ను నిర్వహిస్తున్న పటేల్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఏడాది క్రితమే ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. సొరంగం పనుల్లో కంట్రోల్ బ్లాస్టింగ్ కాకుండా ఎక్కువ సామర్థ్యంతో బ్లాస్టింగ్ చేయడం వల్ల ఆ శబ్దానికి సమీపంలో ఉన్న కేఎల్ఐ మొదటి లిఫ్ట్ వద్ద భూమి కంపించి ఇప్పటికే లిఫ్ట్ వద్ద అద్దాలు పగిలిపోవడంతో పాటు, భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తవచ్చనే ఉద్దేశంతో కేఎల్ఐ అధికారులకు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం వారు పరిశీలించారు. బెంగళూరుకు చెందిన ఎన్ఐఆర్ఎం ప్రతినిధులతో బ్లాస్టింగ్ తీవ్రతను పరీక్షించారు. అయితే బ్లాస్టింగ్ తీవ్రత కేఎల్ఐ లిఫ్ట్ వద్ద పెద్దగా ప్రభావం చూపడం లేదని అధికారులు చెప్పినట్లు సమాచారం. అయితే అక్కడ పనిచేస్తున్న వారు మాత్రం బ్లాస్టింగ్ వల్ల లిఫ్ట్‌కు ప్రమాదం పొంచి ఉందని, బ్లాస్టింగ్ తీవ్రత తగ్గించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి నివేదించిన అనంతరం ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. కేఎల్ఐ లిఫ్ట్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు.. పాలమూరు–రంగారెడ్డి సొరంగం పనుల్లో ఎక్కువ సామర్థ్యంతో కూడిన కెమికల్‌ను వినియోగిస్తూ బ్లాస్టింగ్ చేయడం వల్ల భూగర్భంలో ఉన్న కేఎల్ఐ లిఫ్ట్‌కు ప్రకంపనలు వస్తున్నాయని, దానివల్ల లీకేజీలు, స్లాబ్క్రాక్లు, అద్దాలు పగిపోవడం వంటివి జరుగుతున్నాయని లిఫ్ట్ నిర్వాహకులు ఏడాది క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మళ్లీ అదే పరిస్థితి తలెత్తడంతో మూడు నెలల క్రితం కేఎల్ఐ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం పాలమూరు–రంగారెడ్డి సీఈ రమేష్, ఈఈ విజయ్‌కుమార్, ఎస్ఈ అంజయ్య, ఈఈలు, డీఈలు, ఏఈలు కేఎల్ఐ మొదటి లిఫ్ట్‌ను పరిశీలించారు. బెంగళూర్ నుంచి ఎన్‌ఐఆర్‌ఎంకు ప్రతినిధులను పిలించి పాలమూరు–రంగారెడ్డి టెన్నెల్ పనుల్లో బ్లాస్టింగ్ చేయించి ప్రత్యేక పరికరం ద్వారా కేఎల్ఐ లిఫ్ట్‌లో వచ్చే తీవ్రతను పరీక్షించారు. అయితే పెద్దగా ప్రభావం చూపడం లేదని తేల్చినట్లు సమాచారం. స్వల్పంగా ప్రకంపనలు కనిపిస్తున్నాయని తేల్చినట్లు తెలిసింది. ఈ విషయం సీఈ రమేష్‌ను వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా చెప్పేందుకు ఇష్టపడలేదు. జనరల్ విజిట్ వెల్లడించారు. బ్లాస్టింగ్ వల్ల కేఎల్ఐ లిఫ్ట్‌కు పెద్దగా ఇబ్బంది ఉండదంటూ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అధికారులు, కేఎల్ఐ అధికారులు వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీ–1 పనుల్లో భాగంగా కొనసాగుతున్న సొరంగం పనులు 1,300 మీటర్లు కొనసాగించాల్సి ఉంటుంది. కంట్రోల్ బ్లాస్టింగ్ వినియోగిస్తేనే చుట్టుపక్కల పెద్దగా ఇబ్బంది ఉండదు. కేఎల్ఐ మొదటి లిఫ్ట్‌లో ఐదు పంపులు ఉన్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కేఎల్ఐ మొదటి లిఫ్ట్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని మొదటి ప్యాకేజీ పనులు చేస్తున్న కంపెనీ వారికి కంట్రోల్ బ్లాస్టింగ్ వినియోగించే విధంగా ఆదేశించాలని అక్కడి వారు అభిప్రాయ పడుతున్నారు. పూర్తిస్థాయిలో పరీక్షించి అధికారులు ఏం చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. 2005లో రూపకల్పన శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 25 టీఎంసీల మిగులు జలాలను తీసుకునే ప్రతిపాదనలతో 2005లో కేఎల్ఐ ప్రాజెక్టును రూ.2,990 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును మూడు లిఫ్ట్‌లుగా విభజించారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద మొదటి లిఫ్ట్, పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడ వద్ద రెండో లిఫ్ట్, నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లి వద్ద మూడో లిఫ్ట్‌ను నిర్మించారు. మొదటి లిఫ్ట్ నుంచి 13వేల ఎకరాలకు, రెండో లిఫ్ట్ నుంచి 47 వేల ఎకరాలకు, మూడో లిఫ్ట్ నుంచి 2.80 లక్షల ఎకరాలకు కలిపి మొత్తం 3.40 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కేఎల్ఐ కాల్వల సామర్థ్యం పెంచుకోవడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న కాల్వల నిర్మాణం, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేస్తేనే కేఎల్ఐ ద్వారా పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది. -
పాలమూరు ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పరుగులు పెట్టించేదిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రాజెక్టు పరిధిలో ఉన్న ప్రధాన అడ్డంకులను దాటుతూనే, సమృద్ధిగా నిధులను అందుబాటులో ఉంచేలా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) నుంచి రూ.10 వేల కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ప్రాజెక్టులోని ఎలక్ట్రో మెకానికల్ పనుల పూర్తికి వీలుగా ఈ రుణాలు తీసుకునేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి పాలమూరు–రంగారెడ్డి పనులను రూ.32,500 కోట్లతో చేపట్టగా ఇందులో ఇప్పటివరకు 20 శాతం పనులే పూర్తయ్యాయి. నిధుల కొరత కారణంగా ఏడాదిగా ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ఇది వరదజలాలపై ఆధారపడిన ప్రాజెక్టు కావడంతో రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాలకు బ్యాంకులు నేరుగా రుణాలిచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రాజెక్టులోని ఎలక్ట్రో మెకానికల్ పనులకు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకోవాలని సర్కారు గతంలో నిర్ణయించింది. ఈ పనులకు రూ.17 వేల కోట్లు అవసరం ఉండగా రూ.10 వేల కోట్లు రుణాలిచ్చేందుకు పీఎఫ్సీ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం రుణం తీసుకునేలా ఉత్తర్వులు వెలువడగా, త్వరలోనే దీనికి సంబంధించి పీఎఫ్‌సీతో ఒప్పందాలు జరగనున్నాయి. రూ.41,500 కోట్లకు కాళేశ్వరం రుణాలు! దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ(ఎఫ్ఎఫ్సీ) ప్రాజెక్టుల కోసం ‘తెలంగాణ రాష్ట్ర వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్(టీఎస్‌డబ్ల్యూఐసీ)’పేరుతో ఏర్పాటు చేసిన మరో కార్పొరేషన్ ద్వారా రూ.2,638 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ కార్పొరేషన్‌కు ఆంధ్రాబ్యాంకు కన్సార్షియం రూ.17 వేల కోట్ల మేర రుణం ఇచ్చింది. వీటిల్లో ఎక్కువగా సీతారామ, దేవాదుల పనులకే నిధులు వెచ్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ– 12 పనుల పూర్తికి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) నుంచి రూ.1,500 కోట్లు రుణం తీసుకునేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే ఇప్పటివరకు వివిధ రుణ సంస్థల నుంచి రూ.40 వేల కోట్లకుపైగా సేకరించగా, అందులోంచే ప్రాజెక్టు నిర్మాణపనులకు రూ.32 వేలకోట్లను ఖర్చు చేశారు. ప్రస్తుత కాళేశ్వరం రుణాలు రూ.41,500 కోట్లకు చేరనున్నాయి. -
మా భూములు మీకివ్వం
సాక్షి, కొల్లాపూర్: మండలంలోని కుడికిళ్ల భూముల్లో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబందించిన సర్వే చేయడానికి వచ్చిన తహసిల్దార్ వీరభద్రప్ప బృందాన్ని రైతులు అడ్డుకున్నారు. గురువారం పోలీస్ బందోబస్తుతో రైతుల పొలాలను సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులతోపాటు ఇరిగేషన్ అధికారులు వచ్చారు. కుడికిళ్ల రైతులు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదని నాలుగేళ్లుగా అడ్డుకుంటున్నారు. తాజాగా గురువారం వచ్చిన అధికారులను పంపించేశారు. కుడికిళ్ల గ్రామానికి చెందిన రైతుల పొలాలు 242 ఎకరాలు పాలమూరు ప్రాజెక్టు కింద పోతున్నాయి. గతంలో కల్వకుర్తి ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టులలో భూములు కోల్పోయారు. ప్రస్తుతం పాలమూరు ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదని సంవత్సరాల కొద్దీ పోరాటాలు చేస్తున్నారు. భూమికి భూమి ఇవ్వాలి.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి ఇస్తే తప్పా భూములు ఇవ్వమని తెగేసి చెప్పారు. ఒకటి, రెండు ఎకరాల చొప్పున భూములు మిగిలాయని అవి కూడా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో పోతే బతికేదెట్లా అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసేదేమి లేక ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వెనుదిరిగారు. కార్యక్రమంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న మహిళారైతులు గ్రామస్తులు పాల్గొన్నారు. పోలీసు బందోబస్తుతో.. కుడికిళ్ల రైతులపై ఒత్తిడి పెంచేందుకు అధికారులు భారీ పోలీస్ బందోబస్తుతో వచ్చారు. సర్వేకు వచ్చిన అధికారులను దాదాపుగా 200మంది రైతులు అడ్డుకున్నారు. భూములలోకి అడుగు పెట్టనివ్వబోమని తేల్చి చెప్పారు. భారీ పోలీస్ బందోబస్తుతో వచ్చారు. అధికారులతో దాదాపుగా 2గంటల వాగ్వివాదం చోటుచేసుకుంది. మహిళా రైతులు పెట్రోలు బాటిళ్లు పట్టుకుకుని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే చేస్తే పెట్రోలు పోసుకుని అంటించుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్, ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే మాతో చర్చలు జరపాలని అధికారులతో చెప్పారు. -
‘పాలమూరు’ పరుగులు
ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో వేగం పుంజుకోనుంది. నిధుల సమస్యతో నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.10వేల కోట్ల రుణం తీసుకోవాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. రుణం మంజూరైన వెంటనే మందకొడిగా సాగుతోన్న ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రుణ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో నిధులు మంజూరు చేయడమే మిగిలిందని అధికారులు చెబుతున్నారు. సాక్షి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాల్లో 12.30లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం 2015 జూన్‌లో ప్రతిష్టాత్మకంగా రూ.35,200కోట్లతో పాలమూరు–ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టింది. ఈ అప్పట్లో సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వద్ద కరివెన రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. తర్వాత కాంట్రాక్టర్ల ఒప్పందం కోసం పది నెలల సమయం పట్టింది. చివరకు 2016 మే నుంచి పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో 2018 ఆఖరులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయి తే ప్రాజెక్టు పనులు వేగంగా చేసేందుకు సరిపడా నిధులు లేకపోవడంతో పనుల్లో వేగం తగ్గింది. ఇప్పటి వరకు సుమారు రూ.10వేల కోట్ల మేర పనులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం రుణం మంజూరు కానుండడంతో పనుల్లో వేగం మరింత వేగం పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు స్వరూపం ఇదీ.. శ్రీశైలం వెనక జలాల నుంచి నీటిని ఎత్తిపోసేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న కేఎల్ఐ ప్రాజెక్టులకు సంబంధించి నీటిని నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు లేకపోవడంతో ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల కింద పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మించేందుకు నిర్ణయించింది. మొత్తం ఆరు రిజర్వాయర్లతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇందులో సర్కిల్–1లో కొల్లాపూర్ పరిధిలోని నార్లాపూర్‌లో 8.55 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వనపర్తి పరిధిలోని ఏదుల 6.99టీఎంసీలు, నాగర్‌కర్నూల పరిధిలోని వట్టెం వద్ద 16.75 టీఎంసీలు, మహబూబ్‌నగర్ పరిధిలోని కరివెన వద్ద 17.34 టీఎంసీలు, సర్కిల్–2 పరిధిలోని ఉద్దండాపూర్ వద్ద 9.1టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాలోని కేపీ లక్ష్మిదేవిపల్లి వద్ద 3 టీఎంసీలు (గతంలో 10 టీఎంసీల అంచనా ఉండగా> కుదించారు)మొత్తం ఆరు రిజర్వాయర్ నిర్మించేందుకు పథకాన్ని ప్రారంభించారు. పనులు ఇలా.. జిల్లాలో ఈ ప్రాజెక్టు పనులు 15ప్యాకేజీలుగా విభజించి కొనసాగిస్తున్నారు. రిజర్వాయర్ల వారీగా పరిశీలిస్తే నార్లాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించి మొత్తం 2,465 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,275 ఎకరాల భూమిని సేకరించారు. రూ.760కోట్ల వ్యయానికిగాను రూ.425కోట్లు ఖర్చు చేసి 60శాతం పనులు పూర్తి చేశారు. ఏదుల రిజర్వాయర్‌కు సంబంధించి 5,470 ఎకరాలు సేకరించాల్సి ఉండగా 5,011 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణ వివిధ దశల్లో ఉంది. రూ. 664 కోట్ల వ్యయానికి రూ.622 కోట్లు ఖర్చు చేసి 95శాతం పనులను పూర్తి చేశారు. వట్టెం రిజర్వాయర్‌కు సంబంధించి 4,526ఎకరాలు సేకరించాల్సి ఉండగా దాదాపు 4 వేల ఎకరాలను సేకరించారు. రూ.6వేల కోట్ల వ్యయానికి రూ.1800 కోట్లతో 30శాతం పనులు పూర్తి చేశారు. కరివెన రిజర్వాయర్‌కు సంబంధించి 6,676 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉండగా 6,008 ఎకరాలను సేకరించారు. మిగిలిన భూమికి సంబంధించి సేకరణ అంశం వివిధ దశల్లో ఉంది. రూ.760కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఈ పనులు రూ. 425కోట్ల ఖర్చుతో దాదాపు 60శాతం పూర్తయ్యా యి. కాలువల విషయానికొస్తే నార్లపూర్ నుంచి ఏదుల వరకు 8.375 కిలో మీటర్ల కాల్వలను 2, 3 ప్యాకేజీలుగా విభజించి ఇప్పటి వరకు 50శాతం పనులు పూర్తి చేశారు. ఏదుల నుంచి వట్టెం వరకు 6.4 కిలో మీటర్ల కాలువను 6, 7ప్యాకేజీలుగా విభజించి 81శాతం పనులు పూర్తి చేశారు. ఇక వట్టెం నుంచికరివెన వరకు 12కిలో మీటర్ల కాలువను 12వ ప్యాకేజీగా విభజించి 72 శాతం కాలువ పనులను పూర్తి చేశారు. మోటార్లకే కేటాయింపు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం గల మోటార్లను బిగించనున్నారు. నార్లపూర్‌లో 145మెగావాట్ల సామర్థ్యం గల ఎనిమిది మోటార్లను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ప్రతి రోజు 22వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసేలా ఇంజనీర్లు డిజైన్ చేశారు. అయితే ఇంత సామర్థ్యం గల పంపులు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా వినియోగించకపోవడం విశేషం. పవర్ కార్పొరేషన్ ద్వారా మంజూరయ్యే రుణం వీటి కొనుగోలుకే కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో 6.55 టీఎంసీల సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్‌ను రూ.600 కోట్ల అంచనాతో 2015లో అప్పటి రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పనులు ప్రారంభించారు. సొరంగాలు, సర్జిపూల్స్, కాల్వలు పనులు పురోగతిలో ఉన్నాయి. 7.5 కిలోమీటర్ల పొడవైన ఆనకట్ట నిర్మాణం 99 శాతం పూర్తి చేశారు. రూ.400 కోట్ల రిజర్వాయర్ నిర్మాణానికి, రూ. 200 కోట్ల కాల్వల నిర్మాణం కోసం కేటాయించారు. ఇక్కడ 1.45 హెచ్‌పీ సామర్థ్యం గల 9 పంపులను ఏర్పాటు చేసి, నీటిని ఎత్తిపోసే విధంగా ప్రాజెక్టు డిజైన్ చేశారు. ఈ రిజర్వాయర్‌కు నీరు వస్తే.. 29 గ్రామాల పరి«ధిలోని 45వేల ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందుతోంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటి వరకు 5,011ఎకరాల భూసేకరణ చేశారు. ఇంకా 395 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో 195 ఎకరాల భూమి వివాదాస్పదంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. -
పాలమూరు రైతులపై కేసీఆర్ సవతి ప్రేమ!
సాక్షి, నాగర్ కర్నూలు : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన వట్టెం రిజర్వాయర్ భూనిర్వాసితులు చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. ప్రభుత్వం తమకు న్యాయమైన పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ వారు చేపట్టిన ఆందోళన మంగళవారానికి 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేటలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు ప్రభుత్వం ఏవిధమైన పరిహారం ఇచ్చిందో.. అదేమొత్తంలో పాలమూరు-రంగారెడ్డి భూ నిర్వాసితులకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇదే చివరి హెచ్చరిక అని, వెంటనే భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోతే.. అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి ఉద్యమిస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లాపైన అమితమైన ప్రేమను చూపుతూ.. పాలమూరు జిల్లా రైతన్నలపై సవతి తల్లి ప్రేమ ఎలా చూపిస్తారని మండిపడ్డారు. -
‘నార్లాపూర్’ కొత్త అంచనా రూ.1,182 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ (అంజనగిరి) రిజర్వాయర్‌లో రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి కొత్త అంచనాలు సిద్ధమయ్యాయి. రిజర్వాయర్‌లో మట్టికొరతను ఎదుర్కొనేందుకు ఉత్తరాఖండ్‌లోని తెహ్రీడ్యామ్ తరహాలో రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మించాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో, దాని నిర్మాణానికి అయ్యే వ్యయ అంచనాలకు ప్రాజెక్టు అధికారులు రూ.1,182కోట్లతో సిద్ధం చేశారు. గత అంచనాలతో పోలిస్తే రూ.290 కోట్ల మేర వ్యయం పెరగనుండగా, దీన్ని ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. 6.64 కిలోమీటర్ల మేర మట్టికట్ట.. నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి 6.64 కిలోమీటర్ల మేర మట్టికట్ట నిర్మించాల్సి ఉంది. ఈ పనిని మూడు రీచ్‌లుగా విడగొట్టగా, రీచ్–2లో మట్టి సమస్య నెలకొంది. ఇక్కడ ఏకంగా 75 మీటర్ల ఎత్తులో కట్ట నిర్మాణం చేయాల్సి ఉండగా, 2.26 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి అవసరం పడనుంది. అయితే రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో కేవలం 60 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే మట్టి లభ్యత ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి మట్టిని తెప్పించాలని భావించగా, ఖర్చు తడిసి మోపెడవుతోంది. రీచ్–2లో ఏర్పడిన మట్టికొరత సమస్యను అధిగమించడానికి రాక్‌ఫిల్ డ్యామ్ విధానంలో పనులు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు అధికారులు తెహ్రీడ్యామ్ పరిశీలించిన ఇంజనీర్లు నార్లాపూర్‌లో ఈ విధానం ఫలితానిస్తుందని అసెంబ్లీ ఎన్నికలకు ముందే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే దీనిపై ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో దీనికయ్యే వ్యయ అంచనాలు సిద్ధం చేశారు. రూ.1,182కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. సీనరేజీ చార్జీలు, కరెంట్ లైన్లు, రోడ్ల నిర్మాణం, గత అంచనాల సవరణల కారణంగా తొలి అంచనాతో పోలిస్తే రూ.290 కోట్లు మేర పెరుగుతుందని లెక్కగట్టారు. ఇప్పటికే ‘తెహ్రీ’ఈడీ సందర్శన ఇక నార్లాపూర్‌లో ప్రతిపాదిస్తున్న రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి అవసరమైన డిజైన్, ఇతర సాంకేతిక అంశాలపై సహకారం అందించేందుకు తెహ్రీ హైడ్రో పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ వైష్ణోయ్ ఈ మేరకు అధికారులకు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆయన ఒకమారు రాష్ట్రానికి వచ్చి ప్రాజెక్టును సందర్శించారు. తెహ్రీ డ్యామ్ నిర్మాణ సమయంలో తాము ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లను వివరించి, వాటిని అధిగమించేందుకు జరిపిన అధ్యయనాలను, డిజైన్ రూపకల్పనలో తీసుకున్న జాగ్రత్తలను అధికారులతో పంచుకున్నారు. రిక్టర్ స్కేల్‌పై 9, 10 స్థాయిలో భూకంపాలు వచ్చినా తట్టుకునే విధంగా రాక్‌ఫిల్ డ్యామ్ డిజైన్ చేసినట్లు, అదే తరహాలో ఇక్కడా నిర్మాణాలకు సహకరిస్తామని హామీనిచ్చారు. ఆయన సూచనల నేపథ్యంలోనే ప్రభుత్వం రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణం రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల పరిధిలో పూర్తిగా కొత్తదే అయినా దానివైపే మొగ్గుచూపింది. -
‘పాలమూరు’ చుట్టూ ప్రదక్షిణలు!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు జిల్లా రాజకీయం సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతోంది. కృష్ణానది జలాల అంశాలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య కాకపుట్టిస్తున్నాయి. కృష్ణాబేసిన్ పరివాహక ఆయకట్టుకు నీటిని అందించిన ఘనత తమదేనని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకొని లబ్ధి పొందిన టీఆర్ఎస్ తిరిగి అదే ప్రచారంతో ముందుకెళుతోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయడంతోపాటు పాలమూరును పచ్చగా చేస్తామని చెబుతోంది. ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్, బీజేపీలు జాతీయహోదా ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తుండగా, తాము అధికారంలోకి వస్తే జాతీయ హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టింది. ఇక గట్టు ఎత్తిపోతల, నారాయణపేట–కొడంగల్ పథకాల విషయంలో టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. మాటల యుద్ధం షురూ! ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రాజెక్టులను చూపించే ఓట్లడుగుతోంది. ఇటీవల నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలోనూ ఈ అంశాన్నే కేటీఆర్ పేర్కొన్నారు. ఇదే సమయంలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు. రాష్ట్రంలోని 16 సీట్లలో టీఆర్ఎస్ గెలిచి, కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తే.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా పరిగెత్తుకుంటూ వస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులివ్వాలని నీతిఆయోగ్ కేంద్రానికి సూచించినా.. బీజేపీ ప్రభుత్వం నయాపైసా ఎందుకివ్వలేదని, కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఇక ఈ ప్రాజెక్టులన్నీ తమ ఘనతేనని, తమ హయాంలో చేపట్టినవేనని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. ఇదే అంశంతో ఇప్పటికే మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ అభ్యర్థి మల్లు రవి ప్రచారం మొదలు పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాలమూరుకు జాతీయ హోదా ప్రకటిస్తామని ప్రచారం చేస్తున్నారు. ఆర్డీఎస్ కాల్వల ఆధునీకరణ, ఎన్నికల ముందు హడావుడిగా మొదలు పెట్టిన గట్టు ఎత్తిపోతల ఎందుకు ముందుకు పోవడం లేదని మల్లు రవి ప్రశ్నిస్తున్నారు. ఇక మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డీకే అరుణ సాగునీటి విషయంలో ఎలా ముందుకెళ్తారో చూడాలి. పాలమూరులోని ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తికాకపోవడం, షాద్‌నగర్ నీటి అవసరాలను తీర్చే ప్రణాళికలపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలను ఆమె ప్రస్తావించే అవకాశాలున్నాయి. ఇక ఈ నెల 29న జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ సైతం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏదైనా హామీ ఇస్తారా? అన్నది కీలకం కానుంది. వీటితోపాటే నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలను పక్కనపెట్టి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగం చేయడంతో నారాయణపేట డివిజన్లోని మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల భూములకు చుక్కనీరు అందని పరిస్థితి తలెత్తుతుందనే అంశాన్నీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్ఎస్ను ఓడించాలని విపక్షాలు రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాయి. పాలమూరులోఓట్లు పారేదీ నీళ్లతోనే మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెం ట్ల పరిధిలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో సాగునీటి ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రెండు పార్లమెంట్ల పరిధిలో ఉన్న కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌తోపాటు కొత్తగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, తుమ్మిళ్ల, గట్టు, ఆర్డీఎస్ పథకాల చుట్టూ రాజకీయం నడుస్తోంది. నెట్టెంపాడుతో గద్వాల, బీమాతో వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కోయిల్‌సాగర్‌తో మహబూబ్‌నగర్, కల్వకుర్తితో వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, శంషాబాద్ జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుంది. మొత్తంగా వీటితో 8.77లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంలో.. ఇప్పటికే 6.50లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. ఈ ఖరీఫ్ నాటికి పూర్తిస్థాయిలో నీరందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. అదీగాక ఈ ప్రాజెక్టుల కింద దాదాపు 700 చెరువులను నింపారు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోనే 10లక్షల ఎకరాల మేర సాగునీరందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. ప్రాజెక్టుల కింద 6.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించిన ఘనత తమదేనని చెప్పుకోవడంలో టీఆర్ఎస్ విజయం సాధించడంతో ఏకంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 13 స్థానాల్లో గెలిచారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కొట్లాడిన కొల్లాపూర్ కాంగ్రెస్ నేత బీరం హర్షవర్దన్‌రెడ్డి ఒక్కరే గెలిచారు. అయితే ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పాలమూరు ద్వారా కొల్లాపూర్ నియోజకవర్గానికి నీరందిస్తామన్న హామీతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకుంటామని ప్రభుత్వం నుంచి అందిన హామీ మేరకే పార్టీ మారుతున్నట్లు ఆయన ప్రకటించారు. -
‘పాలమూరు’కు పచ్చతోరణం
సాక్షి, హైదరాబాద్/జడ్చర్ల: ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో సుమారు పన్నెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు, వెయ్యికి పైగా గ్రామాలకు తాగు నీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయిలో అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి అటవీ శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రవణ్ కుమార్ వర్మ శుక్రవారం లేఖ రాశారు. ఈ అనుమతులతో ప్రాజెక్టు పరిధిలోని పంప్‌హౌస్, రిజర్వాయర్, టన్నెల్ నిర్మాణానికి మార్గం సుగమం అయింది. కీలక ముందడుగు.. ప్రాజెక్టు నిర్మాణానికి నాగర్ కుర్నూల్ జిల్లా అచ్చంపేట అటవీ డివిజన్లో ఉన్న 205.48 హెక్టార్ల అటవీ భూమిని సాగునీటి శాఖకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి 2017 మే నెలలో లేఖ రాసింది. ఆ అభ్యర్థనని ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్ఏసీ) పరిశీలించి 2018 ఏప్రిల్ నెలలో తొలి దశ అనుమతిని మంజూరు చేసింది. కేంద్రం విధించిన విధి విధానాలను ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసిన కారణంగా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ శుక్రవారం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతిని మంజూరు చేసింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మొదటి స్టేజి పంప్ హౌస్, నార్లపూర్ వద్ద అంజనగిరి రిజర్వాయర్, నార్లపూర్ –అంజనగిరి – ఏదుల వీరాంజనేయ రిజర్వాయర్ల మధ్య టన్నెల్ తవ్వకపు పనులకు అటవీ భూముల బదిలీ అవసరమైంది. ప్రస్తుత అనుమతితో 205.48 హెక్టార్ల అటవీ భూమి పాలమూరు ప్రాజెక్టు సీఈ అధీనంలోకి వస్తుంది.దీంతో పనులన్నీ సులువుగా సాగనున్నాయి. ఇక పర్యావరణ పరంగా ఇప్పటికే స్టేజ్ –1 అనుమతి పొందిన సంగతి తెలిసిందే. పూర్థి స్థాయి పర్యావరణ అనుమతి కోసం ఆ నివేదికను సాగు నీటి శాఖ తయారు చేస్తోంది. త్వరలోనే దీన్ని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు సమర్పించనుంది. ఈ ప్రాజెక్టుకు గాను ఇప్పటికే అటవీ పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులను కొనసాగిస్తున్నారని, ఈ దృష్ట్యా పనులను వెంటనే ఆపాలని కోరుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు దాఖలైన సంగతి తెలిసిందే.రాష్ట్ర ప్రభుత్వం కేవలం తాగునీటి సరఫరా కోసమే పనులను చేపట్టిందని, పర్యావరణ, అటవీ అనుమతులు పొందిన తర్వాతనే సాగు నీటి పనులను చేపడుతుందని ప్రభుత్వం ఇదివరకు ఎన్జీటీకి తెలిపింది.ఈ కేసుల నేపథ్యంలో ప్రస్తుతం మంజూరైన అటవీ అనుమతి కీలకమైన ముందడుగుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సీఎం కేసీఆర్ హర్షం... పాలమూరుకు అటవీ అనుమతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సహస్ర చండీయాగం ముగింపు రోజున ఈ సమాచారం తెలిసిన సీఎం తన హర్షాన్ని వెలిబుచ్చారు. కేంద్ర అటవీ శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కృషిలో పాలు పంచుకున్న నీటి పారుదల ప్రాజెక్టు సీఈ రమేశ్, ఈఈ విజయ్‌కుమార్‌లను అభినందించారు. తాజా అనుమతులతో పనులు వేగం పుంజుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా దీనికి ఎంతో ప్రాధాన్యం మిచ్చి పనులను వేగిరపరుస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్లలో పూర్తి చేస్తాం: లక్ష్మారెడ్డి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని మాజీమంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఆయన ‘సాక్షి‘తో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కేంద్రంనుంచి లభించాయని వెల్లడించారు. ఇందుకు కృషిచేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామన్నారు. -
భూ పరిహారం అందక మనస్తాపం
నవాబుపేట (జడ్చర్ల): భూపరిహారం అందకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కారుకొండ గ్రామపంచాయతీ పరిధిలోని శామగడ్డ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నవాబుపేట మండల సమీపంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్‌లో నాలుగు గ్రామాల రైతుల భూములు ముంపునకు గురవుతున్నాయి. ఇందులో పూర్తిగా ముంపునకు గురవుతున్న శామగడ్డ తండాకు చెందిన ఆశిలమ్మ (76)కు సర్వేనంబర్ 97లో 2.10 ఎకరాల భూమి ఉంది. నలభై ఏళ్లకు పైగా ఆమె కాస్తులో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నా.. పట్టా మాత్రం మహబూబ్‌నగర్ మండలం ఫత్తేపూర్‌కు చెందిన జహంగీర్ పేరిట ఉంది. దీంతో కారుకొండ గ్రామ రెవెన్యూ కార్యదర్శి వెంకట్‌రెడ్డి ఖాస్తుదారును విస్మరించి ఆమెకు తెలియకుండా పట్టాదారు పేరుతో దాదాపుగా రూ.13.80 లక్షల పరిహారం చెక్కు సిద్ధం చేశాడు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూమి ముంపునకు గురవుతుండగా పరిహారం అందుతుందని ఎదురు చేస్తున్న ఆశిలమ్మకు.. అసలు విషయం తెలియడంతో ఆందోళనకు గురైంది. చెక్కులు పెండింగ్‌లో పెట్టాం: తహసీల్దార్ అశిలమ్మ కాస్తులో ఉన్నా పట్టా మాత్రం జహంరీర్ పేరిట ఉంది. కాస్తుదారులు అప్పుడే పట్టా చేయించుకోవాల్సి ఉండేది. తాజాగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పూర్తి విచారణ కోసం చెక్కులను పెండింగ్‌లో పెట్టాం. -
‘పాలమూరు’లో రూ.2 వేల కోట్ల అవినీతి
బీజేపీ నేత నాగం కొందుర్గు (షాద్‌నగర్): పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వ్యవహారం అంతా అవినీతిమయంగా మారిం దని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరిగూడ మండలం పద్మారం గ్రామపంచాయతీ లక్ష్మీదేవిపల్లిలో ప్రాజెక్టు నిర్మించనున్న స్థలాన్ని ఆయన పరిశీలించా రు. ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వ్యవహారంలో రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఆరోపణలు నిజం కాకుంటే తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన ప్రేమ లక్ష్మీదేవిపల్లిపై ఎందుకు చూపడం లేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రంగారెడ్డి, నల్లగొండ తదితర జిల్లాల్లో 12.3 లక్షల ఎకరాలు సస్యశ్యామలమవుతాయన్నారు. -
‘పాలమూరు’పై స్వతంత్ర కమిషన్
జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్) ప్రాజె క్టుకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ చట్ట ఉల్లంఘనలు, ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరుతెన్నులు, అటవీ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలు తదితర విషయాల్లో నిజా నిజాలను తేల్చేందుకు నిపుణులతో స్వతంత్ర కమిషన్‌ను నియమించింది. ఎన్జీటీ విశ్రాంత సభ్యులు ప్రొఫెసర్ యూసెఫ్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిషన్‌లో కేంద్ర అటవీ, పర్యావరణశాఖ జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి, కేంద్ర జలవనరులశాఖ అధికారులు, రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు, పిటిషనర్ సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఎం.ఎస్.నంబియార్, పి.ఎస్.రావులతో కూడిన ధర్మాసనం మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహా రంలో అంతిమ నిర్ణయానికి రావడానికి కమిషన్ సహాయం తమకు అవసరమని, అందువల్లే పిటిషనర్ అభ్యర్థనను ఆమోదిస్తు న్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 19కి వాయిదా వేసింది. -
‘పాలమూరు’ 47,670 కోట్లకు సవరణ
- రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ సిఫారసు - ప్రభుత్వం ఆమోదిస్తే రూ.12,470 కోట్ల మేర వ్యయం పెరిగే అవకాశం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరగనుంది. పలు మార్పులు, కొత్త నిర్ణయాలు, వాటికి అనుగుణం గా పెరిగిన కాల్వల పొడవు.. వంటి కారణాలతో ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం రూ.35,200 కోట్ల నుంచి రూ.47,670 కోట్లకు చేరనుంది. ఈ వ్యయానికి గాను సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని నీటి పారు దల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం ఈ వినతిని అంగీకరిస్తే ప్రాజెక్టుపై వ్యయ భారం రూ.12,470 కోట్ల మేర పెరగనుంది. పెరిగే అంచనాలపై ప్రభుత్వ పరిశీలన తర్వాత సవరించిన అంచనాలతో ఉత్తర్వులు జారీ అవుతాయని నీటి పారుదల శాఖలోని ఉన్నత స్ధాయి వర్గాలు తెలిపాయి. డిజైన్ మారడంతో అనివార్యమైన పెంపు.. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం నుంచి 60 రోజుల్లో 120 టీఎంసీల వరద జలాలను తీసుకొని మహబూబ్‌నగర్ జిల్లాలోని 7లక్షల ఎకరాలకు, రంగారెడ్డిలో 2.70 లక్షల ఎకరాలు, నల్లగొండలోని 30 వేల ఎకరాలకు కలిపి మొత్తంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు వీలుగా ఈ పథకాన్ని రూ.35,200 కోట్లతో చేపట్టారు. దీనికోసం నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వా యర్లతో పాటు 5 లిఫ్టులను ప్రతిపాదించారు. అందుకనుగుణంగా డిజైన్లు ఖరారు చేసి నార్లాపూర్ నుంచి ఉద్ధండాపూర్‌వరకు 18 ప్యాకేజీలతో రూ.29,333 కోట్లకు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టారు. అయితే ప్రాజెక్టు మొదలు పెట్టే సమయానికే ప్రభుత్వం వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతుల దృష్ట్యా డిజైన్‌లో అనేక మార్పులు చేస్తూ వచ్చింది. గత ఏడాదే ప్రతిపాదనలు.. నిజానికి గత ఏడాదిలోనే ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అది ముందుకు వెళ్లలేదు. అయితే ప్రస్తుతం మిగతా పనులు చేపట్టాలంటే సవరించిన అంచనా వ్యయాలకు ఆమోదం తప్పనిసరి కావడంతో అందుకు అనుగుణంగానే నివేదిక తయారు చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. అక్కడ ఆమోదం దక్కిన పక్షంలో సవరించిన అంచనాలతో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. -
‘పాలమూరు–రంగారెడ్డి’పై విచారణ 10కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ ఎల్ఐఎస్) నిర్మాణ పనుల్లో భాగంగా తమ భూముల్లో అనుమతులు లేకుండా నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ భూగర్భ పంప్‌హౌస్ నిర్మాణ పనులు చేపట్టిందంటూ మహబూబ్‌నగర్ జిల్లా ఎల్లూర్ మండలం రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం వ్యాజ్యంపై ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శశికిరణ్ వాదనలు వినిపిస్తూ.. అటవీ ప్రాంతంలో చేపట్టే పనుల విషయంలో కొన్ని మార్గదర్శకాలున్నాయని చెప్పగా వాటిని తమ ముందుంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. నవయుగ తరఫు సీనియర్ న్యాయవాది మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. కాగా, వ్యాజ్యంలో మరికొంత మంది రైతులను కూడా ప్రతివాదులుగా చేర్చాలని భావిస్తున్నారని, వారి వాదనలూ వినాలని న్యాయవాది రచనారెడ్డి కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషన్ దాఖలు చేసుకుంటే పరిశీలిస్తామని తెలిపింది. -
రిజర్వ్ ఫారెస్ట్‌లో పనులన్నీ ఆపేయండి
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై ఎన్జీటీ ఉత్తర్వులు - అటవీ ప్రాంతంలో పనులు చేయడం లేదన్న ప్రభుత్వం - అది అబద్ధమంటూ శాటిలైట్ ఫొటోలు చూపిన పిటిషనర్ - ఈ ప్రాజెక్టు గురించి కేసీఆర్ ప్రసంగం ఎన్జీటీకి సమర్పణ సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో జరుగుతున్న పనులన్నింటినీ వెంటనే ఆపేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ, చెన్నై) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి అన్ని అనుమతులు పొందేంత వరకు ఏ ఒక్క పని కూడా చేయరాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎస్ నంబియార్, పీఎస్ రావుతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ప్రాజెక్టు జరుగుతున్న తీరు తెన్నులు.. ప్రభుత్వ ఉల్లంఘనలు తదితర విషయాలను నిగ్గు తేల్చేందుకు నిపుణులతో స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ పిటిషనర్ దాఖలు చేసిన అనుబంధ దరఖాస్తును ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై స్పందన తెలియజేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తాగునీటి ప్రాజెక్టు వాదనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. అనుబంధ దరఖాస్తుతో పాటు ప్రధాన పిటిషన్‌ను ఆ రోజు విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. ఇదే సమయంలో ప్రభుత్వ వాదనకు మద్దతు తెలుపుతూ ప్రాజెక్టు పనులను ఆపవద్దని, ఈ కేసులో తమను ప్రతివాదులుగా చేర్చుకుని వాదనలు వినాలంటూ కొందరు రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. అటవీ, పర్యావరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా పాలమూరు పనులను ప్రభుత్వం చేపట్టిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపించగా, పిటిషనర్ తరఫున సంజయ్ ఉపాధ్యాయ్ వాదనలు వినిపించారు. కేసీఆర్ ప్రసంగం కాపీల సమర్పణ విచారణ ప్రారంభం కాగానే వాయిదా కోసం ఏఏజీ కోరగా, సంజయ్ ఉపాధ్యాయ్ దానిని వ్యతిరేకించారు. ఏమీ చేయడం లేదని ఒకవైపు చెబుతూ, మరోవైపు ప్రాజెక్టు పనులను కొనసాగిస్తూనే ఉన్నారని, దీనికి ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రసంగమే సాక్ష్యమన్నారు. కేసీఆర్ ప్రసంగాన్ని ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసి ధర్మాసనం ముందుంచారు. కేసీఆర్ తన ప్రసంగంలో ఎన్జీటీని గేలిచేసేలా మాట్లాడారని వివరించారు. ఎన్జీటీ ఇచ్చిన స్టే ఓ స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేసి తీరుతామన్నారని కేసీఆర్ చెప్పారని తెలిపారు. ఈ సమయంలో రామచంద్రరావు స్పందిస్తూ.. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం లేదని చెప్పారు. ఉపాధ్యాయ్ ఈ వాదనలతో విభేదించారు. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పనులతో పాటు ప్రాజెక్టు కొనసాగుతున్న ప్రాంతాలకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. ఉత్తర్వులు ఆటంకం కాదు ‘‘రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులేవీ రిజర్వ్ ఫారెస్ట్‌లో జరగటం లేదు. కావున ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులు పాలమూరు పనులకు ఆటంకం కాదు’’ – సీఈ లింగరాజు -
‘రాతి’ భారం భరించలేం!
‘పాలమూరు’లో రాతి ఇసుకకు మరింత ధర కోరుతున్న కాంట్రాక్టర్లు సాక్షి,హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల్లో రాతి ఇసుక (రాక్‌శాండ్)కు ప్రభుత్వం నిర్ణయించిన ధరను మరింత పెంచాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభు త్వం నిర్ణయించిన ధర తమకేమాత్రం గిట్టుబాటు కాదని వారు తెగేసి చెబుతున్నారు. రాతి ఇసుకను ప్రభుత్వం చెబుతున్న సైజులో తయారు చేయాలంటే భారీ మెషినరీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సహకరిస్తేనే ముందుకు వెళతా మన్నట్టుగా వారు స్పందిస్తున్నారు. భారీ వ్యయంతో చేపట్టిన పాలమూరు ప్రాజెక్టులో ఐదు రిజర్వాయర్లు నార్లాపూర్–8.61టీఎంసీ, ఏదుల 6.5, వట్టెం 16.6, కరివెన 19.15, ఉద్దండాపూర్ 9.2టీఎంసీల సామర్థ్యాల తో నిర్మించాలని నిర్ణయించారు. వీటితో పాటు ఓపెన్ చానల్, టన్నెళ్లు, పంప్‌హౌస్‌ల నిర్మాణానికి భారీగా ఇసుక, మట్టి అవసరమవుతాయని అధికారులు గుర్తించా రు. రిజర్వాయర్లలో లీకేజీలు లేకుండా నీటిని తరలించేం దుకు కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని లెక్కించారు. క్యూబిక్ మీటర్‌కు రూ.400... అయితే నదుల్లో ఆ స్థాయిలో ఇసుక లభ్యత లేక జాప్యం జరుగుతున్న దృష్ట్యా... మెట్రో పనుల్లో వాడుతున్న మాదిరే రాతి ఇసుకను వాడాలని ఇంజనీర్లు నిర్ణయించారు. ప్రస్తు తం ప్రాజెక్టులోని 15 ప్యాకేజీల్లో దీన్ని వాడాలని కాంట్రాక్టర్లకు సూచించారు. దీనిపై ఇటీవల కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించగా... ప్రభుత్వం క్యూబిక్ మీటర్ రాతి ఇసుకకు రూ.392 ధర నిర్ణయించిం దని, అయితే చాలా ప్యాకేజీల్లో తాము తక్కువకు టెండర్లు వేశామని వారు తెలిపారు. అయితే ఆ ధరకు రాతి ఇసుకను తెచ్చుకోవడం సాధ్యమయ్యేది కాదని వారంతా చెప్పినట్లుగా తెలిసింది. ఈ ధరను క్యూబిక్ మీటర్‌కు రూ.400కు పైగా పెంచాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇక రాతి ఇసుక తయారీకి సైతం మిషనరీని సమకూర్చుకోవాల్సి ఉంటుందని, ఇది చాలా వ్యయంతో కూడకున్నదైనందున దానికి ప్రభుత్వ సహకారం అందించాలని విన్నవించారు. -
తట్టెడు మట్టి ఎత్తకుండా.. 50 వేల కోట్లా!
అంచనాలు అమాంతం పెంచేశారు పాలమూరు ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం టీఆర్ఎస్ సర్కారు తీరుపై రాజకీయ పార్టీల మండిపాటు హైదరాబాద్: నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం నిధుల దోపిడీకి పాల్పడుతోందని రాజకీయ పక్షాల రౌండ్ టేబుల్ సమావేశం మండిపడింది. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం తప్పుడు గణాంకాలను వెల్లడిస్తోందని అభిప్రాయపడింది. ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న అవినీతి ఏరులై పారుతోందని, పరిపాలనలో ఎక్కడా పారదర్శకత లేదని ఆయా పార్టీలు విమర్శించాయి. పాలమూరు - రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టు విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే ఆరుణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అన్ని రాజకీయ పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు దామోదర రాజనర్సింహ, బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి, టీడీపీ నేత రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంజనీర్లు ఈ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టు కోసం ఎందుకు గ్లోబల్ టెండర్లు పిలవలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఒక ఇంట్లో కూర్చొని తమకు కావాల్సిన వారికి టెండర్లు ఫైనల్ చేశారని దుయ్యబట్టారు. తట్టెడు మట్టి ఎత్తకుండా ప్రాజెక్ట్ అంచనాలు 50 వేల కోట్ల రూపాయలకు పెంచడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, ఈ రాష్ట్రంలో ప్రాజెక్ట్స్ కట్టింది కాంగ్రెస్ పార్టీ అనీ, ప్రాజెక్టులను అడ్డుకుంటోంది కాంగ్రెస్ అని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో సాగు, తాగు నీటి ప్రాజెక్ట్స్ కట్టేందుకు ప్రభుత్వంతో కలిసి వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రాజెక్ట్స్ పేరుతో దోపిడీ చేయాలనే మీ ఆగడాలను అడ్డుకొని తీరుతామన్నారు. నిపుణుల కమిటీ అభ్యంతరాలు తెలిపినా .. నవయుగ కంపెనీ అడిగిన మేరకే పనులు మంజూరు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రం నా జాగీరు తరహాలో కెసిఆర్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. భావి తెలంగాణా ప్రజల భవిష్యత్తు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ప్రాజెక్ట్స్ కడుతున్నప్పుడు .. తప్పులు జరుగుతుంటే ప్రశ్నించడం తప్పా. శాశ్వితంగా రాష్ట్రాన్ని తప్పుల ఉబిలోకి నెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని, ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వం నిజమైన అంకెలు దాచిపెడుతోందని విమర్శించారు. ప్రాజెక్ట్ ల పేరు కేసీఆర్ తెలంగాణ దోపిడీకి పాల్పడుతున్నారని డీకే ఆరుణ విమర్శించారు. జిల్లా లోని పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తే కాంగ్రెస్ కు పేరు వస్తుందని వాటిని పక్కన బెట్టారన్నారు. కొత్త ప్రాజెక్ట్ లు కొత్త కాంట్రాక్టర్లు, కొత్త కమిషన్ ల ఫార్ములతో ప్రభుత్వం దోచుకుంటుంతోందని దుయ్యబట్టారు. సర్కార్ తప్పులను, అవినీతిని ప్రశ్నిస్తే.. అడ్డుకుంటున్నారని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అబద్దాలు చెప్పడంలో మామను మించిన అల్లుడు హరీష్ రావు అని, పాలమూరు కు జలకల తెచ్చామంటూ.. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్ట్ లకు హరీష్ ప్రారంభోత్సవాలు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రోజెక్టు ద్వారా ఒక్క విద్యుత భారమే 1600 కోట్లు వాస్తవం కాదా..? పాలమూరు రంగారెడ్డి పార్జిక్ట్స్ అలైన్ మెంట్ తో కల్వకుర్తి ప్రాజెక్ట్ కెలాల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దెబ్బత్న్తుందని .. జూపల్లి తో సహా తెరాస ఎమ్మెల్యేలు సీఎం కు లేఖ రాశారు. కేసీఆర్ ఆంద్ర కాంట్రాక్టర్లతో తెలంగాణ ను దోచుకుంటున్నది వాస్తవం కాదా..? కేసీఆర్ సీఎం లా కాకుండా జోకర్ లా మాట్లాడుతున్నారు. న్యాయం కోసం భూనిర్వాసితులు కోర్ట్ కు వెళితే తప్పా..? తాగునీటి ప్రాజెక్ట్ అని ప్రభుత్వం ఆఫీడౌట్ ఇచ్చింది నిజం కాదా..? పాలమూరు ప్రాజెక్ట్.. త్రాగునీటి ప్రొజెసినా.. సాగునీటి ప్రాజెకట్టా..? ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. పాత డిజైన్ తోనే ప్రాజెక్టు నిర్మాణం జరగాలి. .ప్రాజెక్టు నిర్మాణం పై సమగ్ర చర్చ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది తెలంగాణ రాష్ట్రం కాదు, తన రాజ్యం అనుకుంటున్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే ప్రభుత్వ లోపాల పై ప్రశ్నిస్తున్నామని, ప్రాజెక్ట్ లలో పారదర్శకత ఉండాలనడం నేరమా..? ప్రాజెక్టుల్లో మార్పు పై తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడారా? కేసీఆర్ కు బేతాళ మాంత్రికుడు దగ్గరయ్యాకే.. కేసీఆర్ ప్రాజెక్ట్ ల మార్పును తెరపైకి తెచ్చారని అన్నారు. ప్రభుత్వ తప్పిదాలను సమర్థిస్తే చరిత్ర తమను క్షమించదని వ్యాఖ్యానించారు. దోచుకున్న డబ్బుతో కేసీఆర్ కుటుంబం దేశం విడిచి ఎక్కడికైనా పారిపోయే అవకాశమందన్నారు. అందుకే కేటీఆర్, కవితలు దేశాలు చుట్టొస్తున్నారన్నారు. పది పైసలు వడ్డీకి తీసుకునేందుకు అల్లుడు హరీష్ దగ్గర కోట్ల రూపాయలు మూలుగుతున్నాయని, కేసీఆర్ బ్యాంకుల చుట్టు తిరిగేకంటే హరీష్ ను అడిగితే సరిపోతుందని ఎద్దేవా చేశారు. భూసేకరణ జరగకుండా, 200 కోట్ల బిల్లులను డ్రా చేసిన వారిని బేడీలేసి అరెస్ట్ చేయాలన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ను ఎకరాకు 10లక్ష ల చొప్పున అమ్మేందుకు కేసీఆర్ సిద్ధమా ? డీల్ కు ఒప్పుకుంటే 48 గంటల్లో డబ్బులు ఇచ్చెందుకు తాను సిద్ధమని రేవంత్ సవాలు చేశారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో అవినీతికి పాల్పడిన కేసీఆర్ కు జైలు తప్పదని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు. ప్రాజెక్టుల విషయంలో తాను వేస్తున్న ప్రశ్నలు తప్పు అని తేల్చితే తాను రాజకీయాలనుండి తప్పుకుంటా..? మధుకోడా, శశికలకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందన్నారు. మెగా కంపెనీ కోసం అర్హతలను మార్చిన ఘనుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. కేసీఆర్ అవినీతిపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. -
కేసీఆర్..10 లక్షలు ఇస్తా..సిద్దమా : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ సిటీ: ఫామ్ హౌస్ ను ఎకరాకు రూ.10లక్ష ల చొప్పున అమ్మేందుకు కేసీఆర్ సిద్ధమా.? డీల్ కు ఒప్పుకుంటే 48 గంటల్లో డబ్బులు ఇచ్చేందుకు నేను రెడీ అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. డీకే అరుణ ఆధ్వర్యంలో పాలమూరు-రంగా రెడ్డి ప్రాజెక్టు పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు పందులను, గాడిదలను పెంచడానికి తప్పా దేనికి పనికిరారని ఎద్దేవా చేశారు. భూసేకరణ జరగకుండా..రూ.200 కోట్ల బిల్లులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఫ్యామిలీ ఎలా డ్రా చేశారని ప్రశ్నించారు. ఈ దోపిడీ లో కేసీఆర్, ఇంద్రకరణ్ లను అరెస్ట్ చేయాలన్నారు. ప్రజలు తిరగబడ్డ రోజు కేసీఆర్‌కు ఖాసిం రిజ్వీ గతేపడుతుందన్నారు. ప్రాజెక్టుల్లో పారదర్శకత ఉండాలనడం నేరమా..? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల మార్పు పై తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడారా..? అని అడిగారు. కేసీఆర్‌కు బేతాళ మాంత్రికుడు దగ్గరయ్యాకే.. కేసీఆర్ ప్రాజెక్ట్ ల మార్పును తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పిదాలను సమర్దిస్తే మమ్మల్ని చరిత్ర క్షమించదన్నారు. దోచుకున్న డబ్బులతో కేసీఆర్ ఫ్యామిలీ దేశం విడిచి ఎక్కడి కైనా పారిపోయే అవకాశం ఉందన్నారు. అందుకే కేసీఆర్, కేటీఆర్, కవితలు దేశాలు వెళ్లి చూసి వస్తున్నారని విమర్శించారు. అల్లుడు హరీష్ దగ్గర పది పైసలు వడ్డీకి ఇచ్చేందుకు కోట్లు ములుగుతున్నాయన్నారు. కేసీఆర్ బ్యాంక్ ల చుట్టూ తిరిగేకంటే హరీష్ ను అడిగితే సరిపోతుందన్నారు. పాత ప్రాజెక్టులు చేస్తే కమిషన్లు రావని..కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారని విమర్శించారు. -
ప్రాజెక్టు డిజైన్ మార్పుపై చర్చకు సిద్ధమేనా!
మంత్రి జూపల్లికి వంశీచంద్ సవాల్ సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంపుహౌజు డిజైన్ మార్పులో అవినీతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు బహిరంగచర్చకు సిద్ధ మేనా అని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సవాల్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముడుపుల కోసమే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పంపుహౌజుల డిజైన్లు మారుస్తు న్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలకు అనుకూలంగా జూపల్లి పనిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై బహిరంగచర్చకు సిద్ధమని, మంత్రి తాను చేసిన వాదన తప్పు అని నిరూపిస్తే ముక్కును నేలకు రాస్తా అని సవాల్ చేశారు. మంత్రికి రూ.50 కోట్లు ముడుపులుగా ముట్టాయని ఆరోపించారు. -
‘రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా’
హైదరాబాద్: ముడుపుల కోసమే మంత్రి జూపల్లి కృష్ణారావు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పంపు హౌస్ డిజైన్ మారుస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్ట్ కాంట్రాక్టు దక్కించుకున్న నవయుగ కంపెనీకి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు పంప్‌హౌస్ డిజైన్ మార్చవద్దని నివేదించినప్పటికీ నాలుగో కమిటీ వేసి డిజైన్ మారుస్తున్నారని తెలిపారు. ఈ మార్పు వల్ల సర్కారుపై అదనంగా వెయ్యి కోట్లు భారం పడుతుందని చెప్పారు. ఆ కంపెనీ నుంచి మంత్రి జూపల్లి కి రూ. 50 కోట్లు ముడుపులు ముట్టాయని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. పంప్ హౌస్ డిజైన్ మార్పు సరికాదన్న నిపుణుల కమిటీ రిపోర్టులపై మంత్రి జూపల్లి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆ రిపోర్టులు తప్పని మంత్రి రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తానని తెలిపారు. బహిరంగ చర్చ తేదీని, వేదికను మంత్రి జూపల్లే ఖరారు చేయాలని అన్నారు. -
‘పాలమూరు’ పిటిషన్ లో రాజకీయ కోణం
► గ్రీన్ ట్రిబ్యునల్‌లో కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ► ఫిబ్రవరి 10న విచారణ సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్ వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగు న్నాయని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ (చెన్నై) దృష్టికి తెచ్చింది. ఇప్పటికే పనుల అప్పగింత ప్రక్రియ పూర్తయిందని, పనులు నిలిపివేయాలన్న ట్రిబ్యునల్ ఉత్తర్వుల వల్ల ప్రాజెక్టు వ్యయాలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాజెక్టును అడ్డుకు నేందుకు కొన్ని నెలలుగా కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, కోర్టుల్లో కేసులు వేసినా సానుకూల తీర్పులు రాలేదని వివరించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరిం చుకోవాలని విన్నవించింది. అటవీ చట్ట నిబంధనలకు విరుద్ధంగా పాలమూరు ప్రాజెక్టు పనులను ప్రభుత్వం చేపట్టిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ బీరం హర్షవర్ధన్ రెడ్డి వేసిన పిటిషన్ పై మంగళ వారం కేఆర్ రావుతో కూడిన ట్రిబ్యునల్ విచా రణ జరిపింది. ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది మోహన్ వాదనలు వినిపించగా, పిటిషనర్ తరఫున సంజయ్ ఉపాధ్యాయ్, రచనారెడ్డి వాదనలు వినిపించారు. కేసు విచారణకు వచ్చిన వెంటనే ప్రభుత్వం కౌంటర్‌ను ట్రిబ్యునల్‌కు సమర్పిం చింది. కౌంటర్లోని అంశాలను అధ్యయనం చేసి వాదనలు వినిపించేందుకు తమకు గడువు ఇవ్వాలని, బుధవారం వాదనలు వినిపిస్తామ ని పిటిషనర్ తరఫు న్యాయవాదులు ట్రిబ్యున ల్ను కోరారు. అయితే బుధవారం తమకు సమయం లేనందున ఫిబ్రవరి 23న తిరిగి విచారణ చేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అంత గడువు వద్దని, వీలైనంత త్వరగా తిరిగి విచారణ చేయాలని పిటిషనర్లు కోరగా, ఫిబ్రవరి 10న విచారణ చేస్తామని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. పాలమూరు పను లు అటవీ ప్రాంతంలో జరుగుతున్నాయనే విష యం అటవీ అధికా రులు షోకాజ్ నోటీసు ఇచ్చిన తర్వాతే తమ దృష్టికి వచ్చిందని, దీంతో పనులను మరో చోటుకి మార్చాలని నిర్ణయించామని ప్రభుత్వం తన కౌంటర్లో తెలిపింది. ప్యాకేజీ 1, 2 పనులు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో జరగడం లేదని, ఈ ప్రాజెక్టు వల్ల వన్యప్రాణులకు ముప్పు లేదని స్పష్టం చేసింది. అటవీ ప్రాంతానికి వెలుపల పనులు చేస్తున్న నేపథ్యంలో పర్యావరణ చట్టం కింద ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని వివరించింది. రోజుకు రూ.15 లక్షల ఫీజు పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు సుప్రీం కోర్టుకు చెందిన ముగ్గురు న్యాయవాదులను ప్రభుత్వం నియమించుకుంది. న్యాయవాది మోహన్ పరాశరణ్‌కు ఏకంగా ఒకరోజు హియరింగ్‌కు రూ.15 లక్షలు చెల్లించేందుకు నిర్ణయించింది. -
‘పాలమూరు’ పై విచారణకు ఆదేశించాలి
నాగం జనార్దన్‌రెడ్డి సాక్షి,హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో వచ్చిన అవి నీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించి సీఎం కేసీఆర్ తన చిత్తశుద్ధిని, నిజాయితీని నిరూపించు కోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులో అవినీతిని కోర్టులు తప్పుపడితే కేసీఆర్ తప్పుకుంటా రా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా ఈ ప్రాజెక్టులోని అవినీతినిపై సత్వరం విచా రణ జరిపి చర్యలు తీసుకోవాలని డిసెంబర్ 21న విజిలెన్ప్ డీజీని కలసి కోరినట్లు తెలిపారు. ఈ నివేదిను సీబీఐకి పంపి నిజాలు నిగ్గుతేల్చాలన్నారు. దీనికి సంబం ధించి 864 పేజీల నివేదికను సమర్పిం చానని, దీంట్లో ఒక్కపేజీ తప్పుగా ఉందని నిరూపించినా ఏ శిక్షకైనా సిద్ధమేనని చెప్పా రు. వచ్చేవారం జరగనున్న అసెంబ్లీ సమా వేశాల సందర్భంగా అన్ని రాజకీయపార్టీల సభ్యులను కలిసి సమాచారాన్ని ఇస్తామ నని అన్నారు. -
'పాలమూరు'కు అదనంగా రూ.100కోట్లు
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని వివిధ ప్యాకేజీల్లో మార్పులకు నీటిపారుదల శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్యాకేజీ-1, ప్యాకేజీ-16లో గతంలో చేసిన డిజైన్ కాకుండా ప్రస్తుత డిజైన్లు, ప్రాధమ్యాలకు తగినట్లుగా మార్పులు చేసేందుకు ఓకే చెప్పింది. ఈ రెండు ప్యాకేజీల్లో జరిగే మార్పులతో రూ.100 కోట్ల మేర అదనపు భారం పడే అవకాశం ఉంది. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా ఒకటో ప్యాకేజీలో స్టేజ్-1 పంపింగ్ స్టేషన్‌ను మొదట భూ ఉపరితలంపై నిర్మించాలని నిర్ణయించగా, నిర్మాణ ప్రాంతం అటవీ భూమి పరిధిలోకి వస్తుండటం, అటవీ అనుమతుల కోసం జాప్యం జరిగే అవకాశాల నేపథ్యంలో పంపింగ్ స్టేషన్ నిర్మాణ ప్రాంతాన్ని మార్చాలని నిర్ణయించింది. అయితే నిర్మాణ ప్రాంత స్థాల మార్పు, పెరిగే వ్యయ భారం, ఇతర సానుకూల, ప్రతికూలతలను అంచనా వేసేందుకు నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో ప్రభుత్వం కమిటీని వేసింది. ఈ కమిటీ తన నివేదికను రెండ్రోజుల కిందట ప్రభుత్వానికి సమర్పించింది. పంప్‌హౌజ్‌ను భూగర్భంలో నిర్మించడమే సమంజసమని, దీనిద్వారా అటవీ, భూసేకరణ సమస్య పూర్తిగా తప్పుతుందని అందులో తేల్చిచెప్పింది. ప్రాజెక్టులో ఉన్న స్టేజ్-2, 3, 4 పంప్‌హౌజ్‌లను పూర్తిగా భూగర్భంలోనే నిర్మిస్తున్నారని, అందుకే స్టేజ్-1ను అలాగే కొనసాగించానే అభిప్రాయం వెలిబుచ్చింది. భూగర్భ నిర్మాణానికి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్(ఎన్ఐఆర్ఎం) సైతం ఆమోదం చెప్పిన విషయాన్ని అందులో పేర్కొంది. గతంలో నిర్ణయించిన నిర్మాణ వ్యయంతో పోలిస్తే, ప్రస్తుత నిర్మాణ వ్యయంలో రూ.50కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని, అయితే భూసేకరణ, అటవీ భూమిని తప్పిస్తున్నందున రూ.50కోట్ల భారం కూడా ఉండదని తేల్చిచెప్పానట్లుగా నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి జపాన్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే కమిటీ నివేదికకు ఆమోదం దక్కే అవకాశం ఉంది. -
పాలమూరుకు మరో 12, 432 కోట్లు!
- పాత అంచనా రూ. 35,200 కోట్లు - తాజా అంచనా రూ. 47,632 కోట్లు - ఆయకట్టు పెంపు, కొత్త రిజర్వాయర్, తాజా ధరల వర్తింపే కారణం - ఉద్ధండాపూర్ నిర్వాసితులకు మెరుగైన పరిహారమివ్వాలని నిర్ణయం - డిస్ట్రిబ్యూటరీల సర్వే ముగిస్తే వ్యయ అంచనా మరింతగా పెరిగే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. ప్రాజెక్టు పరిధిలో మార్పులు, కొత్త స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్ల (ఎస్ఎస్ఆర్)ను పరిగణనలోకి తీసుకోవడం, ఆయకట్టు విస్తీర్ణం పెంచిన నేపథ్యంలో... ఇంతకు ముందటి అంచనా రూ.35,200 కోట్ల నుంచి ప్రస్తుతం రూ.47,632 కోట్లకు చేరింది. అంటే ఏకంగా రూ.12,432 కోట్ల మేర అదనపు వ్యయం కానుంది. కొత్తగా పెంచిన ఆయకట్టు పరిధిలో కాలువల (డిస్ట్రిబ్యూటరీల) సర్వే పనులు సైతం ముగిస్తే ఈ అంచనా వ్యయం మరింతగా పెరిగే అవకాశముంది. పెరిగిన అంచనాలపై అన్ని స్థాయిల్లో పరిశీలన పూర్తయ్యాక సవరించిన అంచనాతోసర్కార్ ఉత్తర్వుజారీ చేయనుంది. పెరిగిన ఆయకట్టుకు తగ్గట్లే.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తొలుత రూ.35,200 కోట్ల వ్యయ అంచనాతో చేపట్టారు. దీని ద్వారా శ్రీశైలం నుంచి 60 రోజుల్లో 120 టీఎంసీల వరద జలాలను తీసుకుని మహబూబ్‌నగర్ జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డిలో 2.70 లక్షల ఎకరాలు, నల్లగొండలో 30 వేల ఎకరాలకు కలిపి మొత్తంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని తొలుత సంకల్పించారు. నార్లాపూర్ (8.61 టీఎంసీ), ఏదుల (6.55 టీఎంసీ), వట్టెం (16.58 టీఎంసీ), కరివెన (19.15 టీఎంసీ), ఉద్ధండాపూర్ (15.91 టీఎంసీ), కేపీ లక్ష్మీదేవునిపల్లి(2.80 టీఎంసీ) రిజర్వాయర్లను, 5 లిఫ్టులను ప్రతిపాదించారు. అయితే ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో అదనంగా మరో 2.30 లక్షల ఎకరాల ఆయకట్టును చేర్చారు. ఇందులో పరిగి పరిధిలో 6,893 ఎకరాలు, వికారాబాద్‌లో 65,791, చేవెళ్లలో 80,767, మహేశ్వరంలో 10,741, ఇబ్రహీంపట్నంలో 65,808 ఎకరాలకు నీరి చ్చేలా ప్రణాళిక తయారు చేశారు. దీంతో కొత్తగా కాలువలు, టన్నెళ్లు, ఇతర నిర్మాణా లు పెరిగి.. అంచనా వ్యయం పెరిగింది. దీనికితోడు కొత్తగా పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో సుమారు 1.5 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు ఉద్ధండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ల మధ్య అం తారం వద్ద 16 టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్ నిర్మించాలని తాజాగా నిర్ణయిం చారు. దీనితో అదనంగా రూ.2,600 కోట్ల వ్యయం పెరుగుతోంది. ఉద్ధండాపూర్ రిజ ర్వాయర్ కింద 8 గ్రామాల్లో 1,275 గృహాలు ముంపునకు గురవుతున్నాయి. అక్కడ భూ ములధరలు భారీగా ఉండటంతో ఎక్కువ పరిహారమివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ధరల మార్పుతో.. పాలమూరు ప్రాజెక్టు అంచనాలన్నీ 2014- 15 ఎస్ఎస్ఆర్ రేట్లతో రూపొందిం చారు. ప్రస్తుతం 2015-16 ఎస్‌ఎస్‌ఆర్‌ను పరిగణనలోకి తీసుకుంటూ సిమెంట్, ఉక్కు, లేబర్, ఇతర చార్జీలను లెక్కించారు. ఇలా ఎస్ఎస్ఆర్ మార్పుతోనే ఏకంగా రూ.3,500 కోట్ల వరకు అంచనా వ్యయం పెరిగింది. పంపింగ్ స్టేషన్ల వద్ద చేయాల్సిన హైడ్రో మెకానికల్, ఎలక్ట్రో మెకానికల్ (ఈఎం అండ్ హెచ్ఎం) పనుల విలువ గతంలో రూ.6,258 కోట్లుగా అంచనా వేయగా.. ఇది మరో రూ.వెయ్యి కోట్ల వరకు అదనంగా పెరిగినట్లుగా తెలుస్తోం ది. మరికొన్ని గుర్తించని పనులు సైతం తా జాగా చేరడంతో మొత్తంగా అంచనా వ్యయం రూ.12,432 కోట్ల మేర పెరిగింది. -
రైతుల వినతులపై నిర్ణయం తీసుకోండి
‘పాలమూరు’ భూసేకరణపై కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు సేకరించాలనుకుంటే తమకు 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం, పునరావాసం కల్పించాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం కరుకొండ గ్రామానికి చెందిన రైతులు పెట్టుకున్న వినతిపత్రాలను పరిశీలించాలని హైకోర్టు గురువారం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. అప్పటివరకు పిటిషనర్ల భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం అవసరమైన భూమిని సేకరించేందుకు ప్రభుత్వం జీఓ 123 కింద చర్యలు చేపట్టిందని, అధికారులు తమ భూ ములను బలవంతంగా తీసుకుంటున్నారని, దీనిని అడ్డుకోవాలని కారుకొండ గ్రామానికి చెందిన బి.స్వామిరావు, మరో 23 మందిరైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ, జీవో 123ను అడ్డంపెట్టుకుని ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. భూ ముల అమ్మడానికి ఆసక్తి కనబరిచే రైతుల నుంచి భూమిని కొనుగోలు చేసేందుకు విధి విధానాలను రూపొ ందిస్తూ జారీ చేసిన ఈ జీవో 123 వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉందని తెలిపారు. అంతేకాక భూ సమీకరణ సమయంలో బాధితులకు పునరావాసం కల్పిస్తామని పేర్కొన్న ప్రభుత్వం, తరువాత ఈ క్లాజును తొలగిస్తూ మరో జీఓ జారీ చేసిందని వివరించారు. రైతుల నుంచి అధికారులు బలవంతంగా ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది (భూ సేకరణ) జువ్వాది శ్రీదేవి జోక్యం చేసుకుంటూ ఈ వాదనలను తోసిపుచ్చారు. పిటిషనర్లవి కేవలం ఆరోపణలేనన్నారు. తాము ఏ ఒక్క రైతు నుంచి బలవంతంగా సెం టు భూమిని కూడా తీసుకోవడం లేదని వివరించారు. నిబంధనల మేరకే భూ సేకరణ చేపడుతున్నామని చెప్పారు. తరువాత రచనారెడ్డి వాదనలను కొనసాగిస్తూ.. పిటిషనర్లు 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం, పునరావాసం కల్పించేలా చూడాలంటూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ల వినతిపత్రాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అప్పటి వరకు పిటిషనర్ల భూముల జోలికి వెళ్లొద్దని అధికారులకు తేల్చి చెబుతూ ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించారు. -
ఆ ప్రాజెక్టులపై కేంద్రం జోక్యం చేసుకోవాలి
వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదిపై నిర్మించ తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై కేంద్రప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఏపీ శాసనమండలిలో వైఎస్సార్‌సీపీపక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం లో విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులవల్ల ఏపీకి తీరని అన్యాయం జరగబోతోందని, వీటి నిర్మాణం జరిగితే శాశ్వతంగా ఏపీ ప్రజలు సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతోపాటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు, ప్రాజెక్టులపై అభ్యంతరం చెప్పని టీడీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 16, 17, 18 తేదీల్లో కర్నూలులో నిరాహారదీక్ష చేపడుతున్నారని తెలిపారు. జగన్ జలదీక్ష జరుగుతూ ఉండగానే నదీజలాల విషయంలో ఏపీకి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా 17న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు తెలపాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిందని చెప్పారు. -
గృహ నిర్మాణ పరిహారం కొలిక్కి!
‘పాలమూరు-రంగారెడ్డి’ ఆర్అండ్బీ శాఖకు చేరిన ఫైలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోత ల పథకంలో ముంపునకు గురౌతున్న గృహాలకు పరిహారం చెల్లింపు అంశం కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ముంపు ప్రాంతాల్లో గృహాలపై రెవెన్యూ, ఆర్అండ్ బీ శాఖల సర్వేలు, విలువను మదింపు చేసిన తర్వాత పరిహారం చెల్లింపు విధానాన్ని పక్కనపెట్టి, కొత్తగా గృహ నిర్మాణ రకాన్ని బట్టి చదరపు అడుగును ప్రాతిపదికగా తీసుకొని సత్వరమే చెల్లింపులు చేసేలా నీటిపారుదల శాఖ వేసిన ప్రతిపాదనలకు ఇతర శాఖల నుంచి అంగీకారం వచ్చినట్లుగా సమాచారం. సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర ప్రజోపయోగ ప్రాజెక్టుల నిర్మాణంలో గృహాలు కోల్పోయేవారికి చెల్లించే పరిహారం విషయంలో ఆర్అండ్బీ కొత్త నిబంధనలను రూపొందించింది. దీని ప్రకారం గృహ నిర్మాణం ప్రాథమిక అంచనా మొత్తం రూ. 4 లక్షలు, అంతకంటే తక్కువగా ఉంటే నిర్మాణ వైశాల్యం (ప్లింథ్ ఏరియా) రేట్ల ఆధారంగా లెక్కిస్తారు. ఆ మొత్తం రూ. 4 లక్షలకంటే ఎక్కువగా ఉంటే నిర్మాణం పూర్తి కొలతలు స్వీకరించి ఇంజనీరింగ్ అధికారులు రూపొందించే స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు (ఎస్ఎస్ఆర్) ప్రకారం లెక్క గడతారు. పాత విధానమైతే పనుల్లో జాప్యం: అయితే ఇక్కడ ఆర్అండ్బీ శాఖ నిబంధన మేరకు రూ.4 లక్షల కన్నా తక్కువగా ఉన్న నిర్మాణాలకు, ఎక్కువగా ఉండే నిర్మాణాలకు వేర్వేరు నిబంధనలు తెచ్చారు. ఈ విధానాన్ని పాలమూరు ప్రాజెక్టులో అమలు చేస్తే తీవ్ర జాప్యం జరుగుతుంద ంటూ నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. రూ. 4 లక్షల కన్నా ఎక్కువ ఉండే నిర్మాణాలను సంబంధిత శాఖలు కొలతలు లెక్కించి, తరుగుదల నిర్ధారించి, కలప రకాన్ని గుర్తించి ధరను నిర్ణయించడం మొదలు పెడితే ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంటుందని వివరించింది. ఈ ప్రతిపాదనలపై ఆర్అండ్బీ అడ్డుచెప్పింది. రూ. 4 లక్షల పైబడి ఉండే గృహాలకు నిర్మాణ వైశాల్యాల ఆధారంగా పరిహారం చెల్లించడం కుదరదని తేల్చి చెప్పింది. అయితే దీనిపై శాఖల ముఖ్య కార్యదర్శుల స్థాయిలో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో రూ. 4 లక్షల పైబడి ఉండే గృహాలకు ఫ్లింత్ ఏరియా ఆధారంగా పరిహారం చెల్లించేందుకు మార్గం సుగమం అయింది. దీనికి సంబంధించిన ఫైలు ఇప్పటికే ఆర్‌అండ్‌బీకి చేరినట్లుగా తెలిసింది. అక్కడినుంచి ప్రభుత్వానికి చేరిన వెంటనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. -
పాలమూరు ఎత్తిపోతల భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీదేవి ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ పురోగతిపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశించిన కాలపరిమితిలోపు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించాలని, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన చోట జీఓ 123 ప్రకారం భూమిని తీసుకోవాలని, ముందుకు రాని చోట భూమిని సేకరించాలని సూచించారు. ఆర్డీఓలు దేవెందర్‌రెడ్డి, రాంచందర్, హన్మంతరెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ ట్వింకిల్ జాయ్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈఈలు కోటేశ్వర్రావు, విజయభాస్కర్‌రెడ్డి, శ్రీరాంరెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
‘పాలమూరు’పై ఒప్పందాలు వద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్) పనులకు సంబంధించి ఎలాంటి ఒప్పం దాలు చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం మౌఖికంగా స్పష్టం చేసింది. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది సంబంధం లేని వివరాలతో కోర్టును గందరగోళానికి గురి చేస్తున్నారని, గడువిస్తే పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతామని రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు తెలిపారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘పాలమూరు-రంగారెడ్డి పెద్దపీట
► పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ► భూకొనుగోళ్ల కోసం ఇప్పటికే రూ.300 ► కోట్లు విడుదల చేసింది. ► రిజర్వాయర్లు : నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన ► అవసరమైన భూమి 16,446.40 ఎకరాలు ► రిజిస్ట్రేషన్లు అయినవి 6024.26 ఎకరాలు ► బడ్జెట్ కేటాయింపులు రూ.7,860 కోట్లు రాష్ట్రం మొత్తంలో సాగునీటి రంగానికి సంబంధించి దాదాపు 35 ప్రాజెక్టులకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించగా, అత్యధికంగా పాలమూరు ఎత్తిపోతల పథకానికే కేటాయించింది. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిధులను కేటాయించినట్లు అవగతమవుతోంది. ఇప్పటికే ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి నిర్మాణం పనులు చేపట్టేందుకు 18ప్యాకేజీలతో రూ.29,924.78కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. ఈ ఎత్తిపోతల కింద భూసేకరణకు రైతుల నుంచి భూకొనుగోళ్ల కోసం రూ.300కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. జిల్లాలో దాదాపు 7 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. శ్రీశైలం జలాశయం వెనుకభాగం నుండి నార్లాపూర్ ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా రూపొందించిన ఈ పథకం కింద ఉద్దండాపూర్ జలాశయం వరకు నీటిని తరలించేలా ప్రణాళికలు రూపొందించిన అధికారులు టెండర్లను సైతం ఖరారు చేశారు. ఈ ఎత్తిపోతల పథకంలో ఇప్పటికే రెండుసార్లు మార్పులు జరిగాయి. చివరికి నార్లపూర్ నుంచి లక్ష్మిదేవిపల్లి వరకు నీటిని ఎత్తిపోసేలా డిజైన్‌ను ఖరారు చేశారు. దీంతో జిల్లాలో 16,446.40 ఎకరాల భూమిని ప్రాజెక్టుల నిర్మాణానికి సేకరించాలని సంకల్పించారు. భూసేకరణ అవార్డు విధానం ద్వారా ఆలస్యమవుతుందన్న భావనతో ప్రభుత్వం 123జీఓను జారీచేసింది. ఇప్పటివరకు నార్లాపూర్, ఏదుల, కర్వెన, వట్టెం జలాశయం ప్రాంతాల్లో 6,024.26 ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లను సైతం పూర్తిచేసింది. ఈ మొత్తం ప్రక్రియలో ఉద్దండాపూర్ తప్ప 2,125.02 ఎకరాల అసైన్డ్ భూములు 12,985.20 ఎకరాల పట్టా భూములను కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 661.31 ఎకరాల అసైన్డ్, 10,209.15 ఎకరాల పట్టా భూములను అప్పగించేందుకు రైతులు సుముఖత వ్యక్తం చేశారు. వట్టెం జలాశయం పరిధిలో బిజినేపల్లి మండలంలోని కొందరు రైతులు భూ పరిహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లోకాయుక్తను ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా లోకాయుక్త జిల్లా కలెక్టర్‌ను కోరింది. -
తెరుచుకున్న ‘పాలమూరు’ టెండర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన అనంతరం అత్యంత భారీ వ్యయంతో చేపడుతున్న ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల ఆర్థిక టెండర్లు(ప్రైస్ బిడ్)ను అధికారులు శుక్ర వారం రాత్రి తెరిచారు. మొత్తం 18 ప్యాకేజీలకు గానూ రూ.29,924.78 కోట్ల పనులను నవయుగ, కేఎన్ఆర్, మెగా, హెచ్‌ఈఎస్, సుశీ ఇన్ఫ్రా వంటి ప్రధాన కాంట్రాక్టు సంస్థలు దక్కించుకున్నాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 62 మండలాలకు చెందిన 1,131 గ్రామాల పరిధిలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఉద్దేశ్యంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రూ.35,200 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులకు జనవరి 17న నీటి పారుదల శాఖ టెండర్లను పిలిచింది. వీటికి చెందిన టెక్నికల్ బిడ్లను ఫిబ్రవరి 20నే తెరిచారు. అయితే సాంకేతిక అర్హత పరిశీలనలో జాప్యం కారణంగా ఫిబ్రవరి 29న తెరవాల్సిన ప్రైస్ బిడ్లను శుక్రవారం రాత్రి తెరిచారు. పెద్ద ప్యాకేజీలన్నీ బడా సంస్థలకే.. ప్రాజెక్టులో పెద్ద ప్యాకేజీల పనులను దక్కించుకునేందుకు పటేల్, మెగా, నవయుగ, ఎల్ అండ్ టీ వంటి సంస్థలు పోటీలో నిలిచాయి. అయితే పటేల్, ఎల్అండ్టీ, గాయత్రి వంటి సంస్థలు సాంకేతిక అర్హత సాధించలేదని నీటిపారుదల వర్గాల ద్వారా తెలిసింది. దీంతో మెజార్టీ ప్యాకేజీల్లో పోటీ లేకుండానే ఆయా సంస్థలు పనులు దక్కించుకున్నాయి. ప్యాకేజీ 10, ప్యాకేజీ 15లో మినహా అన్ని చోట్ల తక్కువ విలువకే టెండర్లు దాఖలయ్యాయి. సూపరింటెండెంట్ స్థాయి అధికారులు టెండర్లను తెరిచి, పరిశీలన కోసం చీఫ్ ఇంజనీర్‌కు పంపించారు. సీఈ స్థాయిలో పరిశీలన పూర్తయిన అనంతరం కమిషనర్ ఆఫ్ టెండర్స్ పరిశీలనకు పంపనున్నారు. అక్కడ టెండర్లు పొందిన సంస్థల అర్హతలను పరిశీలించిన తర్వాత పనులు అప్పగిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు వెల్లడించాయి. -
సత్వర పరిహారానికి మోకాలడ్డు!
♦ ‘పాలమూరు’ప్రాజెక్టులో గృహాల పరిహారం చెల్లింపుల నిబంధనల సడలింపునకు ఆర్అండ్బీ శాఖ నో ♦ రూ.4 లక్షల కన్నా అధిక విలువ చేసే గృహాలకు పూర్తి సర్వే చేశాకే పరిహారం నిర్ణయించాలని సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకంలో ముంపునకు గురవుతున్న గృహాలకు పరిహారం చెల్లింపును పక్కాగా, వేగంగా చేసేందుకు నీటి పారుదల శాఖ తీసుకొచ్చిన మార్గదర్శకాలకు రోడ్లు, భవనాల శాఖ మోకాలడ్డుతోంది. ముంపు ప్రాంతాల్లో గృహా లపై పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ శాఖల సర్వేలు, విలువను మదింపు చేసిన తర్వాత పరిహారం చెల్లింపు విధానాన్ని పక్కనపెట్టి, కొత్తగా గృహనిర్మాణ రకాన్ని బట్టి చదరపు అడుగును ప్రాతిపదికగా తీసుకొని సత్వరమే చెల్లింపులు చేసేలా వేసిన ప్రణాళికలపై నీళ్లు చల్లుతోంది. కేవలం రూ.4 లక్షల విలువ చేసే గృహాల వర కైతే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అంతకుమించి విలువజేసే నిర్మాణాలైతే మాత్రం తమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని కరాఖండీగా చెబుతోంది. ఇది నీటి పారుదల శాఖకు పెద్ద తలనొప్పిగా మారింది. మార్పు చేస్తామంటే కుదరదు.. ఆర్అండ్బీ కొత్త నిబంధనల ప్రకారం గృహ నిర్మాణం ప్రాథమిక అంచనా మొత్తం రూ.4 లక్షలు, అంతకంటే తక్కువగా ఉంటే నిర్మాణ వైశాల్యం (ప్లింథ్ ఏరియా) రేట్ల ఆధారంగా లెక్కిస్తారు. ఆ మొత్తం రూ.4 లక్షలకంటే ఎక్కువగా ఉంటే నిర్మాణం పూర్తి కొలతలు స్వీకరించి ఇంజనీరింగ్ అధికారులు రూపొందించే స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు(ఎస్ఎస్ఆర్) ప్రకారం లెక్కగడతారు. ఈ విధానాన్ని పాలమూరు ప్రాజెక్టులో అమలు చేస్తే తీవ్ర జాప్యం జరుగుతుంద ంటూ నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. పరిహారాన్ని లెక్కించేందుకు రెవెన్యూ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, అటవీశాఖల మధ్య సమన్వయం కుదరాలని, అది సమయానుకూలంగా జరగకుంటే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతుందని వివరించింది. గతంలో ఇలాంటి విధానాల వల్ల పరిహార చెల్లింపుల్లో అనేక అక్రమాలు జరిగాయని, శాఖ సమన్వయ లేమితో ప్రాజెక్టులు పూర్తికాలేదని తెలిపింది. ఈ దృష్ట్యా రూ.4 లక్షల పైచిలుకు ఉన్న గృహ నిర్మాణాలకు సైతం గృహ నిర్మాణ రకాన్ని అనుసరించి ముందుగా నిర్ణయించిన రేట్లకు ప్రకారం చదరపు మీటర్ చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రతిపాదనలపై రెండు రోజుల కిందట ఆర్అండ్బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నీటి పారుదల శాఖకు లేఖ రాశారు. రూ.4 లక్షల పైబడి ఉండే గృహాలకు నిర్మాణ వైశాల్యాల ఆధారంగా పరిహారం చెల్లించడం కుదరదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గృహానికి పూర్తి స్థాయి కొలతలు తీసుకొని, వాటర్ సరఫరా, విద్యుత్ సౌకర్యం అన్నీ పరిశీలించాకే దాని వ్యయాన్ని లెక్కించాలని తేల్చి చెప్పింది. ఒక్క ప్రాజెక్టు కోసం ప్రత్యేక నిబంధనలు తెస్తామంటే ఒప్పుకోమని స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయానికి రావాలని నీటి పారుదల శాఖ యోచిస్తోంది. -
పాలమూరు-రంగారెడ్డి పథకానికి టెండర్లు ఖరారు
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి టెండర్లు ఖారారయ్యాయి. మొత్తంగా 18 ప్యాకేజీలకు గానూ సుమారు 30 వేల కోట్ల రూపాయలకు టెండర్లు ఖరారయినట్లు సమాచారం అందింది. ఫైనాన్షియల్ బిడ్ ల పరిశీలన నేటితో పూర్తియింది. ప్యాకేజీల వారిగా ఆయా కంపెనీలకు టెండర్లు ఖారారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్యాకేజీల వారీగా నవయుగ, రాఘవ, పీఎస్ కేకేఎన్ ఆర్, మెగా, ఎస్డబ్ల్యూ కంపెనీలకు టెండర్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఎత్తిపోతల పథకం పనులలో ముందడుగు వేసింది. -
'టీడీపీకి ఉత్తమ్ వంతపాడటం సిగ్గుచేటు'
హైదరాబాద్: ఇప్పటికే ఎన్నికల హామీలు నెరవేర్చలేక ఆంధ్ర ప్రజల నుంచి టీడీపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుందని తెలంగాణ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆయన గురువారం రాత్రి మీడియాతో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ ఏపీ మంత్రి దేవినేని ఉమ కేంద్రాన్ని కోరడాన్ని హరీష్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే బదులు ఏపీలో హామీలు నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు దృష్టిపెడితే మంచిదని హరీష్ సూచించారు. పాలమూరును అడ్డుకోవాలన్న టీడీపీ ప్రయత్నాలకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వంతపాడటం సిగ్గుచేటు అని విమర్శించారు. -
‘తోడేళ్ల ఫలహారం’ బిగుసుకుంటోంది
సాక్షి ప్రతినిధి మహబూబునగర్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూ సేకరణ, పరిహారంలో జరిగిన అవకతవకల ఉచ్చు కొందరు అధికారుల మెడకు బిగుసుకుంటోంది. అక్రమాలకు సంబంధించి సాక్షిలో వరుస కథనాలు రావడంతో అధికారులు నష్టపరిహారం పంపిణీపై అప్రమత్తమయ్యారు. జిల్లాలోని పలు రిజర్వాయర్ల పరిధిలో భూ సేకరణ జరుగుతున్న తీరు, నష్టపరిహారం నిర్ధారిస్తున్న విషయంపై అధికారులు దృష్టి సారించారు. మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కర్వెన రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణలో వెలుగుచూసిన అక్రమాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వ యంత్రాంగం ఇక క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు పర్యటించాకే పంట భూములను రెండు పంటలవిగా నిర్ధారించాలని నిర్ణయిం చినట్లు తెలుస్తోంది. వాస్తవంగా భూ సేకరణకు సంబంధించి నష్టపరిహారం నిర్ధారణ చేసుకోవడానికి ఆయాభూములను సంబంధిత పర్యవేక్షణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలున్నా కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి క్షేత్రస్థాయి పర్యటనలే చేయలేనట్లు తెలుస్తోంది. దీంతో ఒక పంట భూముల ను రెండు పంటలు పండేవిగా రికార్డుల్లోకి ఎక్కడంతో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైంది. మరోమారు పరిశీలన కర్వెన రిజర్వాయర్ పరిధిలో భూ సేకరణలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి దిద్దుబాటు చర్యలకు కొందరు క్షేత్రస్థాయి ఉద్యోగులు చేపట్టినట్లు తెలుస్తోంది. అక్రమాలు జరగలేదని వాదించిన వారిలో కొందరు అధికారులు బుధవారం కర్వెన రిజర్వాయర్ పరిధిలో నష్టపరిహారం చెల్లించిన భూముల్లో కొన్నింటిని పరిశీలించారు. వాటిలో ఉన్న బోర్లు పనిచేస్తున్నాయా..లేదా..అవి ఎన్ని ఎకరాలకు నీరందించే సామర్థ్యం కలిగి ఉన్నాయన్న అంశాన్ని పరిశీలించారు. భూ సేకరణలో ఎటువంటి అక్రమాలూ జరగని పక్షంలో నష్టపరిహారం చెల్లింపులు జరిగిన భూములను, వాటిలోని బోర్లను క్షేత్రస్థాయి అధికారి తరచితరచి పరిశీలించడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. అదే విధంగా వాస్తవానికి భిన్నంగా రెండు పంటల భూములుగా రికార్డులలో నమోదైన వాటికి సంబంధించిన నష్టపరిహారం చెల్లింపులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. కొందరికి చెల్లించి, తమవి ఎలా ఆపుతారని లబ్ధిదారులు ప్రశ్నిస్తుండడంతో చెల్లింపులను తాత్కాలికంగానే నిలిపివేస్తున్నామని సర్దిచెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. భూ పరిహారం విషయంలో ఇప్పటికే ఆర్డీఓ కొంతమేరకు విచారణ జరపడం.. ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు నివేదించడం తదితర పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కొందరు ఉద్యోగులు క్షేత్రస్థాయిలో దిద్దుబాటు చర్యలకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
‘తోడేళ్ల ఫలహారం’ బట్టబయలు
- ‘పాలమూరు-రంగారెడ్డి’లో అక్రమాలపై ఆర్డీవో విచారణ - కరివెనలో క్షేత్రస్థాయి పర్యటన.. అవకతవకల గుర్తింపు - నేడు మరిన్ని భూములు, అంచనాల పరిశీలన సాక్షి, హైదరాబాద్, మహబూబ్‌నగర్: ‘పాలమూరు పరిహారంలో తోడేళ్ల ఫలహారం’ వ్యవహారం బట్టబయలైంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ పరిహారంలో అక్రమాలపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికారులు స్పందించారు. భూత్పూర్ మండల పరిధిలోని కరివెన గ్రామంలో మహబూబ్‌నగర్ ఆర్డీవో హన్మంతరెడ్డి క్షేత్రస్థాయి విచారణ జరిపారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం ఆధారంగా... కరివెన గ్రామ శివారులోని 167, 168, 169, 170, 190, 191, 192, 193 సర్వే నంబర్లలో భూములు, పరిహారం లెక్కలను ఆయన పరిశీలించారు. స్థానిక రెవెన్యూ అధికారులు రెండు పంటల భూములుగా పేర్కొన్న భూములకు, బోర్లకు సంబంధించి పలు అవకతవకలను గుర్తించారు. కొన్ని బోర్లలో కొద్దిపాటి నీటివసతి ఉందని, అయితే ఆ నీటితో ఎకరాకు మించి రెండు పంటలు పండించే అవకాశం లేదని నిర్ధారించారు. 167 సర్వే నంబర్లోని పత్తి చేలల్లో బోరు ఉన్నా.. విద్యుత్ కనెక్షన్ ఉన్న ఆనవాలు కనిపించలేదు. 170 సర్వే నంబర్లో భూమి బీడుగా ఉన్నా... గతంలో ఎప్పుడో ఉన్న బోరుకు పైపులు బిగించి పరిహారం వచ్చేలా స్థానిక రెవెన్యూ అధికారులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆర్డీవో ఏడు బోర్లను పరిశీలించగా నాలుగింటిలో మాత్రమే కొద్దిపాటి నీరున్నట్లు, మరో మూడింటిలో నీరు పడలేదని గుర్తించారు. ఇవి కూడా గతంలోనే పాడుబడిన బావులుగా ఆయనకు ప్రాథమికంగా సమాచారం అందింది. దీంతో పరిహారం పేరిట జరుగుతున్న అక్రమాలపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయాభావంతో పూర్తిస్థాయిలో విచారణ చేయలేదని, మంగళవారం మిగతా సర్వే నంబర్లలో క్షేత్రస్థాయి విచారణ చేస్తామని ఆర్డీవో తెలిపారు. విచారణ సమయంలో ఆర్డీవో వెంట భూసర్వేశాఖ డీఐ శివకుమార్, మండల సర్వేయర్ వెంకటేష్, ఆర్ఐ గురురాజరావ్, వీఆర్వో హన్మంత్ ఉన్నారు. స్థానిక తహసీల్దార్ జ్యోతి ఇక్కడికి రాకపోవడం గమనార్హం. మరోవైపు భూపరిహారం పంపిణీ అక్రమాలు వెలుగులోకి రావడంతో స్థానిక రెవెన్యూ అధికారులు కంగుతిన్నారు. దీంతోపాటు కరివెన ముంపు బాధితులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తమ పొలాలకు వచ్చిన పరిహారంపై చర్చించుకోవడం గమనార్హం. ఇదే గ్రామానికి చెందిన ఓ టీఆర్ఎస్ నేత సోదరులు కూడా ఇక్కడికి వచ్చి పరిహారంలో తమకు వాటా ఉందని వాదులాడుకున్నారు. అక్రమాలపై విజిలెన్స్ కన్ను! పరిహారం అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ దృష్టి సారించింది. సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని చూసిన విజిలెన్స్ అధికారులు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే విచారణ చేపట్టే అవకాశముంది. ఇక పోలీస్ ఇంటలిజెన్స్ సైతం ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లింది. ఎలాంటి అక్రమాలు లేవు: తహసీల్దార్ పాలమూరు ప్రాజెక్టు భూపరిహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని భూత్పూర్ తహసీల్దార్ జ్యోతి వివరణ ఇచ్చారు. రక్షిత కౌలుదారు ఉన్న సర్వే నంబర్లకు నోటిఫికేషన్ జారీ చేసినా నిర్దేశిత సమయంలో.. ఎలాంటి అభ్యంతరాలు రాలేదన్నారు. భూనష్ట పరిహారం కేవలం భూములకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, అందులోని బావులు, చెట్లు, బోర్లకు ప్రత్యేకంగా పరిహారం ఇవ్వడానికి వీలుపడదని చెప్పారు. ఒక బోరు కింద కనీసం మూడెకరాల భూమిని రెండు పంటల భూమిగా పరిగణించామని, ఎక్కువ పారుదల గల బోరున్న చోట మూడెకరాల కన్నా ఎక్కువ భూమిని రెండు పంటల భూమిగా పరిగణించవచ్చని పేర్కొన్నారు. భూకొనుగోలు పథకం కింద సేకరించిన భూములను మినహాయించి, అవే సర్వే నంబర్లలో ఉన్న మిగులు భూమికి పరిహారం ఇప్పించామని, ఎలాంటి అక్రమాలు జరగలేదని వివరణ ఇచ్చారు. అక్రమాల నిగ్గు తేల్చండి: సీఎంకు పొంగులేటి లేఖ పాలమూరు భూపరిహారంలో అక్రమాల నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. పరిహారం చెల్లింపులో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోందని... దీనిపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లేఖ ప్రతిని మంత్రి టి.హరీశ్‌రావుకు పంపారు. -
‘పాలమూరు’కు టెండర్ నోటిఫికేషన్
* ఈ నెల 25 నుంచి అందుబాటులో టెండర్ డాక్యుమెంట్ * ఫిబ్రవరి 10 వరకు టెండర్ల స్వీకరణ.. పనులు పూర్తికి 30 నెలల గడువు సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల టెండర్లకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తంగా రూ. 24 వేల కోట్ల విలువైన ఈ పనులను 15 ప్యాకేజీలుగా విభజించి.. కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను ఆహ్వానించారు. ఈనెల 25 నుంచి టెం డర్ డాక్యుమెంట్లు అందుబాటులో ఉంటాయి. వచ్చే నెల 10 వరకు టెండర్లను స్వీకరిస్తారు. మొత్తం పనులను 30 నెలల్లో పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 62 మండలాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల అంచనాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. వీటికి సంబంధించి సివిల్, ఎలక్ట్రో మెకానికల్ పనులను విభజించాలన్న సూచనను పక్కనపెట్టి, అన్ని పనులకు ఒకే టెండర్ పిలవాలని నిర్ణయించారు. ఈ టెండర్ పనులను వెంటనే పూర్తిచేయాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు... అధికారులు ప్యాకేజీల్లో చిన్నచిన్న మార్పులు చేసి టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్యాకేజీ-8లో భాగంగా వట్టెం గ్రామం వద్ద నిర్మించనున్న వెంకటాద్రి జలాశయం పనులకు గరిష్టంగా రూ. 4,303.37 కోట్లతో టెండర్ పిలవగా... కనిష్టంగా ప్యాకేజీ-3లో ఉన్న నార్లపూర్ వద్ద నిర్మించే అంజనగిరి జలాశయానికి రూ. 391.50 కోట్లతో టెండర్ పిలిచారు. -
త్వరలో ‘పాలమూరు’ టెండర్
► రూ.27 వేల కోట్ల పనులకు ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల ఆరంభానికి నేడో, రేపో తొలి అడుగు పడనుంది. ప్రాజెక్టు టెండర్ నోటిఫికేషన్ సోమవారంగాని, మంగళవారంగాని విడుదల కానుంది. మొత్తంగా 18 ప్యాకేజీలకుగానూ రూ.27 వేల కోట్ల పనులు చేసేందుకు అధికారులు టెండర్లు ఆహ్వానించనున్నట్లుగా తెలిసింది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 14 రోజులపాటు కాంట్రాక్టు ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోని 62 మండలాల్లో 1,131 గ్రామాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఉద్దేశంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రూ.35,200 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల అంచనాలు సైతం ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఇక సివిల్, ఎలక్ట్రోమెకానికల్ పనులను విభజించాలన్న సూచనను పక్కన పెట్టి, అన్ని పనులకు ఒకే టెండర్ పిలవాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు టెండర్ పనులను రెండువారాల్లో పూర్తి చేయాలని గత సమీక్షల సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దానికి అనుగుణంగా కదలిన అధికారులు ప్యాకేజీల్లో చిన్న, చిన్న మార్పులు చేసి టెండర్ల ప్రక్రియకు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రానికి సాంకేతిక అంశాలను సరి చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు నిర్ణయం చేశారని ఉన్నతాధికార వర్గాల ద్వారా తెలిసింది.