న్యూఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో నిధులకు సంబంధించి సవరించిన అంచనాలను సవాలు చేస్తూ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సవరించిన అంచనాలతో ప్రాజెక్ట్ వ్యయంలో నిధులకు సంబంధించి అంకెలు అసాధారణ రీతిలో పెరిగాయని ఈ మేరకు పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.
ప్రాజెక్టులో భారీగా అవకతవకలు జరిగాయని, కాంట్రాక్టు తీసుకున్న సంస్థలపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆదాయపన్ను శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తమ సంస్థ పేర్లు లేవని మేఘా సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరి 14కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment