కేసీఆర్..10 లక్షలు ఇస్తా..సిద్దమా : రేవంత్ రెడ్డి
కేసీఆర్..10 లక్షలు ఇస్తా..సిద్దమా : రేవంత్ రెడ్డి
Published Mon, Mar 6 2017 5:56 PM | Last Updated on Fri, Mar 22 2019 3:19 PM
హైదరాబాద్ సిటీ: ఫామ్ హౌస్ ను ఎకరాకు రూ.10లక్ష ల చొప్పున అమ్మేందుకు కేసీఆర్ సిద్ధమా.? డీల్ కు ఒప్పుకుంటే 48 గంటల్లో డబ్బులు ఇచ్చేందుకు నేను రెడీ అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. డీకే అరుణ ఆధ్వర్యంలో పాలమూరు-రంగా రెడ్డి ప్రాజెక్టు పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
టీఆర్‌ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు పందులను, గాడిదలను పెంచడానికి తప్పా దేనికి పనికిరారని ఎద్దేవా చేశారు. భూసేకరణ జరగకుండా..రూ.200 కోట్ల బిల్లులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఫ్యామిలీ ఎలా డ్రా చేశారని ప్రశ్నించారు. ఈ దోపిడీ లో కేసీఆర్, ఇంద్రకరణ్ లను అరెస్ట్ చేయాలన్నారు. ప్రజలు తిరగబడ్డ రోజు కేసీఆర్‌కు ఖాసిం రిజ్వీ గతేపడుతుందన్నారు. ప్రాజెక్టుల్లో పారదర్శకత ఉండాలనడం నేరమా..? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల మార్పు పై తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడారా..? అని అడిగారు.
కేసీఆర్‌కు బేతాళ మాంత్రికుడు దగ్గరయ్యాకే.. కేసీఆర్ ప్రాజెక్ట్ ల మార్పును తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పిదాలను సమర్దిస్తే మమ్మల్ని చరిత్ర క్షమించదన్నారు. దోచుకున్న డబ్బులతో కేసీఆర్ ఫ్యామిలీ దేశం విడిచి ఎక్కడి కైనా పారిపోయే అవకాశం ఉందన్నారు. అందుకే కేసీఆర్, కేటీఆర్, కవితలు దేశాలు వెళ్లి చూసి వస్తున్నారని విమర్శించారు. అల్లుడు హరీష్ దగ్గర పది పైసలు వడ్డీకి ఇచ్చేందుకు కోట్లు ములుగుతున్నాయన్నారు. కేసీఆర్ బ్యాంక్ ల చుట్టూ తిరిగేకంటే హరీష్ ను అడిగితే సరిపోతుందన్నారు. పాత ప్రాజెక్టులు చేస్తే కమిషన్‌లు రావని..కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారని విమర్శించారు.
Advertisement
Advertisement