మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. చిత్రంలో డీకే అరుణ తదితరులు
పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై బీజేపీ నేత డీకే అరుణ
రేవంత్ సీఎంలా కాదు.. ఎంపీటీసీలా మాట్లాడుతున్నారని విమర్శ
పాలమూరు: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి నీళ్లు తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి డీపీఆర్ మార్చితే.. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని మహ బూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రకటించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జ్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లాకు ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఎంపీటీసీగానే మాట్లాడుతున్నారని విమర్శించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమ ణారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ వైపు ఓటర్లు ఆసక్తి చూపారే తప్ప అది రేవంత్‌రెడ్డి గొప్పతనం ఏమా త్రం కాదన్నారు. ఆనాడు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్లను కొనుగోలు చేస్తున్నాడని ఆరోపించిన రేవంత్ ఇప్పుడు ఇతర పార్టీల వారిని ఎందుకు చేర్చుకుంటున్నారో చెప్పాలన్నారు. సీఎం రేవంత్ ఇంకా జెడ్పీటీసీ స్థాయిలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇద్దరు సీఎం అభ్యర్థులపై తాను విజయం సాధించానంటే బీజేపీ కార్యకర్తల వల్లేనని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment